పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. అడవిదారిలో గాలిపాట – పుస్తక పరిచయం గురించి indrani Palaparthy అభిప్రాయం:

    03/02/2013 7:24 pm

    ఎంతో దయతో ఈ సమీక్ష రాసిన మోహన రావు గారికి పాదాభివందనాలు.

    ఎంతగానో అభిమానించి ఆదరించే పాఠకులకి అనేక నమస్కారాలు.

    ఈ పుస్తకంలోని చాలా కవితలు ఈమాటలో ఇదివరకు వచ్చినవే.

    ఈమాట వారికి ధన్యవాదాలు.

    పాలపర్తి ఇంద్రాణి.

  2. దోసిట్లో నక్షత్రాలు గురించి రవి వీరెల్లి అభిప్రాయం:

    03/02/2013 7:15 pm

    కళ్ళకు కట్టినట్టు చూపించారు నక్షత్రాలని. చాలా బాగున్నాయి.
    “చిరిగిపోయిన కలల్ని కుట్టేందుకు
    చిరునవ్వుల దారాలతో
    ఏరులా నువు నన్ను
    చేరుకుంటావు
    రెండు ప్రవాహాలు కలిసినప్పుడు
    సుళ్ళు తిరిగే ఆనందం నాలో” చాలా నచ్చింది.

  3. దోసిట్లో నక్షత్రాలు గురించి Tulasimohan అభిప్రాయం:

    03/02/2013 1:42 pm

    నిజంగా మనసుని మురిపించిన నక్షత్రాలే! 2వది మాత్రం చందమామే!

  4. ప్రతిమా నాటకం: ఒక సన్నివేశం గురించి nagamurali అభిప్రాయం:

    03/02/2013 11:31 am

    తెలుగువాళ్లు తమ సంస్కృత ఉచ్చారణ గురించి కించిత్ గర్వంగా చెప్పుకోవడం కద్దు.

    పై వాక్యాన్ని ‘సంస్కృతం నేర్చుకున్న తెలుగువాళ్ళు’ అని మార్చుకోవాలి అనుకుంటాను. 🙂

  5. క్షణికమైన భయం మాటున వొదిగి గురించి Aparanji అభిప్రాయం:

    03/02/2013 10:59 am

    అబద్ధం అయోమయ కారణం.

  6. క్షణికమైన భయం మాటున వొదిగి గురించి తః తః అభిప్రాయం:

    03/01/2013 10:53 pm

    శ్రీ జాన్ హైడ్ కనుమూరి: చాలా గొప్ప కవిత. అక్షరం అక్షరం బావుంది. ఇక దీన్ని మరచిపోవటం సాధ్యం కాదు.
    తః తః

  7. అర్జున గురించి మోహన అభిప్రాయం:

    03/01/2013 8:03 pm

    వచనములో కూడ కవిత్వము ఉంటుందనడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. దీనికే విరామాలు ఇచ్చి వ్రాస్తే ఇది ఒక దీర్ఘ కవిత అవుతుంది. ఇది కథ కాదు, కాని ఒక చెట్టు ఆత్మకథ అనుకోవచ్చు గదా! కాకుంటే ఇట్టి రచనలను ఒక మూసలో పెట్టడము కష్టము. ఇది కవిత కాదు, కాబట్టి దీనిని ఎక్కడ ఉంచడము, అందుకే ఇది కథగా మారినది. ఒకప్పుడు దమయంతిగారి ఒక రచనను గురించి కూడ ఇలాటి చర్చ జరిగినట్లు నాకు జ్ఞాపకము. జయప్రభగారికి అభినందనలు. విధేయుడు – మోహన

  8. అర్జున గురించి ప్రసాద్ అభిప్రాయం:

    03/01/2013 3:19 pm

    ఇది కధా? ఈ వచనంలో చాలా అద్భుతమైన వర్ణనలు వుంటే వుండొచ్చు. ఎన్నెన్నో నిగూఢ పోలికలు జీవితంతోనో, మరోదాని తోనో వుంటే వుండి వుండొచ్చు. ఈ వచనాన్ని కధ అంటే, నాకు బొత్తిగా అర్థం కాలేదు. కధ అంటే ఏదో ఒక సంఘటన అయినా వుండాలి కదా? వర్ణనలు పూర్తయి, ఆఖరికి కధేదో మొదలవుతుందని ఎదురు చూస్తే, అంతా పూర్తయిపోయింది. కధేమిటీ అంటే, చెప్పడానికి ఒక్క ముక్క కూడా దొరకలేదు.

