పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. మందులను ఎలా కనుక్కొంటారు? గురించి raavooji అభిప్రాయం:

    11/24/2012 1:06 pm

    ఒక మందు తయారవ్వలంటే ఇంత కథ వుందా అనిపించింది. చక్కటి విషయాలు చెప్పినందుకు ధన్య వాదములు. మోహనరావు గారు.

    రావూజీ అమలాపురం.

  2. About eemaata గురించి Sudhir Babu అభిప్రాయం:

    11/24/2012 11:37 am

    మా చిన్నప్పుడు రంగులను వివరించే పాటలు విన్నాము. ఉ.దా అరుణోదయమెరుపు, అరుణాచలమెరుపు, అర్కమండలమెరుపు, అగ్ని ఎరుపు, … ఇట్లా సాగుతుంది. ఎవరికైనా ఈపాట, మిగిలిన రంగుల పాటలు తెలుసా? తెలిస్తే ప్రచురించ గోర్తాను.

    సుధీర్ బాబు

  3. మహాభారతం ఏం చెప్తుంది? ఒక కొత్త కోణం గురించి Sudhir Babu అభిప్రాయం:

    11/24/2012 1:58 am

    మనవాళ్ళు ధర్మార్ధకామమోక్షాలు అని నాలుగు పురుషార్ధలుగా చెపుతారు. అసలు మోక్షమంటె ఏమిటి. కోరికలు లేని స్థితి. ఏదైనా కోరిక లేని స్థితి ఆ కోరిక తీరిన తరువాతే వస్తుంది. i.e you get Moksham after you fulfill your aspiration. అందుచేత కామమోక్షం అనేది ఒకటే మాట (single phrase). అట్లాగె ధర్మార్ధములు రెండు విడి మాటలు కావు. విడి మాటలైతే కొంత ధర్మము చేయి, ఏవిధముగానైనా డబ్బు సంపాదించు, అని అర్ధము వస్తుంది. ధర్మార్ధము ఒకేమాటగా (single phrase) గా తీసుకొన్టె ధర్మమైన అర్ధము (rightful prosperity) అని అర్ధము (meaning) వస్తుంది. అంటే ఇవి రెండు జంట పదాలె ( ధర్మార్ధము, కామమోక్షము) గాని, నాలుగు విడి పదాలు గావు. ఇప్పుడు నీ కామమోక్షము ధర్మార్ధము ద్వారా సాధించు అని చెప్పుకోవచ్చు. ( i.e. fulfill your aspirations through rightful prosperity) Then ones mind starts growing and aspirations become higher and higher and the person becomes a help to society.

    సుధీర్ బాబు

  4. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి Srinivas అభిప్రాయం:

    11/23/2012 3:29 am

    అద్భుతమైన వ్యాసమాలికండీ…
    రచయితకి హృదయ పూర్వక కృతజ్ఞతలు

  5. కొండ నుంచి కడలి దాకా గురించి surya lakshmi అభిప్రాయం:

    11/23/2012 3:07 am

    నమస్కారం శ్రీనివాస్ గారు నా పేరు సూర్య లక్ష్మి, లలిత సంగీతం పాడుతుంటాను. ఈ వెబ్ సైట్ చాలా బాగుంది. దయచేసి శ్రీరంగం గోపాలరత్నం గారు పాడిన లలిత గీతాలు “వలపులు చెందగ వచ్చెనదె” “నీ జాడ కననైతిర ఏ రేడు సయనించెర ” వంటి పాటలు గాని lyrics గాని మీరు తెలియచెయగలరని ప్రార్థిస్తున్నాను.

  6. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? గురించి Srinivas అభిప్రాయం:

    11/23/2012 2:43 am

    వ్యాసం చాలా బాగుంది కనీ, గొప్పవారైన మాడగుల లాంటి వారిని “చేశాడు” “ఇచ్చాడు” లాంటి ఏకవచన ప్రయోగంతొ సంబోధించడం బాగోలేదు. ఆ సరస్వతీ పుత్రుణ్ణి గౌరవించడం మన భాద్యత.

