పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి Vadapalli SeshaTalpaSayee అభిప్రాయం:

    04/29/2013 2:19 pm

    Essays in criticism and comparative poeticsDLIలో ఉంది.

    నమస్సులతో,
    శేషతల్పశాయి.

  2. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి తః తః అభిప్రాయం:

    04/28/2013 2:48 pm

    1. Essays in criticism and comparative poetics. ఈ పుస్తకం The Divine Commedia, Katharsis and Rasa, Tragedy and Samskrit Dramma, The Cocktail Party and Poetic Drama, Metaphor and Modernity in Metaphor వంటి సాహిత్యాంశాల మీద ప్రొ. విశ్వనాథం వ్యాసాల సంకలనం. కొంతమంది పాఠకులకైనా ఆసక్తికరంగా ఉండవచ్చు.
    తః తః

  3. గాలి మళ్ళింది గురించి N.VENKATESWARARAO అభిప్రాయం:

    04/28/2013 12:11 pm

    ఆంతరార్ధం ఒకింత అర్ధం కాలేదు కొంచెం వివరించి చెప్పరూ? కానీ ఏదో భావ సారుప్యత కనబడుతోంది.

  4. తెలుగులో మొదటి నీతి పుస్తకం: సుమతి శతకం గురించి Rallapalli Sundaram అభిప్రాయం:

    04/28/2013 10:26 am

    సుమతి శతకం కాలాన్ని గురించి, రచయితను గురించి, అందులోని సమాజాన్ని గురించి ఇంకా పరిశోధన జరగాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎక్కువగా ఊహలే ఆధారంగా ఉన్నాయి.

    నా అభిప్రాయాలు ఇవి:
    1. పుస్తకాల పేర్లు సంబోధనను బట్టి. రావు. రచయితనిబట్టి, ఉద్దేశించిన వారినిబట్టి (అది ఆత్మసంబోధన కావచ్చు) వస్తాయి.

    2. సుమతి శతకం భీమనదీ కాదు, బద్దెనదీ కాదు, సుమతి అనే జైన మునిది (నా అభిప్రాయం) అందువల్ల అది సుమతి శతకమే.

    3. నాకు సంస్కృత సాహిత్య పరిచయం ఉంది కాని త: త: గారికున్నంత వ్యాకరణ పాండిత్యం లేదు. అందువల్ల. ఆ విషయాలను పొడిగించను.

    4. నన్నెచోడుడు ఆధునికుడనేది అబద్ధం. మానవల్లి వారే రాశారన్నది దురుద్దేశపూరితమైన ఆపాదన. మానవల్లికంటే ముందే కందుకూరివారు తంజావూరులో ఆ ప్రతిని చూశారు. తెలుగు వారికి 9వ శతాబ్దం లోనే పంప ప్రబంధం రాశాడని తెలీక నన్నెచోడుణ్ణి తర్వాతి కాలానికి నెట్టివేశారు. నేలటూరి వెంకటరమణయ్య గారిలాంటి గొప్ప చరిత్రకారులే నన్నెచోడుడు 10వ శతాబ్దివాడన్నారు. నాదీ అదే అభిప్రాయం.

    నా అభిప్రాయాలతో అందరూ ఏకీభవించాలని నా ఉద్దేశం కాదు.
    రాళ్ళపల్లి సుందరం

  5. అర్జున గురించి N.VENKATESWARARAO అభిప్రాయం:

    04/26/2013 9:08 pm

    జయప్రభ గారికి:

    ఆభిప్రాయాల మాటున మాటల యుద్దాలు జరిగేయి, మీకు ప్రసాద్ గారికి మద్య. అంత అవసరమా? ప్రకృతి ఆందాలలో లీనమయ్యేటపుడు మనలో కలిగే భావసంఘర్షణకి మంచి రూపం ఇచ్చారు మీరు. వాటికి వక్ర భాష్యాలు అనవసరం. అన్ని పేజీల మాటల యుద్దాలు అనవసరం. చెట్టుకి, నదికి ప్రకృతి ఒడిలో సేదదీరే వన్య ప్రాణుల, ప్రేమికుల భావ జాలాన్ని మీదైన బాణిలో చక్కగా చెప్పారు. బాగుంది. దానికి తర్క వితర్కాలు అనవసరం. మీ రచన నాకు నచ్చింది.

