కౌముది వెబ్ మాసపత్రిక మరియు రచన మాసపత్రిక సంయుక్త నిర్వహణలో జరుగుతున్న కథల పోటీ, 2015కు మీ రచనలని ఆహ్వానిస్తున్నాము. పోటీ కథలు మాకు అందవలసిన చివరి తేదీ: ఫిబ్రవరి 5, 2015.
Category Archive: ప్రకటనలు
రాబోయే 20 వ తానా సమావేశాలలో (జులై 2-4, 2015) తెలుగు సాహిత్య కార్యక్రమాల నిర్వాహక వర్గం ‘తెలుగు సాహిత్యంలో స్త్రీల పాత్రల స్వభావ పరిణామం’ అనే అంశం పై చర్చావేదిక నిర్వహించనుంది. స్త్రీ పాత్రల స్వభావాలలో వచ్చిన మార్పులు వివిధ తెలుగు సాహితీ ప్రక్రియలలోను, దృశ్య మాధ్యమాలలోను ఎలా ప్రకటితమయ్యాయి? ఈ మార్పులు సమకాలీన సమాజంలో స్త్రీల జీవితాల్ని ఏ విధంగా ప్రభావితం చేశాయి? అనే విషయాలను చర్చకు తీసుకురావడం, ఈవేదిక నిర్వహణ ప్రధానోద్దేశం.
ఏ సాంకేతిక సాధనం లేదా యంత్రం, మానవ విచక్షణకు సాటిరావు. ఇవి కొన్ని పరిథులకు లోబడి మనకు సహాయకారిగా ఉంటాయి. పద్య రచననను చేయడానికి భాషపై పట్టు సాధించడంతో పాటుగా, ఛందో నియమాల ధారణ, అధ్యయన, అభ్యాసనాలు కొంతవరకూ చేయవలసిందే. కానీ ఈ ప్రత్యేక సాహిత్య ప్రక్రియను తరువాతి తరానికి అందించడానికి సాంకేతిక సాధనాల అవసరాన్ని గుర్తించాల్సి ఉంది. అటువంటి సాంకేతిక సాధనం ఈ ఛందం©.
పెద్దక్కను పోగొట్టుకున్న చెల్లెమ్మలు, ఒక్క పట్టున మూడురోజుల్లో యీ పుస్తకం రాసి, మరో వారం రోజుల్లో పుస్తకంగా ప్రచురించి వాళ్ళ అమ్మా నాన్న చేతుల్లో పెట్టారట (కూతురిని పోగొట్టుకున్న దుఃఖాన్ని కూడా మరిచి యీ ముచ్చట చెప్పారు వాళ్ళ నాన్నగారు.) ‘పెద్దక్క ప్రయాణం’ వీలైనంత మందికి అందుబాటు లోకి తీసుకు రావాలనే మల్లీశ్వరి గారి సంకల్పానికి ఆసరాగా ఈమాట గ్రంథాలయంలో ఈ పుస్తకాన్నుంచుతున్నాం.
2013 బ్రౌన్ పురస్కారానికి రవ్వా శ్రీహరి గారు, ఇస్మాయిల్ అవార్డ్‌కి బండ్లమూడి స్వాతికుమారి గారు ఎన్నికైనారని సంతోషంతో తెలియజేస్తున్నాము.
కందుకూరి రమేష్ బాబు సామాన్యుల జీవితాలను ఇష్టంగా రికార్డ్ చేస్తున్నారు. వారి బతుకులను తన కెమెరాతో బొమ్మలు తీస్తున్నారు.వారి జీవితాలను గానం చెయ్యడమే తనకు సంతృప్తినిస్తుందని చెబుతున్నారు. జర్నలిజంలో పుష్కరకాలం పైగా ఉన్నారు.సామాన్యుల జీవిత పరిచయాలే వీరికి వృత్తీ, వ్యాపకం.
కినిగె గురించి: 2010లో స్థాపించబడి, తెలుగు పుస్తకాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠకులకు అందిస్తూ, తెలుగు ఈ-బుక్ రంగంలో ప్రపంచంలో ప్రథమ స్థానంలో నిలిచింది కినిగె. పాఠకులకు, ప్రచురణకర్తలకు, రచయితలకు ఒక అద్భుత ప్లాట్ ఫామ్ కినిగె.
2012 బ్రౌన్ పురస్కారం, ఇస్మాయిల్ ఆవార్డ్లు ప్రకటించాము. వీటికి గాను ఆలూరి భుజంగరావు గారు, రామినేని లక్ష్మి తులసి ఎంపికైనారని చెప్పడానికి సంతోషిస్తున్నాము. ఈ ప్రకటనతో పాటు తులసి కవిత్వ తత్వాన్ని పాఠకులకు పరిచయం చేస్తున్నాము.
