ఆయన పాడిన మా వూరు ఒక్కసారి పోయి రావాలి, ఈ లోకంలో ఈ దేహంలో పాట చాల పొపులర్. నాకు దాదాపు 10 కి పైన బహుమతొలొచ్చాయి. తెలుగు విశ్వవిద్యాలయానికి మొనోగ్రాఫ్ కూడా వ్రాశారు. మందపాటి వెంకట్రాజు గారి వద్ద వీణ వాయించారు. అలా లలిత సంగితం కోసం జీవితం అంకితం చేసిన వారిని చూడటం ధన్యం.
శ్రీనివాస్ గారూ! చిన్నప్పుడు విన్నపాటలు. మళ్ళీ వింటూంటే అరవై లలోకి ప్రయాణం కట్టినట్లయ్యింది. సంతోషం కలిగించారు. “రాలలోపల” పాడిన గాయని ఎవరూ? ఇంకో వెర్షన్ కూడా ఉండాలేమో దీనికి, కోరస్ తో, కాదా? ఏమో మతిమరుపు వల్ల స్పష్టంగా గుర్తుకి రావడం లేదు. ఆతరం వారికందరికీ కవులూ రచయితలతో ప్రత్యక్ష సంబంధాలుండేవి. ఆరోజుల్లో రేడియో మంచి పనులు చాలా చేసింది. ఇవాళ్టి సంగతి నాకంతగా తెలీదు. ఆనాడు రేడియో తప్ప మరో ఎంటెర్టైన్మెంట్ లేని కాలం. టాలెంట్ అంతా అక్కడికి వెళ్ళింది. అక్షరానికి విలువనిచ్చిన వాళ్ళుండటం. తీరుబాటుగా ఆలోచించి పనిచేయగలిగిన స్థిమితత్వం ఉండటం. అన్నిటికన్నా ముఖ్యంగా డబ్బు ఇంతగా ఇవాళ్టికాలంలోలాగా బతుకుల్ని ఆక్రమించుకుని ఉండకపోవడం కారణం అనుకుంటాను.
విశ్వనాధం గారు కట్టిన వరసలు ఎన్ని ఉన్నా, నాకు ఆయన కృష్ణ శాస్త్రి అక్షరాలకి కట్టిన బాణీలు ఎక్కువ ఇష్టం. కవి అక్షరం పట్ల స్వరకర్త లో కలిగిన ఇష్టం లోంచి వచ్చిన బాణీలవన్నీ అనిపిస్తాయి. ఇవాళ్టి తరాలకి మళ్ళీ వాటిని పరిచయం చేయడం చాలా అవసరమే!
మాన్యమిత్రులు శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారికి
అభినందనలు!
“ఈమాట” పత్రిక ఇదానీంతన సంచికలో శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారికి మీరు సమర్పించిన నివాళి ప్రస్తావిక వారి అమేయమైన ప్రతిభను, అపురూపమైన వ్యక్తిత్వాన్ని, అనర్ఘమైన కృషిసారాన్ని, నిరంతరాయితమైన వ్యాసంగాన్ని, వరివస్యను కన్నులకు కడుతూ చాలా బాగుంది. కొంతకాలం క్రితం అబ్బూరి రామకృష్ణారావు గారి పాటల కేసెట్టు రికార్డింగు సమయంలో నాకు వారితోడి పరిచయం పునరుద్ధృతమైంది. ఆ కేసెట్టు విడుదల వేళ సభాధ్యక్షుడిగా వారిని నేను సన్మానించిన సందర్భంలో కలుసుకోవటమే ఆఖరి సమావేశం. ఆ మధ్య ఫోనుచేసినప్పుడు వారు మా నాన్నగారు శ్రీ ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు రేడియోకి వ్రాయగా తాము సంగీతాన్ని కూర్చిన పాటలు తమ వద్ద బయటపడ్డాయని, ఈ పర్యాయం హైదరాబాదు వచ్చినపుడు కలుసుకొంటే, ఆ వివరాలన్నీ మాట్లాడుకోవచ్చునని అన్నారు. అంతలోనే కాలం వారిని తన దురంతగర్భకుహరంలోకి లాక్కొంటుందని ఊహించలేకపోయాను. ఈ లఘువ్యాసముఖంగా ఇన్నిన్ని పాటలతో మీ జ్ఞాపకాలను పొందుపరిచి మీరు ఎంతో కొంత ఆ ఉత్తమఋషి ఋణాన్ని తీర్చుకోగలిగారు.
ఇదే సంచికలో “ప్రతిమా నాటకము” ప్రసారాన్ని గురించిన ఎన్నో అరుదైన విశేషాలను తెలియజేశారు. ఆ పరిచాయికలో మీరు “రజని గారు సంస్కృత చతుర్భాణీలను తెలుగులోకి అనువదించడం జరిగింది” అన్న ప్రయోగం చేశారు. “చతుర్భాణిని తెలుగులోకి అనువదించడం జరిగింది” లేదా, “చతుర్భాణిలోని నాలుగు భాణాలనూ తెలుగులోకి అనువదించడం జరిగింది” – అని ఉండాలి.
శ్రీ వెల్చేరు వారి సుమతీ శతకం గురించిన వ్యాసంలో “సుమతీ శతకం” తొలి ముద్రణ విషయమై నిడుదవోలు వారు ఆ వివరాన్ని ఎక్కడ చూసి ఇచ్చారో గుర్తింపకుండానే, సందేహించటం జరిగింది. అదీ గాక శ్రీ వెల్చేరు వారు 1868కి పూర్వపు ఏ సుమతీ శతకం ముద్రణా తమకు ప్రపంచంలోని ఏ గ్రంథాలయంలోనూ కనబడలేదు అన్నారు. 1912లో ఎల్.డి. బార్నెట్ ప్రకటించిన A CATALOGUE OF THE TELUGU BOOKS IN THE LIBRARY OF THE BRITISH MUSEUM అన్న సూచికలో
JOYES (Walter) and SESHACHARYULU, N. Ch. Telegoo Series. First Poetical Reader, being introductory lessons, with selections from the Vaymana pathyam and Sumathi Shuthagum, by Walter Joyes, and N. C. Sashacharloo, with the assistance of C. Rungiah, and S. Ramanoojiah . . . Pupil’s edition. (ప్రథమకావ్యపాఠము) pp. 44,5. S.P.C.K. Press: Vepery (Madras), 1859.
అని కనబడుతుంది. దీనిని బట్టి సుమతీ శతకానికి ఒకపాటి సంకలనం – అదెంత సమగ్రమైనా, అసమగ్రమైనా 1859 నాటికే వెలువడినట్లు స్పష్టపడుతున్నది. వాల్టర్ జాయిస్, శేషాచార్యులు జంట అందులో సుమతీ శతకం నుంచి ఎన్ని పద్యాలను గ్రహించారో; వాటిని ఏ రూపంలో పరిష్కరించారో, తమ పీఠికలో 1859 కంటె మునుపటి సుమతీ శతకం ముద్రణలను గురించి ఇంకా ఏవైనా వివరాలను ఇచ్చారేమో – ఆ పుస్తకాన్ని చూసి గాని చెప్పలేము.
ప్రసాద్ గారూ !! మొదట గా నేను మీ వ్యాఖ్యని శ్రధ్ధగా చదివేను. మీ వ్యాఖ్య నన్ను నొప్పించలేదు సుమా! మీ అభిప్రాయాలని నిర్మొహమాటంగా రాసే పధ్ధతి నాకు ఇష్టం.
కాకపోతే కల్పనకీ తర్కానికీ చుక్కెదురు. తర్కం ఎంత ప్రయత్నించీ కల్పనని లొంగదీసుకోలేదు. పక్షపాత దృష్టి ఈ సృష్టి లోనే ఉండగా ఆ సృష్టి మీద చేసే ఏ వ్యాఖ్యానమైనా అందుకు అతీతంగా ఉండలేదు. కదా? మనమందరమూ ఏదో ఒక పక్షం వేపుగానే ఉంటాం. అన్ని సార్లూ అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండకనూ పోవచ్చు. అయినా సరే అలా ఉండటం సహజం. Obviously its difficult to be objective towards nature and its laws.
