రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

దండోరా

రచన: సాంఘిక
జనవరి 2017

డడ్ డడ్ లబ్ డబ్ లబా డబ్
అదే డప్పు చప్పుడుతో
ఉరుకులూ పరుగులుగా
తేనెచుట్టు ఈగల్లా మేం.

ఊరి చివర వాడలో
ఒంటరిగా ఉంటాడు
డప్పు మోగమంటేనే
ఊరు లోకి వస్తాడు.
ఆదివారం దండోరా!
పాములోయ్ పహారా!
బుడ్డోడిది డప్పు దరువు
వెంబట్నే చిందేస్తూ మేం.

పుల్లనైన చద్దికూడు
చిటికెడంత ఉప్పుతో
దోసెట్లో పట్టినంత
నిలబడి తిని అట్లాగే
డప్పు ఆగకుండానే
వాడ వాడ తిరుగుతుంటే
రాజు వెనుక సైన్యంలా మేం.

ఆగని సంబరం జాతరే లోకం.
పాములోళ్ళ బండ్ల వెనుక
వెతికే పెద్దాళ్ళ నుంచి
కందినతో గడ్డాలూ
మీసాలూ వేషాలూ
కల్లుతాగినోళ్ళలా మేం.

గడిచిపోతూ సూరీడు
వెళ్ళిపోతూ బుడ్డోడు
రేపేమో ఎక్కడో
పూటకూడు ఏమిటో
పొట్టమీద గమ్ముగా
కప్పుకున్న డప్పుతో
పొలిమేరకి దాపులో
ముందుకెళ్తూ వాడు.
వెనక్కి తిరిగి చూస్తూ
వెనక్కి తిరిగొస్తూ మేం.

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • చిత్రపటం
  • గిరిపుత్రిక
  • గుప్పెట్లో తూనీగ
  • దండోరా
  • సినిమా

ఇటువంటివే…

  1. ఐదు కవితలు: నాలుకపై వానచుక్క
  2. ద్వంద్వాలు
  3. యేమో!?
  4. రాజేశ్వరీదేవి: శైవలిని
  5. రాజేశ్వరీదేవి: చిరునవ్వు కోసం

జనవరి 2017 సంచికలో ...

  • 2017 కౌముది – రచన సంయుక్త కథల పోటీ
  • ఏకాంతం కోసం
  • ఐదు కవితలు: శివలెంక రాజేశ్వరీదేవి
  • ఒక సందిగ్ధ స్వప్నం – వానొస్తద?
  • ఒకనాటి యువ కథ: గోల
  • కోటిగాని కతలు: బత్తాయిలు పోయినాయి
  • గడి నుడి – 3
  • గుప్పిట ప్రేమ
  • చిత్రకవిత్వరీతులు
  • జనవరి 2017
  • జిక్కి పాడిన మూడు పాటలు
  • తానొకటి తలచిన…
  • దండోరా
  • నాకు నచ్చిన పద్యం: విద్వాన్ విశ్వం ఆధునికస్వరం
  • పాకశాలలో పాణినీయం
  • పెట్టని మొక్కు ఫలితం
  • యేమో!?
  • రాజేశ్వరీదేవి: అట్లా చేశానా?
  • రాజేశ్వరీదేవి: అసలు సంగతి
  • రాజేశ్వరీదేవి: చిరునవ్వు కోసం
  • రాజేశ్వరీదేవి: జాగరణ
  • రాజేశ్వరీదేవి: శైవలిని
  • రాసక్రీడాష్టకము
  • శ్రీ వినాయక లాండ్రీ సర్వీస్
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 1
  • సంగీత కళా రహస్య నిధి భట్టుమూర్తి
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

నాకు నచ్చిన పద్యం: విద్వాన్ విశ్వం ఆధునికస్వరం
రాజేశ్వరీదేవి: శైవలిని

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.