“ఏరా నీ తెలుగు ఇలా ఉండేమిటీ?” అని అడిగితే, “నీకు తెలియదా బాబాయ్? నేను తెలుగు చదవటం మానేసి చాలా రోజులైంది! అందులో మనది హైదరాబాద్ తెలుగు!” అని నవ్వుతూ సమాధానం చెప్పాడు.
శీర్షికలు శీర్షికలు
ఈ నేపథ్యంలో కొల్లూరి సోమశంకర్ వంటి సమర్ధుడైన యువరచయిత ఇతర భాషల కథల్ని తెలుగులోకి తర్జుమా చెయ్యటం మీద తన దృష్టి కేంద్రీకరించడం అభినందించాల్సినదే. ఐతే ఉత్తినే దృష్టి కేంద్రీకరిస్తే ఏమైంది? ఇప్పటివరకూ 40కి పైన కథల్ని చక్కటి తెలుగులోకి అనువదించి వివిధ పత్రికల్లో ప్రకటించటమూ, వాటిల్లోంచి 19 కథల్ని ఏరి “మనీప్లాంట్” అని చిన్న సంపుటం వెలువరించటం – అదీ నిజంగా అభినందించాల్సిన విషయం.
నా జ్ఞాపకాలను ఇలా నెమరు వేసుకోవడం ఇంటర్నెట్టులో తెలుగు వికాసానికి, ఈమాట పుట్టుకకి సంబంధించిన చారిత్రకాంశాలను — పాక్షికంగానైనా — కొత్తతరం వారికి పరిచయం చేయడానికి ఉపయోగపడుతుందన్న నమ్మకమే ఈ వ్యాస రచనకు పూనిక.
ఔరంగజేబు తనగురువుకి రాసిన ఉత్తరం కొమర్రాజు వేంకటలక్ష్మణరావు గారు 1910 లో పారశీకంనుంచి తెనిగించారు. ఆ అనువాదం దిగువన తెలుగులోవిద్యాబోధనపై ఆకాలంలో ఆయన అభిప్రాయాలు చదవచ్చు. 1910 తరువాత తెలుగు మాధ్యమంగా విద్యాబోధనలో వచ్చిన మార్పులు ఈమాట పాఠకులు గుర్తించగలరు.
ఇట్టి ఘనస్వరూపాలలో మిక్కిలి ప్రసిద్ధి కెక్కినవి ప్లేటో ఘనస్వరూపాలు (Platonic solids). ఇవి ఐదు – చతుర్ముఖి (tetrahedron), ఘన చతురస్రము (cube), అష్టముఖి (octahedron), ద్వాదశముఖి (dodecahedron), వింశతిముఖి (icosahedron).
ప్రస్తుతం తెలుగు నాటకం పరిషత్తులకే పరిమిత మయిపోయింది. సృజనాత్మకత కరువయ్యింది. నాటక ప్రదర్శనకి పట్టు మని పదిమంది కూడా రారు. ఏం చూస్తాం, ఇంట్లో టీవీ ఉంది, సినిమాలున్నాయి, మాకింకేం సృజనా అవసరంలేదనే స్థాయిలో నాటకం ప్రేక్షకులకోసం వెంపర్లాడుతోంది.
“టిటి టిటీ! టిటీ టిటీ లీయా! కమాన్ బేబీ కం! కం టు మామీ,” అని నన్ను ఈ కొత్త దొరసాని ముద్దు చేసినప్పుడల్లా […]
మనసొక్కక్షణం
మాష్టారు ప్రవేశించిన
తరగతి గది
ఎవరైనా కొత్తవాళ్ళు ఒక్కసారి తూర్పునుంచి పడమరదాకా, ఉత్తరం నుంచి దక్షిణందాకా ఈ దేశంలో చూస్తే ఒక్క సంగతి స్పష్టంగా బోధపడుతుంది. ఇక్కడి తెలుగు సంస్థల్లో మూడు రకాల తెలుగు వాళ్ళు ఉన్నారు.
రెల్లు గడ్డి కింది తాబేటి భాష
తనకు తెలుసునని డబాయిస్తాడు
ఈ ఏడాది నుండి అనువాదం, పరిశోధనా, నిఘంటు నిర్మాణాల్లో కృషి చేసిన పండితులకు ఉడతాభక్తిగా ఒక పురస్కారం ప్రకటించాలన్న సంకల్పం. ఇందులో భాగంగా, కేశవరావు గారి అనువాద గ్రంథం Tree,My Guru కు CP బ్రౌన్ పండిత పురస్కారం.
కుక్కతోకతో గోదారి ఈదాలని
నడుము లోతుకు వెళ్ళి, కోరలు చూసాక తెలిసింది
అది గుంటనక్కకు గురువని.