ఇంక ప్రతీకలు అన్నవి సైతం అలాంటివే పాము ఎందుకని చెడ్దది కావాలో పక్షి ఎందుకని కాకూడదో స్పష్టం గా నాకు మాత్రం తెలుసునా 🙂 అబ్బే తెలీదు. అది అర్జున అభిప్రాయం. ఆ అభిప్రాయం మీద నాకేమంత అదుపు ఉండదని నేనంటే మీకు అర్ధం అవుతుందో లేదో మరి! కానీ ఇది సత్యం. చాలా సార్లు రచయిత కల్పనావరణాన్ని అతిక్రమిస్తాయి పాత్రలు. అన్నిసార్లూ రచయిత స్వతంత్రుడని / రాలు .. అని మాత్రం అనుకోబోకండి. అలా అంతా రచయిత స్చాధీనం లోంచే తయారయ్యే రచన ఉంటుందని చెప్పలేం కనీశం నావరకూ నేను అలా చెప్పలేను.
సాధారణంగా బలమైన వాటికన్నా vulnerable species వైపుగా మనసు పోవడం వలన కూడా అలాంటి ప్రతీకలు అలవోకగా చొరబడే వీలుంటుంది. లేదా మనసు లోలోతుల్లో ఎక్కడో పాము మీద ఉండే అయిష్టమో పోనీ పక్షి మీద ఉండే ఇష్టమో కూడా పనిచేసి ఉండవచ్చు 🙂 అప్పుడూ అది సహజమే! అలా ఎందుకంటే దాన్ని చెప్పడం కూడా కష్టమే 🙂
ఏం పిల్లడో ఎల్దమొస్తవా ? అన్న వంగపండు పాట మీకు తెలిసే ఉంటుంది. ఆ పాట లోని ప్రతీకలని గమనించండి. ఆయనకి మరి పులి మీద కోపం గొర్రెపొట్టేలు మీద ప్రేమ అని గభాల్న అనేయలేం. కవి చేసే పని ఏమంటే ఉన్న పరిస్థితి మీద వ్యాఖ్యానం చేయడం కోసం ఏ పోలికనైనా తన భావానికి అనువుగా మలుచుకోవడం. అంతే! కొన్నిసార్లు పులి మంచిది కావొచ్చు. కొన్నిసార్లు కాకపోవచ్చు. అంతిమంగా పులి పాము చెట్టు పుట్టా కధల్ని చెప్పవు గనక వాటిని చెప్పేది మనిషే గనక మనిషికున్న సకల భావ సంచలనాలకీ అవి నిర్నిమిత్తంగా కారణభూతమౌతాయి!
కల్పన మీద నేను ఎప్పుడూ వివరణనిచ్చే పనిచేయను. ఇకపోతే సాహిత్యప్రపంచాన్ని సమ్మోహన పరిచిన రచన చలం “ఒక పువ్వు పూసింది.” ఆ ఒక్క రచనే మిగిలీ మిగిలిన సాహిత్యం అంతా పోయినా పరవాలేదన్నారు చింతా దిక్షితులు గారు [కాబోలు]. దాన్ని తప్పక చదవండి. ఏ రచన మన మనసుని ఎలా మెలిపెడుతుందో మనకే తెలీదు. ద్వైదీ భావం కల్పనాపరులందరికీ సహజ గుణం. ” ఒకటికొకటికిని ఒడబడవు” అంటాడు అన్నమయ్య. పగలంతా రాముణ్ణి తిట్టి సాయంత్రం అయ్యేసరికి త్యాగరాజకీర్తనలని ఆస్వాదించే కొడవటిగంటి కుటుంబరావు… స్త్రీలవైపు ప్రాణం ఇచ్చి మాట్లాడి కూడా “ఒక పువ్వు పూసింది” లాంటి చెవనిస్ట్ కధని రాసిన చలం ఈ అంతరంగ గందరగోళాన్ని అధిగమించగలిగారా?? రసపట్టులో తర్కం కూడదు అని అంటారు పింగళి నాగేంద్రరావు కాబోలు. 🙂
బాగుంది కధ. పాజిటివ్‌గా వుంది. దుర్భరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు, మనుషులు మొండిగా తయారవుతారు. వీలైన చోటా, చాతనయిన చోటా ఎదురు తిరుగుతారు. ఆ ప్రాసెస్ లో ఒక్కో సారి తమకి తామే హాని చేసుకుంటారు.
ఈ కధ క్లుప్తంగా: పూర్తిగా వదిలేసిన తండ్రీ, అరకొరగా చూస్తున్న తల్లీ వున్న ఒకమ్మాయి, ప్రేమ లేమితో, దుర్భర జీవితం గడుపుతూ, స్కూలుకి సరిగ్గా వెళ్ళక పోవడం, తనని ఏమన్నా అన్న వాళ్ళకి ఎదురు తిరిగి గట్టిగా సమాధానం చెప్పడం చేస్తూ వుంటుంది. ఒక మంచి టీచరు, తన భార్యతో కలిసి, ఈ అమ్మాయితో పరిచయం పెంచుకుంటాడు. వారి ప్రేమకి కరిగిపోయి, ఈ అమ్మాయి, “స్కూలుకి వెళ్ళక పోవడంలో” తన తప్పుని తాను తెలుసుకుంటుంది.
ఈ కధ నాకు నా చిన్నతనాన్ని కొంచెం గుర్తు చేసింది. ఒక రకమయిన దుర్భర పరిస్తితుల్లో పెరుగుతున్నప్పుడు, నేను కూడా ఇలాగే మొండిగా, ఎదురు తిరుగుతూ వుండే వాడిని కొన్నాళ్ళు. దీనర్థం నన్ను కూడా నా తల్లిదండ్రులు వదిలేశారని కాదు. నావి వేరే రకమయిన దుర్భర పరిస్థితులు. ఎటొచ్చీ ఆ రోజుల్లో, నా కళ్ళు నా వేళ్ళ తోనే, ఈ మరియా లాగా, పొడుచు కోలేదు. అలా చేసి వుంటే, నను కాపాడ్డానికి ఈ కధలో లాగా సంస్కర్తలు ఎవరూ ముందుకు రారు నిజ జీవితంలో. నా చదువు తోనే ఆ దుర్భర పరిస్థితుల్నించీ తప్పించు కోవాలీ అని అనుకునే వాణ్ణి. అందరూ ఇలాగే అనుకోవాలని కాదు దీనర్థం.
సంస్కరణలతో నాకు విభేదం. ఎంత మంది మంచి మనుషులు ఎంత మంది కష్టాల్లో వున్న వారిని ఆదుకోగలరు? ఒక వేళ ఆ టీచరు, ఇతర టీచర్ల లాగా, తన సమస్యలతో తాను వుంటే, ఈ మరియాని ఎవరు కాపాడ గలిగేవారూ? ఆ టీచరు మాత్రం ఎంత మంది మరియాలని కాపాడ గలడు? గ్రహింపు మనంతట మనకే కలగాలి, సమాజం కలిగించే పరిస్థితి లేనప్పుడు. ఆ కలగడం కూడా, మన అనుభవాల్నించో, ఇతరుల అనుభవాల్నించో జరగొచ్చు. అప్పుడు, టీచరు లాంటి మంచి వ్యక్తుల సహాయం తీసుకోవచ్చు. అది ప్రాక్టికల్‌గా వుంటుంది. సమాజంలో మరియ లాంటి వాళ్ళు చాలా ఎక్కువా, టీచర్ లాంటి వాళ్ళు చాలా తక్కువా. సంస్కరణలతో కుదరదు ఓవరాల్ సమస్యకి పరిష్కారం.
సంపాదకులకు ఒక విన్నపం: అనువాద కధలు ప్రచురించే టప్పుడు, అవి మొదటి సారి ఎప్పుడు, వీలైతే ఎక్కడ, ప్రచురించారో తెలియజేస్తే, ఆ కధ వచ్చిన నాటి కాల, మాన పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి కుదురుతుంది. తద్వారా, కధ లోని కొన్ని విషయాలు సరిగా అర్థం అవుతాయి.
