పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. అమ్మ గురించి vijayamadhavi from guntur అభిప్రాయం:

    04/21/2013 2:43 pm

    మంజు గారు
    మీ కవిత నా మనస్సు ను కదిలించింది కరిగించింది
    ఈ జగతి లో అమ్మకు సాటి ఏదీ లేదనిపించింది

  2. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి Rao Vemuri అభిప్రాయం:

    04/20/2013 11:35 am

    ఇక్కడ జరుగుతూన్న చర్చ ఆసక్తి కరంగానే ఉంటోంది కాని నావంటి అర్భకులకి భాష అర్థం అవటం లేదు. ఉదాహరణకి “ఉపస్కారకం” అన్న మాట నా దగ్గర ఉన్న ఏ నిఘంటువులోను కనిపించలేదు. చదివి నేర్చుకోవాలనే ఆసక్తి ఒక పక్క, అర్థం చేసుకోలేకపోవడం అనే అశక్తత మరొక పక్క లాగుతున్నాయి.

    విధేయుడు, నమస్కారములతో – వేమూరి వేంకటేశ్వరరావు.

  3. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి తః తః అభిప్రాయం:

    04/20/2013 6:19 am

    లోకవ్యవహారము, రచన అన్న రెండు సంస్కారాలున్న యే భాషకైనా ఈ తప్పొప్పుల పరిస్థితి తప్పదు. ఈ సందర్భంలో “A living language has a vital illogicity about it …” అంటూ ఆచార్య కలివె విశ్వనాథం రాసిన వ్యాసం, Correct usage superstition, చదవదగ్గది. (భవదీయుడు ఉట్టంకించిన శ్లోకం చాలా అందమైనది. వారికి అభివాదాలు)

    [Correct usage superstition pp 583-596. Essays in criticism and comparative poetics. Andhra University Press, 1977 – Literary Criticism – 714 pages]

    ***

    “అధ్వర్యు” శబ్దం మీద భావార్థకమైన “అణ్” ప్రత్యయం వచ్చి “ఆధ్వర్యవమ్”, తెలుగులో “ఆధ్వర్యవము” అవుతాయి”

    కోపం తెచ్చుకోకండి. ఇందులొ ‘తెలుగు’ అవటానికి అక్కడ యేం ఉందని. మడి నీళ్ళు జల్లి తాకి ఇంట్లోకి తెచ్చుకున్నట్టుగా ఒక ‘ము’ తగిలించాం (‘కోడి స్టవ్వు మీద కుక్కయిపొయిందని’ ఒక చోట తః తః రాసి నట్టు)

    నమస్కారాలతో
    తః తః

  4. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి భవదీయుడు అభిప్రాయం:

    04/19/2013 6:38 am

    మాన్యులు శ్రీ రాళ్ళపల్లి సుందరం గారికి నమస్కారములు. సౌజన్యపూర్ణపూర్ణమైన మీ స్పందనకు ధన్యవాదాలు.

    ఈ చర్చను ముగించేముందు మీరు ప్రస్తావించిన రెండు మూడు విషయాలను వివరించాలనిపించింది.

    1. “సంస్కృతపదేన పరిమిత మాన్ధ్రపదం కర్మధారయో భవతి” అన్న ఆంధ్రశబ్దచింతామణి నిర్వచనాన్ని పురస్కరించికొని వ్యాకర్తలు “వాడి+మయూఖములు, వేడి+పయోధారలు (?)” వలె వికృతిపదం ఆఱక్షరాల వఱకు పరిమితి గల సంస్కృతపదంతో సమసించి కర్మధారయసమాసం అవుతుందని పేర్కొన్నారు. అయితే, వికృతివివేక అహోబలపండితీయాదులు ఆ సూత్రపరిధిని విస్తరించి “కలికిభుజంగకన్యకలు”, “వేల్పువీరభటవర్గము”, కఱకుదర్భపూరిపఱపులు” వంటి ప్రయోగాలను వ్యవస్థీకరించారు. అవి విరళంగా ప్రయోగింపదగినవే అని సూత్రీకరించారు. నిజానికి కేతనకు ముందే తిక్కనగారు “వేయుమున్నూరుదంతావళములు” వంటివి ప్రయోగించిన సంగతిని కేతన గమనించినట్లు లేదు. కేతన నియమనాన్ని ఆయనకు తర్వాతి వ్యాకర్తలు అంగీకరింపలేదు. తదనుసారం కవులు అవిరళంగా ప్రయోగించుకొన్నారు.

