గాలి సావిట్లోకొస్తే
ఎవరు చూడొచ్చేరు?
నువ్వూ చూళ్ళేదూ నేనూ చూళ్ళేదు:
ఆకులు గలగల్లాడితే
తడి బట్టలు అల్లాడితే
అబ్బ గాలే అమ్మలూ!
అనుకోడం తప్పించి.గాడుపు ఈడ్చి కొడుతుంటే
ఎవళ్ళకి కనిపిస్తుంది?
నీకూ అవుపడదూ నాకూ అవుపడదు:
చెట్లు జుట్లు విరబోసుకుని
తలలొగ్గి ఊగుతుంటే
అయ్యొ గాలిరా నానా!!
అనుకోడం తప్పించి.
[Inspiration: Who Has Seen the Wind? Christina Rossetti.]