నా అనే నేను లేక

మట్టి గాలిపటం
ఎగురుతోంది కలలో

ఎలా తయారు చేయాలో
ఎవరూ చెప్పరే

ఏ కొమ్మలకి చిక్కుకున్నానో
చిరాకు లేదు కానీ
ఎలా ఎగరాలి భూమినుండి

ఓ ముసలి అల
తన కళ్ళను పారేసింది

గాలిపటంలోని మట్టి
కరగడం లేదు

ఎగిరే దారం ఒంటరేనా

మట్టి గాలిపటం గదుల్లో
చీకటి అనేది ఉంటుందా

అందుకో ఆ చివరి దాహం
దారాన్ని నేలకు చేరువగా

ఈ గాలిలోనే
కనిపించే ఖాళీ పురుగుని వొదలాలి