    2. “ప్రౌఢవ్యాకర్త వ్యవహారంలో ఉన్న మరికొన్ని పదాలను సూత్రీకరించాడు. అంతమాత్రం చేత అన్ని చోట్లా అలాగే చెయ్యాలని సిద్ధాంతం కాదు.” అన్నప్పటి మీ భావం నాకు స్పష్టంగా బోధపడలేదు. మీ వాక్యం రామరావు, సుబ్బరావు మొదలైన రూపాలు ప్రామాణికాలని, రామారాయాదులు పరిమితంగా ప్రయోక్తవ్యాలని నిర్ణయించటానికి ఉపకరింపదు.

    3. మతి సుమతి ఒకటే అని నేననలేదు. దీర్ఘాంతమైన మతి శబ్దం వైదికం ఒకటున్నదని, అది సుమతీ అన్న రూపసాధనకు ఉపస్కారకం కాగలదని సూచించాను. “సుమతి స్త్రీలింగం ఉన్నా సుమతి శతకంలో అది పుల్లింగమే.” అన్న మీ నిర్వచన నాకు బోధపడలేదు. “కుమార శతకం” మగపిల్లలను, “కుమారీ శతకం” ఆడపిల్లలను సంబోధించినట్లు “సుమతి శతకం” “పుల్లింగ”మే అయితే, పురుషులను మాత్రమే సంబోధించే శతకం అవుతుంది. తెలుగులో హ్రస్వాంతమైన “సుమతి” ఉభయలింగార్థకం కనుక “సుమతీ” అన్న సంబోధన వల్ల స్త్రీపురుషులు ఇరువురికీ సమానంగా శ్రోతృత్వం సిద్ధిస్తుంది. ఆ ఉభయలింగసాధన వల్లనే దీర్ఘాంతత్వం లోకంలో రూఢమయింది.

    4. “కృష్ణా అని సంబోధన ఉన్నా కృష్ణాశతకం అనం.” అన్న వాక్యానికి ఇంతకు మునుపే సమాధానం చెప్పాను. శ్రీకృష్ణుని సంబోధించిన రచనమయితే, దానిని “కృష్ణ శతకం” అంటారు. ఏ ద్రౌపదినో ఉద్దేశించి వ్రాస్తే “కృష్ణా శతకం” అనే అంటారు.

    5. “ఆధ్యక్ష్యం , ఆధ్వర్యవం లాంటి పదాలను గురించి దొరసామి శర్మ గారు, దొణప్ప గారు, తిరుమల రామచంద్ర గారు, రవ్వా శ్రీహరి గారు, శలాక వారు చెప్పినవి, రాసినవి చూచి నేను పొరపాటు పడ్డాను.” అని మీరు వ్రాశారు. “అధ్యక్షత” విషయంలో అసలు పొరబడటానికి, అందులో సందేహానికి అవకాశమే లేదు. “ఆధ్వర్యవము” అన్న రూపాన్ని వారు అభిమానించి తమ రచనలలో వాడుకొని ఉండవచ్చును కాని “ఆధ్వర్యము” అపప్రయోగం అని చెప్పి ఉండరు. “అధ్వర్యు” శబ్దం మీద భావార్థకమైన “అణ్” ప్రత్యయం వచ్చి “ఆధ్వర్యవమ్”, తెలుగులో “ఆధ్వర్యవము” అవుతాయి. “అధ్వరే సాధుః” అన్న అర్థంలో “తత్ర సాధుః” అన్న సూత్రం మూలాన “యత్” ప్రత్యయం వచ్చి “అధ్వర్య” అన్న రూపమూ; దానిమీద భావార్థంలో “తస్యేదమ్” అన్న సూత్రం వల్ల “అణ్” ప్రత్యయం విహితమై “ఆధ్వర్యం” రూపొందుతాయి. రెండు ప్రయోగాలూ సమంజసాలే.