ఈ సారి, ఈ కధ చదువుతూ వుంటే, ఇది ఒక అనువాద కధ అని కొన్ని చోట్ల అనిపించింది.
ఒక సారి, టీచరు, ““మరియా! నీవు స్కూలుకి సరిగ్గా వస్తే కాస్త మార్పుగా ఉంటుంది కదా.” అంటాడు. “మార్పు” అన్న మాట ఏదో లాగా వుంది, ఏదో ఒక జబ్బు మనిషిని వేరే ప్రాంతానికి వెళ్ళమన్నట్టు. అసలు వాక్యం ఏమో గానీ, “మరియా! నీవు స్కూలుకి సరిగ్గా వస్తే అది నీకు భవిషత్తులో మంచిది కదా?” అన్నట్టు వుంటే, కాస్త అర్థవంతంగా వుండేదనిపించింది.
ఒక సారి, టీచరు భార్య, “ఈ రోజు రాత్రి మాతోనే నువ్వు భోజనం చేస్తున్నావు” అని అంటే, దానికి మరియా, “ఉండనీ అక్కా.” అంటుంది. “వద్దులే అక్కా” అని దీని అర్థమన్న మాట. ఏదైనా తిరిగి ఇచ్చేస్తూ వుంటే, “ఉండనీ” అన్న మాట బాగానే వుంటుంది. తమిళనాడులో పుట్టి, పెరిగిన మా తెలుగు స్నేహితులు ఇలా మాట్టాడ్డం తెలుసు.
ఈ కధలో కొన్ని నాకు నచ్చని విషయాలున్నాయి.
1. పిల్లని పట్టించు కోని తల్లిదండ్రుల గురించి, టీచరు, “ఎవరు మాత్రం పాపం కాదు? ఈ అమ్మాయిని వదిలేసి ఎక్కడో జీవితం గడుపుతున్న ఆ తల్లి పాపం కాదా? ఆమె తండ్రి పాపం కాదా? అందరమూ ఏదో ఒక రకంగా పాపగ్రస్తులమే.” అంటాడు. చివర్లో వారి గురించి, “ఆ మాట కొస్తే మీ అమ్మా, నాన్నా కూడా చెడ్డ వాళ్ళు కాదు.” అని కూడా అంటాడు.
ఇదేం మాయదారి మంచితనమో నాకర్థం కాదు. భార్యనీ, పిల్లనీ బాధ్యతా రహితంగా వదిలేసిన తండ్రి మీద జాలి. పిల్ల సంగతి పట్టించు కోకుండా, ఎవరితోనో వుంటున్న తల్లి మీద జాలి. ఈ జాలికి అర్థం ఏమన్నా వుందా? మనుషులందరికీ స్వేచ్ఛ వుంటుంది. అయితే, ఎప్పుడయితే పిల్లల్ని కంటారో, అప్పుడు వారికి బాధ్యతలు కూడా సంక్రమిస్తాయి. పిల్లల పట్ల బాధ్యతగా లేని తల్లిదండ్రులని అందరూ అసహ్యించు కుంటారు. దీనర్థం, పిల్లల కోసం అని, తమకు నచ్చని వారితో జీవితం ఎద్దు లాగా సాగదీస్తూ వుండమని కాదు. చెడ్డ మనుషుల్ని వదిలేసి, తమకు నచ్చిన వారిని ఎన్నుకుని వేరే వాళ్ళతో వెళ్ళి పోయినా, పిల్లల పట్ల భాధ్యతగా వుండాలి. వాళ్ళకి అందుబాటులో వుండాలి, వాళ్ళకి ఒక వయసు వచ్చే వరకూ. ఆ మధ్య కాలంలో, “దమయంతి కూతురు” అని ఒక కధ వచ్చింది. అందులోనూ, చాలా చిన్న వయసులో వున్న పిల్లల్ని వదిలేసి, ఆ తల్లి తన భర్తని ఇక భరించ లేక, వెళ్ళి పోతుంది. ఇక్కడ వరకూ అర్థం చేసుకుంటాను. ఆ పిల్లల్లో చిన్న పిల్ల, గిల గిల్లాడి పోతూ వుంటుంది తల్లి కోసం. తల్లి పూర్తిగా మాయం అయిపోతుంది. ఆ పిల్ల అలా ఏడుస్తూనే పెద్దదవుతుంది. కధ లోని “మంచి” పాత్రలకే కాదు, సమాజంలోని “మంచి” వ్యక్తులకి కూడా ఆ తల్లి మీద జాలే. నాకు ఒళ్ళు మండింది ఆ తల్లి మీద. పిల్లల పట్ల బాధ్యత చూపనిది తల్లైనా సరే, తండ్రైనా సరే, ఏ మాత్రం జాలీ వుండ కూడదు. తమకు నచ్చే పనే చేస్తూ కూడా, పిల్లల్ని పట్టించుకుంటూ వుండే పరిస్థితుల్ని తెచ్చుకోవచ్చు. ఈ ప్రపంచంలో, ఏదో ఒక సినిమా పాత్ర అన్నట్టు, కారు నడపడానికి లైసెన్సు కావాలీ, జంతువులని పెంచుకోవడానికీ లైసెన్సు కావాలీ, పిల్లల్ని కనడానికి మాత్రానికి లైసెన్సు అక్కర్లేదు. ఎవరైనా సరే, కనేసి, వదిలేసి వెళ్ళి పోవచ్చు. అభ్యుదయ వాదులందరూ, వారి మీద జాలి కురిపించేస్తూ వుంటారు.
ఈ కధలో, మరియా తల్లిదండ్రు లిద్దరూ చెత్త మనుషులే. ఎవరి మీదా జాలి చూపనక్కర్లేదు.
2. “నేను” అంటూ కధ చెప్పే ఈ టీచరు కూడా సరిగా ప్రవర్తించడు అస్తమానూ. ఈ టీచరు, మరియా గురించి, మొదట, “ఎప్పుడూ చూయింగమ్ నములుతూ, అలా నమలడం మూలాన ఈ స్కూలును, దానిలో ఉన్న టీచర్లని, విద్యార్థులను, కట్టుబాట్లను, క్రమశిక్షణను అన్నిటినీ లెక్కచేయనట్లు, “నాకు ఎవరూ లెక్క లేదు. మీరంతా నా కాలి గోటికి సమం” అన్నట్టుండి పొగరు, గయ్యాళి తనం కలబోసిన విద్యార్థిని నాకు జ్ఞాపకం వచ్చింది.” అని అనుకుంటాడు. ఈ మంచి టీచరు అలా అనుకోవచ్చా? ఆ పిల్ల పొగరు గానూ, గయ్యాళి గానూ వుందా? తన జోలికి వచ్చిన వారి మీదే కదా ఎదురు తిరిగిందీ? ఎవరి జోలికన్నా తనంతట తాను వెళ్ళిందా? ఇలా అని ఆ హెడ్‌మాష్టరో, వేరే టిచరో అనుకోవచ్చు గానీ, మన మంచి టీచరు అనుకోవచ్చా?
ఈ టీచరే, కాస్సేపటీకే, “అదీ గాక, మరియ చిన్న పిల్ల, మేకపిల్ల లాంటి అమ్మాయి” అని అంటాడు. ఆ కాసేపట్లోనే, ఆ “పొగరు, గయ్యాళి పిల్ల”, మేకయి పోయిందా?
మొదట అలా అనుకోవడం, ఈ పాత్ర తప్పు కాదు. రచయిత తప్పు ఆ పాత్ర చేత అలా అనిపించడం.
3. ఆ దరిద్రపు హెడ్‌మాష్టరు, మరియా వేషాన్ని గురించి చెబుతూ, “నాకు తెలుసులే. మీరు కూడా ఈ విషయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు.” అంటాడు. దానికి మన మంచి టీచరు, ‘సార్’ అని అనడం తప్ప, “ఏంటి సార్ ఆ తప్పు మాటలు? నేనలాంటి వాడిని కాను.” అని అనడు. ఇది కూడా రచయిత దోషమే, ఆ మంచి టీచరు చేత అలా అనిపించక పోవడం. ఎక్కడ మాట్టాడాలో, ఎక్కడ అక్కర్లేదో తెలియక పోతే, ఇలాగే తయారవుతుంది.
