పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి తః తః అభిప్రాయం:

    12/08/2012 9:21 am

    శ్రీ శ్రీనివాస్ పరుచూరి – అవధానాల గురించి క్రాస్ కల్చరల్ సినేరియొలొ మీరన్న మీ రచన కొసం ఎదురు చూడటం మొదలు పెట్టాను. తెలుగు సాహిత్యానికి రాబోయె మీ రచన తప్పక ఒక మంచి కానుక కాగలదని నమ్ముతున్నాను.

    నమస్కారాలతొ
    తః తః

  2. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    12/08/2012 6:21 am

    Since its often claimed that “avadhaanam” is unique to Telugu culture I am wondering if anyone here made an effort to look beyond Telugu country boundaries. If yes, one’d quickly realize that this genre existed both in Indian subcontinent and beyond. I may suggest to read Frances yates’ classic work on Memory and also on Giordano Bruno from 1960s. In very recent times Ingrid Rowland (biography on Bruno) and Anthony Grafton have written on mnemonic feats and the popularity for such in renaissance Europe. Basically all cultures/civilisations had paid great attention towards mnemonics/mnemonic-techniques. I have been exchanging academic materials on this subject i.r.t prosody with Mohanarao gaaru and Pappu Nagaraju. Hopefully we three would put a writeup on this subject in cross-cultural perspective..

    Why “avadhaanam” was reinvented in Telugu country in late 19th, early 20th centuries, and more important why it became popular in 1980s and 90s, is a different subject.. We had such discussion elsewhere, for e.g. in Telusa list 15 years ago.

    Regards, Sreenivas

  3. శంకరాచార్యుల రచనలో ఛందస్సు వైభవము గురించి phanikumar అభిప్రాయం:

    12/08/2012 3:41 am

    How the following characters are used in telugu what place and what manner. (~l, ~lu, ~m, ~n, r, ~r, S, sh, s, t, th, l,L) ilu, iloo, inja, ini, ta, tha, ra, RA, la, LA
    kindly, kindly mail me.
    thank you.

  4. రచయితలకు సూచనలు గురించి venkatesh nanduri అభిప్రాయం:

    12/07/2012 8:15 am

    Thanks a lot. This is my first experience in going through your ‘ee maata’ e-magazine’very wonderful experience. Thanks for giving us a scope for participating, and for presenting the art if any hidden in me. generally we use Telugu shree lipi key board in my office. i feel a little bit of difficulty in the typing appropriate word with the tools provided by you.pl suggest me an easier way to present mini kavithalu’-

    Venkatesh

  5. తిరణాల గురించి venkatesh nanduri అభిప్రాయం:

    12/07/2012 7:23 am

    Gone through your kavitha ‘Thiranala’. ఎక్కడికో తీసుకుపోయారు. మీ పదాలలో తిరనాల చూశాను. fine.

    Venkatesh, east Godavari

  6. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి తః తః అభిప్రాయం:

    12/07/2012 4:26 am

    అవధానులే [బులుసు అపర్ణ , ఫుల్లా భట్ల నాగశాంతి స్వరూప] కాక పృచ్ఛకులందరూ కూడా స్త్రీ లే అయిన అష్టావధానం విశాఖపట్నంలొ జరిగినట్టుగా తారీకుల చింత లేకుండా ఒక సమీక్ష లాంటిది నేటి- 07 డిసెంబర్ 2012- The Hindu పత్రికలో Friday Review వచ్చినది. తెలుగు సాహిత్య చరిత్రలో స్త్రీ[లు] చేసిన మొట్ట మొదటి ఆవధానంగా సమీక్షకులు పేర్కొన్నారు.

    [నా అనుమానం నాకున్నది. మళ్ళీ పాత పేరుతొ వస్తున్న ‘జయంతి’ లొ 2008-9 లలొ ఒక సంచికలో చాలా పాత రొజుల్లొ ఒక బాలిక చేసినదని చదివిన గుర్తు, నేను సరి చూసుకోవాల్సి ఉన్నది. ఎవరి దగ్గరైనా ఈ కొత్త జయంతుల పాత సంచికలు ఉంటే చూడగలరా?]