    బహుశా, ఈ కధ లాంటిది గొప్ప మేధా వర్గానికి మాత్రమే ఉద్దేశించి రాసినది అయి వుండొచ్చును. నా లాంటి మామూలు పాఠకుల కోసం అయి వుండదు. అలా అయితే, నాకు ఏదో ఒక్క ముక్కన్నా కధ గురించి అర్థం అయి వుండేది కదా? “అలా కాదూ, నువ్వు మామూలు పాఠకుడి కన్నా కూడా తక్కువ స్థాయి వాడివీ, అందుకే ఈ కధ లోని కధా, గొప్పతనం, ఇందులోని విషయాలూ నీకర్థం కాలేదూ” అని ఎవరన్నా అంటే, “హతోస్మి” అని అనడం తప్ప, మరింకేమీ చెయ్యలేను.

    సరే, ఇది కధ అవునా, కాదా, లేక ఇది మరొకటా అన్న విషయం వదిలేస్తాను. నాకు అర్థం కాని దాని గురించి చర్చ వ్యర్థం.

    ఒక విషయం మాత్రం చెప్పాలని వుంది. పక్షి నది లోని చేపలని పట్టి తింటుంది. పిల్లలకి పెడుతుంది. పాము పక్షి పిల్లలని తింటుంది. ఇది ప్రకృతికి సంబంధించిన విషయం. జంతువులు ఆకలి తీర్చుకోవడం కోసం, ఒక దాన్ని ఇంకొకటి తినడం ప్రకృతి విషయం. ఇందులో, మంచీ, చెడూ అనేవి వుండవు. పాము చెడ్డది అయితే, పక్షి కూడా చెడ్డదే అవుతుంది. ఏవేవో పురుగుల్ని తినే చేపా చెడ్డదే అవుతుంది. చెట్టు, పక్షి పిల్లల్ని కాపాడ్డానికి ప్రయత్నిస్తే, నది, చేప పిల్లల్ని కాపాడ్డానికి ప్రయత్నిస్తుంది. అర్థం పర్థం లేని విషయం ఇది.

    “పులి తినేయగా మిగిలిన కళేబరాన్ని ఆరగించేటందుకని మూకలుగా వచ్చిన రాబందులు ఆవేళ నా కొమ్మల మీదనే కూచుని దున్నని తలుచుకుని దుఃఖించాయి. అది చాలా వింతగా విశేషంగా అనిపించింది నాకు.” – ఈ రాబందులు కూడా మనుషుల్లాగా కపటత్వం (హిపోక్రసీ) కలిగినవై వుంటాయి. మరి మనుషులు కూడా, చేపల కూరా, చేపల పులుసూ హాయిగా, ఆనందంగా ఆరగిస్తూ, “ఫైండిగ్ నీమో” లాంటి సినిమాలు చూసి, కళ్ళ నీళ్ళు పెట్టేస్తూ వుంటారు కదా? అందుకని.

    ప్రకృతినీ, సమాజాన్నీ కలగా పులగంగా కలిపేసి మాట్టాడ కూడదు. ఈ రెంటికీ చాలా తేడా వుంది. సమాజంలో మంచీ, చెడూ వుంటాయి. ప్రకృతిలో అలాంటివి వుండవు. ప్రకృతిలోని విషయాలకి లేని పోని ఉదాత్తత అంట గట్టేస్టే, కవిత్వానికి పనికొస్తుందేమో గానీ, అర్థం పర్థం లేనిదిగా వుంటుంది. ప్రకృతి లోని విషయాలు ఎప్పుడూ మారవు. అవి వాటి సూత్రాలతో సాగి పోతూ వుంటాయి. సమాజంలోని విషయాలని మార్చుకోవచ్చు.

    ప్రసాద్

  9. అర్జున గురించి Subrahmanyam Mula అభిప్రాయం:

    03/01/2013 1:53 pm

    కథనం కూడా సౌపర్ణిక అంత అందంగా హాయిగా సాగిపోయింది!

  10. అర్జున గురించి భాస్కరరావు అభిప్రాయం:

    03/01/2013 11:26 am

    Wow! జీవితయానానికి, ఇతిహాస పాత్రలకు ఉభయాన్వయంగా నడిచిన, నడిపించిన చెట్టు కధ. Just brilliant!

    కవయిత్రిగా జయప్రభ గారి గురించి తెలుసు కానీ ఆవిడ కథలు కూడా రాస్తారని నాకు తెలియదు. జయప్రభగారు ఇంతకు ముందు ఇంకేమైన కథలు రాసారా, లేక ఇదే మొదటి కథా?