రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

మనభాష – మనపద్యం

రచన: సమవర్తి
జులై 2014

వర్షసహస్ర భాసి, రసవత్కమనీయ పదార్ధ, నైకధో
త్కర్ష, శివే తరాపనయ గౌరవగౌర, తెలుంగు పద్యమౌ!
ఆర్ష మహాధ్వగంత మహితాత్ముఁడు నన్నయ దొట్టి నేఁటికిన్
హర్షవివర్ధనుల్ కవులు, ఆ ఘన విద్య సమాదరింప, సం
ఘర్షణ లేల! పద్యరసగంగ విగాహితులై తరింపఁగా!

తల్లియందంపు టద్దమై దనరు తెలుఁగు
సొబగు దెలియక కష్టమం చోకిలించు
నేటియువతకు గురువులౌ మేటివారి
పాటవంబున పాడయ్యె భాష బ్రదుకు!

భాషకు దిక్కులేనపుడు పద్యము నెవ్వఁడు గుర్తువట్టు? సం
భాషణలో సగంబు పెరభాష విభూషగ నాగరుల్ సదా
పోషణ సేయుచో తెలుఁగు పోదటె కంపల బడ్డ కాకియై!
శేషము సున్నగాగలదు శిక్షణ యిప్పటినుండి లేనిచో!

నన్నయనుండి చిన్నయకు, నాచన సోమునినుండి పోన్నిగం
టన్నకు మధ్య వర్తిలిన యాంధ్రపు టందము బుర్రబుర్రలో
తిన్నగ నాటగా బడమి తెల్లము భాషను నేర్పు వేళ, మ్రా
గన్నిడి యొజ్జలున్ బ్రభుత కాలము బుచ్చిన మాతృ హత్యయౌ!

పొట్టకూటికి నేర్చిన పొరుగు భాష
నట్ట నడిమింటి దయ్యమైనది గదయ్య!
తెలుఁగునేలను పెరభాష తెగులదేల?
నీరుగలిపిన పాలు గానేల తెలుఁగు!

మరల తలలుంచి, యోజింప మఱచి తరచు
యాంత్రికంబుగ బ్రదుకుట యలవడు టను
తల్లి భాషకు తగుచోటు దక్కదయ్యె
దీనిగమనించి దిద్దుకో తెలుఁగువాడ!

శబ్దార్థ సిద్ధులౌ సంయమి త్రయి కృతం
        బాంధ్ర భారత వేద మధ్యయనము
భాషాభిషక్కులౌ ప్రాక్కవీంద్ర స్తోమ
        రసరమ్య కృతుల పారాయణంబు
నైఘంటికములయు నానార్థ పద కోశ
        పరిశీలనా శీల పరిణతి యును
ఆధునాతనాచార్య మధుర వాగ్ని ర్మాణ
        ఫణితు లనుశీలించు ఘన గుణంబు

నియతి బూనుచు నిత్యంబు ప్రియముతోడ
వ్రతము నిష్ఠను నెరపెడు గతిని, గృషిని
సలుపుగావుత విద్యార్థి సముదయంబు
ప్రభుత దోహదమిడుత నీ భాష పొదల!

వారికా దర్శ మూర్తులై భారవాహు
లగుచు నధ్యాపక వ్రాత మమరుగాత!
భాష నిలిచిన, పద్యంబె భద్ర గజము
ఆంధ్రభారతి కౌపవాహ్యంబు,నిజము!

    
   

2అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    తమ్మినేని యదుకుల భూషణ్‌ July 9, 2014 5:31 pm

    సమవర్తివి చక్కని పద్యాలు; అక్కడక్కడ విశ్వనాథ విరుపులు కనిపించాయి.

    దండుగ్గణాలతో విసిగించకుండా, రసస్ఫూర్తి చెడకుండా చెప్పదలచుకున్న విషయాన్ని స్పష్టంగా చెప్పడం ప్రశంసార్హం. భావాంతం, పదాంతం ఒకేసారి ఐతే క్లుప్తత సిద్ధిస్తుంది. రసజ్ఞుడైన కవి రచనల్లో క్లుప్తతకే పెద్ద పీట. పద్యమైనా, గద్యమైనా క్లుప్తత లేనిది రాణించదు. పంచెకట్టులా పద్యము మన సంప్రదాయము, పరాయి వేషభూషలు ఎన్ని వచ్చినా దాని పెద్దరికము దానిదే. విదురనీతి పద్యాల్లో “తగిన వేషంబు , తనుదాను పొగడు కొనమి ” అంటాడు తిక్కన. అలాగే, పద్యమైనా , గద్యమైనా ఒక పూనికతో రచిస్తేనే రసజ్ఞులను అలరించేది.

    ఘనత వహించిన తెనుగును కీర్తించిన సమవర్తికి జయము జయము!!

  2. 2
    samavarthi July 11, 2014 1:10 pm

    మాతృభాషపై మక్కువను పెంచిన మా గురువులకు నా రచనకైన సాధువాదములు చెందుగాక. శ్రీతమ్మినేని వారికిధన్యవాదాలు.

    సమవర్తి

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • మనభాష – మనపద్యం
  • మంజుఘోష
  • ఆకాంక్ష
  • వేడికోలు
  • జీర్ణమఙ్గే సుభాషితమ్

ఇటువంటివే…

  1. పసుపుకాంతి
  2. భావించేవరకూ…
  3. కొండదారిలో!
  4. నేపథ్య సంగీతం
  5. కాలం విలవ తెలీదు

జులై 2014 సంచికలో ...

  • అక్షరమాలా పద్యములు
  • అమెరికా ఇల్లాలి ముచ్చట్లు: ప్లాస్టిక్ బ్యాగులు
  • అమ్మా కనకమ్మా
  • ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం!
  • ఈమాట జులై 2014 సంచికకు స్వాగతం!
  • ఒక శతాబ్దకాలంలో భూపరిణామక్రమం: భూచక్రం
  • కాలం విలవ తెలీదు
  • కొండదారిలో!
  • కోనసీమ కథలు: కాటికాడ రుణం
  • ఛందం© – తెలుగు ఛందస్సు సాఫ్ట్‌వేర్
  • నాకు నచ్చిన పద్యం: అలముకొన్న అదృశ్యాంజనం
  • నేపథ్య సంగీతం
  • పసుపుకాంతి
  • బిల్హణీయము
  • భావించేవరకూ…
  • మనభాష – మనపద్యం
  • మాధవపెద్ది సత్యం: ప్రత్యేక జనరంజని మరియు లలితగీతాలు
  • మూడు ప్రశ్నలు
  • శార్దూలవిక్రీడిత వృత్తము
  • సమస్త సిద్ధాంతం అవసరమా?
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

కాలం విలవ తెలీదు
అక్షరమాలా పద్యములు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.