పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. మనుచరిత్ర – ద్వితీయాశ్వాసము గురించి గురునాథ రావు దిక్కల అభిప్రాయం:

    01/25/2013 1:24 am

    మన సైటులో సందేహాలు సలహాలు చాలా బాగున్నాయి. ఆటో సజేశన్లు కూడా అత్యున్నతముగా ఉన్నాయి. నాలాంటి విశ్రాంత ఉద్యోగులకు ఉపయుక్తం గున్నాయి. ధన్యవాదాలు.

  2. స్వప్నవాసవదత్తం -7 గురించి గురునాథ రావు దిక్కల అభిప్రాయం:

    01/25/2013 12:56 am

    స్వప్న వాసవదత్తం చాలా బాగుంది. కానీ 5వ అంకం మిస్సయింది.

  3. ఈమాట గురించి గురించి తః తః అభిప్రాయం:

    01/24/2013 11:28 pm

    ఈ మాట చదువరులు చదవక తప్పని రెండు రచనలు:

    1. పాతరోజుల పాత్రికేయుడు జి కృష్ణ గారి అబ్బాయి జి.రాజ శుక రాసిన ‘విశ్వనాథ తో కొద్ది రోజులు’ ఆంధ్రజ్యోతి వారి వార పత్రిక – ‘నవ్య’ 02 01 013 సంచిక పే 44-45.

    2. కుర్రా జితేంద్ర బాబు రచన ‘చందాల కేశవ దాసు తొలి సినీ గేయ రచయిత’ ‘మిసిమి’ చింతనాత్మక సారస్వతం జనవరి 013 సంచిక పే 14-18.

  4. అయినా సరే… గురించి తః తః అభిప్రాయం:

    01/24/2013 11:11 pm

    శ్రీ బండి : మీ కవిత చాలా బావుంది
    నమస్కారాలతొ
    తః తః

  5. ఈ సంచిక గురించి… గురించి బ్రహ్మానందం అభిప్రాయం:

    01/23/2013 7:53 pm

    భలే చెప్పారు కృష్ణ మూర్తి గారూ!
    నా మానాన నేను వ్యాఖ్య పెట్టుకుంటే, “నాంది పలకండి” అంటూ మొట్ట మొదట ఉచిత సలహా పారేసిందెవరూ? మీరా? నేనా? బావుంది మీ డబాయింపు. మొక్కుబడి రాతలే రాసుకుంటారో, అర్థవంతమైన వ్యాఖ్యలే చేసుకుంటారో అది మీ ఇష్టం. అలాగే నేను కూడా. చివరగా – మీకు ఏం రాయాలో చెప్పలేదు. చెప్పచ్చు కదా? అని ప్రశ్నించాను. “ఎదుటి వారికి ఇచ్చేటందుకే సలహాలున్నాయి!” అన్నట్లుగా వుంది మీ వాలకం. మీకున్న స్వేచ్చే, నాకూ ఉండదా, మరి?

  6. ఈ సంచిక గురించి… గురించి కె. కృష్ణమూర్తి అభిప్రాయం:

    01/23/2013 12:05 pm

    బ్రహ్మానందం గారు,

    సహృదయతతో నా వ్యాఖ్యని అర్థం చేసుకుని, ఆచరించడానికి ఉద్యుక్తులౌతున్నందుకు మహదానందంగా ఉంది.

    ఆ చేత్తోనే ఈమాటలో వెల్చేరు గారికి అభినందనలనో లేదా తెలుగు సాహిత్యాన్ని ప్రపంచానికి అందజేసిన వాళ్ళల్లో ప్రముఖులనో, ఏదో ఒకటి రాయచ్చు కదా?

    ఏదో ఒహటి వ్రాయడమే మీ ప్రధాన ధ్యేయం మరియు ఏమి వ్రాయాలో కూడా మీరే చెబుతున్నారు. భేష్!

    అభిప్రాయాలు వెలుబుచ్చడం పూర్తిగా వ్యక్తుల ఇష్టం అని నేననుకుంటాను. మీ ఉద్దేశ్యం దీనికి భిన్నమని మీ వాలకం బట్టి అర్థమౌతోంది. మొక్కుబడి వ్రాతలతో, వ్యాఖ్యలతో ప్రయోజనం శూన్యం. ‘ఒక పనైపోతుంది బాబూ’ టైపులో కాకుండా, నాకు వ్రాయలనిపిస్తె అభిప్రాయమో, కామెంటో వ్రాస్తాను. మీరు కాస్త ఆలోచిస్తే నేను చెప్పదలచుకున్నది ఆర్థమౌతుందనుకుంటున్నాను.

    – కె.కృష్ణమూర్తి

  7. అయినా సరే… గురించి gopagani ravinder అభిప్రాయం:

    01/22/2013 10:15 pm

    మీ కవిత బాగుంది

  8. నాకు నచ్చిన పద్యం: నన్నయ భారతంలో కర్ణ ప్రవేశం గురించి kapilaram అభిప్రాయం:

    01/22/2013 8:15 pm

    మంచి పుట చదివాను

  9. కోనసీమ కథలు: పిండంతే నిప్పటి గురించి Narayana Garimella అభిప్రాయం:

    01/21/2013 9:27 pm

    ‘పిండంతే నిప్పటి’ చాలా బాగుంది.

    “సంస్కారం లేని ప్రేమ ప్రేమ కాదు. ఆ అమ్మాయి మీద కక్షతో వీధికి లాగితే నాశనమయ్యేది ఆమె కాదు, ఆమె చుట్టూ అల్లుకున్న జీవితాలు” అన్న కన్నబాబు సంస్కారానికి సరితూగగల మనుషులు, సంస్కారాలు ఎంతమందికి ఉన్నాయి?

    ఇలా ఆలోచిస్తే….యాసిడ్ దాడులకు, ప్రేమించని వాళ్ళని నరికి మరీ చంపేసే కిరాతక దాడులకు ఎప్పుడో ముగింపు పడేది.

    మంచి కధనందించినందుకు జోహార్లు.

    నారాయణ.

  10. అంబఖండి నుంచి అట్లాంటా దాకా… గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    01/20/2013 10:47 pm

    ఇలాటి విషయాలు చెప్పటం వేలూరి గారొక్కరికే సాధ్యమయే పననుకుంటాను. నారాయణరావు గారితో ఇంత చిరకాల అనుబంధం వున్నవాళ్లు ఇంకెవరూ లేరేమో ! అభ్యుదయ కవిత్వపు తొలిరోజుల్లో అందులోని ముఖ్యులు చాలామందితో ప్రత్యక్షపరిచయాలు నారాయణరావు గారికున్నాయని తెలుసును. వేలూరి గారికి కూడ ఉండివుండవచ్చు. ఆనాటి సాహితీ వాతావరణం గురించి, అందులో జీవించిన వ్యక్తుల గురించి వారు వివరిస్తే వినాలనే ఆసక్తి నాకూ వుంది.

    ఇంత చక్కటి ప్రత్యేకసంచికని తెచ్చినందుకు వేలూరి గారిని, రచనల్ని పోగుచెయ్యటానికి కాలికి బలపం కట్టుకుని తిరిగిన పరుచూరి శ్రీనివాస్ గారిని మనసా అభినందిస్తున్నా.