పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. చరిత్రాత్మక నవల అంటే? గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    08/13/2012 5:08 am

    ఏ రకమైన కొలబద్ద అయినా మంచి అవగాహనకు కొద్దిగానో గొప్పగనో ఉపకరిస్తుంది. అయితే , ప్రతీ విషయమూ, ప్రతీ వస్తువూ, ప్రతీ సిధ్ధాంతమూ చివరికి ప్రతీ వ్యక్తి కూడా మనకు తెలిసిన కొలబద్దలకూ తూకంరాళ్ళకూ లొంగి తీరవలసినదే నన్న ఆలోచన సరైనది కాదని నా అభిప్రాయం.

    విషయానికి వస్తే, లూకాచ్ అనే ఒకాయన తనకు దొరికిన వాటిలో నచ్చిన కొన్ని నవలలను మార్క్సిష్టు దృక్పధంతో పరిశీలించి చారిత్రకనవలల లక్షణాలను క్రోడీకరించటం జరిగిందని తెలుస్తోంది యీ వ్యాసం వలన నాకు. ప్రపంచంలో ఆయన దృష్టికి రాని అనేక చారిత్రకనవల లుండవచ్చును గదా? అనేక దేశాలలో అనేక సంస్కృతులలో అనేక భాషలలో అనేకానేక చారిత్రకనవలలు ఉంటే అన్నిటినీ పరిశీలించటం లూకాచ్ గారికి వీలుపడేపనీ కాదు. ఆయన ఒక గుప్పెడు నవలలను పరిశీలించి ఒక సిధ్ధాంతం చేస్తే అది శిరోధార్యం కానవుసరం లేదు. మంచం పొట్టిదయిందని కాళ్ళు నరుకుకోరు కదా? ఈ సిధ్ధాంతం చట్రంలో ప్రపంచవ్యాప్తంగా అన్ని సాహిత్యాలలోనూ వచ్చిన చారిత్రక నవలలను ఇమడ్చాలన్న ఆదుర్దాతో అలా ఇమడని వాటిని అక్షరాలా ఖండించటమేనా చేయవలసినది? ఇది శాస్త్ర్రీయదృక్పధం అనిపించుకుంటుందా?

    పాశ్చాత్యులైతే మనకన్న తెలిసిన వారు తెలివైన వారు అనే బూజుపట్టిన భావదారిద్యం నుండి మనకు యెప్పుడూ విడుదల? ఎంతసేపూ తెల్లవాడి సిధ్ధాంతాల మూసల్లోకి భారతీయ సాహిత్యాన్ని పోసి గుండెలు బాదుకోవటం జుగుప్స కలిగిస్తోంది. భారతీయవిమర్శనాసిద్ధాంతాల ప్రతిపదికగా పాశ్చాత్య సాహిత్యాన్ని యెందుకు బేరీజువేయరు అనే యెదురు ప్రశ్న వేసి తీరాలనిపిస్తోంది. (నిజానికి రెండూ సరైన ధోరణులు కావని తెలిసినా కూడా!)

    ఈ వ్యాసకర్తగారి ఒక వాక్యం “చివరికి విశ్వనాథ సత్యనారాయణగారి పురాణవైర గ్రంధమాల పేరున వచ్చిన నవలలు కూడా ఒక విధముగా చరిత్రాత్మక నవలలే!” అన్న మాటలో ఎంత హేళన ఉన్నది. పాపం విశ్వనాధ భారతోయుడై పోవటం కారణాన, ఇంకా దుడుగ్గా చెప్పాలంటే సాటి తెలుగువాడై పోయిన కారణాన ఎంత పలుచనై పోయాడు. పాపం ఆయనకు ‘లూకాచ్’ అనే ఆయన బిగించిన సిధ్ధాంతం ప్రకారం వ్రాయక పోవటం మరింత అవమానానికి గురి చేసిందా? నోరివారు విశ్వనాధ కొంత విశృంఖలంగా వ్రాసారన్నది నవలల చారిత్రకను ప్రశ్నించటం కాకపోవచ్చని నా అభిప్రాయం.

