పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. తుఫాను ముగిసింది గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    02/20/2013 5:08 pm

    సాధారణంగా వైదేహి గారి కవిత్వంలో భావుకత ముగ్ధమోహనంగా వుంటుంది, ముచ్చట కలిగిస్తుంది. ఇది అలాటి కవిత కాదు. చివరి మూడు పాదాలు తప్ప ముందంతా నాకు కవిత్వచ్ఛాయలే కనిపించలేదు.

  2. తుఫాను ముగిసింది గురించి తమ్మినేని యదుకుల భూషణ్. అభిప్రాయం:

    02/20/2013 1:35 pm

    కవిత /రచన నచ్చకపోవడానికి కారణాలు అనేకం ఉండవచ్చు. ఎందుకు నచ్చలేదో చెప్పడం ఒక పధ్ధతి- దాని వల్ల కొంత ప్రయోజనం ఉంది. ఇతరులకు సదరు పాఠకుని అభిరుచి గురించి తెలుస్తుంది. ఆ అభిరుచి స్థాయి గురించి కవి /పాఠకులు కొంతలో కొంత అంచనా వేయగలరు.ఇక్కడ ఆ ప్రయత్నం జరిగినట్టు కనిపించదు. అంతేగాక, కవి /రచయిత వ్యక్తిగత జీవితాన్ని రచనకు /కవిత్వానికి ముడిపెట్టే అనవసరమైన ప్రయత్నం ఒకటి కనిపిస్తుంది. దాని వల్ల కలిగే ప్రయోజనం ఏమిటో నా బోంట్లకు బోధ పడలేదు.

    కవిత్వ మూలాలు కనుక్కోవడం అంత సులభం కాదు. వస్తువు ఏదైనా కవిత్వం రాయడం ముఖ్యం. దేని మీద కవిత్వం రాయాలో కవికి ఇతరులు ట్యూషన్ చెప్పే అవసరం లేదు. దేని మీద పడితే దాని మీద రాయడానికి కవిత్వం ఆవు వ్యాసం కాదు కదా. ఈ తరహా అలోచనలకు మన పత్రికలు కొంత కారణం. వార్తా పత్రికల్లో కవిత్వాలు ప్రచురించే అలవాటు ఇటు కవిత్వానికి, అటు కవిత్వంలో సగటు పాఠకుని అభిరుచికి తీరని అన్యాయం చేసింది. ఎక్కువ పాళ్ళు వార్తా పత్రికల్లో స్పందించి రాసే కవిత్వానికే పెద్ద పీట. గట్టిగా మాట్లాడితే వార్తలకు కవిత్వానికి అట్టే తేడా లేదు. అటుదిటు కావడం సర్వ సాధారణం. కవిత్వానికి ప్రత్యేకించి సంపాదకులు ఉండటం అన్న ఊహే రాదు మనకు. బొడ్దూడని సబెడిటర్ కవిత్వ నిర్దేశం చేయగల మహా కవి, మహా విమర్శకుడూనూ. కనీసం ఈ-పత్రికల్లో వార్తాకవిత్వం నుండి పాఠకులకు విముక్తి లభించాలని కోరుకోవడం అత్యాశ కానేరదు.

    రామాయణంలో పిడకల వేట: పాఠకుని లేఖలో ఒక నియమంగా మ కారం వకారం గా రాయడం ఉదా: ఏమని /ఏవని (కనీసం అర సున్న పెట్టినా కొంతలో కొంత నయం: ఏవఁని) చెప్పలేనంత చీకాకు కలిగించింది. అయినా, సంభాషణలకు పరిమితం కావలసిన వాడుక ఉత్తరాల్లో కనిపించడం మంచి ప్రమాణానికి ప్రాతిపదిక కాబోదు. సంపాదకులు ఆలోచించగలరు.

    తమ్మినేని యదుకుల భూషణ్.

  3. ఊర్మిళాదేవి నిద్ర గురించి surya venkata subrahmanyam అభిప్రాయం:

    02/19/2013 9:37 am

    తూర్పుగోదావరి జిల్లాలో పాడుకొనే పాట ఊర్మిళా దేవి నిద్ర నా దగ్గరున్న ప్రతిని పంపమంటారా?

    [తప్పకుండా. దయచేసి submissions@eemaata.com కి పంపండి. కృతజ్ఞతలతో – సం.]

  4. వాన ముసురు గురించి indrani Palaparthy అభిప్రాయం:

    02/18/2013 9:17 am

    Iam pleased to inform you that my first Novelika, “Bandiraa” is available online at:

    http://kinige.com/kbook.php?id=1492&name=BanDiraa

    you can buy it online or rent the book at your convenience.

    Thank you.

    Indrani Palaparthy.

