(1) అర్ధబిందు ప్రాసను గురించి చర్చించునపుడు ఒక విషయము గుర్తుంచుకోవాలి. చీకటివంటి పదాలకు నన్నయ, తిక్కనల కాలములో క అక్షరానికి ముందు అరసున్న లేదు, తరువాతి కాలములో చేర్చబడినది. నన్నయభట్టు మాత్రమే సార్ధబిందుప్రాసను తప్పకుండ అనుసరించినాడని విజ్ఞుల అభిప్రాయము. తిక్కన కాలానికి ఇది కొద్దిగా సడలినది. ర,ఱలు ఉండే పదాలవలెనే అర్ధబిందువులు ఉండే పదాలలో కూడ నియమాలు తగ్గినాయి. ట, ప లకు ముందు అరసున్న ఉండే పదాలకు అలా లేని పదాలతో ప్రాస చెల్లుతుందని అనంతుని ఛందములో (ఛందోదర్పణములో) నున్నది. అట్టి పద్యమును సుమతిశతకమునుండి నేను ఉదహరించినాను. ఈ కారణములన వలననే నేను శతక రచయిత తప్పక నన్నయ నన్నెచోడుల తరువాతి వాడని తెలిపాను.
(2) తిక్కనకు 50 సంవత్సరాలు అటో యిటో అనడానికి మరొక కారణము. సుమతిశతకమును భీమకవి వ్రాసినాడాని అనుకొంటే ఈ భీమకవియే భీమనఛందము అని పిలువబడే కవిజనాశ్రయమును కూడ వ్రాసినాడని అనుకొంటే ఈ కవిజనాశ్రయ కాలమును మనము నిర్ణయించాలి. దీనిని నేను వివరముగా నా క్రౌంచపదము అనే వ్యాసములో వ్రాసియున్నాను. తెలుగులో ఉండే క్రౌంచపదము, మంగళమహాశ్రీ వృత్తపు లక్షణాలు నన్నెచోడుని కుమారసంభవపు ప్రభావము వలన వచ్చినవే. కాబట్టి భీమన కవిజనాశ్రయమును వ్రాసియుంటే అది నన్నయ, నన్నెచోడుల తరువాతనే, ముందు కాదు. ఇక పోతే ఎంత తరువాత అన్నది నన్నెచోడుని కాలమును బట్టి ఉంటుంది. నా ఊహలో నన్నెచోడుడు నన్నయ సమకాలికుడు, కాని చాలమంది అతడు నన్నయ తిక్కనల మధ్యకాలములో జీవించాడని అంటారు.
(3) ఇక్కడ మరొక చిక్కు ఏమనగా, సుమతిశతకములో పద్యాలు చాల తక్కువ, అందువలన మనకు తక్కువ దత్తాంశములతో ఎక్కువ ఫలితాలను ఆశించడము వీలు కాదు (ఉదా. నన్నయ వ్రాసిన రెండున్నర మహాభారత పర్వాలలో అరసున్న ప్రాస ఉండే పద్యాలు పదికంటె తక్కువ). నేను ఇక్కడ తెలిపినవి పూర్తిగా ఛందశ్శాస్త్రముపైన ఆధారపడిన నా ఊహలు మాత్రమే, మిగిలిన విషయాలపైన వ్రాయడానికి నాకు అర్హత లేదు.
సుమతిశతక కర్త కాలాన్ని గురించి మోహనరావు గారి ఆలోచన ఆలోచించదగింది. ఐతే, ఆయన వాడిన తర్కం వల్ల అతను నన్నయ, నన్నెచోడుడుల తర్వాతి వాడని చెప్పొచ్చు కాని తిక్కనకి తర్వాతివాడు కాడని చెప్పటం సాధ్యం కాదు కదా! అతను తిక్కన లాటి ప్రయోగాలు చేసినంతమాత్రాన తిక్కనకి సమకాలికుడు కాడు, తిక్కన తర్వాతి వాళ్లు ఇంకెవరూ అలాటి ప్రాసలు పాటించలేదని రుజువు చేస్తే తప్ప. కవిత్రయం ప్రయోగాల్ని ప్రమాణాలుగా తీసుకుని తర్వాతి వాళ్లు చాలామంది వాళ్లు ముగ్గురు చేసిన ప్రాసలన్నిట్నీ అనుసరించారని నేను విన్నది. అది నిజమైతే సుమతిశతకం తిక్కన గారి తర్వాత వచ్చిందని తప్ప ఎప్పుడు వచ్చిందో ఈ ప్రాసల బట్టి చెప్పలేం.