4. ఆడపిల్లల ఎబ్బెట్టు వేష ధారణ గురించి, ఆ ఇసక తక్కెడ హెడ్‌మాష్టరు, “సైకిల్ మీద మగరాయడిలా ధీమాగా పేంట్ వేసుకొని వస్తుంది. అది కూడా ఎలాంటి పేంట్? బిగుతుగా, ఉన్నదున్నట్లు అందరికీ తెలిసేలా, ఫోటోకి ఫ్రేమ్ వేసినట్లు టైట్‌గా, ఎప్పుడు కుట్లు ఊడి పోతాయేమోనని మనకి భయం కలిగించేటట్లుగా ఉంటుందా డ్రస్. షర్ట్ వేసుకొని వస్తుంది కదా? పై రెండు బటన్లు పెట్టుకోకుండా అలాగే వదిలేయడం ఎందుకట? మెడలో గొలుసొకటి పాములాగా అటూ ఇటూ ఊగుతూ…” అంటాడు.
చదివే వాళ్ళకి ఇది ఆడ పిల్ల వేష ధారణ పైన వచ్చిన చురక లాగా అనిపిస్తుంది. మరి మగ పిల్లలు ఇలాంటి వేష ధారణతో వుంటే, ఎబ్బెట్టుగా వుండదా చూడ్డానికి? దీనర్థం, మగ పిల్లలు ఏ చెత్త పని చేస్తే, ఆడ పిల్లలు కూడా, తమ స్వేచ్ఛ కోసం, అదే చెత్త పని చెయ్యాలని కాదు. అటువంటి వేష ధారణ, ఆడ పిల్లల కయినా ఎబ్బెట్టే, మగ పిల్లల కయినా ఎబ్బెట్టే. ఆ మాటే చెప్పాలి రచయిత. “ఆడ పిల్లలు తమ వేష ధారణతో, ఏ పాపం ఎరగని మగ పిల్లలని రెచ్చ గొట్టేస్తున్నట్టూ, అందు వల్లనే ఆడ పిల్లల మీద అత్యాచారాలు పెరిగి పోతున్నాయంటూ” వెర్రి వాగుడు వాగే చెత్త మనుషుల మాటల్లాగా తయారవుతుంది విషయం.
తనకే తెలియని మంచిని ఏ రచయితా సరిగా చెప్పలేడు.
5. మరియ ఒక చోట, తన తల్లి గురించి, “అమ్మ మమ్మల్ని పూర్తిగా వదిలేయలేదు.” అంటుంది. కధలో మరియాకి తోబుట్టులున్నట్టు ఎక్కడా చెప్ప లేదు. మరి ఈ “మమ్మల్ని” ఏమిటీ? “తోబుట్టువులు లేరని కూడా చెప్ప లేదు” కాబట్టి, వున్నారనే అంటారా? “అమ్మ నన్ను పూర్తిగా వదిలేయలేదు” అని వుంటే ఇంకా స్పష్టంగా వుండేది.
మొత్తానికి, ఇది మంచి కధే. చక్కటి అంశం వుంది, కొన్ని తప్పులున్నప్పటికీ. పాజిటివ్‌గా ముగిసింది కూడా, సంస్కరణ అయినప్పటికీ.
జయప్రభ గారూ,
మీకు నా వ్యాఖ్యలో “అసహనం” ధ్వనించిందా? అయ్యయ్యో! సారీ అండీ! నా ఉద్దేశ్యం అది కాదు. నేను సంయమనంతోనే రాసేననుకున్నాను. అంటే, అలా నేను అనుకుంటే చాలదూ, నా వ్యాఖ్య చదివే వాళ్ళు కూడా అలా అనుకోవాలీ అని అర్థం అయింది. అంటే, అలా ఏడిసిందన్న మాట నా సంయమనం. ఇక మీదట ఇంకా సంయమనంతో రాయాలి ఏదైనా వ్యాఖ్య రాస్తే.
చలం గారు రాసిన “ఒక పువ్వు పూసింది” నాకు అస్సలు గుర్తు లేదు. అసలు చదివానో, లేదో కూడా. చలం గారు స్త్రీల స్వేచ్ఛ గురించీ, వారి ఆత్మ గౌరవం గురించీ, సమాజంలోని కుళ్ళు గురించీ, కపటత్వం గురించీ ఎన్నో గొప్ప విషయాలు, ఎవరూ ఏమీ చెప్పని రోజుల్లో, చెప్పిన మహానుభావుడు కాబట్టి, ఆయన ఏ తప్పు రాసినా, ఏ తప్పు చెప్పినా, దాన్ని వెనకేసుకు రానండీ. “ఒక పువ్వు పూసింది” కధ కూడా ఈ కధ లాగే వుంటే, “ఇది కధా” అనే అనిపిస్తుంది నాకు.
కధల్లో కవిత్వం వుండకూదదని అని నేననలేదు. అసలు ఒక రాత ఇలా వుంటేనే దాన్ని కధ అనాలీ అనే నిర్వచనం చెప్పేంత జ్ఞానం కూడా నాకు లేదు. ఒక మామూలు మనిషిగా, ఒక కధ చదివితే, అప్పుడప్పుడు, “ఇది కధా” అని అనిపిస్తుంది. కధల్లో జంతువులు మాట్టాడ్డం సరి కాదు అని నేననుకోను. వాటి పేర్న రచయిత(త్రి) ఏం చెప్పారా అనే చూస్తాను. కొన్ని కల్పిత లక్షణాల్ని నేనేమీ వ్యతిరేకించను. “కులాలు నశించాలీ” అని విష్ణు శర్మ ఆ కరటక దమనకుల చేత చెప్పించాడనుకోండీ, అప్పుడు ప్రశ్నలు వస్తాయి. చెట్టు, పక్షి పిల్లల్ని పాము నించి కాపాడే విషయం ఒక సన్నివేశంగా వచ్చినా, నాకు అలా అనిపించేది కాదేమో.
ప్రసాద్ గారూ!! నా కధ పట్ల మీ అసహనం నాకు బాగా నచ్చింది. థాంక్యూ!
ఇది కధా? కాబోలు. చలం రాసిన “ఒక పువ్వు పూసింది” గనక కధే అయితే ఇదీ కధే! ఇంక కవిత్వానికి వేరే సూత్రాలూ కధలకి మరొక తరహా సూత్రాలూ అంటూ ఉండవనుకుంటాను. కరటక దమనకులు అలా మాట్లాడతాయా అవేమన్నా మనుష్యులా అని అంటే విష్ణుశర్మ ఏమని జవాబు చెప్పి ఉండేవాడో ? 🙂
భాస్కర రావు గారూ, మూలా గారూ, మోహన గారూ: చెట్టు కధని అర్థం చేసుకున్నందుకు నచ్చుకున్నందుకూ మీకు నా వందనాలు.
పాలగుమ్మి విశ్వనాథం (1919-2012) – లలిత సంగీత నివాళి గురించి srinivasaraov,khammam అభిప్రాయం:
03/04/2013 4:56 pm
ఆయన పాడిన మా వూరు ఒక్కసారి పోయి రావాలి, ఈ లోకంలో ఈ దేహంలో పాట చాల పొపులర్. నాకు దాదాపు 10 కి పైన బహుమతొలొచ్చాయి. తెలుగు విశ్వవిద్యాలయానికి మొనోగ్రాఫ్ కూడా వ్రాశారు. మందపాటి వెంకట్రాజు గారి వద్ద వీణ వాయించారు. అలా లలిత సంగితం కోసం జీవితం అంకితం చేసిన వారిని చూడటం ధన్యం.
