చక్కటి వ్యాసం, అంతే ఎత్తు వ్యాఖ్యానాలూ ఎంతో ఆనందదాయకం. ఐతే స్వ. పినాకపాణి గార్కి శ్రీ బాల మురళి గారిపై దురభిప్రాయాన్ని ఆపాదించడం ఆప్రస్తుతం మరియు అసమంజసమని నా అభిప్రాయం.
జయరాం గారూ,
ఈ పాట సంగతి నాకు తెలియదు గానీ, గస గసాలనే పదార్థం వుంది. చిన్నప్పుడు మా ఇంట్లో వుండేది. ఇది ఆవాలు కాదు. ఈ గస గసాలు పోపులో వెయ్యము. మరి దేనికి వాడతారో మర్చి పోయాను. ఈ సారి మా అమ్మ గారితో మాట్టాడినప్పుడు అడుగుతాను. బహుశా కడుపు నొప్పికో, అజీర్ణానికో వాడతారనుకుంటాను. ఇప్పుడు కూడా ఆ పదార్థం మా ఇంట్లో వుంది. అస్సలు వాడము దాన్ని. అది వేరే సంగతి. 🙂
గస గసాలనే పదార్థం ఘాటుగా వుంటుంది. ఆ అర్థం మీ పాటకి సరిపోతుందేమో చూసుకోవచ్చు.
ఈ పాదానికి అర్థం శేఖర్ కమ్ముల గారి మాటల్లోనే చూద్దాం:
వినగానే డౌట్… అసలు “గసగసాల కౌగిలింత” ఏంటి?… చదివేటప్పుడు ఆవాలని గసగాసాలుగా తప్పుగా అనేసుకొని (తిండి, వంట – రెండు సరిగా రావు), ఆవాలు అన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి అలా వాడారేమో అని సరిపెట్టుకున్నా! ఓ మూడు నెలల తర్వాత అనుకుంటా, డౌట్ క్లియర్ చేసుకున్నా! “ఏమీ లేదు. ప్రయోగం చేశా… ‘సగం సగం’ని తిప్పా… ‘గసం గసం అయ్యింది… అది కాస్తా ‘గసగసాలు’ అయ్యింది” అన్నారు. మళ్ళి ఓ దణ్ణం!
శేఖర్ గారు రాసిన పూర్తి వ్యాసం చదవాలనుకుంటే ఈ లంకె లో చూడచ్చు.
(1) భర్తృహరి సుభాషిత శతకములలోని పద్యాలు ఒకే ఛందస్సునకు చెందినవి కావు. కాని హాలుని గాథాసప్తశతిలోని పద్యాలన్నియు గాథాలక్షణములు కలిగినవి. దీనిని గురించి నేను ఇటీవల చర్చించియున్నాను. కందపద్యమునకు ఆధారము ఈ గాథయే. అందువలన సుమతిశతక కర్త హాలుని ఉదాహరణముగా నెంచుకొని ఒకే ఛందస్సైన కందమును మాత్రమే వాడియుండవచ్చును.
ఈ పద్యములోని ఒక విశేష మేమనగా – ఇందులోని అన్ని పాదములలో ప్రాసాక్షరమునకు ముందు అర్ధబిందువు (అరసున్న) ఉన్నది. ఇలాటి పద్యములు నన్నయ భారతములో కొన్ని ఉన్నవి, ఉదా.
తిక్కన భారతములో ఇట్టి నియమమును పాటించని పద్యములు ఉన్నాయి. నన్నెచోడుడు అర్ధబిందు, పూర్ణబిందు ప్రాసలను కొన్ని చోటులలో సంకరము చేసెను. కావున సుమతిశతక కర్త నన్నయ తఱువాతి వాడనియు, తిక్కనకంటె ముందో లేక అతని సమకాలికుడో అని చెప్పవచ్చును. ఎందుకంటే ట అక్షరముముండు ఉండే అరసున్నను ప్రాససాంకర్యము చేయడము తిక్కన కాలములో అమలులో నుండినది. సుమతిశతకములో అలాటి పద్యము మాటకు ప్రాణము … పద్యములో బోఁటి పదమునకు అరసున్న ఉన్నది, మిగిలిన పదములకు (మాట, కోట, చీటి) అది లేదు.
(3) నన్నయ, నన్నెచోడుడులాటి కవులు బండి ర, గుండు ర లకు ప్రాస సాంకర్యమును చేయలేదు. సుమతిశతకములో ఱ ప్రాస పాటించబడినట్లే తోచుచున్నది. కొన్ని చోటులలో దాని లేమి తరువాతి కవులు పద్యసౌలభ్యమునకై చేసిన మార్పు అని అనుకొంటాను.