    “నోరి వారి లెక్కలో అడివి బాపిరాజు రాసిన హిమబిందు, గోనగన్నారెడ్డి చారిత్రక నవలలే” అన్న వేరొక వాక్యం వ్యాసకర్త గారు చెప్పారు. బాపిరాజుగారిని లూకాస్ శిక్షకు గురిచేస్తున్నా రన్నమాట. వేరే రకంగా ఎలా అర్థం చేసుకోవాలీ వాక్యాన్ని?

    ఇటువంటి ధోరణులు అసంతృప్తిని కలిగిస్తున్నాయి. భగవద్గీతనుండి బాపిరాజుదాకా, మీదాకా నాదాకా అందరి మీద పెత్తనం చేసే అధికారం ఈ మార్క్సిజానికీ దానిపేరు చెప్పుకొని పుట్టే సవాలక్ష సిధ్ధాంతోపసిధ్దాంతాలకీ ఎవరిచ్చారు?

    ఈ మార్క్సిజం అనే ఇనప చట్రంలో ఇమడవలసిన అగత్యం ప్రపంచాని కేమీ లేదు. ఎవరు హర్షించినా మానినా సాహిత్యకారులు ఏ సిధ్ధాంతాల చట్రాలకూ అనుగుణంగా వ్రాసితీరాలన్న వెట్టి చాకిరీ యేమీ లేదు చెల్లదు.

  2. మేరు నగ మేధావి గురించి Rao Vemuri అభిప్రాయం:

    08/12/2012 1:18 pm

    అచార్య కృష్ణమూర్తి గారిని హైదరాబాదులో, వారింట్లో ఒకసారి, కేలిఫోర్నియాలో మా స్నేహితుడి ఇంట్లో ఒకసారి కలుసుకునే అదృష్టం నాకు కలిగింది. నిండుగా ఉన్న విస్తరి అణిగిమణిగి ఉంటుందనే దానికి కృష్ణమూర్తిగారు ఒక ఉదాహరణ.

  3. తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్‌ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి lyla yerneni అభిప్రాయం:

    08/11/2012 1:26 pm

    “ఏకైక రామాయణ కథనానికి దారితీసే అవాంఛనీయ ప్రయత్నాల్ని ఇవి కొంతవరకు అడ్డుకొంటున్నాయి.” -K.V.S. Ramarao

    అనువాదము చాలా బాగుంది. Terrific. ఆఖరు పేరా, original English essay లో ఉన్నంత అర్థవంతము కాదు. The writer who translated the essay didn’t capture the essence of original writer’s conclusion.

    Narayana Rao uses the word ‘discourse’ three times in the last paragraph of his English essay. The word’s meaning is kept consistant. The English essay’s last sentence (It is a difficult sentence in itself, and it has its problems; :-), seriously, how many independent and dependent clauses can a compound-complex English sentence support, before it loses track of it’s verbs and its thoughts :-)) conveys a different meaning.

    అనువాదపు ఆఖరు పేరా తిరగ రాయవచ్చును. ఇంత గొప్పగా అనువదించిన వారికి అదెంత పాటి కష్టం?
    “Questioning Ramayanas” పుస్తకములోని ఇతర వ్యాసాలు ఇంకేమైనా తెలుగులోకి అనువదింపబడినవా?

    లైలా

  4. తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్‌ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి rama bharadwaj అభిప్రాయం:

    08/11/2012 1:22 pm

    రామారావు గారూ! నా అభిప్రాయాన్ని కూడా నేను మరి కొంచెం వివరించి రాసి ఉండవలసింది. నేను ఎక్కువ సేపు టైపు చెయ్యలేకపోవడం ఒక కారణం కాగా అభిప్రాయాలనే వ్యాసాలుగా విస్తరించి రాసే ఆసక్తి లేకపోవడం మరొక కారణం కావడంతో క్లుప్తంగానే నా అభిప్రాయాన్ని చెప్పడం జరిగింది.

