రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

సహచర

రచన: మహె జబీన్‌
జనవరి 2001

(“ఆకురాలు కాలం” కవయిత్రిగా ప్రపంచ వ్యాప్తమైన అభిమాన పాఠక బృందాన్ని సంపాదించుకున్న సుప్రసిద్ధ రచయిత్రి మహె జబీన్‌. ఈమధ్య వీరి కవిత్వం మరో మలుపు తిరిగినట్టు అనిపిస్తోంది. కొత్త భావాలు, ఆలోచనలు, ప్రతీకలు కన్పిస్తున్నాయి. ఈమార్గంలోదే ఈ కవిత కూడా.)

మనసు పరివాహకప్రాంతం మీద
అజమాయిషీ నీదే
ఆనకట్ట కట్టి మనస్తాపం కలిగించకు
మనసు లోయలలో దాగిన
జావళిపాటతో గొంతు కలుపు

ఇప్పుడు హృదయం ఇచ్చినందుకు
రేపు స్మృతిగీతం రాయకు
ఇప్పటికిప్పుడు ఒక ప్రేమ కవిత చెప్పు

సమాధి మీద పుష్పగుచ్ఛం వద్దులే
చీరకొంగులో కాసిని పొగడపూలు వేయి
తాజ్‌మహల్‌ప్రేమకానుక వద్దులే
బ్రతుకు బాటలో తోడుగావుండు

అరుంధతి నక్షత్రం సరిగా కనిపించడం లేదు
అబద్ధం చెప్పమని బలవంతం చేయకు

ఏడేడు అడుగులు
జన్మ జన్మల బంధాలు
అందాక ఆగలేను
కాస్త దగ్గరికి జరుగు

ఊహల గవాక్షం దగ్గర గొడవవుతుంది
విస్తరించని నీహారిక
జీవితం సేదతీరుతుంది
ప్రేమ యవనిక కప్పు

దేహం సప్తస్వరాల మోహగీతం
కలిసి శ్రుతి తప్పని రాగమొకటి ఆలపిద్దాం

    
   

1అభిప్రాయం

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    siriviennea June 14, 2009 7:48 am

    మంచి భావన!
    “ఇప్పుడు హృదయం ఇచ్చినందుకు
    రేపు స్మృతిగీతం రాయకు”

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • సహచర
  • తెంపుకోవే బంధనాలు
  • ఒక రాజకీయ ఉత్తరం
  • తామసి
  • కనిపించడం లేదు

ఇటువంటివే…

  1. కలిశాం
  2. సోహం
  3. కవిత ఒకటి కొత్తది
  4. నేనొక పాత్రని
  5. మనం మాట్లాడుకుందాం

జనవరి 2001 సంచికలో ...

  • …..ఉరకకురా పడేవు
  • అమెరికా ఆంధ్రుల ఆహ్వానం
  • ఇండియన్‌ వేల్యూస్‌
  • గతచిత్రం
  • గింగిర్లు తిరుగుతున్న పాటలు
  • జనవరి 2001
  • డ్రైవింగ్‌ లెసన్‌
  • తమాషా దేఖో 5
  • తెలుగు లలిత సంగీతంలో “రజనీ” గంధం
  • నిద్ర పట్టనివ్వని అలారం
  • నేనొక పాత్రని
  • మనం మాట్లాడుకుందాం
  • రాగలహరి: కల్యాణి
  • లెఖ్ఖల పరీక్ష
  • సహచర
  • సినిమా పాటల్లో హాస్యం
  • సోహం
  • స్వామి డి. ఆనంద్‌ మహరాజ్‌ కథ
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

తమాషా దేఖో 5
మనం మాట్లాడుకుందాం

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.