కథ ఎప్పుడో రాయబడింది. అది అంతే. మారదు. పాలగుమ్మి గారు రూపాయి చేతిలో పెట్టేసారు. అది మళ్ళీ రాదు. ఎందుకు రాసారో అలా. కథలో ఉన్న కథకుడి పాత్ర లక్షణం అది. అతను అలా చేసుండకూడదూ అంటే మనం అందరం ఒక్కోలా ప్రవర్తించి ఉండేవాళ్ళం పడవలో ఉండి అదంతా చూస్తూ ఉంటే. నేనైతే కచ్చితంగా దాని చేతిలో డబ్బు పెట్టే వెళ్ళేవాడిని. నాకు చాలా తేలికైన పని అది అందుకే…
రంగి కానీ పద్దాలు గాడు కానీ హీరోలు. కష్టపడి వొళ్ళు హూణం చేస్కుని చదివి, ఉద్యోగాలు సంపాదించి చాకిరీ చేస్తూ, ఆశల్ని ఉత్సాహాన్ని సంసారపు భూతానికి అంకితం చేసేసి పిల్ల రాక్షసులకి యవ్వనాలని ధారపోసి పెద్దయ్యాక వాళ్ళతో తిట్లు తింటూ జీవితం ఇలాగే ఉంటుందీ అని నమ్ముతూ బతుకుతూ చచ్చిపోతాం. వీళ్ళు అలా కాదు. హాయిగా బ్రతుకుతారు. నవ్వుతారు ఏడుస్తారు ప్రేమిస్తారు. రంగి నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప విషయం మనిషిని పూర్తిగా ప్రేమించడం. ఇంటికి తొందరగా వస్తే, మా అమ్మా వాళ్ళకి వారానికోసారి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటే, పుట్టిన రోజు మర్చిపోకుండా ఉంటే ప్రేమించే ప్రేమ ఏం ప్రేమ. పద్దాలు గాడి ప్రవర్తన కాదు చర్చనీయాశం. ఎవరినైనా వాళ్ళ ప్రవర్తనకి అతీతంగా ప్రేమించగలగడం, గొప్ప విషయం. తేలిక కాదు. అలా గలిగితే ప్రేమించబడ్డవాళ్ళు కాదు ప్రేమించిన వాళ్ళు పొందే ఆనందం. అదీ జీవితం అంటే… రంగి ఎక్కడైనా ఏడుస్తున్నట్లు నీరసంగా కనిపించిందా? ఈ రూపాయి మనిషి ఏడ్చాడు ఏడిస్తే.. గుమాస్తా ఏడ్చాడు.
నిజమైన పాత్రలు ఇవి. మనం చుట్టూ చూస్తే రోజూ కనిపించే మనుషులు. పడవలు స్టీమర్లూ, సారాలు విస్కీలూ, రంగిలు రంగీలాలు అవ్వచ్చు అంతే.
మెచ్చుకుని ఉంటే అది ఆ పాత్ర నిజ స్వభావం అయ్యేది కాదు. మనం రోజూ చూస్తూ ఉంటాం ఇలాంటి ప్రవర్తనల్ని, మనుషుల్నీ…
మనుషులు నిజంగా ఉంటారు. ప్రవర్తిస్తుంటారు. మా అక్క వరస, వాళ్ళ అత్తగారితో చాలా స్నేహంగా ఉంటుంది. రోజస్తమానం కబుర్లు అత్తయ్యగారూ అంటూ. తన తోడికోడలికి ఒళ్ళు మండిపోతుంటుంది… అంతా నాటకం, అందరి ప్రేమ పొందాలని బూటకపు వినయం అంటుంది. శీను ప్రవర్తన చూసి ఇతనికి కూడా అలాగే అనిపించింది. అది సహజం. మనమందరం అందరికీ చట్రాలు గీసి అందుల్లో మనుషులు ఎలా ఉండాలో నిర్ణయించేస్తాం. దాంట్లోంచి వాళ్ళు బయటకి వస్తే మనకి మంట. అదే ఆ ఊరి మునసబు గారి అబ్బాయో మాష్టారి కొడుకో శీనులాగా ఉంటే మనకి అంత మండదు.