    మీరే అన్నారు ” ఆధునిక” దృష్టి కానిది ఎలా ఉంటుందో నాకు అర్ధం కావడం లేదు అని. ఇది చెప్పడం లేదా మనం ఎంతగా ఈ “ఆధునిక ” స్పృహలో కూరుకుని పోయామో తెలుసుకోవడానికి? మీ ఉద్దేశ్యంలో “ఆధునికత”ని ముందు స్పష్టపరచండి. అసలు మనం ఏ పాటి “ఆధునికులమో” తెలుస్తుంది. అది అటుంచితే ఎందుకని మనకి విమర్శ తప్పనిసరిగా ఇంగ్లీషువారి మార్గాన్ని అనుసరించి వారిని ఉల్లేఖిస్తూ వారి మార్గంలో వారికి ఒప్పుదలగా సాగడం ఒక ఆనవాయితీగా మారిపోయింది? ఇది తప్ప వేరే మార్గం ఎందుకని లేదని మీరు అనుకుంటున్నారూ? మనకి ముందున్న ప్రమాణాలాన్నీ వట్టిపోయినవేననీ మన సమకాలంలోని అమెరికన్ విశ్వవిద్యాలయాలలోని విమర్శ మాత్రమే బలమైనదనీ ఎలా భావిస్తున్నారూ? దీన్నే “అంటగట్టడం” అని అంటాం. నాకు పోలాక్ ఏం చెప్పేరో ఎంతగా తెలియాలో అంతకన్నా ముఖ్యంగా భవభూతి ఏమని అనుకున్నాడో కూడా అంతే ముఖ్యంగా తెలియాలి. నాకు “కాలస్పృహ” లేదు. ఆ ప్రమాణంతో నేను ఆధునికతనే తప్పనిసరి కొలమానంగా ఎంచను. అందునా సాహిత్యంలో అసలే లేదు.

    పై వ్యాసంలో ఎంతగా నారాయణ రావు తెలుగున వచ్చిన పాత రామాయణాల ప్రస్తావన తెచ్చినా ఆయన విశ్లేషణ చేసింది మొత్తంగా వలస పాలన ప్రభావంతో మారిన ఆధునికుల చూపుని గురించే! ఇది ఒక ఫ్యాషన్. ఇదేమీ సత్యమూ శాశ్వతమూ కానఖ్ఖరలేదు. నేను భాగవతం లోని కృష్ణుని ప్రస్తావన తెచ్చినది ఎందుకంటే ప్రతిలో లేని దానిని మనం వ్యాఖ్యానం చెయ్యడం కాదు. కవి చెప్పిన దాని మీద మాత్రమే మాట్లాడటం విమర్శకి ముఖ్యం గనక. ఆ వ్యాసంలో చేసిన పని అదే! అంతే గానీ రామాయణాన్ని ఆధునికంగా మార్చిన రచనల మీద ఆధునికతా దృష్టితో ఇతిహాసాలని వ్యాఖ్యానం చేస్తున్నప్పుడు ఏ రకంగా ఇంగ్లీషు చదువులు అందుకు ప్రేరణని ఇచ్చాయో మాత్రమే కాకుండా ఆయా భాషలలో వారు, వారి వారి ఇతిహాసాలని ఆధునికంగా మార్చుకున్నారా అన్నది సైతం చెప్పాలి. అందుకూ నేను ఆ దేశాలలో ఏం జరిగిందీ కూడా తెలిస్తే బాగుంటుందని అన్నది. ఎందుకంటే రామాయణాలలోని ఆధునికమైన మార్పు ఆధునిక విద్యల కారణంగా వచ్చింది గనుకా, అది “రాజకీయ పరిణామం” అని వ్యాస రచయిత చెబుతున్నారు గనకాను! ఏసు పాత్రని గురించిన ప్రశ్నని నేను అందుకనే వేశాను. అది ఈ వ్యాసపు పరిధిలోకి రానివ్వకపోవడం విమర్శకులకి ఒక సులువు. ఎందుకంటే తెలుగు పాఠకులకి తెలుగులో వచ్చిన రామాయణాల గురించి తెలిసే వీలుందేమో గానీ ఇంగ్లీషు వారి విద్యా విధానమూ వారి రాజకీయాలూ ఈ ఆధునిక రామాయణ రచనల మీద ఏ రకంగా ప్రభావం చూపాయో తెలిసే వీలు లేదు. అలా తెలియాలంటే అసలు ముందు ఆ భాషల్లో ఇటువంటి మార్పులు ఎలా పనిచేసాయో తెలియాలి. ఆ జోలికి మాత్రం పోకుండా ఒక్క ఇంగ్లీషు విమర్శకుల ధోరణిని పాటిస్తూ తెలుగు రచనలమీద వ్యాఖ్యానం చేయడం తెలుగు పాఠకులని అయోమయపరచడమే అని నేను అనుకుంటాను.

