పోటీ డిసెంబర్ 13, 2020 ఆదివారం పూర్తిగా ఆన్‌లైన్‌లో నిర్వహింపబడుతుంది. ఇంటర్నెట్ ఉన్న స్మార్ట్‌ఫోన్ ద్వారా ఎవరైనా ఈ పోటీలో పాల్గొనవచ్చు. ఫలితాలను డిసెంబర్ 20, 2020 ఆదివారం ప్రకటిస్తారు. పోటీకి నమోదుకు ఆఖరు తేదీ డిసెంబర్ 10, 2020.
Category Archive: ప్రకటనలు
రాబోయే సంక్రాంతి 2021 పండుగ సందర్భంగా శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) శ్రీ UAN మూర్తి స్మారక 3వ రచనల పోటీ నిర్వహిస్తుంది. విదేశాలలో నివసిస్తున్న తెలుగు రచయితలందరినీ ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని సవినయంగా కోరుతున్నాం.
స్వర్గీయ కొండసాని నారాయణరెడ్డి స్మరణలో… కొండసాని వారి సాహితీ పురస్కారం – 2020 కొరకు తెలుగు రాష్ట్రాలలోని కవులు మరియు రాష్ట్రేతర తెలుగు కవుల నుండి కవిత/కథా/నవల సంపుటాలను పురస్కారం కోసం ఆహ్వానిస్తున్నాము. ఈ పురస్కారపు 2019 గ్రహితలు కవిత్వం : సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి – బడి; కథ: యమ్.వి రామిరెడ్డి – వెంటవచ్చునది.
తమ పుస్తకాలు తామే అచ్చు వేసుకోవడమే కాక, వాటిని అమ్ముకోవలసిన కష్టమూ రచయితల మీదే పడుతున్నది. పాఠకులు తమ పుస్తకాలను చదువుతారా, మెచ్చుతారా అన్నది తరువాతి మాట. అసలు తమ పుస్తకం అనేది ఉన్నది అని పాఠకులకు తెలియజెప్పడం మొదటి సమస్య. ఈ సమస్య కొంతైనా తీర్చడం కోసం, ఈమాటలో ఇకనుంచీ కొత్త పుస్తకాల పరిచయాలు మొదలుపెడుతున్నాం.
రాబోయే సంక్రాంతి (2019) సందర్భంగా శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ నిర్వహిస్తుంది. భారతదేశం మినహా విదేశాలలో నివసిస్తున్న తెలుగు రచయితలందరినీ ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చెయ్యమని సవినయంగా కోరుతున్నాం.
డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితి ఇరవై ఏళ్ళ పండగ సందర్భంగా సెప్టెంబరు 29-30, 2018న జరుగుతున్న సదస్సులకు సాదర ఆహ్వానం. మా ఆహ్వానాన్ని మన్నించి తెలుగు సాహిత్యాభిమానులందరూ రావాలని కోరుతున్నాం, వస్తారని ఆశిస్తున్నాం.
ఇదిగో అదిగో అంటూనే డిట్రాయిట్ తెలుగు సాహితీ సమితికి ఇరవై ఏళ్ళ వయసొచ్చేసింది. సాహితీ సమితి సంబరాలకు తోటి సాహిత్యాభిమానులతో కలిసి సదస్సు నిర్వహించుకోవడంకన్నా సబబైనది మరొకటి ఉండబోదు. అందుకే తెలుగు సాహిత్యాభిమానులందరినీ ఈ ఇరవై ఏళ్ళ పండగ సందర్భంగా డిట్రాయిట్‌కు ఆహ్వానిస్తున్నాం.
కౌముది వెబ్ మాసపత్రిక మరియు రచన మాసపత్రిక సంయుక్త నిర్వహణలో జరుగుతున్న కథల పోటీ, 2017కు మీ రచనలని ఆహ్వానిస్తున్నాము. పోటీకి వచ్చిన కథలలో ఉత్తమమైన కథలకు ఒక్కొక్కదానికీ రూ. 1500, అత్యుత్తమ కథ (ఒక కథకి) రూ.5000 బహుమానంగా ఇవ్వబడతాయి. చివరి తేదీ: ఫిబ్రవరి 5, 2017.
అనువాదంలో అవిరళ కృషికి గుర్తింపుగా మన్మధ నామ సంవత్సరానికి గాను బ్రౌన్ పండిత పురస్కారాన్ని వై. ముకుంద రామారావు గారికి ప్రకటిస్తున్నాము.
తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు చామర్తి మానస ఎంపికైనారు. తనదైన అనుభవాన్ని అనాయాసంగా దృశ్యమానం చేయగల ప్రతిభా వ్యుత్పన్నతలు నేటికాలపు కవులనుండి వీరిని ఎడంగా నిలబెడతాయి.