  7. జనరంజని: మహానటి సావిత్రి గురించి Vijaya Bhaskar Reddy Puduri అభిప్రాయం:

    12/06/2012 4:23 pm

    శ్రీమతి సావిత్రి సినీ వినీలాకాశంలో ఒక ధృవ తార. ఆమె రూపం, నటన తెలుగు భాషా విశేషణాలకు అందని వర్ణన. సావిత్రి గారిని ఎవరితో నైనా పోల్చాలంటే సాహసమే అవుతుంది. అలనాటి ఆ మహానటి స్వరం ఈవిధంగా మళ్లీ వినటం మాటల కందని అనుభూతి. సాంకేతిక పరిజ్ఞానం అభినందనీయం. ఆమె అవసానదశ కడు దుర్భరం. మరి కొంతకాలం మన మధ్య వుండి వుంటే తెలుగు జాతి మరింతగా తరించేది.
    అశ్రునయనాలతో
    వి భా రె.

  8. గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి తః తః అభిప్రాయం:

    12/06/2012 3:52 pm

    లైలా గారూ
    ‘గొల్లపూడి మారుతీరావు పినాకపాణి పెద్దన్న అల్లుడు అన్న సమాచారం’ ఆ వ్యాసంలొ ఉన్నది. మరికొంచం ఆసక్తి రేకెత్తించటానికి గమత్లబ్ గా ‘రిలీజ్’ చేసాను. ఒక విషయం [బుచ్చమ్మతొ] ఇంగ్లీష్ లొ చెప్పి ఆ విషయం ఇంగ్లీష్ లొ ఎంత అర్థమయిందొ దాని తెలుగు తర్జూమా కూడా అంతే అర్థమవుతుందని గిరీశం అన్నట్టు నెను అసలు పేరుతొ రాసినా ఇలాగే రాస్తాను కాబట్టి అసలు పేరును దాని మానాన దాన్ని ఉండనిచ్చేసాను.
    నమస్కారాలతొ
    తః తః..

  9. గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి lyla yerneni అభిప్రాయం:

    12/05/2012 9:51 pm

    ఒక పది నిమిషాల క్రితం… – తః తః

    తహ్ తహ్!

    వహ్ వహ్!

    మీ పేరేమో మీరు గుప్తంగా ఉంచుతున్నారు. గొల్లపూడి మారుతీరావు పినాకపాణి పెద్దన్న అల్లుడు అన్న సమాచారం రిలీజ్ చెయ్యటంలో మతలబ్ క్యా హై జీ!

    లైలా

  10. ఆర్నెలల్లో అవధాని కావటం ఎలా? 3 (ఆఖరి భాగం) గురించి J K Mohana Rao అభిప్రాయం:

    12/05/2012 7:12 pm

    నేను చర్చను ఆసక్తితో చదువుతున్నాను. ఈ సందర్భములో రాళ్ళబండి కవితాప్రసాద్ గారు “అవధానవిద్య – ఆరంభవికాసాలు” అనే తమ సిద్ధాంత గ్రంథాన్ని పుస్తక రూపములో 2006లో ప్రచురించారు. ప్రాప్తిస్థానం – సహృదయ సాహిత్య సాంస్కృతిక సంస్థ, వరంగల్లు. అవధాన విద్యలాగే చిత్రకవిత్వాన్ని కూడ చాల మంది నిరసిస్తారు, దానిపైన పుస్తకాలు వ్రాసినవారు కూడ. చిత్రకవిత్వాన్ని అప్పుడప్పుడు వ్రాసే నాకు ఇది చాల కష్టాన్ని కలిగిస్తుంది. అవధానుల బాధను నేను అర్థము చేసికొనగలను. విధేయుడు – మోహన