    ఇంక అసలు ఈ ఆధునిక తెలుగు రామాయణాల గురించీ తెలియని వాళ్ళూ ఆ బ్రిటీషు వలస పాలనని గురించీ తెలియని వాళ్ళూ – ఇప్పటికీ రామాయణాలని అన్ని కులాల వాళ్ళూ కూడా సుబ్బరంగా పఠిస్తున్నారు. పఠిస్తారు కూడాను. వాళ్లకి చాగంటి కోటేశ్వరరావుల వ్యాఖ్యానం కావాలి గానీ, ఈ వ్యాఖ్యానాలతో పని లేదు. “ఆధునిక” కాలం లోనే ఆ ఇంగ్లీషు చదువులు చదువుకున్న వాళ్ళే ఆధునిక వేషధారణ తోనే ఈ మార్గం లో వెళుతూ కనిపిస్తూ ఉంటారు నిత్యమూ! అందువలన నాకు “ఆధునికత” తాలూకు పరిధి బోధపడలేదు. అటువంటి ఒక వ్యాఖ్యానమూ అంతే బోధపడలేదు. పిడుక్కీ బియ్యానికీ ఒకటే మంత్రంగా మనం ఈ ఆధునికతని పాటిస్తూ ఉన్నట్టు ఉండటమే పెద్ద అబధ్ధం అని అర్ధం అవుతూన్నప్పుడు ఈ వ్యాఖ్యానాల పరిధి మాత్రం ఎంతా? ఏవో కొన్ని కొత్త తరహా మాటలు అంటున్నారు ఈ వ్యాస రచయిత అని అనుకుని మళ్ళి వాల్మీకీ రామాయణాన్నో కనీసం కంకటి పాప రాజు రామాయణాన్నో పఠించేందుకో వినేందుకో తెలుగువాళ్ళూ సిధ్ధపడుతూనే ఉంటారు. [అన్ని కులాల వాళ్ళూ సుమా!] ఎందుకూ? అంత మాత్రం చేత వారంతా వెర్రి వారని మనం అననూ లేము. అనుకోనూ లేము. కదా? ఈ “ఆధునికత” అన్నది సర్వే సర్వత్రా అమలు జరగదు. కావాలంటే ఎలా అమలు జరుగుతుందో మీరు చెప్పండి వింటాను.

    రమ.

  5. మేరు నగ మేధావి గురించి indrani Palaparthy అభిప్రాయం:

    08/11/2012 11:49 am

    రాత్రి సుమారు ఒంటి గంట ప్రాంతంలో ఈమాటలోను, ఫేస్ బుక్ లోనూ ఈ విషాద వార్తను చూసాను. చాలా విచారం కలిగింది.