ఈమాట జనవరి 2008 సంచికలో —
ఉత్తర అమెరికాలో ఉన్న ప్రవాసాంధ్రులలో మూడు రకాల తెలుగువారిని వారి మాటల ద్వారా గాక, చేతల ద్వారా ఎలా గుర్తించవచ్చో వివరిస్తూ వేలూరి వేంకటేశ్వరరావు సంపాదకీయం: “నా మాట”
ఇంకా విశేషాలు —
- సితార్ విద్వాంసులలో పండిట్ రవిశంకర్ అర్జునుడైతే, ప్రతిభలో కర్ణుడి వంటి ఉస్తాద్ విలాయత్ఖాన్ గురించి కొడవటిగంటి రోహిణీప్రసాద్ గారి మల్టీమీడియా వ్యాసం: “సర్వోత్తమ సితార్ విద్వాంసుడు ఉస్తాద్ విలాయత్ఖాన్“
- దేవతలకూ, రాక్షసులకే గాక, ప్రాణం లేని ఘనస్వరూపాలకు కూడా అనేక ముఖాలుంటాయంటూ జెజ్జాల కృష్ణమోహన రావు గారి సచిత్ర వ్యాసం: “ప్లేటో ఘనస్వరూపాలు“.
ఈమాట నవంబర్ 2007 సంచిక విడుదల!
విద్యాసుందరి నాగరత్నమ్మ శారదాస్వరూపిణి, లలిత కళలకు కాణాచి. భరతనాట్యము, శాస్త్రీయ కర్ణాటక సంగీతము, కవిత్వము ఆమెకు కరతలామలకము. భోగినిగా ఆమె జీవితము ఆరంభమై, తరువాత రాగిణిగా మారి, పిదప విరాగిణియై, చివరకు యోగినిగా ముగిసింది. రక్తితో నిండిన ఆమె మనస్సు విరక్తితో నిండి భక్తి మార్గములో ప్రయాణము చేసి విముక్తి పొందింది.
ఏ.టి.ఎం. (Automatic Teller Machine) లాంటి సౌకర్యాల వెనక వున్న సాంకేతిక పరిజ్ఞానం ఏమిటి? దానిని సగటు మనిషికి అందుబాటులోకి తీసుకురావడానికి కృషి చేసిన వాళ్ళలో ఎందరో మహానుభావులు – అందరిలో ఓ మహనీయుడు – జిమ్ గ్రే (Jim Gray) – ఆయన్ని తెలుగు వాళ్ళకి పరిచయం చెయ్యాలన్నదే నా ఈ వ్యాసం ఉద్దేశం.
దక్షిణ ఆసియా విభాగాలున్న పది పన్నెండు అమెరికన్ విశ్వవిద్యాలయాలలో తెలుగు పరిశోధనాపీఠాలు నెలకొ్ల్పడానికి స్థానికంగా ఉన్న తెలుగు సంస్థలు పూనుకొంటే, దేశ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారు సహకరిస్తే, దశాబ్దాలుగా ఈ ఆలోచనలు చేస్తున్నవారు ముందుకు వచ్చి కార్యసాధనకు నడుము కడితే, ఐదు సంవత్సరాలలో తప్పక ఈ పరిశోధనాపీఠాలు నెలకొల్పగలమని నానమ్మిక.
గోవిందరావు హైదరాబాదులో విమానం దిగి, భోషాణాల్లాంటి రెండు పెద్ద సూటుకేసులూ ట్రాలీ మీదకెక్కించి బయటకి రాగానే వాడి నాన్న, అమ్మ, మేనత్త కనిపించారు, చేతులూపుతూ! అమ్మకి కళ్ళనిండా నీళ్ళు నిండాయి. ఐదేళ్ళయ్యిందాయె, ఒక్కగానొక్క కొడుకునీ చూసి!
“కర్ణుడి చావుకి కారణాలనేకవనీ..పాపం అన్నీ కలిసొచ్చుంటాయి అతనికి. గయ్యాళి పెళ్ళాం, కొరగాని కొడుకు, చెప్పు చేతల్లో లేని కూతురు.”
శృంగార నైషధం నల దమయంతుల కథ. వారిద్దరి మధ్యా సఖ్యతను పెంపొందింప జేసి ప్రేమను కలిగించింది ఒక హంస. ఈ హంస మొదట నలుని ఉద్యానవనం లోని కొలనులో విహరిస్తూ నలునికి పట్టుబడుతుంది. తనను రక్షించి వదిలి పెట్టమని వేడుకుంటున్న సందర్భం లోనిది ఈ పద్యం.