రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

పాయిరం

రచన: బండారి రాజ్ కుమార్
జూన్ 2019

వీనమ్మకు శెడబుట్టిండు నా కొడుకు! వీని శెర ఎన్నడు ఇర్గడయితదో ఏందో?
సుట్టు జెయ్యలేక నా రెక్కలిరిగిపోతానయి. ఎన్నడు బాత్తదో ఈ రంది? నా తలరాతని సరిపెట్టుకుందునా…

కాలిదప్పి ఏండ్లు గడిశినయి. పెయిమీది బట్టకు సోయి లేదు.
ఒకటికి రెంటికి ఇగజెప్పాల్నా… ఆడిపుట్క పుట్టినందుకు తలుగు తలిగిచ్చుకున్నట్టయింది.

అయ్య లేడాయే. అవ్వ లేదాయె. ఇంత ఉడుకబెట్టి పెడ్తనే ఆయింతనన్నున్నడు.
ఆళ్ళ ఈళ్ళ మాటలిని మార్వానంబోయినా పానమంత ఈన్నె వుండేది.

ఈడంత గంజి వార్సినట్టయితాందని ఊరకుక్కలు ఓరసూపు జూత్తయి.
పలుకు మీదున్నప్పటి పదునే పదునని పదిమంది గుడిసె సుట్టే కాపల గాత్తాంటరు.
గంజిలబడ్డ ఈగకు గాశారమా పాడా? అని మొఖం జూసుకుంటనే గొణుగుతాంటరు.

శేతజెయ్యలేక యాష్టకొచ్చి తిడుతాంటె ఎన్నడు బోతడోనని ఎదురుసూత్తాందని…
రంకుబొంకు సాటుంగ జేత్తానికి సందు దొర్కుతలేదని నరాల్లేని నాలికెలు బుసలుగొడుతనే వుంటయి.

మనిషి మీది పాయిరం ఎన్నయినా ఓర్సుకుంటదని ఈ జనాలకి ఎప్పటికీ తెల్వని రహస్యంగానే ఉండిపోతది.

    
   

0There are no comments

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • దందెడ
  • Replica
  • వొట్టిశాపల బతుకు
  • పాయిరం
  • హోమ్ సిక్

ఇటువంటివే…

  1. క‌ల‌గంటాను…
  2. నా-2
  3. రెండు కార్ల్ శాన్డ్‌బర్గ్ కవితలు
  4. అగ్ని స్నానం
  5. ఏదో వెలితి

జూన్ 2019 సంచికలో ...

  • ఒక ఊహ – ఒక కల
  • కాల్వీనో కథల నుంచి – 8
  • క‌ల‌గంటాను…
  • గడినుడి – 32
  • జూన్ 2019
  • దిష్టి
  • నా-2
  • పాయిరం
  • బాలానందం: ఇంకొన్ని పాటలు
  • మంటో కథలు: సహాయ్
  • మరొకసారి గంగ నేలకు దిగింది
  • రెండు కార్ల్ శాన్డ్‌బర్గ్ కవితలు
  • వెల్చేరు చేసిన విశ్వనాథ కథల ఆంగ్లానువాదం వెనుక
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 32
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

క‌ల‌గంటాను…
రెండు కార్ల్ శాన్డ్‌బర్గ్ కవితలు

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.