  6. మరియ గురించి N.Venkateswararao అభిప్రాయం:

    04/26/2013 8:20 am

    కధా రచయితకి ధన్యవాదాలు కధ చదువుతున్నప్పుడు నిజంగా సమాజంలో అందరిలాగే నాకూ అనిపించింది కాని చివరికి వచ్చే టప్పటికి కళ్ళవెంట నీళ్ళు తిరిగాయి. పల్లెల్లో ఎన్నో కుటుంబాల చరిత్రలు ఈ రీతి గానె వుంటాయి. కుటుంబం గడవని స్థితి, తల్లి తండ్రి ఎవరి దారి వారిది అన్నట్టు పిల్లల్ని గాలికి వదిలేయడం సర్వ సాధారణం. అన్ని కళ్ళకు కట్టినట్టు చూపించారు రచయిత. జోహార్.

  7. కొత్త మలుపు గురించి ramaa devi అభిప్రాయం:

    04/26/2013 7:20 am

    కధ రంగనాయకమ్మ గారి స్టైల్లో వుంది అన్నాను అంటే చిన్న కారణానికి కూడా బయటికి వచ్చేసి స్వతంత్రంగా బతకండీ అని మొన్నీమధ్యే వొక “కళ్ళూ తెరిచిన సీత” అని వొక నిజంగా జరిగేలా చేసిన వొక ఎక్స్పీరియన్స్ మీద ఆంధ్రజ్యోతి లో సీరియల్ వచ్చింది. బోలెడంత మంది అమ్మయిలు మాకు సీత(ఆ సీరియల్లో సీత) ఆదర్శం అన్నట్లు వుత్తరాలు కూడా రాశారు. ఇక్కడ కొత్త మలుపు అని పేరుకి మూలం అయిన సరోజ కొడుకుతో వెళ్ళిపోవడం సీత వెళ్ళి పోవడం లాగా వుంది అని ప్రస్తావించాను. కాని ఈ కధలో సరోజకి కనీసం సీత పాత్ర చేసినంత ఆలోచన కూడా చేసినట్లు అనిపించదు. పైగా మూర్తితో సరోజకి సీతకి భర్త మీద వున్న లాంటి అసంతృప్తి కూడా వున్నట్లు అనిపించదు. మరి అంత విప్లవాత్మకంగా, వెళ్ళిపొయేలా ఆ పాత్ర చిత్రణ జరగలేదు. కవన శర్మ గారు “ఆమె ఇల్లు” అని వొక కధ రాశారు. దాన్లో భార్య రిటైర్ అయ్యాక స్వంత ఇల్లు కొనుక్కుని వెళ్ళి పోతుంది. అప్పుడు ఆమె జవాబులో మనకి కొన్ని సంవత్సరాలుగా ఆమె అనుభవించిన వేదన సంఘర్షణ, ఆయనకి తెలియకుండా ఎంతగా గాయపరిచాడో. (అంటే ఈ కధలో మూర్తి లానే వొక మూస ధోరణి భర్తల స్వభావం, అహంభావం… దాన్ని బోలెడంత మంది ఈ సమాజంలో సమర్ధించేవాళ్ళున్నారు; నేను మూర్తి లేక ఆమె ఇల్లులో భర్తలని సమర్ధించట్లేదు; కాని అలాంటి స్వభావం ఇంకా బోలెడంత మంది అబ్బాయిల్లొ, భర్తల్లొ, కొడుకుల్లో కనిపిస్తుంది. అది “వో.కే అని ఎంత మంది అనుకుంటున్నారొ చూస్తుంటే ఆశ్చర్యంగా అసహనంగా అనిపిస్తుంది.) సమాజంలో బోలెడు భర్తలు వులిక్కిపడి తమని తాము చూసుకునేలా రాశారు.

    రమాదేవి

  8. కొత్త మలుపు గురించి ramaa devi అభిప్రాయం:

    04/26/2013 6:35 am

    కధ కొంచెం రంగనాయకమ్మ గారి స్టైల్ లో వుంది. అమ్మానాన్నల మధ్య భార్య భర్తలుగా వున్న సంబంధం సరిగ్గ తెలియట్లేదు. భర్త ఈ వొక్క సారి మాత్రమే అమ్మ చెల్లిని పిలిపించాడా ఇలా ఇంతకు ముందు కూడా చేశాడా? సామాన్యంగా భర్త భార్యలలో వొకళ్ళు తన వారిని పిలిపించుకుంటే సంప్రదిస్తే రెండో వాళ్ళు ముందు లేక పోయినా అప్పుడు పిలుచుకుంటారు. ఇది సామాన్యంగా కనిపించేది జరిగేది ఎందుకంటే బయటి వాళ్ళకి ఎప్పుడు తమ అబ్బాయి అమ్మయినే సమర్ధించాలనుకుంటారు. అలా అనుకుంటారనే ధైర్యంతోనే మోరల్ సపొర్ట్ కోసం బయటి వాళ్ళని రప్పించుకుంటారు లేక పోతే సరోజ వెలిబుచ్చినట్లు తమ ముగ్గురు తేల్చుకోవాలనే అనుకోవాలి.

