మా సంస్థకి పదేళ్ళు నిండిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న తెలుగు సాహిత్యాభిమానులందరితో సమావేశమై ఒక వారాంతమంతా తెలుగు సాహిత్యపు వెల్లువలో మునిగి తేలాలని కోరిక కలిగింది.

భాషాశాస్త్ర రంగంలో మహత్తరమైన కృషి చేసినందుకు భద్రిరాజు కృష్ణమూర్తిగారిని అభినందిస్తూ సి.పి. బ్రౌన్ అకాడమి, “తెలుగు భారతి” పురస్కారాన్ని ఆనందంతో అందజేస్తున్నది.

రాబోయే సర్వధారి ఉగాదికి, తెలుగు లలిత కళా సమితి (Telugu Fine Arts Society, NJ, USA ) తెలుగుజ్యోతి పత్రికావర్గం ఒక విశేష సంచికని మీ ముందరికి తీసుకు రాబోతోంది. ఈ విశేష సంచికలో ప్రచురించడానికి దేశవిదేశాల్లో వున్న తెలుగు భావుకులందరికీ ఈ ఆహ్వానం.

ఈ ఏడాది నుండి అనువాదం, పరిశోధనా, నిఘంటు నిర్మాణాల్లో కృషి చేసిన పండితులకు ఉడతాభక్తిగా ఒక పురస్కారం ప్రకటించాలన్న సంకల్పం. ఇందులో భాగంగా, కేశవరావు గారి అనువాద గ్రంథం Tree,My Guru కు CP బ్రౌన్ పండిత పురస్కారం.

విదేశాంధ్ర ప్రచురణల సంస్థాపకులు, ఇంగ్లీషు ప్రొఫెసర్ గూటాల కృష్ణమూర్తి గారు సూర్యకుమారి గారి పై ఒక ప్రత్యేక గ్రంధం ప్రచురించబోతున్నారు. ఇదివరలో, ఆయన శ్రీశ్రీ గారి మహాప్రస్థానం పుస్తకం, శ్రీశ్రీ స్వయంగా చదివిన గేయాల టేపు మనకి అందించారు. ఈ పుస్తకం ఇండియాలో నవంబర్ 2007 లోనూ, ఇంగ్లండులో ఫిబ్రవరి 2008 లోనూ విడుదల కాబోతోంది.

వంగురి ఫౌండేషన్ వారు రెండేళ్ళకొకసారి నిర్వహించే ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు హ్యూస్టన్ మహా నగరంలో అక్టోబర్ 14-15 తేదీలలో జరగబోతోంది. తెలుగు భాషాభిమానులు, పండితులు, సాహిత్య విమర్శకులు, కంప్యూటర్ తెలుగు లిపి మొదలైన సాంకేతిక విషయాలలో నిష్ణాతులైనవారు, అమెరికాలో తెలుగు భాషను పెంపొందించదలుచుకున్న వారందరనీ ఈ ఐదవ అమెరికా తెలుగు సాహితీ సదస్సు లో పాల్గొనమని “ఈమాట” ఆహ్వానిస్తోంది . ఈ సారి సదస్సులో ప్రముఖ చిత్రకారులు, సినీ దర్శకులు శ్రీ బాపు గారి చిత్రకళా ప్రదర్శన, “ఈమాట” ముఖ్య సంపాదకులు శ్రీ వేలూరి వెంకటేశ్వరరావు గారు “సాహిత్యంలో హాస్యం” అన్న అంశం మీద చేయబోయే కీలకోపన్యాసం ప్రత్యేక ఆకర్షణలు కానున్నాయి.

పార్థివనామ సంవత్సరం ఇస్మాయిల్‌ అవార్డ్‌ కు ప్రతిభగల కవయిత్రి పాలపర్తి ఇంద్రాణి రచించిన “వానకు తడిసిన పూవొకటి” అనే కవితా సంకలనాన్ని ఎంపిక చేశారు. అక్టోబర్‌ లో విడుదల కాబోయే ఈ పుస్తకం నుండి రెండు చిన్న కవితలు.