సురవర వారు తెలుగు కీబోర్డ్ తయారుచేసి అమ్ముతున్నారు. ఈ కీబోర్డ్‌పై అక్షరాలు తెలుగులో ఉంటాయి. ఈ కీబోర్డ్ వాడి ఇంగ్లిష్, తెలుగు రెండు భాషల్లోనూ టైప్ చేయవచ్చును. వేరే ఏ సాఫ్ట్‌వేర్ అక్కరలేకుండానే మీరు ఇప్పుడు వాడుతున్న కీబోర్డ్ స్థానే సురవర కీబోర్డ్‌ని చక్కగా వాడుకోవచ్చును.
వెల్చేరు నారాయణరావుగారు మనకు ప్రసిద్ధ సాహితీ విమర్శకులుగా, విద్యావేత్తగా మాత్రమే తెలుసు. కానీ ఆయన ఒక కవి అని మనలో ఎక్కువమందికి తెలియదు. ఆయన వ్రాసిన మంచి కవితలు అనేకం ఉన్నాయి. వాటన్నిటినీ ఒక సంపుటంగా తీసుకురావాలని మేము సంకల్పించాము.
ప్రపంచ తెలుగు ప్రజలకు అభివందనం! జనవరి 5-7 తేదీలలో, ఒంగోలు పట్టణంలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహోత్సవానికి మీకందరికీ హార్దిక స్వాగతం పలుకుతున్నాం.
ప్రతి సంవత్సరం కాకినాడ లోని ఇస్మాయిల్ మిత్రమండలి ఇచ్చే ఇస్మాయిల్ కవితా పురస్కారానికి గాను 2010 సంవత్సరంలో వచ్చిన ‘రెండో పాత్ర’ కవితా సంకలనం ఎంపికయ్యింది. కవి విన్నకోట రవి శంకర్.
తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు పద్మలత కవితా సంకలనం “మరో శాకుంతలం” ఎంపికైంది. భాషా శాస్త్రంలో ఏడు దశాబ్దాల అవిరళ కృషి పరిశోధనకు గాను బ్రౌన్ పురస్కారానికి కోరాడ మహాదేవ శాస్త్రి గారిని ఎంపిక చేసాము. పద్మలతతో మాటామంతీ.
తెలుగు పలుకు: 2011 తానా సమావేశాల ప్రత్యేక సంచిక తానా 2011 జ్ఞాపిక, 338 పే. ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా (TANA) […]
తానా (జులై 1-3, 2011) 18వ సభల సందర్భంగా వెలువడనున్న ‘తెలుగు పలుకు’ జ్ఞాపిక ప్రచురణ నిమిత్తమై రచనలు ఆహ్వానిస్తున్నాం.
పెద్దల్లో మద్యపాన వ్యసనం వారి పిల్లలపై ఎలాంటి దుష్ప్రభావాన్ని చూపిస్తుందో, ఆ పిల్లలు ఎటువంటి వ్యక్తిత్వపు ముసుగులలో దాక్కుని పెరుగుతారో ఎంతో చక్కగా వివరించే ఈ పుస్తకం, ప్రతి ఒక్కరూ చదవ వలసినది.
వికృత నామ సంవత్సరానికి గాను ఇస్మాయిల్ అవార్డుకు గండేపల్లి శ్రీనివాస రావును, బ్రౌన్ పండిత పురస్కారానికి దీవి సుబ్బారావుని ఎంపిక చేశాము.
ఎమొరీ విశ్వవిద్యాలయంలో తెలుగు బోధన, పరిశోధనల నిమిత్తం అధ్యాపక పదవి నెలకొల్పడానికై కొప్పాక వారు భూరి విరాళం ఇచ్చారు. మీ వంతు సహాయం మీరూ చేయమని విజ్ఞప్తి.
“మనలో మనం” వేదిక, మహిళాధ్యయన కేంద్రం, నాగార్జున విశ్వవిద్యాలయాల సంయుక్త ఆధ్వర్యంలో 2009 నవంబర్ 15, 16 తేదీల్లో రాష్ట్రస్థాయి రచయిత్రుల సదస్సుని ఏర్పాటుచేస్తోంది.
2009 బ్రౌన్ పురస్కారానికి జెజ్జాల కృష్ణమోహనరావు గారిని, ఇస్మాయిల్ అవార్డుకు వైదేహి శశిధర్ గారిని ఎంపిక చేశారు.