పై మూడు కారణములవలన సుమతిశతక కర్త బహుశా తిక్కనకంటె ముందు లేక తిక్కన సమకాలికుడో అయి ఉండవచ్చును.
(4) మన్మథుని భార్య రతిని గురించి చెప్పేటప్పుడు రతీదేవియే సరి. కాని రతికేళికి, ఆనందమునకు దేవి అన్నప్పుడు ఆ పదము రతిదేవి అవుతుంది.
నేను ఇప్పుడు పదకొండవ తరగతి చదువుతున్నాను. పదవ తరగతి వరకు మొదటి భాష తెలుగు అవడం వల్ల ఇలా మాట్లాడగలుగుతున్నాను. నేను షేక్ స్పియర్ రాసిన నాటకాలు కొన్ని చదివాను. కాని మన అల్లసాని పెద్దన గారు మను చరిత్రలో వ్రాసిన ఒక పద్యం గుర్తువచ్చినప్పుదు మా స్నేహితుల కంటే నేను అదృష్టవంతుడిని అని అనిపిస్తుంటుంది. ఆ పద్యం…
సుమతి శతకాన్ని గురించి నిర్మాణాత్మకమైన చర్చ చెయ్యకుండా సుమతీ శతకమా, సుమతి శతకమా అనే మీమాంసలోకి దింపటం నా ఉద్దేశం కాదు. నేను చెన్నపురిలో చదువుకొనే రోజుల్లో సుమతీ శతకం అనగానే రావూరి దొరసామి శర్మగారు ‘అలా అనకు. దాని పేరు సుమతి శతకం’ అని సరిదిద్దారు. ఇది నా మనసులో బలంగా నాటుకుంది.
నిజానికి సుమతి శతకం కాలం, రచయిత, నాటి సాంఘిక పరిస్థితులు వగైరా విషయాల మీదనే ఎక్కువ చర్చ జరగాలి. అసలు విషయం వదిలేసి మరేవో చెప్తున్న జయప్రభగారి లాంటి వారితో అసలు పేచీనే లేదు.
“సుమతిశతక”మని అనాలా “సుమతీశతక”మని అనాలా అనే చర్చలోకి నేను దిగదలుచుకోలేదు కాని ఆ శబ్దాల గురించి నాకు తెలిసిన రెండు విషయాలు మాత్రం చెపుతాను. “సుమతీశతకం”, “దాశరథీశతకం” వంటి మాటలలో దీర్ఘం నిజానికి సంస్కృత భాషా ప్రభావం వల్ల వచ్చినదే. సంస్కృతంలో చాలా ఇకారాంత పదాలు స్త్రీలింగాలు. అవి చాలా వరకూ దీర్ఘాంతాలు. అవి సమాసాలలో (తెలుగులోకి వచ్చిన తర్వాత కూడా) దీర్ఘంతోనే ఉంటాయి – పార్వతీపరమేశ్వరులు, ధరణీచక్రము, దేవీభాగవతం – ఇత్యాదిగా. అది అలవాటైపోయి, దీర్ఘాంతాలు కాని ఇకారాంత పదాలను కూడా సమాసాలలో దీర్ఘాంతాలుగా వాడేస్తూ ఉంటాం. సుమతీశతకం, దాశరథీశతకం వంటి పదాలలో దీర్ఘానికి కారణం ఇది తప్పిస్తే, అవి సంబోధనలు అయినందువల్ల కాదు. తః తః గారే యిచ్చిన “భాస్కరశతకం” అన్న ఉదాహరణలో, సంబోధనే అయినా “భాస్కరాశతకం” అని అనం కదా, ఎందుకంటే ఆ పదం దీర్ఘాంతం కాదు కాబట్టి.
అరుదుగా అకారాంత పదాలకి కూడా యీలా దీర్ఘం లేని చోట దీర్ఘం పెట్టెయ్యడం గమనించవచ్చు. అలాంటి దానికి ఒక ఉదాహరణ “ఊహ”. దీని చివర దీర్ఘం లేదు. కాని సమాసం చేసినప్పుడు “ఊహాశక్తి”, “ఊహాగానం” అని చాలామంది వాడుకలోకి వచ్చేసింది. వ్యాకరణ పరంగా చెప్పాలంటే “ఊహశక్తి” “ఊహగానం” అనేవి సరైన పదాలు. “రతీదేవి” అన్నది కూడా ఇలాంటిదే (“రతిదేవి” అన్నదే సరైన పదం), అయితే దీని గురించి కొంత వాదన ఉంది, వ్యాకరణ ప్రకారం రెండూ సరైనవే అని.