    కొంచెం పోపులర్ కధల ధొరణి కనిపిస్తుంది. అంటే బొమ్మరిల్లులో సిద్దు లాంటి పాత్ర, హాపీడేస్ సినిమా లాగా అన్న మాట. సరొజ అత్త గారిని ఆడపడుచు గురించి “కట్టెలను ఎగదోసి నిప్పును ఇంకాస్త రాజుకునేటట్లు చేశారు” అని అనుకున్నట్లు మరి తను చేసింది ఏమిటి? భర్త నాకు ఇష్టం లేదు అన్నప్పుడు తను కొడుకు కనీసం కొన్ని రోజులు తండ్రి ఈగొ తగ్గి మనసు మారుతుందేమో అని ఎందుకు చూడలేదు? ఎలాగు ఆ కొడుకు అప్పుడే చెప్పాలనుకోలేదు అంటే అంత తక్కువ వ్యవధిలో చేసుకోవాల్సిన అగత్యం ఏమి కనిపించట్లేదు. కభి ఖుషి కభి గం అని వొక సినిమాలొ ఇలానే చూపించారు. కనీసం అక్కడ వొక తప్పనిసరి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ అలా ఏమీ కనిపించట్లేదు. ఆ భార్య అలా వెళ్ళి పోవాలనుకుంత క్రూరుడా ఆ భర్త? అలా కాని పక్షంలో భార్య భర్త సంభంధం అంత తొందరగా తెంచుకోవాల్సినంత చిన్న విషయం కాదు, తెంచుకోగలిగేంతదీ కాదు. అందుకే ఇది వొక పాపులర్ కధలా వుంది అన్నది వాస్తవికంగా లేదు.

    ప్రసాద్ గారు అన్ని కధల లోనూ కొంచెం ఎక్కువ ఆవేశపడుతున్నారేమో.

    “సంవత్సరం పైగా ప్రేమించినవాడికి ఇంట్లో ముందుగా చెప్పాలన్న సంస్కారం ఉండదు.” ఇక్కడ “సంస్కారం” పదం పక్కన పెడితే నిజంగానే కనీసం చూచాయగానయినా తన అభిప్రాయం వ్యక్తం చేసాడా? అసలు సామాన్యంగా ముందే కొంచెం తమషాకి అన్నట్లు ఇలాంటి విషాయాలు చర్చకి వస్తాయి. వాటిల్లొంచి వీడు ఇలా చేసేవాడే, అలా చేస్తాడని అస్సలు అనుకోలేదు, ఇలా అభిప్రాయ పడుతుంటాము. అలాటిది ఆ ఇంట్లో ఎప్పుడు జరగలేదా? కనీసం తల్లి తండ్రి ఇష్టాలు అభిప్రాయాలు ముందే అంచనా వుంటుంది కదా. అందుకయినా కొంచం సూచించచ్చు కదా? ఈ రోజుల్లొ కూడా గౌరవం కులం అంటూ మనుషుల్ని చంపేసే ఆచారాలు, వాటికి వొప్పుదలలు ఇచ్చే చుట్టు పక్కల మనుషులు వున్న నేపధ్యం లో స్నేహంగా ఇష్టంగా పంచుకోక పోయినా ఎక్కడే కొంచెం సూచనగా అయినా చెప్పాలి. లేదా అది మోసం కింద వస్తుంది. ప్రసాద్ గారికి ఇంకో కధలో తల్లి మీద తండ్రి మీద బాధ్యతా రాహిత్యంతో ప్రవర్తించినవాళ్ళ మీద చాలా కఠినంగా “జాలి చూపించక్కర్లేదు” అన్నారు. మరి ఇక్కడ కొడుకుని సమర్ధిస్తున్నారు? నిజానికి కొంచెం ఇష్టం కొంచెం కష్టంలో లాగా ఇద్దరు రెండు వైపుల వాళ్ళని వొప్పించటానికి కనీసపు ప్రయత్నం చెయ్యకపొవడం చెయ్యాలి అనుకోక పోవడం, మనం అలౌ చేస్తున్న సామాజిక రుగ్మత.