పాలగుమ్మి విశ్వనాథం (1919-2012) – లలిత సంగీత నివాళి గురించి jayaprabha అభిప్రాయం:
03/04/2013 1:47 pm
శ్రీనివాస్ గారూ! చిన్నప్పుడు విన్నపాటలు. మళ్ళీ వింటూంటే అరవై లలోకి ప్రయాణం కట్టినట్లయ్యింది. సంతోషం కలిగించారు. “రాలలోపల” పాడిన గాయని ఎవరూ? ఇంకో వెర్షన్ కూడా ఉండాలేమో దీనికి, కోరస్ తో, కాదా? ఏమో మతిమరుపు వల్ల స్పష్టంగా గుర్తుకి రావడం లేదు. ఆతరం వారికందరికీ కవులూ రచయితలతో ప్రత్యక్ష సంబంధాలుండేవి. ఆరోజుల్లో రేడియో మంచి పనులు చాలా చేసింది. ఇవాళ్టి సంగతి నాకంతగా తెలీదు. ఆనాడు రేడియో తప్ప మరో ఎంటెర్టైన్మెంట్ లేని కాలం. టాలెంట్ అంతా అక్కడికి వెళ్ళింది. అక్షరానికి విలువనిచ్చిన వాళ్ళుండటం. తీరుబాటుగా ఆలోచించి పనిచేయగలిగిన స్థిమితత్వం ఉండటం. అన్నిటికన్నా ముఖ్యంగా డబ్బు ఇంతగా ఇవాళ్టికాలంలోలాగా బతుకుల్ని ఆక్రమించుకుని ఉండకపోవడం కారణం అనుకుంటాను.
విశ్వనాధం గారు కట్టిన వరసలు ఎన్ని ఉన్నా, నాకు ఆయన కృష్ణ శాస్త్రి అక్షరాలకి కట్టిన బాణీలు ఎక్కువ ఇష్టం. కవి అక్షరం పట్ల స్వరకర్త లో కలిగిన ఇష్టం లోంచి వచ్చిన బాణీలవన్నీ అనిపిస్తాయి. ఇవాళ్టి తరాలకి మళ్ళీ వాటిని పరిచయం చేయడం చాలా అవసరమే!
జయప్రభ.
తృప్తి గురించి purnima అభిప్రాయం:
03/04/2013 9:14 am
చాలా బాగుంది కథ. చదువుతూ వుంటే నోరు ఊరుతోంది. మంచి మెనూ. స్వచ్ఛమైన తెలుగులొ అందమైన వర్ణన. ధన్యవాదాలు.
పాలగుమ్మి విశ్వనాథం (1919-2012) – లలిత సంగీత నివాళి గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
03/04/2013 8:28 am
మాన్యమిత్రులు శ్రీ పరుచూరి శ్రీనివాస్ గారికి
అభినందనలు!
“ఈమాట” పత్రిక ఇదానీంతన సంచికలో శ్రీ పాలగుమ్మి విశ్వనాథం గారికి మీరు సమర్పించిన నివాళి ప్రస్తావిక వారి అమేయమైన ప్రతిభను, అపురూపమైన వ్యక్తిత్వాన్ని, అనర్ఘమైన కృషిసారాన్ని, నిరంతరాయితమైన వ్యాసంగాన్ని, వరివస్యను కన్నులకు కడుతూ చాలా బాగుంది. కొంతకాలం క్రితం అబ్బూరి రామకృష్ణారావు గారి పాటల కేసెట్టు రికార్డింగు సమయంలో నాకు వారితోడి పరిచయం పునరుద్ధృతమైంది. ఆ కేసెట్టు విడుదల వేళ సభాధ్యక్షుడిగా వారిని నేను సన్మానించిన సందర్భంలో కలుసుకోవటమే ఆఖరి సమావేశం. ఆ మధ్య ఫోనుచేసినప్పుడు వారు మా నాన్నగారు శ్రీ ఏల్చూరి సుబ్రహ్మణ్యం గారు రేడియోకి వ్రాయగా తాము సంగీతాన్ని కూర్చిన పాటలు తమ వద్ద బయటపడ్డాయని, ఈ పర్యాయం హైదరాబాదు వచ్చినపుడు కలుసుకొంటే, ఆ వివరాలన్నీ మాట్లాడుకోవచ్చునని అన్నారు. అంతలోనే కాలం వారిని తన దురంతగర్భకుహరంలోకి లాక్కొంటుందని ఊహించలేకపోయాను. ఈ లఘువ్యాసముఖంగా ఇన్నిన్ని పాటలతో మీ జ్ఞాపకాలను పొందుపరిచి మీరు ఎంతో కొంత ఆ ఉత్తమఋషి ఋణాన్ని తీర్చుకోగలిగారు.
ఇదే సంచికలో “ప్రతిమా నాటకము” ప్రసారాన్ని గురించిన ఎన్నో అరుదైన విశేషాలను తెలియజేశారు. ఆ పరిచాయికలో మీరు “రజని గారు సంస్కృత చతుర్భాణీలను తెలుగులోకి అనువదించడం జరిగింది” అన్న ప్రయోగం చేశారు. “చతుర్భాణిని తెలుగులోకి అనువదించడం జరిగింది” లేదా, “చతుర్భాణిలోని నాలుగు భాణాలనూ తెలుగులోకి అనువదించడం జరిగింది” – అని ఉండాలి.
శ్రీ వెల్చేరు వారి సుమతీ శతకం గురించిన వ్యాసంలో “సుమతీ శతకం” తొలి ముద్రణ విషయమై నిడుదవోలు వారు ఆ వివరాన్ని ఎక్కడ చూసి ఇచ్చారో గుర్తింపకుండానే, సందేహించటం జరిగింది. అదీ గాక శ్రీ వెల్చేరు వారు 1868కి పూర్వపు ఏ సుమతీ శతకం ముద్రణా తమకు ప్రపంచంలోని ఏ గ్రంథాలయంలోనూ కనబడలేదు అన్నారు. 1912లో ఎల్.డి. బార్నెట్ ప్రకటించిన A CATALOGUE OF THE TELUGU BOOKS IN THE LIBRARY OF THE BRITISH MUSEUM అన్న సూచికలో
JOYES (Walter) and SESHACHARYULU, N. Ch. Telegoo Series. First Poetical Reader, being introductory lessons, with selections from the Vaymana pathyam and Sumathi Shuthagum, by Walter Joyes, and N. C. Sashacharloo, with the assistance of C. Rungiah, and S. Ramanoojiah . . . Pupil’s edition. (ప్రథమకావ్యపాఠము) pp. 44,5. S.P.C.K. Press: Vepery (Madras), 1859.
అని కనబడుతుంది. దీనిని బట్టి సుమతీ శతకానికి ఒకపాటి సంకలనం – అదెంత సమగ్రమైనా, అసమగ్రమైనా 1859 నాటికే వెలువడినట్లు స్పష్టపడుతున్నది. వాల్టర్ జాయిస్, శేషాచార్యులు జంట అందులో సుమతీ శతకం నుంచి ఎన్ని పద్యాలను గ్రహించారో; వాటిని ఏ రూపంలో పరిష్కరించారో, తమ పీఠికలో 1859 కంటె మునుపటి సుమతీ శతకం ముద్రణలను గురించి ఇంకా ఏవైనా వివరాలను ఇచ్చారేమో – ఆ పుస్తకాన్ని చూసి గాని చెప్పలేము.
శుభాకాంక్షలతో,
ఏల్చూరి మురళీధరరావు
అర్జున గురించి jayaprabha అభిప్రాయం:
03/04/2013 5:18 am
ప్రసాద్ గారూ !! మొదట గా నేను మీ వ్యాఖ్యని శ్రధ్ధగా చదివేను. మీ వ్యాఖ్య నన్ను నొప్పించలేదు సుమా! మీ అభిప్రాయాలని నిర్మొహమాటంగా రాసే పధ్ధతి నాకు ఇష్టం.
కాకపోతే కల్పనకీ తర్కానికీ చుక్కెదురు. తర్కం ఎంత ప్రయత్నించీ కల్పనని లొంగదీసుకోలేదు. పక్షపాత దృష్టి ఈ సృష్టి లోనే ఉండగా ఆ సృష్టి మీద చేసే ఏ వ్యాఖ్యానమైనా అందుకు అతీతంగా ఉండలేదు. కదా? మనమందరమూ ఏదో ఒక పక్షం వేపుగానే ఉంటాం. అన్ని సార్లూ అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండకనూ పోవచ్చు. అయినా సరే అలా ఉండటం సహజం. Obviously its difficult to be objective towards nature and its laws.
