ఇంతలో ఉన్నట్టుండి కుక్క శరీరం బిగుసుకుంది. కదలకుండా ఊపిరి బిగబట్టి నేలలో వున్న నెర్రె వైపే చూస్తూన్న దాని శరీరంలో వెంట్రుకలన్నీ అదో మాదిరి ఉద్వేగంతో నిక్కబొడుచుకున్నాయి. ఆమెకి అర్థం అయింది. వంటింటి గోడ కింద వున్న నెర్రె వైపే తనూ చూస్తూ చేతి కర్ర అందుకుందామె. చిన్న కంతలోంచి గాజు గోళీల్లాంటి రెండు చిన్న కళ్ళు కదలకుండా బయటికి చూస్తున్నాయి. ఆమె ఇంకా మెల్లిగా చేతి కర్ర పైకెత్తింది.
శీర్షికలు సంచికలు
వద్దు. పాప జాగ్రత్త. పాపకేమన్నా కావాలంటే చేసి పెట్టు. కానీ, మనసేదోలా ఉంది. ఏవో పాత సంగతులు చుట్టూ తిరుగుతోంది మనసు. బంగారం మొత్తం అమ్మేయడం, ఆ సంగతి మామగారింట్లో తెలియడం, వాళ్ళ ముందు తలవంపులు, బిడ్డకు టాబ్ కొనివ్వలేక అబద్ధం చెప్పడం, ఖాళీ అయిన కొట్టు పరిస్థితి, పరువు పోయిన సందర్భం- వీటన్నింటి ముందూ గుర్తొచ్చే బంగారు పతకం, మార్కుల షీటు, సాహిత్య సంపద తెచ్చిన బహుమానం, పాఠాలు విన్న పిల్లలు అప్పుడప్పుడూ చేసే నమస్కారాలు, మనసంతా బరువెక్కింది.
“తమ్ముడూ, ఇప్పుడు మనం జీవితంలో చరమాంకాన్ని చేరుకున్నాం. ఇప్పటివరకూ చేసిన పాప పుణ్యాలూ, ఆచరించిన ధర్మాధర్మాలు ఒక్కటే మన వెంటే వచ్చేవి. మనం ఐదుగురం అతిరధ మహారధులుగా ఉండీ వస్త్రాపహరణం సమయంలో ఏమి చేయగలిగాం? భగవంతుడైన కృష్ణుడు తన స్వంత కొడుకుగా పుట్టిన తర్వాత కూడా వచ్చి విడిపించేవరకూ దేవకీ వసుదేవులు కారాగారంలోనే కదా బతికినది? ఎవరి పుణ్యఫలం వారిది. చివరిదాకా నువ్వు బతికి ఉంటే మాత్రం ద్రౌపది కష్టాలు పడదని రూఢిగా చెప్పగలవా?
శుచిముఖి చేసిన వర్ణనలో, ప్రభావతి శరీరాంగాలకు పోలికలుగా చెప్పిన తుమ్మెదలు, చంద్రబింబమూ మొదలైన ఉపమానాల సౌందర్యానికి వెయ్యిరెట్లుగా ఆయా శరీరభాగాలను ఊహించుకొన్నాడు ప్రద్యుమ్నుడు. అలా ఊహించి ఊహించి తన మనసుకి కొద్ది కొద్దిగా కనిపించే ఆమె శరీరాకృతిని జాగ్రత్తగా పొందుపరచుకొన్నాడు. అలా కొంచెం కొంచెం పొందుపరచుకొంటూ పోగా చివరికి ఆమె రూపం ఎలా ఉంటుందో, సరిగ్గా అలాగే ప్రద్యుమ్నునికి దర్శనమయ్యిందిట!
అధిక బరువు చేత నట్లైనదో యేమొ
హరితకలల గనుచు నడుగులిడిరొ!
ఉగ్రనీడల మతి దప్పి యుంటిరేమొ!
జనకొలువు జేర – జాగ్రత జారిపోయి
పాదబాటల బట్టిన పతనమబ్బు!
