రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

శ్రీ యు. ఎ. ఎన్. మూర్తి స్మారక 3వ రచనల పోటీ

రచన: శాక్రమెంటో తెలుగు సంఘం
నవంబర్ 2020

విదేశాల్లో నివసిస్తున్న ప్రవాస తెలుగువారి రచనలకు TAGS ఆహ్వానం

రాబోయే సంక్రాంతి 2021 పండుగ సందర్భంగా అమెరికాలో కాలిఫొర్నియా రాష్ట్ర రాజధాని నగరం అయినటువంటి శాక్రమెంటోలో నెలకొనిఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం (TAGS) శ్రీ UAN మూర్తి స్మారక 3వ రచనల పోటీ నిర్వహిస్తుంది. భారతదేశం మినహా విదేశాలలో నివసిస్తున్న తెలుగు రచయితలందరినీ (ప్రవాస తెలుగువారు) ఈ పోటీలో ఉత్సాహంగా పాల్గొని విజయవంతం చేయాలని సవినయంగా కోరుతున్నాం. మూడు వేలమందికి పైగా స్థానిక సభ్యులను కలిగి ఉన్న శాక్రమెంటో తెలుగు సంఘం తెలుగు భాష, తెలుగు సంస్కృతి వ్యాప్తికి 2003 సంవత్సరం నుండి శాక్రమెంటో పరిసర ప్రాంతాలలో విశేష కృషి చేస్తున్నది. అమెరికా, కెనడా, యూరప్, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, సింగపూర్, మలేసియా తదితర విదేశాలలో నివసించే తెలుగు రచయితలకు ఇదే మా ఆహ్వానం. స్నేహపూర్వకమైన ఈ రచనల పోటీ ప్రధాన విభాగంలో జరుగుతుంది. ప్రవాసులు కానివారు TAGSవారి శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రికలో సాధారణ ప్రచురణ నిమిత్తం తమ రచనలు మా ఈమెయిలు telugusac@yahoo.comకు నిరభ్యంతరంగా పంపవచ్చు.

ప్రధాన విభాగం

ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఔత్సాహిక ప్రవాస తెలుగు రచయితల నుండి నూతన, అముద్రిత తెలుగు రచనలని ఈ పోటీకి ఆహ్వానిస్తున్నాం.

ఉత్తమ కథానిక: (మూడు బహుమతులు) ఒక్కొక్కటీ: $116, $58, $28 మరియు ప్రోత్సాహక బహుమతులు.