ఇంక ప్రతీకలు అన్నవి సైతం అలాంటివే పాము ఎందుకని చెడ్దది కావాలో పక్షి ఎందుకని కాకూడదో స్పష్టం గా నాకు మాత్రం తెలుసునా 🙂 అబ్బే తెలీదు. అది అర్జున అభిప్రాయం. ఆ అభిప్రాయం మీద నాకేమంత అదుపు ఉండదని నేనంటే మీకు అర్ధం అవుతుందో లేదో మరి! కానీ ఇది సత్యం. చాలా సార్లు రచయిత కల్పనావరణాన్ని అతిక్రమిస్తాయి పాత్రలు. అన్నిసార్లూ రచయిత స్వతంత్రుడని / రాలు .. అని మాత్రం అనుకోబోకండి. అలా అంతా రచయిత స్చాధీనం లోంచే తయారయ్యే రచన ఉంటుందని చెప్పలేం కనీశం నావరకూ నేను అలా చెప్పలేను.
సాధారణంగా బలమైన వాటికన్నా vulnerable species వైపుగా మనసు పోవడం వలన కూడా అలాంటి ప్రతీకలు అలవోకగా చొరబడే వీలుంటుంది. లేదా మనసు లోలోతుల్లో ఎక్కడో పాము మీద ఉండే అయిష్టమో పోనీ పక్షి మీద ఉండే ఇష్టమో కూడా పనిచేసి ఉండవచ్చు 🙂 అప్పుడూ అది సహజమే! అలా ఎందుకంటే దాన్ని చెప్పడం కూడా కష్టమే 🙂
ఏం పిల్లడో ఎల్దమొస్తవా ? అన్న వంగపండు పాట మీకు తెలిసే ఉంటుంది. ఆ పాట లోని ప్రతీకలని గమనించండి. ఆయనకి మరి పులి మీద కోపం గొర్రెపొట్టేలు మీద ప్రేమ అని గభాల్న అనేయలేం. కవి చేసే పని ఏమంటే ఉన్న పరిస్థితి మీద వ్యాఖ్యానం చేయడం కోసం ఏ పోలికనైనా తన భావానికి అనువుగా మలుచుకోవడం. అంతే! కొన్నిసార్లు పులి మంచిది కావొచ్చు. కొన్నిసార్లు కాకపోవచ్చు. అంతిమంగా పులి పాము చెట్టు పుట్టా కధల్ని చెప్పవు గనక వాటిని చెప్పేది మనిషే గనక మనిషికున్న సకల భావ సంచలనాలకీ అవి నిర్నిమిత్తంగా కారణభూతమౌతాయి!
కల్పన మీద నేను ఎప్పుడూ వివరణనిచ్చే పనిచేయను. ఇకపోతే సాహిత్యప్రపంచాన్ని సమ్మోహన పరిచిన రచన చలం “ఒక పువ్వు పూసింది.” ఆ ఒక్క రచనే మిగిలీ మిగిలిన సాహిత్యం అంతా పోయినా పరవాలేదన్నారు చింతా దిక్షితులు గారు [కాబోలు]. దాన్ని తప్పక చదవండి. ఏ రచన మన మనసుని ఎలా మెలిపెడుతుందో మనకే తెలీదు. ద్వైదీ భావం కల్పనాపరులందరికీ సహజ గుణం. ” ఒకటికొకటికిని ఒడబడవు” అంటాడు అన్నమయ్య. పగలంతా రాముణ్ణి తిట్టి సాయంత్రం అయ్యేసరికి త్యాగరాజకీర్తనలని ఆస్వాదించే కొడవటిగంటి కుటుంబరావు… స్త్రీలవైపు ప్రాణం ఇచ్చి మాట్లాడి కూడా “ఒక పువ్వు పూసింది” లాంటి చెవనిస్ట్ కధని రాసిన చలం ఈ అంతరంగ గందరగోళాన్ని అధిగమించగలిగారా?? రసపట్టులో తర్కం కూడదు అని అంటారు పింగళి నాగేంద్రరావు కాబోలు. 🙂
అస్తు.
మరియ గురించి ప్రసాద్ అభిప్రాయం:
03/03/2013 3:40 pm
బాగుంది కధ. పాజిటివ్‌గా వుంది. దుర్భరమైన పరిస్థితుల్లో జీవిస్తున్నప్పుడు, మనుషులు మొండిగా తయారవుతారు. వీలైన చోటా, చాతనయిన చోటా ఎదురు తిరుగుతారు. ఆ ప్రాసెస్ లో ఒక్కో సారి తమకి తామే హాని చేసుకుంటారు.
ఈ కధ క్లుప్తంగా: పూర్తిగా వదిలేసిన తండ్రీ, అరకొరగా చూస్తున్న తల్లీ వున్న ఒకమ్మాయి, ప్రేమ లేమితో, దుర్భర జీవితం గడుపుతూ, స్కూలుకి సరిగ్గా వెళ్ళక పోవడం, తనని ఏమన్నా అన్న వాళ్ళకి ఎదురు తిరిగి గట్టిగా సమాధానం చెప్పడం చేస్తూ వుంటుంది. ఒక మంచి టీచరు, తన భార్యతో కలిసి, ఈ అమ్మాయితో పరిచయం పెంచుకుంటాడు. వారి ప్రేమకి కరిగిపోయి, ఈ అమ్మాయి, “స్కూలుకి వెళ్ళక పోవడంలో” తన తప్పుని తాను తెలుసుకుంటుంది.
ఈ కధ నాకు నా చిన్నతనాన్ని కొంచెం గుర్తు చేసింది. ఒక రకమయిన దుర్భర పరిస్తితుల్లో పెరుగుతున్నప్పుడు, నేను కూడా ఇలాగే మొండిగా, ఎదురు తిరుగుతూ వుండే వాడిని కొన్నాళ్ళు. దీనర్థం నన్ను కూడా నా తల్లిదండ్రులు వదిలేశారని కాదు. నావి వేరే రకమయిన దుర్భర పరిస్థితులు. ఎటొచ్చీ ఆ రోజుల్లో, నా కళ్ళు నా వేళ్ళ తోనే, ఈ మరియా లాగా, పొడుచు కోలేదు. అలా చేసి వుంటే, నను కాపాడ్డానికి ఈ కధలో లాగా సంస్కర్తలు ఎవరూ ముందుకు రారు నిజ జీవితంలో. నా చదువు తోనే ఆ దుర్భర పరిస్థితుల్నించీ తప్పించు కోవాలీ అని అనుకునే వాణ్ణి. అందరూ ఇలాగే అనుకోవాలని కాదు దీనర్థం.
సంస్కరణలతో నాకు విభేదం. ఎంత మంది మంచి మనుషులు ఎంత మంది కష్టాల్లో వున్న వారిని ఆదుకోగలరు? ఒక వేళ ఆ టీచరు, ఇతర టీచర్ల లాగా, తన సమస్యలతో తాను వుంటే, ఈ మరియాని ఎవరు కాపాడ గలిగేవారూ? ఆ టీచరు మాత్రం ఎంత మంది మరియాలని కాపాడ గలడు? గ్రహింపు మనంతట మనకే కలగాలి, సమాజం కలిగించే పరిస్థితి లేనప్పుడు. ఆ కలగడం కూడా, మన అనుభవాల్నించో, ఇతరుల అనుభవాల్నించో జరగొచ్చు. అప్పుడు, టీచరు లాంటి మంచి వ్యక్తుల సహాయం తీసుకోవచ్చు. అది ప్రాక్టికల్‌గా వుంటుంది. సమాజంలో మరియ లాంటి వాళ్ళు చాలా ఎక్కువా, టీచర్ లాంటి వాళ్ళు చాలా తక్కువా. సంస్కరణలతో కుదరదు ఓవరాల్ సమస్యకి పరిష్కారం.
సంపాదకులకు ఒక విన్నపం: అనువాద కధలు ప్రచురించే టప్పుడు, అవి మొదటి సారి ఎప్పుడు, వీలైతే ఎక్కడ, ప్రచురించారో తెలియజేస్తే, ఆ కధ వచ్చిన నాటి కాల, మాన పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి కుదురుతుంది. తద్వారా, కధ లోని కొన్ని విషయాలు సరిగా అర్థం అవుతాయి.