మార్చ్ 26న అట్లాంటా నగరంలోని ఎమరీ యూనివర్సిటీలో తెలుగు ఆచార్య పదవి నెలకొల్పబడబోతున్న సందర్భంగా ప్రత్యేక ప్రకటన ఈమాట పాఠకులతో పంచుకోడం కోసం.
యావజ్జీవితం శాసన పరిశోధనకు అంకితమై ఆంధ్ర చరిత్ర రచనకు ఆకరాలు అందించిన పుచ్చా వాసుదేవ పరబ్రహ్మ శాస్త్రి గారికి జయనామ సంవత్సర బ్రౌన్ పురస్కారాన్ని ప్రకటిస్తున్నాము.
తెలుగులో ఉత్తమ కవిత్వానికి గుర్తింపుగా ఇస్తున్న ఇస్మాయిల్ అవార్డుకు కె. మమత ఎంపికైంది. ఎగసి పడే భావాలను, నిజాయితీగా – సున్నితమైన పదచిత్రాల్లో పట్టుకురావడంలో గల నేర్పు, కవిత్వానికి కట్టుబడి ఉండటం నేటికాలపు కవులనుండి ఈమెను ఎడంగా నిలబెడతాయి.
కౌముది వెబ్ మాసపత్రిక మరియు రచన మాసపత్రిక సంయుక్త నిర్వహణలో జరుగుతున్న కథల పోటీ, 2015కు మీ రచనలని ఆహ్వానిస్తున్నాము. పోటీ కథలు మాకు అందవలసిన చివరి తేదీ: ఫిబ్రవరి 5, 2015.
రాబోయే 20 వ తానా సమావేశాలలో (జులై 2-4, 2015) తెలుగు సాహిత్య కార్యక్రమాల నిర్వాహక వర్గం ‘తెలుగు సాహిత్యంలో స్త్రీల పాత్రల స్వభావ పరిణామం’ అనే అంశం పై చర్చావేదిక నిర్వహించనుంది. స్త్రీ పాత్రల స్వభావాలలో వచ్చిన మార్పులు వివిధ తెలుగు సాహితీ ప్రక్రియలలోను, దృశ్య మాధ్యమాలలోను ఎలా ప్రకటితమయ్యాయి? ఈ మార్పులు సమకాలీన సమాజంలో స్త్రీల జీవితాల్ని ఏ విధంగా ప్రభావితం చేశాయి? అనే విషయాలను చర్చకు తీసుకురావడం, ఈవేదిక నిర్వహణ ప్రధానోద్దేశం.
ఏ సాంకేతిక సాధనం లేదా యంత్రం, మానవ విచక్షణకు సాటిరావు. ఇవి కొన్ని పరిథులకు లోబడి మనకు సహాయకారిగా ఉంటాయి. పద్య రచననను చేయడానికి భాషపై పట్టు సాధించడంతో పాటుగా, ఛందో నియమాల ధారణ, అధ్యయన, అభ్యాసనాలు కొంతవరకూ చేయవలసిందే. కానీ ఈ ప్రత్యేక సాహిత్య ప్రక్రియను తరువాతి తరానికి అందించడానికి సాంకేతిక సాధనాల అవసరాన్ని గుర్తించాల్సి ఉంది. అటువంటి సాంకేతిక సాధనం ఈ ఛందం©.
పెద్దక్కను పోగొట్టుకున్న చెల్లెమ్మలు, ఒక్క పట్టున మూడురోజుల్లో యీ పుస్తకం రాసి, మరో వారం రోజుల్లో పుస్తకంగా ప్రచురించి వాళ్ళ అమ్మా నాన్న చేతుల్లో పెట్టారట (కూతురిని పోగొట్టుకున్న దుఃఖాన్ని కూడా మరిచి యీ ముచ్చట చెప్పారు వాళ్ళ నాన్నగారు.) ‘పెద్దక్క ప్రయాణం’ వీలైనంత మందికి అందుబాటు లోకి తీసుకు రావాలనే మల్లీశ్వరి గారి సంకల్పానికి ఆసరాగా ఈమాట గ్రంథాలయంలో ఈ పుస్తకాన్నుంచుతున్నాం.
2013 బ్రౌన్ పురస్కారానికి రవ్వా శ్రీహరి గారు, ఇస్మాయిల్ అవార్డ్‌కి బండ్లమూడి స్వాతికుమారి గారు ఎన్నికైనారని సంతోషంతో తెలియజేస్తున్నాము.
కందుకూరి రమేష్ బాబు సామాన్యుల జీవితాలను ఇష్టంగా రికార్డ్ చేస్తున్నారు. వారి బతుకులను తన కెమెరాతో బొమ్మలు తీస్తున్నారు.వారి జీవితాలను గానం చెయ్యడమే తనకు సంతృప్తినిస్తుందని చెబుతున్నారు. జర్నలిజంలో పుష్కరకాలం పైగా ఉన్నారు.సామాన్యుల జీవిత పరిచయాలే వీరికి వృత్తీ, వ్యాపకం.