  7. కళాపూర్ణోదయం: విషయ సూచిక గురించి seshakumarkv అభిప్రాయం:

    11/22/2012 11:38 pm

    I read this book many years ago and now I have read it again. Shri. K S RamaRao made a great effort to make Pingali Suranna easily understandable. Many Thanks to the Editor and team of EEMAATA!
    I request many such books be published to help understand Telugu classics by all,especially the youth.
    NAMASKAARAMULATHO- SESHA KUMAR K V

  8. శ్రీ శ్రీ గురించి మూడు మాటలు… గురించి ప్రసాద్ అభిప్రాయం:

    11/21/2012 7:18 pm

    ఆ ఇద్దరూ ఒక్కరే. కవులూ, వ్యక్తులూ వేరు, వేరు కారు. ఉపాధ్యాయులూ, వ్యక్తులూ వేరు వేరు కారు. రాజకీయ నాయకులూ, వ్యక్తులూ వేరు వేరు కారు. నాస్తికులూ, వ్యక్తులూ వేరు వేరు కారు. ఇక మార్క్సిస్టు విషయం లోనూ అంతే. అన్నీ ఒకరే. ఆ ఇద్దరూ, నిజానికి, ఒక్కరే. అవసరం కోసం వేసుకునే రెండు వేర్వేరు ముసుగులు మాత్రమే.

    శ్రీశ్రీ చెప్పినట్లు (అచ్చు ఇవే మాటలు కాక పోవచ్చు), “వ్యక్తులూ, వారి జీవితాలూ వారి వారి సొంతం. పబ్లిక్‌ లోకి వస్తే, ఏమన్నా అడుగుతాం, ఏమన్నా అంటాం.”

    “నీవు నేర్పిన విద్యే నీరజాక్షీ” అనే సామెత గుర్తొస్తుంది.

    ఉపసంహారం: ఈ నెల “విపుల” మాస పత్రికలో, వేంపల్లి షరీఫ్‌ రాసిన, “గోళ్ళు” అనే కధ చదవండి, ఆసక్తి వుంటే.

    — ప్రసాద్

    [This post was edited – Eds.]

  9. తిరణాల గురించి తః తః అభిప్రాయం:

    11/21/2012 4:14 pm

    ‘కొబ్బరి నూనెల ఆడ పిల్లలు
    చుట్టూ గాలిలో గేలాలెన్నో”

    కాసేపు మీరూ ఒక కొబ్బరి నూనె ఆడ పిల్లై రాశారు ఇంద్రాణీ. చాలా అందంగా ఉంది. ఇంతకు ముందొక సారి ఈమాటలొ మీ కవిత చదివి ‘ గరిక పేని ఏనుగును కట్టేయగల కవయిత్రి ఇంద్రాణి’ అని నా అభిప్రాయం చెప్పినట్టు గుర్తు. ఇప్పుడూ అంతే.
    అభినందనలతొ
    తః తః

  10. టి. జి. కమలాదేవి గురించి తః తః అభిప్రాయం:

    11/21/2012 4:05 pm

    ‘పొన్న పూవుల మాల’ నూర్జహాన్ ని [ఆవాజ్ దే?] గుర్తుకు తెచ్చింది. చంద్రబాబు గారి గొంతు కూడా కొంచం వేరేగా ధ్వనించింది.*

    శ్రీనివాస్, మీరు ఆమెకు మంచి నివాళి రచించారు. మరో మంచి లలిత గీతం “అందమైన ఈ చంద్ర నౌకలో” ఆమె ముసునూరి వేంకట రమణ మూర్తి తొ కలిసి పాడారన్నట్టు గుర్తు. దాన్ని గూడా జత చేయడానికి వీలవుతుందా?

    నమస్కారాలతొ.
    తః తః

    * ఇలాంటప్పుడు రోహిణీ ప్రసాద్ లేని లోటు తెలుస్తోంది.