ఈ సంచికలో విశేషాలు:
- భావ జానపద కవిత్వాల పై వెల్చేరు, పరుచూరి గార్ల వ్యాసం
- పాల్కురికిపై పరిశోధన చేసిన ఆచార్య పి. జ్యోతి గారి వ్యాసం
- ఈ మధ్యే మరణించిన జి. వి. సుబ్రమణ్యం గారికి నివాళిగా నవ్య సంప్రదాయోద్యమం గురించి ఆయన రాసిన వ్యాస పరంపర నుండి కొన్ని భాగాలు
- అతి పిన్న వయస్సులోనే princeton university లో ప్రొఫెసర్ పదవి పొందిన మంజుల్ భార్గవ పై వేమూరి గారి వ్యాసం.
- అంపశయ్య నవీన్ గారి అమెరికా పర్యటన సందర్భంగా అట్లాంటాలో చేసిన ప్రసంగం.
- చంద్రా కన్నెగంటి, లైలా, వేలూరి, వైదేహి శశిధర్ గార్ల కథలు
- యథార్థ చక్రం మూడవ భాగం, తిరుపతి వెంకట కవుల గురించి వేలూరి గారి వ్యాసం, శాస్త్రీయ సంగీతాన్ని “డీ మిస్టిఫై” చేసే రోహిణీప్రసాద్ గారి వ్యాసం, మత్తేభ విక్రీడితంలో నవరసాల గురించి మోహన రావు గారి వ్యాసం
పాఠకుల సూచన మేరకు ఈ సంచిక నించి ఈమాట వేషంలో మరిన్ని మార్పులు చేస్తున్నాము. అందులో ముఖ్యమైనవి:
- ప్రతి పేజీలో కుడిపక్కన ఇంకో కాలమ్.
- సంచికలోని ప్రతి రచన పేజీలో కుడిపక్క కాలమ్లో ఆ సంచిక విషయ సూచిక.
- ఒకటి కన్నా ఎక్కువ పేజీలున్న ప్రతి రచననీ ఒకే పేజీలో చదవడానికి లింకు. ఇటువంటి రచనలని విషయసూచిక పేజీ నించే ప్రింట్ చేసుకోగలిగే సౌకర్యం.
- ప్రతి రచనకీ కుడిపక్క కాలమ్ లో printer friendly page కి లింక్
- మీ సౌకర్యం కోసం printer friendly page ఇంకొక విండో లో కనబడుతుంది.
ఈ మార్పులు మీ మెప్పు పొందుతాయనీ, ఈమాట కొత్త సంచిక గురించి మీ నిర్మాణాత్మకమైన అభిప్రాయాలు తెలియచేస్తారనీ ఆశిస్తాము.