ఉత్తమ కవిత: (మూడు బహుమతులు) ఒక్కొక్కటీ: $116, $58, $28 మరియు ప్రోత్సాహక బహుమతులు

ముఖ్య గమనికలు

  • ఒక రచయిత ఒక్కో పోటీలో ఒక ఎంట్రీ మాత్రమే పంపించవచ్చును. కథలు పది పేజీల లోపు, కవితలు ఐదు పేజీలు లోపుగా ఉండాలి. పేజీ గరిష్ఠ కొలత 8.5 అంగుళాలు X 11 అంగుళాలు ఉండాలి. తమకు నచ్చిన ఇతివృత్తం రచయితలు ఎన్నుకోవచ్చును.
  • రచయితల అముద్రిత స్వీయ రచనలు మాత్రమే పరిశీలనకు స్వీకరించబడతాయి. స్వంత బ్లాగులు, స్వంత వెబ్ సైట్స్, స్వంత పత్రికలు మొదలైనవాటిల్లో ప్రచురించుకున్న లేదా ప్రచురించబడిన రచనలు పరిగణింపబడవు. ఈ మేరకు హామీపత్రం రచనతో బాటు విధిగా జతపరచాలి.
  • ‘ప్రధాన విభాగం’ పోటీలొ పాల్గొనే రచయితలకు 18 ఏండ్లు నిండి ఉండాలి. ప్రధాన విభాగంలో స్వీయ రచనలు పంపాలి. ప్రధాన విభాగంలో అనువాద కథలు, అనువాద కవితలు అనుమతింపబడవు.
  • హామీపత్రం/ధ్రువీకరణ పత్రం ఇక్కడ నుండి డౌన్లోడు చేసుకొనగలరు: డౌన్లోడు చేసుకున్న పిదప సదరు పత్రం పూరించి, మీ రచన(ల)తో పాటుగా మాకు ఈమెయిలు చెయ్యగలరు.
  • రచనల్లో ఎక్కడా మీ పేరు కానీ, మీ కలం పేరు కాని వ్రాయకూడదు. మీ రచనలు మాకు పంపినప్పుడు, మీ హామీపత్రంలో ఆ వివరాలు రాస్తే సరిపోతుంది.
  • మీ రచనలను Microsoft Wordలో తెలుగులో టైపు చేసి మా ఈ-మెయిలు telugusac@yahoo.com కు పంపాలి. చేతిరాత ప్రతులను పంపేవారు సదరు రచయిత చేతిరాత స్పష్టంగా, చదువశక్యంగా ఉండాలని మనవి. అస్పష్ట, సందిగ్ధమైన లేదా చదవడానికి వీలుకాని రచనలు పోటీకి పరిశీలింపబడవు.
  • బహుమతి పొందిన రచనలు, ప్రచురణార్హమైన ఇతర రచనలు కౌముది, సుజన రంజని, శాక్రమెంటో స్థానిక పత్రిక సిరిమల్లె, స్వర పత్రిక మరియు ఇతర పత్రికలలోనూ ఆయా సంపాదకుల వీలునిబట్టి, కేవలం వారి నిర్ణయానుగుణంగా మాత్రమే ప్రచురించబడతాయి.
  • బహుమతి పొందిన రచనలు, ప్రచురణార్హమైన ఇతర రచనలు TAGS వారి శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రికలో ప్రచురించబడతాయి.
  • విజేతల వివరాలు రాబోయే సంక్రాంతి 2021 పండుగకు ముందు ప్రకటించబడతాయి. కాపీ రైట్స్ తమవే అయినా, ఆ లోపుగా తమ ఎంట్రీలను రచయితలు ఇతర పోటీలకు పంపరాదు, ఇంకెక్కడా ప్రచురించకూడదు.
  • కాలిఫొర్నియా రాష్త్రంలో నెలకొని ఉన్న శాక్రమెంటో నగరంలో, జనవరి 2021న జరగబోయే TAGS 17వ వార్షికోత్సవం మరియు సంక్రాంతి సంబరాల సందర్భంగా సభాముఖంగా వేదికపై విజేతలకు బహుమతులు అందజేయబడతాయి, రాలేనివారికి పోస్టులో బహుమతులు పంపడం జరుగుతుంది. కోవిడ్ మహమ్మారి మూలంగా ఒకవేళ సంక్రాంతి సభ నిర్వహణ ప్రత్యక్ష్యంగా సాధ్యం కాకపోతే, ఆన్‌లైను సదస్సులో బహుమతి ప్రదానం నిర్వహించడం జరుగుతుంది. విదేశాలలో ఉంటున్న తెలుగు రచయితలకి ఇది ప్రత్యేక అవకాశం.
  • విజేతల ఎంపికలో న్యాయ నిర్ణేతలదీ, ఇతర విషయాలలో నిర్వాహకులదే తుది నిర్ణయం.
  • మీ రచనలు మాకు అందవలసిన ఆఖరి తేదీ: నవంబర్ 30, 2020.
    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • శ్రీ యు. ఎ. ఎన్. మూర్తి స్మారక 3వ రచనల పోటీ

ఇటువంటివే…

  1. TAGS ఆధ్వర్యంలో శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ
  2. 2005 తానా కథ-నవలల పోటీ బహుమతి పొందిన రచనల పై సమీక్ష
  3. 2017 కౌముది – రచన సంయుక్త కథల పోటీ
  4. 2015 కౌముది – రచన సంయుక్త కథల పోటీ
  5. శ్రీ శ్రీ కవిత్వంపై … మరో వ్యాసం

నవంబర్ 2020 సంచికలో ...

  • People who reacted
  • ఆగిపోని గానం
  • ఆవిరి
  • గడినుడి – 49
  • గల్ఫ్ గీతం: 5. నగర సంచారి
  • గ్రీకు పురాణ గాథలు 11
  • ఛాయారూపం
  • దేవగిరి
  • దేశ చరిత్రపై మత ప్రభావము
  • నవంబర్ 2020
  • పరిచయం: భారతీయ రచయిత్రులు
  • పోర్టికో
  • బహుజన సాహిత్యానికి దృష్టాంతం: వలస
  • ముగ్గురు మహనీయులు
  • విశ్వ మహిళా నవల: 4. షార్లట్ లెనక్స్
  • వీధి అరుగుపై…
  • శ్రీ యు. ఎ. ఎన్. మూర్తి స్మారక 3వ రచనల పోటీ
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 49
  • షెహనాయ్ సంతకం
  • స్థితం
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

అక్టోబర్ 2020
శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 49

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.