క్రీ.శ. 11వ శతాబ్ది నుంచి నవలను తమ ప్రధాన సాహిత్యమాధ్యమంగా చేసుకుని, ప్రపంచ భాషలన్నిటిలోనూ నవలా సామ్రాజ్యంలో మహిళలు తమ బావుటా ఎగరేశారు. అలాంటి నవలారచయిత్రులను సాహిత్య చరిత్రలు ఎలా గుర్తించాయి? వారు ఎలా జీవించారు? వారు ఏం రాశారు? సమకాలీన సాహిత్య సమాజం వారిని ఎలా చూసింది? వారి రచనల్లో ఇప్పుడు కూడా చదివి, తెలుసుకుని ఆనందించగల విషయాలేవైనా ఉన్నాయా?
జులై 2020
పంజరంలో బందీ అయిన పక్షి ఎందుకు పాడుతుందో తెలుసా? తన రెక్కలు కత్తిరించబడి, తన కాళ్ళకు సంకెళ్ళు వేయబడి, రగిలిపోతున్న కోపం, నిస్సహాయతల ఊచలకావల చూడలేక, ఇక వేరే దారి లేక, దూరతీరాలకు తన గొంతు చేరాలని, స్వేచ్ఛాస్వాతంత్రాల కోసం తాను పాడే పాట పదిమందికీ వినిపించాలని–అంటుంది మాయా ఏన్జెలో తన కవితలో. ఇటీవల ప్రపంచమంతా వెల్లువెత్తుతున్న బ్లాక్ లైవ్స్ మాటర్ ఉద్యమం మొదట అమెరికాలో ఇలానే గొంతు విప్పుకుంది. తరతరాలుగా లోపల వేళ్ళూనుకున్న ఆధిపత్యభావజాలం సాటి మనిషి పీకపై కాలు పెట్టి ప్రాణాలు తీసివేయడానికి సంకోచించని ఆ క్షణంలో సాంకేతికంగా అభివృద్ధి చెందినంత మాత్రాన సామాజికంగాను అభివృద్ధి చెందినట్టు కాదని సర్వప్రపంచానికీ స్పష్టమయింది. రంగు, కులం, మతం, జాతి, లింగభేదం, అధికారం, ధనం-ఇలా సాటి మనిషిపై వివక్ష వేయి పడగలతో విషం చిమ్ముతూనే ఉంది. ఈ రుగ్మత ఏ ఒక్క దేశానిదో, ఏ ఒక్క సంస్కృతిదో కాదు. ప్రపంచమంతటా ఏదో ఒక రూపంలో ఈనాటికీ ఈ వివక్ష కనపడుతూనే ఉంది. అసహాయుల ప్రాణాలను బలిగొంటూనే ఉంది. కాలం మారిందనీ బానిస భావజాలం మేమిక మొయ్యమనీ ఇన్నాళ్ళూ దానిని భరించిన వాళ్ళు ఇప్పుడు బాహాటంగా చెప్పడం ఆధిపత్య సమాజానికి అహం మీద పడిన దెబ్బవుతోంది. ఎంత కట్టడి చేసినా తమ బ్రతుకుని గానం చేస్తూనే ఉండాలన్న పట్టుదలతో, వేనవేల ఒంటరి గొంతులు ఇప్పుడు ఒక్కటై మార్మోగుతున్నాయి. వివక్షకు గురైనవారి అనుభవాల్లోని వేదన, ఆ గొంతుల్లోని తడి, ధిక్కారం అందరికీ అర్థమవడం కోసం ఉద్యమిస్తున్నాయి. మునుపు లేని కొత్త చర్చలకు, కొత్త ఆలోచనలకు తావిస్తున్నాయి. సహానుభూతి ఉండీ సమస్యలోతులు పూర్తిగా తెలియనివారికి తెలియజేస్తున్నాయి. భిన్నాభిప్రాయాలను గౌరవించడానికి, భిన్నానుభవాలను అర్థం చేసుకోవడానికి, విభిన్నజీవనరీతులకు రెండు చేతులతో స్వాగతమిచ్చి తమ సరసనే స్థానమివ్వడానికి ఔదార్యం, సహనం, సహానుభూతి అవసరం. కత్తిరించబడ్డ చరిత్ర పుస్తకాలు, జల్లెడ పట్టబడిన బడిపాఠాలు అన్ని నిజాలూ చెప్పవు. అన్ని దృక్కోణాలూ చూపవు. మనసు లోపల్లోపలికి వెళ్ళి తమ అస్ఠిమూలగతమైన వివక్షాధోరణులను, అహంకార ఆధిపత్య ధోరణులను ఎవరికివారు తరచిచూసుకోగలగడమే సమాజంలో సమూలమైన మార్పు తెచ్చేందుకు మొదటి అడుగు. ఆ ఆలోచన మెదిలే దిశగా, అలా చూసేందుకు వీలైన ప్రశ్నలను వివక్ష, దాస్యం, అణచివేతల కొలిమిలో కాలిపోయి ఇక వేరే దారితోచని కళాకారుల గళం ఆర్తిగా అడుగుతూనే ఉంటుంది. మనం నిర్లక్ష్యం చేసిన, ఇప్పటికీ చేస్తున్న అలాంటి గొంతులేవైనా మన చుట్టూనే ఉన్నాయా అని చెవులొగ్గి వినాల్సిన సందర్భమిది. మన లోపలి చీకటి కుహరంలో తెలియకుండానే దాగివున్న వివక్షాధోరణుల పైన ప్రతి ఒక్కరం నిజాయితీగా వెలుగు ప్రసరించుకోవాల్సిన తప్పనిసరి తరుణమిది. సాటిమనిషిని ద్వేషించడానికి వెయ్యి కారణాలెప్పుడూ ఉంటాయి. ప్రేమించడానికి ఒక్క కారణం వెతుక్కొనవలసిన సమయమిది.