గానవిద్యా వారిధి: డా. శ్రీపాద పినాకపాణి గురించి parasuram govindu అభిప్రాయం:
03/23/2013 4:42 am
చక్కటి వ్యాసం, అంతే ఎత్తు వ్యాఖ్యానాలూ ఎంతో ఆనందదాయకం. ఐతే స్వ. పినాకపాణి గార్కి శ్రీ బాల మురళి గారిపై దురభిప్రాయాన్ని ఆపాదించడం ఆప్రస్తుతం మరియు అసమంజసమని నా అభిప్రాయం.
వేటూరి పాట గురించి ప్రసాద్ అభిప్రాయం:
03/22/2013 12:10 pm
జయరాం గారూ,
ఈ పాట సంగతి నాకు తెలియదు గానీ, గస గసాలనే పదార్థం వుంది. చిన్నప్పుడు మా ఇంట్లో వుండేది. ఇది ఆవాలు కాదు. ఈ గస గసాలు పోపులో వెయ్యము. మరి దేనికి వాడతారో మర్చి పోయాను. ఈ సారి మా అమ్మ గారితో మాట్టాడినప్పుడు అడుగుతాను. బహుశా కడుపు నొప్పికో, అజీర్ణానికో వాడతారనుకుంటాను. ఇప్పుడు కూడా ఆ పదార్థం మా ఇంట్లో వుంది. అస్సలు వాడము దాన్ని. అది వేరే సంగతి. 🙂
గస గసాలనే పదార్థం ఘాటుగా వుంటుంది. ఆ అర్థం మీ పాటకి సరిపోతుందేమో చూసుకోవచ్చు.
ప్రసాద్
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
03/22/2013 12:32 am
వ్యాసంతో సంబంధం లేకపోయినా, భాష గురించిన చర్చ కాబట్టి, పిడకలవేటని కొనసాగిస్తూ :
“మన్మథుని భార్య రతిని గురించి చెప్పేటప్పుడు రతీదేవియే సరి. కాని రతికేళికి, ఆనందమునకు దేవి అన్నప్పుడు ఆ పదము రతిదేవి అవుతుంది.”
మోహనరావుగారూ, మరి “రతిపతి” అన్నప్పుడు అందులో రతి, మన్మథుని భార్యే కదా?
వేటూరి పాట గురించి Jayaram అభిప్రాయం:
03/21/2013 10:25 pm
“గసగసాల కౌగిలింత గుసగుసల్లె మారుతావు”
ఈ పాదానికి అర్థం శేఖర్ కమ్ముల గారి మాటల్లోనే చూద్దాం:
వినగానే డౌట్… అసలు “గసగసాల కౌగిలింత” ఏంటి?… చదివేటప్పుడు ఆవాలని గసగాసాలుగా తప్పుగా అనేసుకొని (తిండి, వంట – రెండు సరిగా రావు), ఆవాలు అన్నీ దగ్గర దగ్గరగా ఉంటాయి కాబట్టి అలా వాడారేమో అని సరిపెట్టుకున్నా! ఓ మూడు నెలల తర్వాత అనుకుంటా, డౌట్ క్లియర్ చేసుకున్నా! “ఏమీ లేదు. ప్రయోగం చేశా… ‘సగం సగం’ని తిప్పా… ‘గసం గసం అయ్యింది… అది కాస్తా ‘గసగసాలు’ అయ్యింది” అన్నారు. మళ్ళి ఓ దణ్ణం!
శేఖర్ గారు రాసిన పూర్తి వ్యాసం చదవాలనుకుంటే ఈ లంకె లో చూడచ్చు.
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి మోహన అభిప్రాయం:
03/21/2013 8:10 pm
(1) భర్తృహరి సుభాషిత శతకములలోని పద్యాలు ఒకే ఛందస్సునకు చెందినవి కావు. కాని హాలుని గాథాసప్తశతిలోని పద్యాలన్నియు గాథాలక్షణములు కలిగినవి. దీనిని గురించి నేను ఇటీవల చర్చించియున్నాను. కందపద్యమునకు ఆధారము ఈ గాథయే. అందువలన సుమతిశతక కర్త హాలుని ఉదాహరణముగా నెంచుకొని ఒకే ఛందస్సైన కందమును మాత్రమే వాడియుండవచ్చును.