    పండితులకి,పరిశోధకులకి బహుశా మరణం లేదనుకుంటాను.

    వారు వ్రాసిన పుస్తకాల్లోను, పరిశోధనా పత్రాల్లోనూ వారు సదా చిరంజీవులై ఉంటారు.

    పాలపర్తి ఇంద్రాణి.

  6. మేరు నగ మేధావి గురించి తఃతః అభిప్రాయం:

    08/11/2012 4:28 am

    ఆచార్య భద్రిరాజు కన్ను మూత – వారి గురించి, వారి విద్వత్తు గురించి తెలిసిన వారికి ఎంత లొటో నాకు తెలుసు . ఒక మహా పండితుదు మాయమై పోతే వారితొ పాటే ఒక నిధి మాయమై పొతుంది ఆబాధ నాకు తెలుసు.’ఎవరితొ మాట్లాడుతాం ఆవిషయాలని’ తెంపుకోలేని దుఃఖం వస్తుంది. ఈమాట లో వారి తిక్కన మీది వ్యాసం చదివి ఆనందం పట్టలేకపోయాను. వారు ఆంధ్ర విశ్వకళా పరిషత్తు లొ కొన్నాళ్ళు ఉపాధ్యాయులుగా గడిపారని నాకు చాలా గర్వంగా ఉంటుంది. వారికి నా నివాళులు
    తఃతః

  7. మేరు నగ మేధావి గురించి Rohiniprasad అభిప్రాయం:

    08/11/2012 2:03 am

    హైదరాబాద్‌లో ఉంటున్నవారికి ఇంకా తెలియని ఈ విషాదవార్తను అందించిన సురేశ్ గారికి థాంక్స్.

  8. మేరు నగ మేధావి గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    08/10/2012 11:41 pm

    Prof. BhK is no more.

    “మన సారథి, మన సచివుడు,
    మన వియ్యము, మన సఖుండు, మన బాంధవుడున్
    మన విభుడు, గురువు, దేవర
    మనలనుఁదిగనాడి చనియె …”

    గత కొద్ది రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భద్రిరాజు కృష్ణమూర్తి గారు ఆగస్టు 10వ తేది రాత్రి కన్నుమూసారు.

  9. నిజంగా … గురించి Shaik Khaja Moenuddin అభిప్రాయం:

    08/10/2012 9:30 pm

    ఈ కథ చాల బాగుంది.

  10. తెలుగు రామాయణాల రాజకీయాలు: బ్రిటీష్‌ పాలన, ముద్రణ సంస్కృతి, సాహితీ ఉద్యమాలు గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    08/09/2012 2:43 pm

    దిలీప్ గారు: ఇది చాలాకాలం క్రితం (2003లో) ప్రచురితమైన వ్యాసం. అప్పట్నుంచి ఇప్పటివరకు “ఈమాట” సాంకేతిక పద్ధతుల్లో కలిగిన మార్పుల వల్ల మీకన్న ముందు వారు రాసిన అభిప్రాయాలన్నీ ఇప్పుడు కనుమరుగయ్యాయి.
    — ————
    ఇప్పుడు రమ గారి సందేహాలకి సమాధానాలివ్వటానికి ప్రయత్నిస్తాను. ఆవిడ ముఖ్యంగా రెండు విషయాలు లేవనెత్తారు. (అ) ఈ వ్యాసం “ఆధునిక” రామాయణాల మీదే కేంద్రీకరిస్తుంది, (ఆ) విశ్లేషణంతా “ఆధునిక” దృష్టితోనే జరిగింది.