దేనికో రెడీ అవుతున్నట్టు నన్ను వెల్లకిలా పడుకోబెట్టి నాపైకి వొరిగాడు. నా మీద నాకు నమ్మకం పోయేది ఈ పొజిషన్ లోనే. ముందు సులువుగానే మానేజ్ చేసేదాన్ని. ఈ మధ్యే నాలో ఈ మార్పు గమనించాను. అతని పరిస్థితి కూడా ఇలాగే ఉందని తెలిసిపోతుంది. మెత్తని ఈటెల్లా నా గుండెలోకి గుచ్చుకెళ్ళిపోయే ఫీలింగ్స్. అటు స్వీకరించలేను. ఇటు తిప్పిపంపించనూ లేను. ‘బ్రేక్ ఫాస్ట్ ఇన్ ది బెడ్’ ఇన్ ది మిడిల్ ఆఫ్ ది నైట్.
“ఎమిరేట్స్‌కి స్వాగతం! మొత్తానికి రెండేళ్ళు పట్టింది మీరు ఇక్కడికి చేరడానికి.” నిజమే. మిన్నీ 2018లో వేసిన బీజం నిలదొక్కుకొని, మొలకెత్తి, మారాకు వెయ్యడానికి రెండేళ్ళు పట్టేసింది. క్రమక్రమంగా వెనకబడిపోయిన దుబాయి ప్లాను. ఢిల్లీకీ దుబాయ్‌కూ మధ్య ఉన్న నాలుగు గంటల దూరాన్ని దాటడానికి నాకు రెండేళ్ళు పట్టింది. 2020 ఫిబ్రవరిలో ఆ దూరం దాటగలిగాను.
“అమ్మనిచ్చి పెళ్ళి చెయ్యమని నువ్వు తాతయ్యనడిగావ్. నీకంటే రెండేళ్ళు పెద్దదని వాళ్ళు వద్దన్నారు. మీ ఇద్దరికీ వేరే చోట్ల పెళ్ళయినా, నువ్వు అమ్మని వేధిస్తోనే ఉన్నావ్ మా ఇంటికి వచ్చినప్పుడల్లా. పైగా పెళ్ళయిన రెండేళ్ళకే అమ్మ తల చెడి పుట్టింటికి తిరిగొచ్చిందాయె. నీ ప్రయత్నాలు ఫలించకుండా ఎలా ఉంటాయి?!” ఆయన తల అడ్డంగా తిప్పడానికి ప్రయత్నిస్తున్నట్లు అతనికి తెలుస్తోంది.
నా వైపు చూసిందా అమ్మాయి. ఊపిరి బిగబట్టి తనవైపే చూశాను. అమ్మాయి సన్నగా ఒక నవ్వు నవ్వి, మెల్లగా చేతులు సాచి నెమ్మదిగా నేలని తన్ని పైకి లేచింది గాలిపటంలాగా. అలాగే నవ్వుతూ నా వంక చూస్తూ గోడల పక్కగా హాయిగా పైకి ఎగురుతూ… తేలిగ్గా ఒక దేవతలాగా తేలుతూ అలాగే మెల్లగా గది పై కప్పుదాకా ఎగిరింది. పై కప్పు దగ్గ్గరకు రాగానే, చేయి ఎత్తి కప్పును నెట్టి ఆ ఊతంతో మళ్ళీ మెల్లగా కిందకు రాబోయింది. కానీ మళ్ళీ తేలసాగింది.
నిద్రపోవడం అంటే
వాంఛలు ఆరిపోయే వాయిదాలాంటి నీ ముద్దు.
కళ్ళుమూయడం కాదని చీకటికైతే తెలుసు.
మేనత్తలు, నీల, నిసి, ఇద్దరు ఒకేసారి లండన్ రావటం, అదీ తన ఇండియా ట్రిప్ ముందే జరగటం, వారి మేనకోడలికి చాలా సంతోషాన్నిచ్చింది. అదీ! వారంతా ఈ అతి చక్కని చోట ఆ రోజు కలవాలనుకోటం. జస్ట్ గ్రేట్! కొలనులో హంసలు విలాసంగా తేలుతున్నాయి, వారి కళ్ళముందు. రంగుల తుమ్మెదలు ఓడ్‍హౌస్ కథలలోలాగా ఎగురుతున్నయ్యి. గాలి తేలిక సుగంధాలు తెస్తున్నది.