(2) సుమతిశతకమునుండి ఒక రెండు పద్యములు –
ఆఁకలి యుడుగని కడుపును
వేఁకటియగు లంజ పడుపు – విడువని బ్రదుకున్
బ్రాఁకొన్న నూతి యుదకము
మేఁకల పాడియును రోఁత – మేదిని సుమతీ
ఈ పద్యములోని ఒక విశేష మేమనగా – ఇందులోని అన్ని పాదములలో ప్రాసాక్షరమునకు ముందు అర్ధబిందువు (అరసున్న) ఉన్నది. ఇలాటి పద్యములు నన్నయ భారతములో కొన్ని ఉన్నవి, ఉదా.
వీఁకఁ బఱతెంచి నలుగడఁ
దాఁకిన గడు నలిగి ఘోర-తరశరహతి న-
మ్మూఁకలు విరియఁగ నర్జునుఁ
డాఁకరమున నేసె పెనుగురుఁ-డయి రణభూమిన్ – ఆది, 8.200
తిక్కన భారతములో ఇట్టి నియమమును పాటించని పద్యములు ఉన్నాయి. నన్నెచోడుడు అర్ధబిందు, పూర్ణబిందు ప్రాసలను కొన్ని చోటులలో సంకరము చేసెను. కావున సుమతిశతక కర్త నన్నయ తఱువాతి వాడనియు, తిక్కనకంటె ముందో లేక అతని సమకాలికుడో అని చెప్పవచ్చును. ఎందుకంటే ట అక్షరముముండు ఉండే అరసున్నను ప్రాససాంకర్యము చేయడము తిక్కన కాలములో అమలులో నుండినది. సుమతిశతకములో అలాటి పద్యము మాటకు ప్రాణము … పద్యములో బోఁటి పదమునకు అరసున్న ఉన్నది, మిగిలిన పదములకు (మాట, కోట, చీటి) అది లేదు.
(3) నన్నయ, నన్నెచోడుడులాటి కవులు బండి ర, గుండు ర లకు ప్రాస సాంకర్యమును చేయలేదు. సుమతిశతకములో ఱ ప్రాస పాటించబడినట్లే తోచుచున్నది. కొన్ని చోటులలో దాని లేమి తరువాతి కవులు పద్యసౌలభ్యమునకై చేసిన మార్పు అని అనుకొంటాను.
పై మూడు కారణములవలన సుమతిశతక కర్త బహుశా తిక్కనకంటె ముందు లేక తిక్కన సమకాలికుడో అయి ఉండవచ్చును.
(4) మన్మథుని భార్య రతిని గురించి చెప్పేటప్పుడు రతీదేవియే సరి. కాని రతికేళికి, ఆనందమునకు దేవి అన్నప్పుడు ఆ పదము రతిదేవి అవుతుంది.
విధేయుడు – మోహన
తెలుగు భాషాభివృద్ధికి వ్యూహాలు గురించి శ్రీ భువన్ అభిప్రాయం:
03/21/2013 9:26 am
నేను ఇప్పుడు పదకొండవ తరగతి చదువుతున్నాను. పదవ తరగతి వరకు మొదటి భాష తెలుగు అవడం వల్ల ఇలా మాట్లాడగలుగుతున్నాను. నేను షేక్ స్పియర్ రాసిన నాటకాలు కొన్ని చదివాను. కాని మన అల్లసాని పెద్దన గారు మను చరిత్రలో వ్రాసిన ఒక పద్యం గుర్తువచ్చినప్పుదు మా స్నేహితుల కంటే నేను అదృష్టవంతుడిని అని అనిపిస్తుంటుంది. ఆ పద్యం…
అట జని కాంచె భూమి సురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
పటల ముహుర్ముహుర్లుఠదభంగ తరంగ మృదంగ నిస్స్వన
స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కల్లపి జాలమున్
గటక చరత్కరేణు కర కంపిత సాలము శీతశైలమున్.
ఇప్పటికైనా నాకు ఒక తెలుగు బ్లాగు దొరికినందుకు నాకు సంతోషంగా ఉంది.
మీ
శ్రీ భువన్.
గాలి మళ్ళింది గురించి John hyde Kanumuri అభిప్రాయం:
03/21/2013 8:27 am
మొదట చదినప్పుడు ఒక స్థబ్దత అనిపించి కామెంటు రాయలేకపోయాను. మళ్ళీ ఇప్పుడు చదువుతుంటే కన్నీటి పొరమధ్య అక్షరాలు కనబడటం లేదు.