    6. “సుమతి శతకం”, “సుమతీ శతకం” రెండూ వాడుకోవచ్చునని నా ఉద్దేశం. “నేను భక్తచింతామణిని రచియించితిని” అని వడ్డాది సుబ్బారాయ కవిగారు (సుబ్బరాయ కవి కాదు!) వ్రాయగా, వారే అచ్చువేయించిన పునర్ముద్రణ పీఠికలో ముద్రాపకులు లోకప్రసిద్ధిని బట్టి “సుబ్బారాయకవిగారు రచించిన భక్తచింతామణీ శతకము” అనే వ్రాశారు. లోకం భక్తచింతామణీ శతకం అనే అంటున్నది. మడిగట్టుకొన్న పండితులెవరో ఒకరిద్దరు మాట్లాడేటప్పుడు కూడా “భక్తచింతామణి శతకం”, “సుమతి శతకం” అంటారేమో కాని నా వంటి సామాన్యులు మాత్రం భక్తచింతామణీ శతకం, సుమతీ శతకం అనే అంటారు. సామాన్య ముద్రాపకులు అనేకపర్యాయాలు బులుసు వెంకటరమణయ్య గారి వంటి పండితులు వ్రాసిన వ్యాఖ్యానాలతోనూ సుమతీ శతకం అనే అచ్చువేశారు.

    అందుకే, కవిశిరోభూషణం

    ప్రకృత్యుక్తప్రకారేణ రచనా రసరంజనీ
    భవేదత్రాపి శబ్దస్య క్వచిద్యోగేన సాధుతా
    భవేత్క్వచిదయోగేన క్వచిత్తు వచనశ్రుతేః
    తత్తత్పదం పరిగ్రాహ్యం యద్యత్ సహృదయేహితమ్”

    అన్నది. “సహృదయ ఈహితమ్” అన్నదే వ్యాకర్తల ఉద్దేశం!

    లేఖ సుదీర్ఘమైనందుకు మన్నించండి. సుమతి (తీ) శతకకారుడు అన్నట్లు “పగ వలవదెవరితోడను” అన్నదే ఈ చర్చకూ మహావాక్యం.

    “ఈమాట” కుటుంబానికి, మీ ఇంటిల్లిపాదికి శ్రీరామ నవమి శుభాకాంక్షలు!

  5. పాఠకులకు సూచనలు గురించి chudamani అభిప్రాయం:

    04/18/2013 8:52 am

    అరుదైన పాటల గురించిన సమాచారం అందిస్తున్నందుకు చాలా కృతజ్ఞతలు. ఇంకా చిత్తరంజన్, శ్రీరంగం గోపాలరత్నం వంటివారి పాటలు అందిస్తారని ఆశిస్తున్నా.

    చూడామణి.

  6. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి Rallapalli Sundaram అభిప్రాయం:

    04/18/2013 8:12 am

    1. కేతన ఆంధ్రభాషాభూషణములో వాడిమయూఖములు, వేడిపయోధారలు లాంటివి చెల్లుబాటవుతాయని చెప్పినా అలాంటివి సుకవీంద్రుల ప్రయోగాలు కాబట్టి చెల్లుతాయన్నాడు. ఇలాంటివి ఒక్కొక చోట మాత్రం చెయ్యాలని కూడా చెప్పాడు.

    2. ప్రౌఢవ్యాకర్త వ్యవహారంలో ఉన్న మరికొన్ని పదాలను సూత్రీకరించాడు. అంతమాత్రం చేత అన్ని చోట్లా అలాగే చెయ్యాలని సిద్ధాంతం కాదు.

    3. మతిని, సుమతిని ఒకటే అనటం భావ్యం కాదు. సుమతి స్త్రీలింగం ఉన్నా సుమతి శతకంలో అది పుల్లింగమే. సంబోధనను బట్టి పుస్తకాల పేర్లు రావు. కృష్ణా అని సంబోధన ఉన్నా కృష్ణాశతకం అనం. దీన్ని మరీ లాగిలాగి పక్కదోవ పట్టటం నాకూ ఇష్టం లేదు.