దారిలో ఏదో కూడలి దగ్గిర గుమికూడి ఉన్నారు జనం, ఏదో వింత చూస్తున్నట్టు. దగ్గిరకెళ్ళి చూశాడు. దారుణమైన నెప్పితో పడి ఉన్న ఒక స్త్రీ మూలుగుతోంది. ప్రసవవేదన. ఇందుకేనా భగవానుడు చెప్పేది జననమరణాలనుంచి విముక్తి పొందాలని? పాపం ఎంతటి వ్యథ! చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరికీ ఏమీ చేయడానికి పాలుపోవడంలేదు. ఎవరో పరుగున పోయి వైద్యుణ్ణి పిలుచుకొచ్చారు.
ఎన్నో అడగాలనుకున్నాను
ఆ రాత్రిని, ఈ మేఘాన్ని
ఆ స్వప్నాన్ని, ఈ మౌనాన్ని.
ఎన్నో అడగాలనుకున్నాను
సగమే తెరిచిన నీ తలపు వెనుక
తలుపు తీయని మనసును.
ఇంతకు ముందు ఆమె ఇలా వుండేది కాదు. ఈ రెండు మూడు నెలల నుండే! మనసులో ఆందోళనో, తీరిక చిక్కనివ్వని పనులో, మరింకేమిటో?! అప్పటికీ సహాయానికి దిగాడు. అదే మూకుడు. అదే నూనె. కానీ ఆ ఆలూ వేపుడు ఓసారి కుదిరినట్లు మరింకోసారి కుదరదు. ఎందుకో అర్థంకాదు. పోనీ గిన్నెలు కడిగి పెడదామంటే జిడ్డు వదలలేదంటుంది. తానూ ఆఫీస్ పనితో పాటు మరెన్నో పనులు చక్కబెట్టుకుని వస్తోంది కదా!
ఈ రోజుల్లో అయితే కసాండ్రా లాంటి వ్యక్తిని ‘శకున పక్షి’ అని గేలిచేసి ఉండేవారు. మనకి అవగాహనలో లేని ఏదైనా శక్తివంతమైన ప్రభావం వల్ల మనకి ఏదో కీడు కలగబోతోందని జోస్యం చెప్పేమనుకోండి. ఉదాహరణకి ‘పర్యావరణం వెచ్చబడడం వల్ల పల్లపు ప్రాంతాలు ముంపుకి గురవుతాయి’ అని ఒక శాస్త్రవేత్త జోస్యం చెప్పేడనుకోండి. మనకి వెంటనే నమ్మబుద్ది కాదు.
ఇవి ప్రయత్నం మీదనైనా అందరూ రాయగలిగిన కథలు కావు. ఇందులో ఉన్నదేమీ వెక్కిరింపో దూషణో కాదు. మొదట్లోనే చెప్పినట్టు చాలా అరుదైన, కథ చెప్పే ధోరణికి అద్దంపట్టే కథలు. హాయిగా, మిత్రుడితో సాగే ఆత్మీయ సంభాషణలా, లేనిపోని మర్యాదలూ నటనలూ పక్కన పెట్టి, దాపరికం లేకుండా కులాసాగా మాట్లాడుకున్న ముచ్చట్లు.
ఈ సన్యాసులు చేసిన యుద్ధవిధానమును పరిశీలించినచో అది ధర్మయుద్ధమేయని తేటపడగలదు. లోకసంగ్రహముకొరకును మతధర్మములను రక్షించుటకును మ్లేచ్ఛులను ప్రతిఘటించి ధర్మసంస్థాపనము చేయుటలో మహానుభావులైన సన్యాసులు కూడా రాజులకు తోడ్పడినట్లు మనదేశ చరిత్రలో కొన్నియుదాహరణములున్నవి.
జ్యోతి మాసపత్రికలో 1970లలో పదబంధ ప్రహేళిక అన్న పేరుతో శ్రీశ్రీ గడి నిర్వహించారు. ఈమాట పాఠకుల కోసం ఆ గడులు తిరిగి ధారావాహికగా ప్రచురిస్తున్నాం. – సం.
క్రితం సంచికలోని గడినుడి-44కి మొదటి పదమూడు రోజుల్లో కేవలం అయిదుగురి నుండి మాత్రమే సరైన సమాధానాలు వచ్చాయి. విజేతలకందరికీ మా అభినందనలు. గడి నుడి-44 సమాధానాలు.
ఎవరి గ్రంథం వారే అచ్చువేయించుకోవలసి రావడం కవులకు ఎంత దౌర్భాగ్యమో వివరిస్తూన్న శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి గారి అనుభవాలూ-జ్ఞాపకాలూనూ పుస్తకం రెండవభాగం నుంచి 35వ ప్రకరణం, పఠనరూపంలో.