అమ్మా కనకమ్మా
రాగం: మాయా మాళవగౌళ
స్వర రచన, గానం: పేరి పద్మావతి
రచన, స్వర కల్పన: కనక ప్రసాద్
సాహిత్యం
పల్లవి:
అమ్మా కనకమ్మా
అది ఏమని అనకమ్మా
దిన దినము ఒక తెరుపమ్మా
అమ్మా కనకమ్మా
అది ఏమని అనకమ్మా
దిన దినము ఒక తెరుపమ్మా
అమ్మా కనకమ్మా
చరణం:
పసి రోజుల నాడు
కసుఁగాయకు మరుపమ్మ
ఎల ప్రాయమునాడు
వలకాఁకను తల చెఱుపమ్మ |అమ్మా|
కసుఁగాయకు మరుపమ్మ
ఎల ప్రాయమునాడు
వలకాఁకను తల చెఱుపమ్మ |అమ్మా|
చరణం:
నడిఁగాలపు రాఁపు
నలుగురిలో మను బలుపమ్మ
ముది యొదకలియాడ
తుది అదుబిదుకులలో అలుపమ్మ |అమ్మా|
నలుగురిలో మను బలుపమ్మ
ముది యొదకలియాడ
తుది అదుబిదుకులలో అలుపమ్మ |అమ్మా|
చరణం:
విదులందరు ముందఱగొన్నా
ఇది ముందరి తోవను కనదమ్మ! |అమ్మా|
ఇది ముందరి తోవను కనదమ్మ! |అమ్మా|
For కనకమ్మ.