    రాళ్ళపల్లి సుందరం

  7. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి Rallapalli Sundaram అభిప్రాయం:

    04/17/2013 9:10 pm

    నాకు తెలియని ఎన్నో విషయాలు చెప్పినందుకు భవదీయుడుగారికి ధన్యవాదాలు. వాడిమయూఖముల్ తప్పయినా దేవయాని చెప్పిన సందర్భాన్ని బట్టి సమర్థించవచ్చునని పండితులు రాశారు. సుమతి శతకం, ఆధ్యక్ష్యం , ఆధ్వర్యవం లాంటి పదాలను గురించి దొరసామి శర్మ గారు, దోణప్ప గారు, తిరుమల రామచంద్ర గారు, రవ్వా శ్రీహరి గారు, శలాక వారు చెప్పినవి, రాసినవి చూచి నేను పొరపాటు పడ్డాను. నాదే పొరపాటు కావచ్చు. నేనూ నేర్చుకోవలసింది చాలా ఉంది.

    రాళ్ళపల్లి సుందరం

  8. పాలగుమ్మి విశ్వనాథం (1919-2012) – లలిత సంగీత నివాళి గురించి chudamani అభిప్రాయం:

    04/17/2013 8:15 am

    విశ్వనాధంగారి గురించి శ్రీ చిత్తరంజన్ గారు రెండు రోజులపాటు ఆకాశవాణిలో రూపకం ఇచ్చారు. వాటిలో ఎన్నో మంచి పాటలు వినగలిగాము.

    మీరు తరువాత ఎప్పుడైనా శ్రీ చిత్తరంజన్ గారి పాటలను కూడా అందిస్తారని ఆశిస్తున్నాను.

    నమస్కారం.
    చూడామణి.

  9. పాలగుమ్మి విశ్వనాథం (1919-2012) – లలిత సంగీత నివాళి గురించి chudamani అభిప్రాయం:

    04/17/2013 8:06 am

    శ్రీనివాస్ గారికి,
    మీ సమాధానానికి చాలా కృతజ్ఞతలు. మా అమ్మ పాడినిది కాబట్టి (మా అమ్మ వయసు ఇప్పుడు 83), బహుశా కాంచనమాల పాటేనేమో. మా అమ్మ బాగా పాడేది కాబట్టి, కాంచనమాల పాట అయినా నాకు బాగుండేది అనుకుంటా. నేను కూడా ఏదైనా వెబ్ సైట్లో దొరుకుతుందేమో చూస్తాను. దొరకకపోతే మళ్ళీ మిమ్మలనే అడుగుతా.

    ఏది ఏమైనా, మంచి మంచి పాత పాటలను అందిస్తున్నందుకు మిమ్ములను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా.

    నమస్కారాలతో,
    చూడామణి.

  10. పాలగుమ్మి విశ్వనాథం (1919-2012) – లలిత సంగీత నివాళి గురించి Sreenivas Paruchuri అభిప్రాయం:

    04/16/2013 5:58 pm

    జయప్రభగారు: “రాలలోపల” పాడిన గాయని: శాంత రంగాచారి; చిత్తరంజన్ గారి సోదరి. మీరన్నట్లు మరో వెర్షన్ కూడా ఉండవచ్చు. చాలా లలితగీతాలకు 2-3-4 వెర్షన్లు ఉన్నాయి. ఉదాహరణకు “భూధరమో సాగరమో” అన్న పాట బాలమురళిగారి గళంలో బాగా ప్రాచుర్యం పొందినా, చిత్తరంజన్ గారి వెర్షన్ కూడా ఉంది. అలాగే “వచ్చెనోయి వసంతము”, “అమ్మ దొంగా నిన్ను” లాంటి పాటలు..

    చూడామణిగారు: “ఏది ఏది నీ దయా వీక్షణం” అన్న పాట గురించి మీరింతకుముందు ఒకసారి అడిగారు. నాకు ఆపాట విన్న జ్ఞాపకం లేదు. దొరుకుతుందేమో ప్రయత్నిస్తాను. మీరడిగిన రెండవ పాట: “దినదినము పాపన్ని దీవించి పొండి, దేవలోకములోన దేవతల్లారా” అన్నది బసవరాజు అప్పారావుగారి రచన: బాగా ప్రాముఖ్యం పొందిన పాట, “ఇల్లాలు” (1940) అన్న సినిమాలో కాంచనమాల పాడిన (సంగీతం: సాలూరి) పాట రికార్డు దొరుకుతుంది. కాంచనమాలది గొప్ప పాడే గొంతుక కాదు. ఆ రికార్డయితే వెంటనే ఇవ్వగలను. కొన్ని వెబ్సైట్లలో కూడా కాంచనమాల పాట దొరుకుతుందనుకుంటాను.

    శ్రీనివాస్