వీడెమిటీ ఇంత హుందాతనం యెంటీ, నాటకం కాకపోతే… అందరినీ చట్రాలలో చూడడం మనకి మనం విధించుకున్న పెద్ద చట్రం. ప్రపంచం ఎలా ఉండాలో ఎలా ఉంటే బాగుంటుందో నిర్ణయించడం కాకుండా ఎలా ఉన్నా నవ్వుతూ అన్ని రంగుల్నీ, సమీకరణాలనీ అవి ఎలా ఉంటే అలా అనుభవిస్తూ జీవించడం పెద్ద కళ.
చాలా బాగా అనువదించారు. చివర ఈ అభిప్రాయాల చోటుకొచ్చేదాకా ఇది అనువదించిన కథ అని తెలియలేదు. పేర్లు కూడా మార్చినట్లున్నారు అందుకే అసలు సందేహం కూడా రాలేదు.
అభినందనీయం మీ ప్రయత్నం.
రమణ గారికి శతసహస్ర వందనాలు ఎన్నో ఏండ్ల కోరిక తీర్చినందుకు. గౌతమరావు గారి గురించి ఏమీ తెలియనప్పుడు రోజూ వాళ్లింటికి వెళ్లేవాడిని .తెలిసిన తర్వాత రెండుమూదు సార్లు కలిసినా పద్యం చదివి వినిపించమనే ధైర్యం లేకపోయింది. ముఖ్యంగా మ్రోయుతుమ్మెద చదివిన తర్వాత రెండు మూడు సార్లు నారాయణ రావుగారింట్లో గౌతమరావు గారిని కలుసుకోవడం, వాళ్లు మాట్లాడుకుంటుంటే వినడం ఇప్పటికీ మరువలేని మధురానుభూతి. మ్రోయుతుమ్మెద నారాయణరావు, మా పెదనాన్న సహాధ్యాయులు. నారాయణ రావుగారే ఈ విషయం చెప్పారు మొదటి సారి వారిని కలుసుకున్నప్పుడు. రెండేళ్ల క్రితం గౌతమరావు గారిని కలుసుకున్నప్పుడు దాదాపు ముప్పావుగంట విశ్వనాథ గురించి మాట్లాడుతూ వేయిపడగలు ఒక వచన ప్రబంధం అనటం నాకు గుర్తు. ఏది ఏమైనా గౌతమరావు గారికి రమణ గారిలాంటి వారసులు ఉండటం వారి పుణ్యం, మా అదృష్టం.
పడవ ప్రయాణం: కథ నచ్చిన కారణం గురించి Sudhakar Majety అభిప్రాయం:
12/18/2012 11:46 pm

కోనసీమ కథలు: రెండో రుమాలు గురించి Sudhakar Majety అభిప్రాయం:
12/18/2012 11:09 pm
మెచ్చుకుని ఉంటే అది ఆ పాత్ర నిజ స్వభావం అయ్యేది కాదు. మనం రోజూ చూస్తూ ఉంటాం ఇలాంటి ప్రవర్తనల్ని, మనుషుల్నీ…
మనుషులు నిజంగా ఉంటారు. ప్రవర్తిస్తుంటారు. మా అక్క వరస, వాళ్ళ అత్తగారితో చాలా స్నేహంగా ఉంటుంది. రోజస్తమానం కబుర్లు అత్తయ్యగారూ అంటూ. తన తోడికోడలికి ఒళ్ళు మండిపోతుంటుంది… అంతా నాటకం, అందరి ప్రేమ పొందాలని బూటకపు వినయం అంటుంది. శీను ప్రవర్తన చూసి ఇతనికి కూడా అలాగే అనిపించింది. అది సహజం. మనమందరం అందరికీ చట్రాలు గీసి అందుల్లో మనుషులు ఎలా ఉండాలో నిర్ణయించేస్తాం. దాంట్లోంచి వాళ్ళు బయటకి వస్తే మనకి మంట. అదే ఆ ఊరి మునసబు గారి అబ్బాయో మాష్టారి కొడుకో శీనులాగా ఉంటే మనకి అంత మండదు.