ఈ సారి, ఈ కధ చదువుతూ వుంటే, ఇది ఒక అనువాద కధ అని కొన్ని చోట్ల అనిపించింది.
ఒక సారి, టీచరు, ““మరియా! నీవు స్కూలుకి సరిగ్గా వస్తే కాస్త మార్పుగా ఉంటుంది కదా.” అంటాడు. “మార్పు” అన్న మాట ఏదో లాగా వుంది, ఏదో ఒక జబ్బు మనిషిని వేరే ప్రాంతానికి వెళ్ళమన్నట్టు. అసలు వాక్యం ఏమో గానీ, “మరియా! నీవు స్కూలుకి సరిగ్గా వస్తే అది నీకు భవిషత్తులో మంచిది కదా?” అన్నట్టు వుంటే, కాస్త అర్థవంతంగా వుండేదనిపించింది.
ఒక సారి, టీచరు భార్య, “ఈ రోజు రాత్రి మాతోనే నువ్వు భోజనం చేస్తున్నావు” అని అంటే, దానికి మరియా, “ఉండనీ అక్కా.” అంటుంది. “వద్దులే అక్కా” అని దీని అర్థమన్న మాట. ఏదైనా తిరిగి ఇచ్చేస్తూ వుంటే, “ఉండనీ” అన్న మాట బాగానే వుంటుంది. తమిళనాడులో పుట్టి, పెరిగిన మా తెలుగు స్నేహితులు ఇలా మాట్టాడ్డం తెలుసు.
ఈ కధలో కొన్ని నాకు నచ్చని విషయాలున్నాయి.
1. పిల్లని పట్టించు కోని తల్లిదండ్రుల గురించి, టీచరు, “ఎవరు మాత్రం పాపం కాదు? ఈ అమ్మాయిని వదిలేసి ఎక్కడో జీవితం గడుపుతున్న ఆ తల్లి పాపం కాదా? ఆమె తండ్రి పాపం కాదా? అందరమూ ఏదో ఒక రకంగా పాపగ్రస్తులమే.” అంటాడు. చివర్లో వారి గురించి, “ఆ మాట కొస్తే మీ అమ్మా, నాన్నా కూడా చెడ్డ వాళ్ళు కాదు.” అని కూడా అంటాడు.
ఇదేం మాయదారి మంచితనమో నాకర్థం కాదు. భార్యనీ, పిల్లనీ బాధ్యతా రహితంగా వదిలేసిన తండ్రి మీద జాలి. పిల్ల సంగతి పట్టించు కోకుండా, ఎవరితోనో వుంటున్న తల్లి మీద జాలి. ఈ జాలికి అర్థం ఏమన్నా వుందా? మనుషులందరికీ స్వేచ్ఛ వుంటుంది. అయితే, ఎప్పుడయితే పిల్లల్ని కంటారో, అప్పుడు వారికి బాధ్యతలు కూడా సంక్రమిస్తాయి. పిల్లల పట్ల బాధ్యతగా లేని తల్లిదండ్రులని అందరూ అసహ్యించు కుంటారు. దీనర్థం, పిల్లల కోసం అని, తమకు నచ్చని వారితో జీవితం ఎద్దు లాగా సాగదీస్తూ వుండమని కాదు. చెడ్డ మనుషుల్ని వదిలేసి, తమకు నచ్చిన వారిని ఎన్నుకుని వేరే వాళ్ళతో వెళ్ళి పోయినా, పిల్లల పట్ల భాధ్యతగా వుండాలి. వాళ్ళకి అందుబాటులో వుండాలి, వాళ్ళకి ఒక వయసు వచ్చే వరకూ. ఆ మధ్య కాలంలో, “దమయంతి కూతురు” అని ఒక కధ వచ్చింది. అందులోనూ, చాలా చిన్న వయసులో వున్న పిల్లల్ని వదిలేసి, ఆ తల్లి తన భర్తని ఇక భరించ లేక, వెళ్ళి పోతుంది. ఇక్కడ వరకూ అర్థం చేసుకుంటాను. ఆ పిల్లల్లో చిన్న పిల్ల, గిల గిల్లాడి పోతూ వుంటుంది తల్లి కోసం. తల్లి పూర్తిగా మాయం అయిపోతుంది. ఆ పిల్ల అలా ఏడుస్తూనే పెద్దదవుతుంది. కధ లోని “మంచి” పాత్రలకే కాదు, సమాజంలోని “మంచి” వ్యక్తులకి కూడా ఆ తల్లి మీద జాలే. నాకు ఒళ్ళు మండింది ఆ తల్లి మీద. పిల్లల పట్ల బాధ్యత చూపనిది తల్లైనా సరే, తండ్రైనా సరే, ఏ మాత్రం జాలీ వుండ కూడదు. తమకు నచ్చే పనే చేస్తూ కూడా, పిల్లల్ని పట్టించుకుంటూ వుండే పరిస్థితుల్ని తెచ్చుకోవచ్చు. ఈ ప్రపంచంలో, ఏదో ఒక సినిమా పాత్ర అన్నట్టు, కారు నడపడానికి లైసెన్సు కావాలీ, జంతువులని పెంచుకోవడానికీ లైసెన్సు కావాలీ, పిల్లల్ని కనడానికి మాత్రానికి లైసెన్సు అక్కర్లేదు. ఎవరైనా సరే, కనేసి, వదిలేసి వెళ్ళి పోవచ్చు. అభ్యుదయ వాదులందరూ, వారి మీద జాలి కురిపించేస్తూ వుంటారు.
ఈ కధలో, మరియా తల్లిదండ్రు లిద్దరూ చెత్త మనుషులే. ఎవరి మీదా జాలి చూపనక్కర్లేదు.
2. “నేను” అంటూ కధ చెప్పే ఈ టీచరు కూడా సరిగా ప్రవర్తించడు అస్తమానూ. ఈ టీచరు, మరియా గురించి, మొదట, “ఎప్పుడూ చూయింగమ్ నములుతూ, అలా నమలడం మూలాన ఈ స్కూలును, దానిలో ఉన్న టీచర్లని, విద్యార్థులను, కట్టుబాట్లను, క్రమశిక్షణను అన్నిటినీ లెక్కచేయనట్లు, “నాకు ఎవరూ లెక్క లేదు. మీరంతా నా కాలి గోటికి సమం” అన్నట్టుండి పొగరు, గయ్యాళి తనం కలబోసిన విద్యార్థిని నాకు జ్ఞాపకం వచ్చింది.” అని అనుకుంటాడు. ఈ మంచి టీచరు అలా అనుకోవచ్చా? ఆ పిల్ల పొగరు గానూ, గయ్యాళి గానూ వుందా? తన జోలికి వచ్చిన వారి మీదే కదా ఎదురు తిరిగిందీ? ఎవరి జోలికన్నా తనంతట తాను వెళ్ళిందా? ఇలా అని ఆ హెడ్‌మాష్టరో, వేరే టిచరో అనుకోవచ్చు గానీ, మన మంచి టీచరు అనుకోవచ్చా?
ఈ టీచరే, కాస్సేపటీకే, “అదీ గాక, మరియ చిన్న పిల్ల, మేకపిల్ల లాంటి అమ్మాయి” అని అంటాడు. ఆ కాసేపట్లోనే, ఆ “పొగరు, గయ్యాళి పిల్ల”, మేకయి పోయిందా?
మొదట అలా అనుకోవడం, ఈ పాత్ర తప్పు కాదు. రచయిత తప్పు ఆ పాత్ర చేత అలా అనిపించడం.
3. ఆ దరిద్రపు హెడ్‌మాష్టరు, మరియా వేషాన్ని గురించి చెబుతూ, “నాకు తెలుసులే. మీరు కూడా ఈ విషయాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు.” అంటాడు. దానికి మన మంచి టీచరు, ‘సార్’ అని అనడం తప్ప, “ఏంటి సార్ ఆ తప్పు మాటలు? నేనలాంటి వాడిని కాను.” అని అనడు. ఇది కూడా రచయిత దోషమే, ఆ మంచి టీచరు చేత అలా అనిపించక పోవడం. ఎక్కడ మాట్టాడాలో, ఎక్కడ అక్కర్లేదో తెలియక పోతే, ఇలాగే తయారవుతుంది.