కదిలే కాలానికీ, కదలక మెదిలే యెద యేటికి మధ్య సంఘర్షణలా, సంవేదనలా సాగింది ఈ కథ!
గట్టు మీద చెట్టుకీ, ఒడ్డునొరుసుకుంటూ ప్రవహించే నదికీ మధ్య ఎన్నేసి మాటలు జరిగాయీ! అనే విస్మయమూ కలిగింది. ఆత్రేయ గారన్నట్టు “ఎద మీద ఎద పెట్టి సొదలన్నీ వినుకుంటే…” ఇలాటి కథా సుధలెన్నో కురుస్తాయేమో!!
“సౌపర్ణిక నాకు చలనాన్ని చూపిస్తుంది! నేను ఆమెకు స్థిరత్వాన్ని విశదీకరిస్తాను!” — ఒకరి అనుభవం మరొకరికి జ్ఞాన బోధన కావడమే ఈ వాక్యానికి భాష్యం! అదే ఈ కథ లోని వేదసారం కూడా!
శ్రీ మోహన: అర సున్నాను పట్టుకుని సుమతీ శతక కర్త జాతకం చెప్పిన మీకు జోహారులు. కానీ మేక లో ‘మే’ కీ ‘క’ కీ మధ్య లో ఉన్న అరసున్నా మేక మెడ మీద కత్తిలాగా కనిపించింది.
చంద్రుణ్ణి చూపించే వేలు గురించి Tulasimohan అభిప్రాయం:
03/25/2013 4:45 pm
ఈ వ్యాసం తేలిగ్గా అర్ధమవుతూనే, ఎన్నో లోతైన హైకూ నిజాలు తెలుపుతుంది. చాలా బాగుంది.
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి మోహన అభిప్రాయం:
03/24/2013 6:50 pm
(1) అర్ధబిందు ప్రాసను గురించి చర్చించునపుడు ఒక విషయము గుర్తుంచుకోవాలి. చీకటివంటి పదాలకు నన్నయ, తిక్కనల కాలములో క అక్షరానికి ముందు అరసున్న లేదు, తరువాతి కాలములో చేర్చబడినది. నన్నయభట్టు మాత్రమే సార్ధబిందుప్రాసను తప్పకుండ అనుసరించినాడని విజ్ఞుల అభిప్రాయము. తిక్కన కాలానికి ఇది కొద్దిగా సడలినది. ర,ఱలు ఉండే పదాలవలెనే అర్ధబిందువులు ఉండే పదాలలో కూడ నియమాలు తగ్గినాయి. ట, ప లకు ముందు అరసున్న ఉండే పదాలకు అలా లేని పదాలతో ప్రాస చెల్లుతుందని అనంతుని ఛందములో (ఛందోదర్పణములో) నున్నది. అట్టి పద్యమును సుమతిశతకమునుండి నేను ఉదహరించినాను. ఈ కారణములన వలననే నేను శతక రచయిత తప్పక నన్నయ నన్నెచోడుల తరువాతి వాడని తెలిపాను.
(2) తిక్కనకు 50 సంవత్సరాలు అటో యిటో అనడానికి మరొక కారణము. సుమతిశతకమును భీమకవి వ్రాసినాడాని అనుకొంటే ఈ భీమకవియే భీమనఛందము అని పిలువబడే కవిజనాశ్రయమును కూడ వ్రాసినాడని అనుకొంటే ఈ కవిజనాశ్రయ కాలమును మనము నిర్ణయించాలి. దీనిని నేను వివరముగా నా క్రౌంచపదము అనే వ్యాసములో వ్రాసియున్నాను. తెలుగులో ఉండే క్రౌంచపదము, మంగళమహాశ్రీ వృత్తపు లక్షణాలు నన్నెచోడుని కుమారసంభవపు ప్రభావము వలన వచ్చినవే. కాబట్టి భీమన కవిజనాశ్రయమును వ్రాసియుంటే అది నన్నయ, నన్నెచోడుల తరువాతనే, ముందు కాదు. ఇక పోతే ఎంత తరువాత అన్నది నన్నెచోడుని కాలమును బట్టి ఉంటుంది. నా ఊహలో నన్నెచోడుడు నన్నయ సమకాలికుడు, కాని చాలమంది అతడు నన్నయ తిక్కనల మధ్యకాలములో జీవించాడని అంటారు.