    అసలు అలా అబ్బాయి కాని అమ్మాయి కాని ప్రయత్నించాలి అనుకోకపోతే వాళ్ళ ప్రేమ అసలు శంకించాల్సిన విషయం. ఈ రోజు అమ్మ నాన్న లతొ జరిగింది రేపు వాళ్ళ విషయంలో జరగదని గారంటీ ఏమిటి? సంప్రదాయంగా ఎందుకు పెళ్ళి చేసుకోవాలనుకున్నాడు? సంప్రదాయానికి విలువిచ్చాడు కాబట్టి. మరి అలాంటి మనస్తత్వం వున్నవాడు తండ్రితో అలా ఎలా మాట్లాడ గలిగాడు? తండ్రికి కొడుకుకి తేడా ఏమిటి? అలాటప్పుడు తల్లి కొడుకుని ఎందుకు సమర్ధించాలి? ఇది ఈ రోజు అన్ని సినిమాల్లోను కధల్లొను చూపించేస్తున్నారు + ఇది “తల్లి అంటే ఇలా కొడుకునే సమర్ధించాలి” అనే వొక తప్పు ఆలోచనని మనుషుల్లో పెరిగేలా చేస్తొంది. నాలాంటి సామాన్యురాలికే కళ్ళు మనసు తెరుచుకుంటే ఈ ద్వంద ప్రవృత్తి అర్ధం అయిపోతూ వుంటుంది. అసలు చాలా సార్లు ఇద్దరికీ ఇష్టం వుండదు కాని అలా జరగడానికి కారణం నువ్వంటే నువ్వు అని ఇద్దరు ఇద్దరిని దూషించుకోని పోట్లాడుకుంటరు.

    కధ పాజిటివ్ గా కనిపిస్తున్న, అసంబద్ధం అయిన పాపులర్ కధ. ముందు చెప్పినట్లు హాపీడేస్ సినిమా లాంటి తప్పు ఆలోచనలని చొచ్చుకుపోయేలా ఆకర్షణీయంగా చెప్పిన కధ. ప్రసాద్ గారి పేద్ద అభిప్రాయం చదివాక నాలాంటి వాళ్ళు వొక్కళ్ళయినా చెప్పకపోతే అదేదో కొంచెం అటు ఇటూ వున్న వాళ్ళని తప్పు మార్గంలోకి వెళ్ళేలా చేస్తుందేమో అని ఇంత రాయడం జరిగింది. కోక్, పెప్సి పిజ్జా లాగా కొబ్బరి నీళ్ళు ఆకర్షణీయంగా నోటికి రుచిగా అనిపించక పోవచ్చు, పెద్ద పెద్ద సినిమా స్టార్లూ క్రికెట్ ఆటగాళ్ళు తాగండీ/నా సీక్రెట్ అంటూ అబద్దపు ఎండొర్స్మెంట్లు లేక పోవచ్చు. కానీ అది వొక మార్పుకి మొదలు పునాది లాంటి అసంగతమైన విషయాలని కాదు అని చెప్పకుండా వుండడం కూడా తప్పే అని…

  9. మరియ గురించి krkreddy అభిప్రాయం:

    04/25/2013 2:01 pm

    ఈ కథ చాలా బాగుంది. ఇక కొన్ని పదాలు ఆయా ప్రాంతాల బట్టి ఉన్నా విషయం అర్థం కావాలి కాని అవేమో పెద్ధ తప్పు కాదుగా. కథ నడిపిన తీరు చాల బాగుంది. నాకు కూడ ఈలాంటి student తగిలింది. ఆమెలో మార్పు వచ్చింది. కాని ఆమె సఫలీకృతం కావడంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్న సందర్భాలు ఉన్నా నాకు చివరికి happy అనిపించింది. చాలా thanks. ఇలానే మరిన్ని మంచి రచనలు అందించి తెలుగు వారికి ఎంతో ఆనందాన్ని ప్రాచుర్యాన్ని కలిగిస్తారని ఆశిస్తూ మీ కె.ఆర్.కె.రెడ్డి.

  10. పాఠకులకు సూచనలు గురించి N.VENKATESWARARAO అభిప్రాయం:

    04/24/2013 6:29 am

    ఈమాట (ఈ మాటే) చాలా ఆనందం కలిగిస్తొంది. తెలుగు పాఠకులకు ఒక చక్కని అవకాశం కలిగిస్తోంది ఈమాట. మీకు ధన్య వాదాలు.