  5. About eemaata గురించి GHAZAL VASUDEV అభిప్రాయం:

    02/17/2013 4:12 am

    నమస్తే, మీ పత్రిక చాల చాల బాగున్నది!
    మీకు నా హృదయపుర్వక అభినందనలు!

  6. తుఫాను ముగిసింది గురించి ravi అభిప్రాయం:

    02/17/2013 12:35 am

    ఇది మళ్ళా వ్రాస్తున్నాను. నేను వ్రాసింది ఏవయ్యిందో నాకు తెలీదు పోయింది, నేను సబ్మిట్ నొక్కిన తర్వాత.

    లైలా గారు,

    మీరు వ్రాసిన కవిత ఆంగ్లంలో నాకు చాలా నచ్చింది, అయితే ఎందుకో నాకు కొంచం — ఆక్షేపణ అనికాదు — ఎక్కడో ఎందుకో నాకు కొంచం సరిగ్గా అనిపించలేదు. నాకు తెలియదు మీరెవరో, మీరు ఫిజీషియనా? నేను స్టే హోం డేడ్ అండీ. కానీ నా పెళ్ళాం ఫిజీషియన్. నాకు తెలుసు తన కష్టవేవిటో. తను ఇంటికొస్తే తన హాస్పేటల్‌లో పేషంట్ల దగ్గరకి వెళ్ళిపోతాను నేను. అబ్బా, వీళ్ళు ఎలా భరిస్తారురా అంత కష్టాన్ని, అంత దుఃఖాన్ని అనిపిస్తుంది నాకు. అంత వత్తిడిలో వ్రాయటవంటే చిన్న విషయం కాదు కదా.

    తెల్లగా, హయిగా, మెత్తగా పడే ఆ స్నో మీద వైదేహి గారు వ్రాయగలదు, అప్పుడే విచ్చుకున్న ఆ పువ్వు మీద వ్రాయగలదు, జలజల పారిపోయే ఆ క్రీక్ మీద వ్రాయగలదు, కానీ కారిపోయే ఆ కన్నీళ్ళ మీద (ఒక సారి తను వ్రాసేరు సబ్ వే లో ఒక ఆమెని చూసి) కూడా వ్రాయాలి కదండీ. బతుకంటే అన్ని అనుభవాలు ఉంటాయి కదా. కష్టం. సుఖం, నవ్వు, ఏడుపు అన్నీ ఉంటాయి కదా.

    ఆవిడ కవిత్వం నాకు భలే ఇష్టవండీ, కానీ ఏదో లోటు కనిపిస్తుంది. తను బతుకులో ఒక భాగాన్నే చూస్తుందేవో అనిపిస్తుంది. బొమ్మ వెనకే బొరుసు కూడా ఉంటుందండీ. మీకు షాంపేను లాగే నాకు ఓడ్కా అంతే.
    -కిరణ్

  7. పడవ ప్రయాణం: కథ నచ్చిన కారణం గురించి venkatrao chinni అభిప్రాయం:

    02/16/2013 11:04 am

    మాజేటీగారు మీ అభిప్రాయం అద్భుతంగా ఉంది. చాలా సంతోషం. కథలోని ఆత్మని సరిగ్గా పట్టుకున్నారు. ఈ సందర్భంగా మన జీవితాలని బాగా ఎత్తిచూపారు. ధన్యవాదాలు.

  8. తృప్తి గురించి N RAMACHANDHRA RAO అభిప్రాయం:

    02/16/2013 8:46 am

    అచ్చ తెలుగులో కథ చదివి ఎన్ని రోజులైందో, ఎంత హాయిగా, తృప్తిగా ఉందో ఈ కథ చదివితే!

  9. రచయితలకు సూచనలు గురించి తోట రమేశ్ అభిప్రాయం:

    02/16/2013 3:20 am

    నమస్తే,

    మన కరణ, శ్రావ్య, శబ్దసంకేతాల ముగ్దమనోహర రసరమ్య పద కదలికల ప్రవాహామే మన తెలుగు భాష.

    ఇటువంటి భాషోన్నతికి మీ ఈవెబ్‌సైట్ చాలా ఉపయోగకరంగా ఉంది.

    ధన్యవాదాలు
    తోట రమేశ్

  10. ఇసక- 4 గురించి indrani Palaparthy అభిప్రాయం:

    02/15/2013 10:10 pm

    ఇది నాకు బాగా నచ్చిన కధ.
    మంచి వాతావరణం ఉన్న కధ.
    నిజాయితీ ఉన్న కధ.
    ఈ కధకునికి తగినంత గుర్తింపు రాలేదని అనిపిస్తుంది.

    బద్ధకం వల్ల ఎప్పుడో రాయాలకున్న అభిప్రాయాన్ని ఇప్పుడు రాస్తున్నాను.

    ఇంద్రాణి.