    వ్యాసం అంతా చదివితే తొలి ఆరోపణ నిజం కాదని ఇట్టే తెలిసిపోతుంది. వాల్మీకి రామాయణం చర్చించే సమస్య గురించి పోలాక్ చెప్పిన అభిప్రాయాన్ని ఈ వ్యాసరచయిత అంగీకరించారు. అంటే అది రాజ్యం ఒకతరాన్నుంచి మరో తరానికి సంక్రమించే పద్ధతుల గురించి ప్రధానంగా చెప్పిందని ఒప్పుకున్నారన్న మాట (వాల్మీకి రామాయణం చెప్పేది అదేనా లేదా మరోటా అనేది వేరే చర్చ, అది ఈ వ్యాసం scope లో లేదు). ఈ ప్రతిపాదన ప్రకారం రాముడు దేవుడు కాడు, ఆదర్శపురుషుడు మాత్రమే. అలాగే, వాల్మీకి రామాయణంలో రాజ్య సంక్రమణకి వున్న మిగిలిన నమూనాలు (ఉదా: సుగ్రీవుడు, విభీషణుడు) సరైనవి కావని, రాముడి మార్గమే అందరికీ అనుసరణీయమని చాటి చెప్తుంది వాల్మీకి రామాయణ కథ. ఇక తెలుగు రామాయణాల విషయానికి వస్తే, తెలుగులో తొలి రామాయణం వచ్చేనాటికే రాముడు దేవుడయ్యాడని ఈ వ్యాసం చేసే ప్రతిపాదన. కనక తెలుగులో ఇరవయ్యవ శతాబ్దానికి ముందు వరకు వచ్చిన రామాయణాలన్నీ రాముణ్ణి దేవుడిగా చూస్తూ ఆ దృష్టి నుంచి రామాయణ కథని ఆయా కవుల ప్రతిభలకి తగ్గట్టుగా, ఆయా కాలాల స్థితిగతులకి అనుగుణంగా చెప్పటానికి ప్రయత్నించాయన్నది corollary. ఐతే ఇరవయ్యవ శతాబ్దంలో కొత్త ఆలోచనలు వచ్చినయ్, రామాయణాన్ని కొత్త కోణాల్లోంచి చూడటం మొదలయ్యింది (స్త్రీల రామాయణాల్లాటి మౌఖిక సంప్రదాయపు కథనాలు అంతకు ముందు నుంచీ వున్నయ్ కాని అవి mainstream లోకి రాలేకపోయినయ్). ఈ కొత్తదారికి దారితీసిన మూల కారణాలేవో వివరించే ప్రయత్నం చేసిందీ వ్యాసం. ముఖ్యంగా అచ్చు యంత్రం, వలస పాలన, వాటి ద్వారా కలిగిన సామాజిక విప్లవం – వీటిని గుర్తించి, వీటి మూలాన ఈ కొత్తదారిలో వచ్చిన రచనల పరిణామాన్ని విశ్లేషించటం జరిగింది. కనక వ్యాసమంతా కేవలం “ఆధునిక” తెలుగు రామాయణాల గురించే అనటం అవాస్తవం.

    ఇక రెండో విషయం. మొదటగా, ఈ point నాకు సరిగా అర్థం కావటం లేదు. “ఆధునిక” దృష్టితో విశ్లేషించటానికి అభ్యంతరం చెప్తున్నారు. అంటే ఆధునిక పూర్వ దృష్టితో విశ్లేషిస్తే బాగుండేదని దాని భావం అనుకుంటున్నా. ఐతే ఇప్పటి కాలంలో నివసించే ఒక వ్యక్తికి అలాటి దృష్టి ఎలా సాధ్యమో నాకు తెలియటం లేదు. బహుశ ఆవిడ reference ఇచ్చిన జయప్రభ గారి వ్యాసంలో అలాటి దృష్టితో చేసిన విశ్లేషణ వుందేమో చూడాలి. నాకు బోలెడంత కుతూహలంగా వుంది అలాటి విశ్లేషణ చూడాలని. ఎవరైనా దాన్ని చదివిన వాళ్లు ఆధునిక పూర్వ దృష్టి ఎలా వుంటుందో దయచేసి అందరితోనూ పంచుకోండి.