వేయాల్సిన వెర్రి వేషాలన్నీ అయిపోయాయి
ఇక మరణించాలనుకుంటా
ఎవడు మరణిస్తాడు పోదూ
నక్షత్రము మరణిస్తుందా
భూగోళం మరణిస్తుందా
తాళం వెనుక తాళం తీస్తూ పోతే
తలపులలా తెరుచుకుంటూనే
వుంటాయి.శూన్యమైన గది మూలల్లోనూ
ముడుచుకున్న జ్ఞాపకాలు
మళ్ళీ తలలెత్తి చూస్తాయి.
prathama sandhyāra svara ప్రథమ సంధ్యార స్వర ē sandhyā cahaṭiyāē dēhē manē ākāśē ākāśē। nānārangī āluara āḍambara ō raktara […]
కాఠిన్య కాంస్యభూమిని చూసి గాలి, నక్షత్రాలు,
సరివిచెట్టు, హోటల్, బ్రతుకు కదలికలు,
సర్వావయాలూ నిజంగానే రవంత నిర్జీవమైనాయి,
రాయిగామారిన అహల్య ఏ రాముడికోసమో ఎదురుచూస్తున్నది.
పిట్టలు పారే వేళకి ముందే
దండెం మీది నీ బట్టలు మోసుకుని నేనో
లేరంగుల ఇంద్రధనుస్సునై ఇంటిలోకి నడవడం
ఒక రంగులకలలా ఉంటుంది.
మందారచెట్టు మీద
మబ్బుల పరుపు
వెలుగు రేకల
చీకటి దుప్పటీ
పక్కన
చిన్ని కంఠం
కూకూ పాట
మానులు వణికే మార్గశిరం
రక్తం గడ్డకట్టిపోయే చలి
వేడి కోరుకునే దేహం
ఒకే దుప్పటిలో నీతో
పంచుకునే వెచ్చదనం
ఇది చాలు నాకు
నేను తెలుగు నేర్చుకోలేదు, ఎవ్వరూ నేర్పలేదు; దానంతట అదే వచ్చేసింది. భాష వచ్చిన తరువాత రాయడం, చదవడం గురుముఖంగా నేర్చుకున్నాను. కనుక తెలుగంటే ఏమిటో బొత్తిగా తెలియని వాళ్ళకి తెలుగు నేర్పడంలో ఉన్న కష్టసుఖాలు, తెలుగు నేర్చుకునేటప్పుడు విద్యార్థులు చేసే తప్పులు నా విద్యార్థులకి పాఠాలు చెప్పే సందర్భంలోనే నాకు అవగతం అయేయి.
రాత్రి యంతయు అన్యకాంతతో గడపి, ప్రొద్దున సంభోగ చిహ్నములతో నిలు చేరిన ప్రభువును జూచి ఖండితానాయిక వక్రోక్తిగా ననుచున్నది: రాత్రియో మూడుజాములు మాత్రమే. తమరికో ప్రియాసంఘము వేయింటి కున్నది. ఏదో తెల్లవాఱి దారిని బోవుచు ఈయింటిలో దూరితిరి. తాము ప్రభువులు (సరసులు గారనుట).
సంస్కృత, కన్నడ-తెలుగు, తమిళ, మాత్రా ఛందస్సు, నేను కొత్తగా ప్రతిపాదించిన ఛందస్సులో గణముల సంఖ్య ఒక గుణశ్రేఢి. సామాన్య నిష్పత్తి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి. అందులో కొన్నిటికి Pascal triangleతో కూడ సంబంధము ఉన్నది.
సంస్కృత భీమఖండంలో లేని కిరాతుడై వున్న శివలింగాన్ని శ్రీనాథుడు ఉటకించాడు. ప్రాచీనమైన యీశ్వరలింగము నేడు లేదు. మలిపురాణ కాలం ముందరి శివలింగాలు విడిగా, పురుషాంగం రాజుకు ప్రతీకగా, వేటగానిలా చెక్కించడం, చారిత్రకాలు.