(3) ఇక్కడ మరొక చిక్కు ఏమనగా, సుమతిశతకములో పద్యాలు చాల తక్కువ, అందువలన మనకు తక్కువ దత్తాంశములతో ఎక్కువ ఫలితాలను ఆశించడము వీలు కాదు (ఉదా. నన్నయ వ్రాసిన రెండున్నర మహాభారత పర్వాలలో అరసున్న ప్రాస ఉండే పద్యాలు పదికంటె తక్కువ). నేను ఇక్కడ తెలిపినవి పూర్తిగా ఛందశ్శాస్త్రముపైన ఆధారపడిన నా ఊహలు మాత్రమే, మిగిలిన విషయాలపైన వ్రాయడానికి నాకు అర్హత లేదు.
విధేయుడు – మోహన
అడవిదారిలో గాలిపాట – పుస్తక పరిచయం గురించి మోహన అభిప్రాయం:
03/24/2013 3:58 pm
One can watch Carl Sagan’s cosmos TV serials on youtube.
Regards – J K Mohana Rao
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి K.V.S. Ramarao అభిప్రాయం:
03/24/2013 1:10 pm
సుమతిశతక కర్త కాలాన్ని గురించి మోహనరావు గారి ఆలోచన ఆలోచించదగింది. ఐతే, ఆయన వాడిన తర్కం వల్ల అతను నన్నయ, నన్నెచోడుడుల తర్వాతి వాడని చెప్పొచ్చు కాని తిక్కనకి తర్వాతివాడు కాడని చెప్పటం సాధ్యం కాదు కదా! అతను తిక్కన లాటి ప్రయోగాలు చేసినంతమాత్రాన తిక్కనకి సమకాలికుడు కాడు, తిక్కన తర్వాతి వాళ్లు ఇంకెవరూ అలాటి ప్రాసలు పాటించలేదని రుజువు చేస్తే తప్ప. కవిత్రయం ప్రయోగాల్ని ప్రమాణాలుగా తీసుకుని తర్వాతి వాళ్లు చాలామంది వాళ్లు ముగ్గురు చేసిన ప్రాసలన్నిట్నీ అనుసరించారని నేను విన్నది. అది నిజమైతే సుమతిశతకం తిక్కన గారి తర్వాత వచ్చిందని తప్ప ఎప్పుడు వచ్చిందో ఈ ప్రాసల బట్టి చెప్పలేం.
దోసిట్లో నక్షత్రాలు గురించి భాస్ బాపట్ల అభిప్రాయం:
03/24/2013 8:48 am
మూలా గారు లోకం మూలాలని ఆవిష్కరించారు.
మరియ గురించి భాస్ బాపట్ల అభిప్రాయం:
03/24/2013 8:37 am
ఇంద్రాణి గారి అభిప్రాయం తో ఏకీభవిస్తున్నాను
వేటూరి పాట గురించి Sowmya అభిప్రాయం:
03/24/2013 1:50 am
గసగసాల పొడి మార్కెట్లో ఇప్పుడు కూడా దొరుకుతూనే ఉంది…చాలా ఖరీదు కూడా భారతదేశంలోనైతే. మేము వేడి అన్నంలో కలుపుకు తినేవాళ్ళం 🙂
అడవిదారిలో గాలిపాట – పుస్తక పరిచయం గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
03/24/2013 1:09 am
మోహన గారూ! మీ సమీక్ష చాలా బాగుంది.
-అభినందనలు తెలియ చేసుకుంటూ..
నమస్సులతో..
-ఆర్.దమయంతి.
అర్జున గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:
03/24/2013 12:42 am
కదిలే కాలానికీ, కదలక మెదిలే యెద యేటికి మధ్య సంఘర్షణలా, సంవేదనలా సాగింది ఈ కథ!
గట్టు మీద చెట్టుకీ, ఒడ్డునొరుసుకుంటూ ప్రవహించే నదికీ మధ్య ఎన్నేసి మాటలు జరిగాయీ! అనే విస్మయమూ కలిగింది. ఆత్రేయ గారన్నట్టు “ఎద మీద ఎద పెట్టి సొదలన్నీ వినుకుంటే…” ఇలాటి కథా సుధలెన్నో కురుస్తాయేమో!!
“సౌపర్ణిక నాకు చలనాన్ని చూపిస్తుంది! నేను ఆమెకు స్థిరత్వాన్ని విశదీకరిస్తాను!” — ఒకరి అనుభవం మరొకరికి జ్ఞాన బోధన కావడమే ఈ వాక్యానికి భాష్యం! అదే ఈ కథ లోని వేదసారం కూడా!
జయప్రభ గారికి అభినందనలతో..
-ఆర్.దమయంతి.
తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి తః తః అభిప్రాయం:
03/23/2013 1:44 pm

తః తః