విద్యాసుందరి నాగరత్నమ్మ శారదాస్వరూపిణి, లలిత కళలకు కాణాచి. భరతనాట్యము, శాస్త్రీయ కర్ణాటక సంగీతము, కవిత్వము ఆమెకు కరతలామలకము. భోగినిగా ఆమె జీవితము ఆరంభమై, తరువాత రాగిణిగా మారి, పిదప విరాగిణియై, చివరకు యోగినిగా ముగిసింది. రక్తితో నిండిన ఆమె మనస్సు విరక్తితో నిండి భక్తి మార్గములో ప్రయాణము చేసి విముక్తి పొందింది.

ఏ.టి.ఎం. (Automatic Teller Machine) లాంటి సౌకర్యాల వెనక వున్న సాంకేతిక పరిజ్ఞానం ఏమిటి? దానిని సగటు మనిషికి అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేసిన వాళ్ళలో ఎందరో మహానుభావులు – అందరిలో ఓ మహనీయుడు – జిమ్ గ్రే (Jim Gray) – ఆయన్ని తెలుగు వాళ్ళకి పరిచయం చెయ్యాలన్నదే నా ఈ వ్యాసం ఉద్దేశం.

దక్షిణ ఆసియా విభాగాలున్న పది పన్నెండు అమెరికన్‌ విశ్వవిద్యాలయాలలో తెలుగు పరిశోధనాపీఠాలు నెలకొ్ల్పడానికి స్థానికంగా ఉన్న తెలుగు సంస్థలు పూనుకొంటే, దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు సహకరిస్తే, దశాబ్దాలుగా ఈ ఆలోచనలు చేస్తున్నవారు ముందుకు వచ్చి కార్యసాధనకు నడుము కడితే, ఐదు సంవత్సరాలలో తప్పక ఈ పరిశోధనాపీఠాలు నెలకొల్పగలమని నానమ్మిక.

గోవిందరావు హైదరాబాదులో విమానం దిగి, భోషాణాల్లాంటి రెండు పెద్ద సూటుకేసులూ ట్రాలీ మీదకెక్కించి బయటకి రాగానే వాడి నాన్న, అమ్మ, మేనత్త కనిపించారు, చేతులూపుతూ! అమ్మకి కళ్ళనిండా నీళ్ళు నిండాయి. ఐదేళ్ళయ్యిందాయె, ఒక్కగానొక్క కొడుకునీ చూసి!

శృంగార నైషధం నల దమయంతుల కథ. వారిద్దరి మధ్యా సఖ్యతను పెంపొందింప జేసి ప్రేమను కలిగించింది ఒక హంస. ఈ హంస మొదట నలుని ఉద్యానవనం లోని కొలనులో విహరిస్తూ నలునికి పట్టుబడుతుంది. తనను రక్షించి వదిలి పెట్టమని వేడుకుంటున్న సందర్భం లోనిది ఈ పద్యం.

ఒక్క క్షణం తన కళ్ళని తనే నమ్మలేకపోయాడు. అది కలా నిజమా – అని తెలుసుకుందుకు గిల్లుకొనేవాడే, అంతలో కయ్యి మని హారన్ కొట్టుకొంటూ ఎదురుగా వెళ్ళిపోయిన లారీ తన శబ్దభేరిని భేదించినంత పని చేస్తే, తను చూస్తున్నది కలకాదని నిశ్చయించుకున్నాడు. ఆమె… ఆమేనా?! ఇది సాధ్యమేనా?! లేక తను భ్రమపడుతున్నాడా?!

రెండు దేశాల మధ్య వారధులం మేవు
కొండల్ని, కోనల్ని, సముద్రాల్ని,
భాషల్ని, భావాల్ని, భేదాల్ని,
దాటి ఎగిరిన రెండు స్వేఛ్చా విహంగాలం మేవు
మనసులో ఏమూల్లో ఎక్కడ పుట్టిందో
ఈ బైపోలార్ భూతం, వాడి
మెదడుని చెర పట్టింది

అమాకారు రాత్రి జాఱుడు ఊబి బుయ్యల్లోంచి జరజరా
బూఱడ కన్ను పాఱడ పళ్ళు కొరుకుతూ రాకాసి
కోఱల నోరు బారడు చాచి వొచ్చెస్తాడు జేబఱబూచి మాబోయ్
ఱంపం వొళ్ళు వంకర తోక ఝాడించుకుంటూ రంకెలు వేసి
అమ్మో మమ్మీ వెనక ఉలుబులుకు దాంకో పారిపో పారిపో.

ఇప్పటికి 4500 సంవత్సరాలకి పూర్వమే, మహా వైభవంగా సాగిన పురాతన ఈజిప్ట్ చక్రవర్తుల (ఫెరోల) పాలనలో ప్రముఖ పాత్ర వహించిన హైరోగ్లిఫ్ లిపి కాల గర్భంలో కలిసిపోయి, దాదాపు 1500 సంవత్సరాల కాలం తరవాత, ఒకదాని తరవాత మరొక అద్భుత పరిశోధనల సముదాయం వల్ల, మళ్ళీ వెలుగులోకి వచ్చింది. ఆ కథా వివరాలే ఇక్కడ ప్రస్తావన.