నేను మంచివాణ్ణి


నేను మంచివాణ్ణి

కొద్దో గొప్పో గొప్పవాణ్ణి కూడా!

పథకాలూ, పరివారాలూ, పరపతీ వున్నవాణ్ణి



నేనేనా మంచివాణ్ణి?

నా కూటమిలో అందరూ కొద్దో గొప్పో మంచివాళ్ళే

సమాజంకోసం ఏదో చెయ్యాలనే తాపత్రయం వున్నవాళ్ళే

పాపం నావాళ్ళందరూ మంచివాళ్ళే



కానీ అల్లవాళ్ళు?

వాళ్ళు నాకంత నచ్చరు

ఎందుకంటే,

చెడ్డవాళ్ళని కాదు కానీ జడ్డివాళ్ళు

సమాజంకోసం ఏదో చెయ్యాలనే తాపత్రయం వున్నట్టే కనిపిస్తారు

ఏవో నాలుగు స్లోగన్లు ముక్కున పట్టి

ఫైపైకి ఏదో తాపత్రయం చూపెడుతూంటారు

కానీ ఓ పథకమూ, పరివారమూ, పరపతీ వాళ్ళకేవీ?

నాకున్న అవగాహనా, దాని లోతూ మాత్రం వాళ్ళదగ్గరేవీ?

అందుకే వాళ్ళని సన్నగా తిట్టో, చీవాట్లు పెట్టో

ఇంకా అవసరమైతే నెత్తిమీద మొట్టో మార్చడానికి ప్రయత్నం చేస్తాను

అదికూడా నా బృహత్పథకంలోని భాగమే!



కానీ నిజానికి వాళ్ళూ పాపం కొంచెం మంచివాళ్ళేననీ

నాలాటి గొప్పవాడు తిడుతూ విమర్శిస్తే వాళ్ళు ఇంకా జడ్డిగా మడ్డిగా ఐపోతారనీ

ఆస్లోగన్లుకూడామాని చప్పగా చల్లారిపోతారనీ

నిర్లిప్తంగా ఊరుకుండిపోతారనీ

నాకేం తెలుసు!