కనిపించే పెద్ద గీత – దాని వెనుక మరుగైన చిన్నగీత – సీత – ఊర్మిళ.
శీర్షికలు సంచికలు
ఒచ్చిన కొత్తల్లో తను కూడా అలాగే అనుకొనేది. అన్నం వేష్ట్ చెయ్యకూడదు, కూర వేష్ట్ చెయ్యకూడదు అని. ఇప్పుడు అదంతా సిల్లీగా ఉంటుంది. చెత్త కుండీల దగ్గర ఇంకా రంగైనా పోని సోఫాలు, మంచి టీవీలూ టేబిళ్ళూ పడీసుంటాయి. బట్టలు చెప్పులు తనకెన్నున్నాయో తనకే గుర్తుండదు. పిల్లలూ ఒక నాలుగు సార్లు తొడుక్కుని చెప్పులూ బట్టలూ ‘Yuk!’ అని పడెస్తారు.
కుటుంబరావుగారి కథలూ, నవలలూ, నాటికలూ, వ్యాసాలూ సంకలనాలుగా వచ్చాయి కాని అనువాద రచనలేవీ మళ్ళీ పాఠకుల కంటబడలేదు. ఆ లోటును పూర్తి చేసే ఉద్దేశంతో “మృతజీవులు” నవలను సీరియల్‌గా మీ ముందుకు తెస్తున్నాము.
అవార్డులే ప్రతిభకు తార్కాణం కాకపోయినా ఛాయాదేవి గారి లాంటి ఉత్తమ రచయిత్రికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు ఇవ్వడం వల్ల ఆ అవార్డుకే గౌరవం వచ్చింది.
తెలుగు సాహిత్యం నిలిచివుండాలంటే దాన్ని ఆంగ్లంలోకి అనువదించటమే ఇప్పుడున్న ఏకైక సాధనం. ఎంతో కాలం నుంచి నిర్విరామంగా ఈ కృషిని కొనసాగిస్తున్న నారాయణరావు, షుల్మన్ గార్లను మనం ప్రత్యేకించి అభినందించాలి.
తెలుగు బాలసాహిత్య జాతకంలో “చంద్ర మహాదశ” వంటిదేదో “చందమామ”తోనే మొదలైనట్టుగా అనిపిస్తుంది.
ఈ ఆంగ్లం నిజానికి దేశభాషలని ఏమీ చెయ్యలేదు; సంస్కృతం పూర్వం ఏ స్థానంలో ఉండినదో ఆ స్థానాన్ని ఆంగ్లం ఆక్రమించుకుంది.
అమాయకులైన కుశలవులూ, కపటత్వంగల సీతా, ఫెమినిస్టు శూర్పణఖా, వెరసి “సమాగమం” కథ!
బాల్యం – తుప్పల్లోకి పోయిన బంతి
ఎప్పటికీ మరి కనిపించదు
నిశ్శబ్ద నిగూఢ రాగాల రారాణి
చిక్కని నలుపుల చక్కని రమణి.
అనువాదం అనువదించబడే భాషలో సాహిత్య స్థానాన్ని సంపాదించ లేక పోతే అది ఎంత విధేయంగా వున్నా అది సాహిత్యానువాదం కాదు. అంచేత సాహిత్యానువాదకుల పని ప్రధానంగా తాము అనువదించిన భాషలో తమ అనువాదానికి సాహిత్యస్థానాన్ని సంపాదించుకోవటమే.
సుడి రేగి కుదిపేస్తోంది,
వేరు వదలకుంది!
మధ్యలో-
చెట్లు విరిగిపోతున్నాయి
“దిస్సీజ్ మై వొయిఫ్ …. అన్నమేరి! అవర సన్ మేక్ పీస్!” అన్నాడు. అలాగే మర్యాదగా ముభావంగా నవ్వి “నమస్తే ఆంటీ!” అని, అంతలోకే తను తప్పు విందేమోనని సందేహంగా “బాబు పేరేంటంకుల్ ?” అంది. ఆయన పెద్ద పెట్టె, చిన్న పెట్టె రెండు చేతుల్తో ఎత్తి పట్టుకున్న కష్టం నిగ్రహించుకుంటూ “మేక్ పీస్ ” అనే అన్నాడు మళ్ళీ.
ఈమాట 7వ జన్మదిన సంచికకు స్వాగతం.
పౌరహక్కుల న్యాయం కోసం తుపాకులు అక్కరలేదు, తూటాలు అక్కరలేదు. విప్లవం విప్లవం అంటూ గొంతుచించుకొని అరవక్కరలేదు
చుక్కల పరుపుపై
మబ్బుల దుప్పటీ కప్పుకుని
చంద్రుడు
అమ్మాయిల మనస్సుల్లా పక్కవాడి ఆట అర్థం కావడం లేదు
అరకు రాణీ వెక్కిరిస్తూ అవతలవాడి చేతిలో చిక్కింది.
జ్ఞాపకముందా?
చిన్నప్పుడు అమ్మ వేలు పట్టుకుని నువ్వు నడుస్తున్నప్పుడు
భూమ్మీద పరుచుకున్న వర్షపు నీటి అద్దాలు నీలి మైదానాలైతే
ఆ నీలి మైదానాల్లో పరుగెత్తే మబ్బు పిల్లలతో ఉరుకుడు పందెం కాచి
బొక్కాబోర్లాపడి తడిసిపోయింది
ప్రకృతి వికృతుల్ని
సమతుల్యంగా మోసే
స్వేచ్ఛ భుజమ్మీద
సప్తవర్ణాల పచ్చబొట్టు
ఈ ఇప్లవం అనేటోళ్ళను జెయిల్ల పెడితె నా కొడుకు రాడు. ఆళ్ళు ఇప్పుడు చెప్పినట్టే ఒక మనిషిని చంపితే ఇప్లవానికి పనికొస్తది అని చెప్పకుండా ఆగరు.