4. ఆడపిల్లల ఎబ్బెట్టు వేష ధారణ గురించి, ఆ ఇసక తక్కెడ హెడ్‌మాష్టరు, “సైకిల్ మీద మగరాయడిలా ధీమాగా పేంట్ వేసుకొని వస్తుంది. అది కూడా ఎలాంటి పేంట్? బిగుతుగా, ఉన్నదున్నట్లు అందరికీ తెలిసేలా, ఫోటోకి ఫ్రేమ్ వేసినట్లు టైట్‌గా, ఎప్పుడు కుట్లు ఊడి పోతాయేమోనని మనకి భయం కలిగించేటట్లుగా ఉంటుందా డ్రస్. షర్ట్ వేసుకొని వస్తుంది కదా? పై రెండు బటన్లు పెట్టుకోకుండా అలాగే వదిలేయడం ఎందుకట? మెడలో గొలుసొకటి పాములాగా అటూ ఇటూ ఊగుతూ…” అంటాడు.
చదివే వాళ్ళకి ఇది ఆడ పిల్ల వేష ధారణ పైన వచ్చిన చురక లాగా అనిపిస్తుంది. మరి మగ పిల్లలు ఇలాంటి వేష ధారణతో వుంటే, ఎబ్బెట్టుగా వుండదా చూడ్డానికి? దీనర్థం, మగ పిల్లలు ఏ చెత్త పని చేస్తే, ఆడ పిల్లలు కూడా, తమ స్వేచ్ఛ కోసం, అదే చెత్త పని చెయ్యాలని కాదు. అటువంటి వేష ధారణ, ఆడ పిల్లల కయినా ఎబ్బెట్టే, మగ పిల్లల కయినా ఎబ్బెట్టే. ఆ మాటే చెప్పాలి రచయిత. “ఆడ పిల్లలు తమ వేష ధారణతో, ఏ పాపం ఎరగని మగ పిల్లలని రెచ్చ గొట్టేస్తున్నట్టూ, అందు వల్లనే ఆడ పిల్లల మీద అత్యాచారాలు పెరిగి పోతున్నాయంటూ” వెర్రి వాగుడు వాగే చెత్త మనుషుల మాటల్లాగా తయారవుతుంది విషయం.
తనకే తెలియని మంచిని ఏ రచయితా సరిగా చెప్పలేడు.
5. మరియ ఒక చోట, తన తల్లి గురించి, “అమ్మ మమ్మల్ని పూర్తిగా వదిలేయలేదు.” అంటుంది. కధలో మరియాకి తోబుట్టులున్నట్టు ఎక్కడా చెప్ప లేదు. మరి ఈ “మమ్మల్ని” ఏమిటీ? “తోబుట్టువులు లేరని కూడా చెప్ప లేదు” కాబట్టి, వున్నారనే అంటారా? “అమ్మ నన్ను పూర్తిగా వదిలేయలేదు” అని వుంటే ఇంకా స్పష్టంగా వుండేది.
మొత్తానికి, ఇది మంచి కధే. చక్కటి అంశం వుంది, కొన్ని తప్పులున్నప్పటికీ. పాజిటివ్‌గా ముగిసింది కూడా, సంస్కరణ అయినప్పటికీ.
ప్రసాద్
అర్జున గురించి ప్రసాద్ అభిప్రాయం:
03/03/2013 2:16 pm
జయప్రభ గారూ,
మీకు నా వ్యాఖ్యలో “అసహనం” ధ్వనించిందా? అయ్యయ్యో! సారీ అండీ! నా ఉద్దేశ్యం అది కాదు. నేను సంయమనంతోనే రాసేననుకున్నాను. అంటే, అలా నేను అనుకుంటే చాలదూ, నా వ్యాఖ్య చదివే వాళ్ళు కూడా అలా అనుకోవాలీ అని అర్థం అయింది. అంటే, అలా ఏడిసిందన్న మాట నా సంయమనం. ఇక మీదట ఇంకా సంయమనంతో రాయాలి ఏదైనా వ్యాఖ్య రాస్తే.
చలం గారు రాసిన “ఒక పువ్వు పూసింది” నాకు అస్సలు గుర్తు లేదు. అసలు చదివానో, లేదో కూడా. చలం గారు స్త్రీల స్వేచ్ఛ గురించీ, వారి ఆత్మ గౌరవం గురించీ, సమాజంలోని కుళ్ళు గురించీ, కపటత్వం గురించీ ఎన్నో గొప్ప విషయాలు, ఎవరూ ఏమీ చెప్పని రోజుల్లో, చెప్పిన మహానుభావుడు కాబట్టి, ఆయన ఏ తప్పు రాసినా, ఏ తప్పు చెప్పినా, దాన్ని వెనకేసుకు రానండీ. “ఒక పువ్వు పూసింది” కధ కూడా ఈ కధ లాగే వుంటే, “ఇది కధా” అనే అనిపిస్తుంది నాకు.
కధల్లో కవిత్వం వుండకూదదని అని నేననలేదు. అసలు ఒక రాత ఇలా వుంటేనే దాన్ని కధ అనాలీ అనే నిర్వచనం చెప్పేంత జ్ఞానం కూడా నాకు లేదు. ఒక మామూలు మనిషిగా, ఒక కధ చదివితే, అప్పుడప్పుడు, “ఇది కధా” అని అనిపిస్తుంది. కధల్లో జంతువులు మాట్టాడ్డం సరి కాదు అని నేననుకోను. వాటి పేర్న రచయిత(త్రి) ఏం చెప్పారా అనే చూస్తాను. కొన్ని కల్పిత లక్షణాల్ని నేనేమీ వ్యతిరేకించను. “కులాలు నశించాలీ” అని విష్ణు శర్మ ఆ కరటక దమనకుల చేత చెప్పించాడనుకోండీ, అప్పుడు ప్రశ్నలు వస్తాయి. చెట్టు, పక్షి పిల్లల్ని పాము నించి కాపాడే విషయం ఒక సన్నివేశంగా వచ్చినా, నాకు అలా అనిపించేది కాదేమో.
ఏమైనా, మిమ్మల్ని నొప్పించాలని కాదండీ.
ప్రసాద్
ఇటుకలూ అటుకులూ గురించి D.Venkateswara Rao అభిప్రాయం:
03/03/2013 12:48 pm
తః తః గారు భాషా బేధాలు ప్రాంతీయ బేధాలు తలెత్తి తః తః లాడేలా వ్రాశారు.
అర్జున గురించి jayaprabha అభిప్రాయం:
03/03/2013 6:39 am
ప్రసాద్ గారూ!! నా కధ పట్ల మీ అసహనం నాకు బాగా నచ్చింది. థాంక్యూ!
ఇది కధా? కాబోలు. చలం రాసిన “ఒక పువ్వు పూసింది” గనక కధే అయితే ఇదీ కధే! ఇంక కవిత్వానికి వేరే సూత్రాలూ కధలకి మరొక తరహా సూత్రాలూ అంటూ ఉండవనుకుంటాను. కరటక దమనకులు అలా మాట్లాడతాయా అవేమన్నా మనుష్యులా అని అంటే విష్ణుశర్మ ఏమని జవాబు చెప్పి ఉండేవాడో ? 🙂
భాస్కర రావు గారూ, మూలా గారూ, మోహన గారూ: చెట్టు కధని అర్థం చేసుకున్నందుకు నచ్చుకున్నందుకూ మీకు నా వందనాలు.
జయప్రభ.
అడవిదారిలో గాలిపాట – పుస్తక పరిచయం గురించి రవి వీరెల్లి అభిప్రాయం:
03/02/2013 7:27 pm
సమీక్ష బాగుంది.
ఇంద్రాణి గారి కవితలు కొన్ని చదివాను. నచ్చాయి. వెంటనే పుస్తకం కొని మిగతావి చదవాలి.