వీడెమిటీ ఇంత హుందాతనం యెంటీ, నాటకం కాకపోతే… అందరినీ చట్రాలలో చూడడం మనకి మనం విధించుకున్న పెద్ద చట్రం. ప్రపంచం ఎలా ఉండాలో ఎలా ఉంటే బాగుంటుందో నిర్ణయించడం కాకుండా ఎలా ఉన్నా నవ్వుతూ అన్ని రంగుల్నీ, సమీకరణాలనీ అవి ఎలా ఉంటే అలా అనుభవిస్తూ జీవించడం పెద్ద కళ.
చాలా బాగా రాసారు మాష్టారూ..
కాల్వీనో కథల నుంచి – 6ఆ గురించి Sudhakar Majety అభిప్రాయం:
12/18/2012 10:51 pm
చాలా బాగా అనువదించారు. చివర ఈ అభిప్రాయాల చోటుకొచ్చేదాకా ఇది అనువదించిన కథ అని తెలియలేదు. పేర్లు కూడా మార్చినట్లున్నారు అందుకే అసలు సందేహం కూడా రాలేదు.
అభినందనీయం మీ ప్రయత్నం.
తుపాకి గురించి P.Sivaji అభిప్రాయం:
12/17/2012 12:43 pm
చాలా చక్కటి కధ,కధనం. మంచి తెలుగు కధ అందించినందుకు థాంక్స్.
తిరణాల గురించి Rammohan rao Thummuri అభిప్రాయం:
12/16/2012 6:00 pm
ఈ కవిత్వం పట్టు ఇంద్రాణి గారి ప్రత్యేకత .
వ్యవహార భాష: వ్యాకరణము గురించి Rammohan rao అభిప్రాయం:
12/16/2012 5:47 pm
రెండు చక్కని చదువతగిన వ్యాసాలు .
కాల్వీనో కథల నుంచి – 6ఆ గురించి MURTHY.V. అభిప్రాయం:
12/16/2012 9:44 am
చాలా బాగుంది. ఒక క్రొత్త ప్రపంచము లోకి వెళ్ళినట్టు వుంది. అనువాదం చేసిన వార్కి అభినందనలు.
రుక్మిణీ కళ్యాణం గురించి Rammohan rao Thummuri అభిప్రాయం:
12/15/2012 11:47 pm
రమణ గారికి శతసహస్ర వందనాలు ఎన్నో ఏండ్ల కోరిక తీర్చినందుకు. గౌతమరావు గారి గురించి ఏమీ తెలియనప్పుడు రోజూ వాళ్లింటికి వెళ్లేవాడిని .తెలిసిన తర్వాత రెండుమూదు సార్లు కలిసినా పద్యం చదివి వినిపించమనే ధైర్యం లేకపోయింది. ముఖ్యంగా మ్రోయుతుమ్మెద చదివిన తర్వాత రెండు మూడు సార్లు నారాయణ రావుగారింట్లో గౌతమరావు గారిని కలుసుకోవడం, వాళ్లు మాట్లాడుకుంటుంటే వినడం ఇప్పటికీ మరువలేని మధురానుభూతి. మ్రోయుతుమ్మెద నారాయణరావు, మా పెదనాన్న సహాధ్యాయులు. నారాయణ రావుగారే ఈ విషయం చెప్పారు మొదటి సారి వారిని కలుసుకున్నప్పుడు. రెండేళ్ల క్రితం గౌతమరావు గారిని కలుసుకున్నప్పుడు దాదాపు ముప్పావుగంట విశ్వనాథ గురించి మాట్లాడుతూ వేయిపడగలు ఒక వచన ప్రబంధం అనటం నాకు గుర్తు. ఏది ఏమైనా గౌతమరావు గారికి రమణ గారిలాంటి వారసులు ఉండటం వారి పుణ్యం, మా అదృష్టం.
తేనీటి సమయం గురించి jaya అభిప్రాయం:
12/15/2012 8:55 am
చాలాబాగుంది
ప్రాసక్రీడాశతకము గురించి raavooji అభిప్రాయం:
12/14/2012 12:32 pm
భాషా, భావం, ప్రాస, కథనం
కలసి మెలసి కలివిడిగా
పదం పదం కదం తొక్కుతూ
హృదయాన్ని తాకుతూ
ఉల్లమ్మును రంజిల్ల జేసినవి