రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

దృశ్యం

రచన: విన్నకోట రవిశంకర్
సెప్టెంబర్ 2015

పొగలో దోబూచులాడే కొండలే
ఈ ఊరికి అండగా నిలుస్తాయి.
దట్టమైన వృక్ష కవచాలతో
నలు దిక్కులా సైనికుల్లా కాపలా కాస్తాయి.
పట్టు చీర కట్టుకున్న దేవ కన్యలై
పర్యాటకుల్ని సమ్మోహ పరుస్తాయి.

ఏవో ప్రాచీన స్మృతులతో నిత్యం ధ్యానంలో మునిగినా,
ఊరు కొత్త మెరుగులు దిద్దుకుని జన సంద్రం కావటానికి
తమ భుజాల్ని ఆసరాగా ఇస్తాయి.

ఉన్నవన్నీ విడిచి రమ్మనే అడవి,
లేనివి కూడా అనుభవించమని పిలిచే ఊరు
ఆశ్చర్యంగా ఇక్కడ సహజీవనం చేస్తాయి.

అలవికాని తళుకు బెళుకులతో,
అర్థరాత్రి దాకా ఆనందాన్ని వెతుకుతూ తిరిగే మనుషులతో
సతమతమయ్యే ఊరిని చూసి
ఆకుల రంగులే ఆభరణాలుగా ధరించిన అడవి
చిన్నగా నవ్వుకుంటుంది.

అడవిలో కాసిన వెన్నెల
అద్భుతంగా పండుతుంది.
ఊరి మీద పడిన వెన్నెలే వృధా అయిపోతుంది.

వినోదాలను పంచే తలుపులన్నీ మూతపడ్డాక
తలపులతో అలసిన ఊరు
కలత నిదురలోకి జారే తెల్లారివేళలో
అడవి నిద్ర లేస్తుంది.
తొలి మంచు బిందువులలో తడిసిన
ముంగురులను సరిచేసుకుని
నుదుట సూర్య తిలకం దిద్దుతుంది.

    
   

1అభిప్రాయం

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    జ్యోతిర్మయి September 4, 2015 9:52 am

    అడవిలో కాసిన వెన్నెల
    అద్భుతంగా పండుతుంది.
    ఊరి మీద పడిన వెన్నెలే వృధా అయిపోతుంది.

    అద్భుతంగా ఉంది కవిత.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • అదను
  • హోళీ
  • కెరీరిజం
  • సాగర్ శిల్పం
  • భ్రమలు

ఇటువంటివే…

  1. ఓ మలి సంధ్య దృశ్యం
  2. కాన్వాసు పై దృశ్యం
  3. ఒక కాఫ్కా స్వదేహ దృశ్యం
  4. అరణ్య కవితలు
  5. సరస్సు నవ్వు

సెప్టెంబర్ 2015 సంచికలో ...

  • అదీ ఇదీ వదలితే
  • ఈమాట సెప్టెంబర్ 2015 సంచికకు స్వాగతం!
  • ఎందుకో అలా!
  • ఎక్కడెక్కడ తిరిగేవు నాయనా
  • ఒక పద్ధతి ప్రకా…రం
  • చిత్రం – ‘బాపు’రే విచిత్రం!
  • టూఎయిటీన్ డీ
  • తెలుగులో పుస్తక ప్రచురణ – ఆకారవికారాలు
  • దృశ్యం
  • నాకు నచ్చిన పద్యం: దాంపత్య మధురిమ – కవిత్వ మాధురీమహిమ
  • పోతనామాత్యుని కల్పనానల్పశిల్పం
  • ప్రత్యేక జనరంజని: పిఠాపురం
  • ప్రార్ధన: నువ్వే నేనవ్వు – 1వ భాగం
  • మాటల అక్షరాలు
  • వెడలెను కోదండపాణి
  • శ్రీమాన్ రీమాన్ ఉవాచ!
  • సినిమా
  • సౌభాగ్య కుమార మిశ్ర: మూడు ఒరియా కవితలు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

మాటల అక్షరాలు
సినిమా

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.