1. తొమ్మిదింబావు
అద్దపు చెక్కిటి
చెరువున ఊగే
కలువల రేకుల
అంచులనిమంచు దుప్పటి
కప్పుకు కునికే
చలిమంటల
చిరు కులుకులనిముని చీకటి
కాటుక అలదిన
అంచుల వెనక
మాటలు దాచిన
సరసులనిగేలం వేసే
చేపలనిచేపల చిక్కి
గంటనించి
కొట్టుకులాడే
తెలిమబ్బు
కలలన్నీచక్రాల్
గాల్లో తేలే
పచ్చ బస్సులో
వదిలేసిదిగిపోయాను
కళాశాలకు
వేళయిందని.
2. ఆ మాట
దారంతో పువ్వు కుడుతోంటే
చిక్కు ముడి పడ్డట్టు
ఎగురుకుంటూ వెళుతోంటే
కళ్ళల్లో నలుసు పడ్డట్టు
షికారుగా పోతోంటే
జోడు ఒకటి తెగినట్టు
అప్పుడు గబుక్కున
నువ్వన్న ఆ మాట
నీ గొంతులో విసురు
మైసూరు పాకులాంటి
నా మనసును
కసుక్కున కోస్తుంది.