పూల బాల పూల బాల గాలి లోన తీగె ఝూల లోలితా
జాల మేల ముద్దుగా మధూలి చాల తాగుతా
నిరంతరం ఎదురయ్యే అనుభవాలు, చిరపరిచితమనిపించే భావాలు మళ్ళీ మళ్ళీ చదివించే పద్యాలుగా సరికొత్తగా సాక్షాత్కరించేది కవిత్వమనే రసవిద్య పట్టుబడ్డ కవి చేతి చలువ వల్లే. ‘లిఖిత’ శ్రీకాంత్ ఆ రసవిద్య నేర్చిన కవి. మనిషి లోని సంఘర్షణని అలవోకగా కవిత్వం చేయగల నేర్పు శ్రీకాంత్ సొంతం. ఇతని కవిత్వం – సంకుచితం కాని చూపొక్కటీ చాలు, కవిత్వాన్ని, ఆ మాటకొస్తే ఏ కళనైనా ఉదాత్తంగా తీర్చిదిద్దుతుంది అని చూపడానికి నిలువెత్తు తార్కాణం. శ్రీకాంత్ కవిత్వం, లోకం లోను, మనుషుల లోతుల్లోను, మునుపెన్నడూ చూడని పార్శ్వాలను చూపెట్టడమా? లేదూ, మనం తెలుసుకున్న, తెలుసనుకున్న సంగతులనే సరికొత్తగా పరిచయం చేయడమా? ఏది ఉత్తమ కవిత్వ లక్షణం? అన్న ప్రశ్ననూ కలిగిస్తుంది; శ్రద్ధగా చదివే పాఠకులకు, బహుశా ఓ సమాధానమూ చూపెడుతుంది. నిప్పు కణికలా వెలుగులీనే నిజమూ, బాహ్యస్మృతి విముక్తులను చేసే సౌందర్యలోకాల ప్రస్తావనా, బాధల కొలిమిలో నిండా కాల్చి, మనలోలోపలెక్కడో స్వర్ణకాంతులీనే హృదయమొకటి ఉందని మరలా గుర్తు చేసే విషాదమూ — శ్రీకాంత్ కవిత్వాన్ని చదివి తీరాల్సిన కవిత్వంగా మార్చిన సుగుణాలు. వెన్నెల రాత్రులనీ, ఈరెండ ఉదయాలనీ తఱచుగానే కవితల్లో చూస్తూ ఉంటాం. కానీ, ఇవే ఉదయాస్తమయాలను మనిషిలోని భావసంచలనంతో సంధానించి కవిత్వం చెబితే ఎలా ఉంటుందో శ్రీకాంత్ అక్షరాల సాక్షిగా చూపించే చిరుపరిచయమిది. ఒక్క రోజులో మన మనసు ఎన్ని రంగులు మార్చుకుంటుందో, ఎన్ని వైవిధ్యాలను, ఉద్వేగాలను ఉగ్గబట్టుకుని క్షణాలను దొరలించుకుంటుందో, అన్ని ఛాయలనూ చాకచక్యంగా తన రెండు వేళ్ళ మధ్యా ఏ ఒత్తిడీ లేకుండానే ఒడిసి పట్టుకున్న కవి ఇతడు. ఒక కవిత చదవగానే, ‘ఇది శ్రీకాంత్ కవిత’ అని ఇట్టే గుర్తించగలిగేంత ప్రత్యేకమైన శైలిని సృజించుకుని, తెలుగు కవిత్వంలో తనదే అయిన దారిలో నడుస్తున్న శ్రీకాంత్ కవితలు మచ్చుకి ఐదు — కవిత్వం కాలాన్నిలా అలవోకగా అక్షరాల్లో బంధించగలదని నమ్మే వారి కోసమూ, నమ్మని వారి కోసం కూడా — ఈనెల ఈమాటలో, మరికొందరికి చేరాలన్న ఆశతో… [పరిచయకర్త: మానస చామర్తి.]
మనం చిన్నప్పుడు ఎట్లా స్నేహితులమయ్యామో నాకు గుర్తే లేదు. మీ నాన్న జేబులో సిగరెట్లు నేను కాజేసి తెచ్చి బలవంతంగా నీతోటీ తాగిస్తే పట్టుబడినప్పుడు తప్పంతా నీమీద వేసుకుని తన్నులు తిన్నావు గుర్తుందా? పరీక్షలో నాకు సాయం చేయబోయి పట్టుబడ్డావు. ఇన్నేళ్ళూ మన స్నేహం చెక్కు చెదరలేదు. నువ్వొక్క ద్రోహం మాత్రం చేశావు. అది నీకు తెలుసు. అయినా నీ స్నేహం ముఖ్యం నాకు. తెలీనట్లే ఉండిపోయాను. క్షమాపణలేవీ అక్కర్లేదు. మనం మనుషులమే కదా!
తాను ఈమధ్యే ఒంగోల్లో చూసొచ్చిన కొండవీటి దొంగ సినిమా ఎత్తుకోని వైనవైనాలుగా చెప్పడం మొదలుపెట్టాడు కోటిగాడు. సినిమా కతలు చెప్పమంటే యమాజోరు కోటిగానికి. స్టోరీ అయిపోతూండగానే కుంట వచ్చేసింది. అక్కడ ఎక్కువ వెయిటింగు లేకుండానే దోర్నాల పోయే బస్సు వచ్చేసింది. కిక్కిరిసిపోయి ఉంది. వీళ్ళకి సీట్లు దొరకలా. కండక్టరు మా ఒడుపుగా అందరిమధ్య దూరిపోతూ టిక్కెట్లు కొట్టేసి తన సీట్లో దర్జాగా కూచున్నాడు.