రచనాపాఠానికి వెళ్ళు

ఈమాట

eemaata: An Electronic Magazine in Telugu for a World without Boundaries
ప్రధానజాబితా
  • ఈమాట గురించి
  • పాఠకుల అభిప్రాయాలు
  • శీర్షికలు
    • కథలు
    • కవితలు
    • పద్యసాహిత్యం
    • వ్యాసాలు
    • సమీక్షలు
    • స్వగతం
    • గడినుడి
    • శబ్దతరంగాలు
    • ముఖాముఖి
  • సూచనలు
    • పాఠకులకు సూచనలు
    • రచయితలకు సూచనలు
  • ఈమాట రచయితలు
  • పాతసంచికలు

సరస్సు నవ్వు

రచన: హెచ్చార్కె
మే 2017

తన నుంచి తాను వెళిపోయి
అతడలా వుండిపోతాడు
తన వొడ్డు మీద తానుండి
తన లోనికి తాను గాలం విసిరే జాలరి
కొలనులో నీరు కదలదు
లోపల స్వప్నమీనం నవ్వుకుంటుంది
ఉండి వుండి కొలను నిద్ర పోతుంది
అతడూ నిద్ర పోతాడు
నిద్రపోక ఏం చేస్తాడు?
నిద్దట్లో మాత్రమే జీవిస్తున్నవాడు
ఎంతో కొంత తనకు తాను లేనప్పుడే
నిజంగా వుంటుంటాడు ఈ మాత్రమైనా
పేటిక మూసుకోవాలి ఇంకా
మనసులో ఏం వుందో
చెప్పడం ఎప్పుడూ సాధ్యం కాదు
లోలోపల నవ్వుకోడమే

    
   

4అభిప్రాయాలు

మీ అభిప్రాయం తెలియచేయండి
  1. 1
    T V Sharma May 2, 2017 4:27 am

    సరస్సు నవ్వు ఒకానొక నిచ్చల నిచ్చింత స్వప్న కిలికించితాలకి తార్కాణం.
    సరస్సు నిలవనీటికీ ప్రవాహరాహిత్యానికీ నిదర్శనం. నిచ్చలత్వాన్ని నిద్రతో పోల్చడం కవితాత్మకమైనా ఈ కవిత అందించే శూన్య తాదామ్యత ఎవరికీ సుబోధకం కాదు సుమా!

    సరస్సు ప్రవహించదు, సముద్రమూ ప్రవహించదు.. కానీ సముద్రానికీ సరస్సుకీ అసలు పోలికెక్కడుందీ? సరస్సులోనే గిలకొట్టేవాళ్ళు సముద్రాన్ని తలచడం సాధ్యం కాదు గాక కాదు. అందుకే మీ మీ మనఃసరస్సులలోనే మనోవాంచితాలను సాధించుకోండి సలక్షణంగా!

  2. 2
    అశితకేశ్‍ May 2, 2017 4:12 pm

    పద్యం బాగుంది. అంతరంగంలోని మాట ఎప్పటికీ చెప్పలేం.చెప్పలేక నవ్వుకోడమో ఏడ్చుకోడమో చేస్తాం. కవులు కూడా అదే చేస్తారేమో. ఈ వ్యాఖ్య రాసేప్పుడు పైన‍ శర్మ గారి కామెంటు చదివాను. కవితలో లేని సముద్రాలెందుకు ఇక్కడ? రచనలో వున్నవి వదిలేసి, లేనివి తెచ్చిపెట్టడం మంచి విమర్శ కాదేమో.

  3. 3
    పుట్టపర్తి నాగపద్మిని May 2, 2017 6:17 pm

    పరమాద్భుత భావచిత్రం !!!

  4. 4
    విజయ్ కోగంటి May 5, 2017 8:55 pm

    మీ ప్రతి కవిత లోనూ ఒక ప్రత్యేకత వుంటుంది. మనిషి-మనస్సు- సరస్సు- చిత్రమైన అంతర్వలయాలు. బాగుంది. అభినందనలు.

మీ అభిప్రాయం తెలియచేయండిCancel reply

మీ అభిప్రాయం తెలియచేయండి

  

   ( సహాయం తొలగించండి)

s h L ksh ~r j~n ph b bh m y r l v S sh p n dh d th t N ~m ch Ch j jh ~n T Th D Dh o O au M @H @M k kh g gh Ru ~l ~lu e E ai aa i ee u oo R a

ఈమాట పాఠకులకు సూచనలు చదివాను. వాటికి కట్టుబడి ఉంటానని హామీ ఇస్తున్నాను.

ఈ రచయిత నుంచే...

  • అమర కోశం
  • రెండు కవిత్వాలు
  • బుడగ
  • సరస్సు నవ్వు
  • కడవ

ఇటువంటివే…

  1. రామప్ప సరస్సు
  2. లక్ష్మణదేవర నవ్వు
  3. చావు నవ్వు
  4. ఆమె నవ్వు
  5. నాన్నా తెలుసా

మే 2017 సంచికలో ...

  • In Defence of Freedom
  • అదీ నేనే…
  • ఆవలి తీరం
  • ఒక పాట – రెండు బాణీలు
  • ఒకనాటి యువ కథ: కెరటాలు పలకరించాయి
  • గడి నుడి – 7
  • ఛాయామాయావి: మార్కస్ బార్ట్‌లీ
  • తెరచాటు-వులు: 4. మీరు సమర్ధులు గాన…
  • తెలుగు భాషా ప్రాచీనత
  • దేహి
  • నాకు నచ్చిన పద్యం: అశ్వంగా మారిన అప్సరస
  • నిర్వికల్ప సంగీతం (1987): సహృదయుని సాహితీ ప్రస్థాన ప్రారంభం
  • పెంపకపు మమకారం: కాళీపట్నం రామారావు కథ గురించి
  • మే 2017
  • రామచంద్ర పుత్ర! రామభద్ర!
  • రామరసాయనము
  • రిటర్న్ పాలసీ
  • వేయిపడగలు-గాన్ విత్ ద విండ్: 3. మారే ప్రపంచంలో మారని విలువ మెలనీ!
  • శ్రీశ్రీ పదబంధ ప్రహేళిక – 5
  • సగమే పూర్తయిన ఓ కవిత
  • సరస్సు నవ్వు
  • సుబంధుని వాసవదత్తా కథ: కొన్ని విశేషాంశాలు
© ఈమాట
అడుగు మెన్యూ గమనము
  • ఈమాట రచయితలు
  • About eemaata
గౌణ జాబితా
  • ఈమాట – ఫేస్బుక్
  • ఈమాట యూట్యూబ్
  • మీ రచనలు పంపించండి
  • సంపాదకులను సంప్రదించండి
  • RSS ఫీడ్
  • వెతుకు

రచనల జాబితా

నిర్వికల్ప సంగీతం (1987): సహృదయుని సాహితీ ప్రస్థాన ప్రారంభం
తెలుగు భాషా ప్రాచీనత

ఈమాటలో శోధించడానికి మీ కీలకపదాలను టైప్ చేసి రిటర్న్ బొత్తామును నొక్కండి. వెనక్కి వెళ్లడానికి Esc బొత్తామును నొక్కవచ్చు.