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి Rallapalli Sundaram అభిప్రాయం:
03/20/2013 11:47 pm
సుమతి శతకాన్ని గురించి నిర్మాణాత్మకమైన చర్చ చెయ్యకుండా సుమతీ శతకమా, సుమతి శతకమా అనే మీమాంసలోకి దింపటం నా ఉద్దేశం కాదు. నేను చెన్నపురిలో చదువుకొనే రోజుల్లో సుమతీ శతకం అనగానే రావూరి దొరసామి శర్మగారు ‘అలా అనకు. దాని పేరు సుమతి శతకం’ అని సరిదిద్దారు. ఇది నా మనసులో బలంగా నాటుకుంది.
నిజానికి సుమతి శతకం కాలం, రచయిత, నాటి సాంఘిక పరిస్థితులు వగైరా విషయాల మీదనే ఎక్కువ చర్చ జరగాలి. అసలు విషయం వదిలేసి మరేవో చెప్తున్న జయప్రభగారి లాంటి వారితో అసలు పేచీనే లేదు.
రాళ్ళపల్లి సుందరం
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి కామేశ్వరరావు అభిప్రాయం:
03/20/2013 12:29 pm
“సుమతిశతక”మని అనాలా “సుమతీశతక”మని అనాలా అనే చర్చలోకి నేను దిగదలుచుకోలేదు కాని ఆ శబ్దాల గురించి నాకు తెలిసిన రెండు విషయాలు మాత్రం చెపుతాను. “సుమతీశతకం”, “దాశరథీశతకం” వంటి మాటలలో దీర్ఘం నిజానికి సంస్కృత భాషా ప్రభావం వల్ల వచ్చినదే. సంస్కృతంలో చాలా ఇకారాంత పదాలు స్త్రీలింగాలు. అవి చాలా వరకూ దీర్ఘాంతాలు. అవి సమాసాలలో (తెలుగులోకి వచ్చిన తర్వాత కూడా) దీర్ఘంతోనే ఉంటాయి – పార్వతీపరమేశ్వరులు, ధరణీచక్రము, దేవీభాగవతం – ఇత్యాదిగా. అది అలవాటైపోయి, దీర్ఘాంతాలు కాని ఇకారాంత పదాలను కూడా సమాసాలలో దీర్ఘాంతాలుగా వాడేస్తూ ఉంటాం. సుమతీశతకం, దాశరథీశతకం వంటి పదాలలో దీర్ఘానికి కారణం ఇది తప్పిస్తే, అవి సంబోధనలు అయినందువల్ల కాదు. తః తః గారే యిచ్చిన “భాస్కరశతకం” అన్న ఉదాహరణలో, సంబోధనే అయినా “భాస్కరాశతకం” అని అనం కదా, ఎందుకంటే ఆ పదం దీర్ఘాంతం కాదు కాబట్టి.
అరుదుగా అకారాంత పదాలకి కూడా యీలా దీర్ఘం లేని చోట దీర్ఘం పెట్టెయ్యడం గమనించవచ్చు. అలాంటి దానికి ఒక ఉదాహరణ “ఊహ”. దీని చివర దీర్ఘం లేదు. కాని సమాసం చేసినప్పుడు “ఊహాశక్తి”, “ఊహాగానం” అని చాలామంది వాడుకలోకి వచ్చేసింది. వ్యాకరణ పరంగా చెప్పాలంటే “ఊహశక్తి” “ఊహగానం” అనేవి సరైన పదాలు. “రతీదేవి” అన్నది కూడా ఇలాంటిదే (“రతిదేవి” అన్నదే సరైన పదం), అయితే దీని గురించి కొంత వాదన ఉంది, వ్యాకరణ ప్రకారం రెండూ సరైనవే అని.
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
03/20/2013 10:14 am
[మార్చమని వ్యాస రచయిత కోరలేదు. సుందరం, మోహన రావు గార్ల అభిప్రాయాలను పరిశీలించిన పిమ్మట ఇది మేము తీసుకున్న నిర్ణయమే – సం.]
మూలవ్యాసం లో ఎలావుందో అలా మొదల్లోనే చేస్తే సరిపోయేది కదా – సంపాదకుల పరిశీలనలు, నిర్ణయాలు ఎందుకు? మూలవ్యాసం ప్రకారం అది “సుమతిశతకం”, దీర్ఘం లేదు.
[కృతజ్ఞతలు. మాకు పంపిన తెలుగు అనువాదంలో సుమతీ అనే ఉండడం వల్ల పరిశీలనలు, నిర్ణయాలు అవసరమైనాయి. – సం.]