క్లబ్బులో చెట్టు కొట్టేశారని రెడ్డి మేష్టారు రాజు గారింట్లో చెప్పంగానే, నా కుడిచెయ్యి కొట్టేసినట్టనిపించింది.  కుడి చేతిలో స్కాచ్‌ గ్లాసు జారిపోతుందేమోనని భయపడి, గట్టిగా […]

“గజగామిని” సినిమా చూసొచ్చిన నా మిత్రుడొకడు “తన్వీ శ్యామా..” శ్లోకం చదివబడ్డ తీరుకి ముగ్ధుడై దాని అర్ధం ఏమిటని అడిగాడు. చెప్పగానే, “ఆ సీన్‌లో […]

గరాజ్‌ లో పూజ జరుగుతోంది సంప్రదాయ బద్దంగా. అక్కడవున్న వాళ్ళు, లంకంత ఇల్లు ఎలా వుంటుందో అప్పటిదాకా చూడకపోయినా  ప్రసాద్‌  కొన్న కొత్త ఇల్లు […]

“కవీనాం సమయః కవిసమయః” అని కవిసమయ సమాసానికి విగ్రహవాక్యం. కవుల ఆచరణే కవిసమయం అని అర్థం. శిష్టసాహిత్యమైన కావ్యాలు, ప్రబంధాలలో కవిసమయాలను ప్రయోగించడముంది. కాని […]

అప్పుడే బోటస్కుర్రు బస్సు కూడా వెళ్ళిపోయింది. అంటే టైము పన్నెండైపోయింది. అన్న బాపేశ్వర శర్మ గారిని పర్మిషనడిగేసి గేటుదెగ్గర నాకోసం ఎదురుచూస్తూ వుంటాడు. ఈ […]

“పెళ్ళి సందడి తగ్గిపోయి ఇల్లంతా బోసిపోయింది కదూ?” అన్నాడు రాజశేఖరం భార్య సుమతితో. వాళ్ళ రెండో అమ్మాయికి ఇటీవలే పెళ్ళి చేసి బాధ్యత తీరిందన్న […]

పూవుల రంగులన్నీ లాగేసుకొని పారిపోతాడు సూర్యుడు నల్లని రాత్రి! పొద్దెక్కి లేచాను చెల్లాచెదురుగా ఎండ అడక్కుండా ప్రవేశించేది ఇదొక్కటే చీకట్లో నల్లపిల్లి మ్యావంది తను […]

అన్నీ వదులుకోక తప్పదని చిన్నపాటి  చెట్టుక్కూడా తెలుసు విలవిలలాడిపోతారు మీరు గలాభా చేయడం మాని పగటి ఎండను, రాత్రి వెన్నెలను నిగర్వంగా ఆహ్వానించి చతికిలపడిపోకుండా […]

సిగరెట్టును తగలేస్తారు పొగరంతా తగ్గి పొగయిపోగానే పీకను నలిపేస్తారు నాకుమాత్రం బ్రతకాలని ఉండదా? సుతారంగా, కొంత సున్నితం పాటించి నన్నిలా వదిలేయండి!

“సినిమా పాటలు లైట్‌ సాంగ్స్‌ (లలిత సంగీతమే) కదా అని లైట్‌గా తీసుకోకండి” అనేవాడు సంగీతం బాగా తెలిసిన నా మిత్రుడు. సినిమా పాటలు […]

(నలుగురూ కూర్చుని సుబ్రమణ్యం కోసం చూస్తుంటారు. బయట ఉండుండి పెద్దగా కేకలు వినిపిస్తుంటాయి. కర్టెన్‌ వెనకనుండి ఒక మూడేళ్ళ బాబు తొంగి తొంగి చూస్తుంటాడు.) […]

మూడున్నర వేల పైచిలుకు అంతర్జాతీయ పాఠకులకు స్వాగతం! ఈ సంచికతో ఓ కొత్త శీర్షిక మొదలుపెడుతున్నాం “రచనా సమీక్ష” అనేది. మీ రచనలు పుస్తక […]

వాళ్ళిద్దరికీ వస్తానని చెప్పి వచ్చేసిందిగానీ ఆరోజంతా ఆ విషయమే మనసులో కదలాడుతూ ఉంది. ఈ వయసులో ఉద్యోగం చేస్తూ ముగ్గురు పిల్లల్ని ఎట్లా సాకగలుగుతుంది? అందుకు కావలసిన మానసిక శారీరక శక్తులు ఆమెకి ఎక్కణ్ణుంచి వస్తున్నాయి? కోరి నెత్తిమీదికి ఈ కష్టం ఎందుకు తెచ్చుకుంది?

అగరొత్తుల పరిమళం గదిలో బెరుకుగా క్రమ్ముకుంటోంది. మంచం మీద చల్లిన మల్లెపూలు.. మధ్యలో గులాబీ మొగ్గలతో కూర్చిన అక్షరాలు.. గుండె క్రింద కొంచెం కంగారుతో […]

ఆదర్శాలకు పోతే ఇంట్లో అన్నముడకొద్దూ? అబ్బా..ఈ వెధవ డైలాగొకటి. అసలు ఇది ఎవరు కనిపెట్టారే బామ్మ? నేనెక్కడా పుస్తకాల్లో చదివినట్టు లేదు? పోనీ మరోనోట […]

ఇప్పుడక్కడ కవిత్వంగా మలచడానికి మిగిలిందేమీ లేదు ఒక నివ్వెరపోయే దృశ్యం, కంట తడిరాని దుఃఖం వెడల్పాటి బాటలూ, ఎ్తౖతెన అరుగులూ, అటూ ఇటూ నవ్వులతో […]