పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. కతికితే అతకదు గురించి N.VENKATESWARARAO అభిప్రాయం:

    05/14/2013 8:10 pm

    శర్మ గారు: అతికే యోగం వుంటే ఎలాగైనా అతుకుతుంది. కతకడంలో ఏముంది? మీ కధ బాగుంది సరదాగా.

  2. పలుకుబడి – కాలమానము II గురించి మోహన అభిప్రాయం:

    05/14/2013 4:41 pm

    బావుంది వ్యాసము సురేశ్ గారు! పూర్వులు వ్రాసిన కొన్ని గ్రంథాలలో సూర్యోదయమును ఉదయము ఆఱు గంటలుగా (by default) తీసికొనవలెను అని అంటారు. తరువాతి కాలములో సూర్యోదయ కాలమును కచ్చితముగా తీసికొనవలెనని అంటారు. కొన్ని సమయాలలో దీని వ్యత్యాసము సుమారు ఒక అరగంట కాలము ఉంటుంది. సామన్యముగా ఇది సందిగ్ధతను కల్పించదు. కాని తేడా అరగంటకన్న తక్కువైతే ఇది సందిగ్ధతను కల్పించవచ్చును. బహుశా 1901లో ఇలాటి సందిగ్ధత వచ్చిందేమో? జాతకములు వ్రాసేటప్పుడు కూడ లగ్న నిర్ణయములో ఈ సూర్యోదయకాలము మనకు కొన్ని సందిగ్ధ లగ్నములకు దారి తీస్తుంది.

    మరో విషయము – కాల నిర్ణయము ఏ రేఖాంశము ద్వార నిర్ణయించారో అన్నది కూడ మనము తెలిసికోవాలి. ఇప్పుడు భారతదేశమునకంతటా ఒకే కాలమున్నను, ప్రతి చోటులో సూర్యోదయకాలము వేరు అనే సంగతిని మనము గుర్తులో నుంచుకోవాలి. కామరూపలో సూర్యుడు త్వరగా ఉదయిస్తే కచ్‌లో ఆలస్యముగా ఉదయిస్తాడు! అందుకే భారతదేశానికి రెండు time zones ఎంతైనా అవసరము, ఇది వేరే విషయము అనుకోండి. అధిక మాస నిర్ణయానికి ఈ శ్లోకమును ఉదహరిస్తారు – ద్వాత్రింశద్భిః గతైః మాసై దినై షోడశభిస్తథా ఘటికానాం చతుష్కేణ పతత్యధికమాసకః (33 నెలలు, 16 దినములు, నాలుగు ఘడియలకు ఒక మారు అధికమాసము వస్తుంది). అధికమాసమును పురుషోత్తమ మాసము, మల మాసము, మలిమ్లుచము అని కూడ పిలుస్తారు. మాసేషు ద్వాదశాదిత్యం తపంతే హి యథాక్రమం నపుంసకేஉధికే మాసి మండలం తపసే రవి (ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఆదిత్యుడు (12మంది సూర్యులలో ఒకడు) ఉదయిస్తాడు, కాని అధికమాసములో ఇలాటి సూర్యోదయము లేదు, కావున సూర్యమండలమే ఈ పనులను కొన సాగిస్తుంది).

    విధేయుడు – మోహన

  3. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    05/14/2013 3:35 pm

    ” జిక్కి, జమునారాణి, ఈశ్వరి, బెంగళూరు లతా, సుమిత్ర మున్నగువారు ప్రధాన నటులకు పాడలేకపోయారు. ఇప్పుడు కూడ ఈశ్వరి నాయకికి తరచుగా పాడి ఉంటే ఎలాగుండేదో అని నేను ఊహిస్తుంటాను. కనీసము వీరందరు చిత్రాలలో పాడారు. మంచి శారీరము ఉండి అవకాశము లేకుండా ఎందరు పాడలేకపోయారో అన్నది కూడ గమనార్హమే.” విధేయుడు – మోహన.

    బాగా చెప్పారు మోహన గారు! అప్పటి కాలంతో పోల్చి చూస్తే, ఇప్పుడు చాలా మార్పులే చోటు చేసుకున్నట్టు స్పష్టమౌతుంది. కొత్త కొత్త స్వరాలకి అవకాశమూ, టాలెంట్ కి తగిన సముచిత స్థానమూ దొరుకుతున్నట్టు తోస్తుంది నాకు. రొటీన్ గొంతుతో సంఖ్యాపరంగా ఏ సింగర్ ఎన్నేసి పాటలు పాడారన్న మాట పక్కనుంచితే, అరుదుగా అప్పుడప్పుడు మాత్రమే వినిపించిన కొన్ని స్వరాల ప్రత్యేకతలు రసజ్ఞుల మనసుల్లో అలాగే ముద్రించుకు పోయి వున్నాయి. ఎన్నేళ్ళైపోయినా, ఏ మాత్రం చెక్కుచెదరక, గాన శిల్పాల వోలే అలా నిలిచే వున్నాయి. అవి అలానే వుండి పోతాయి కూడా. ఆ గాత్రాలకు గానీ, ఆ గాయనీ గాయకులకు కానీ – అంతకు మించిన అవార్డ్స్ ఏం కావాలి. బిరుదులెవరివ్వాలీ? ఆలోచిస్తే – అవసరమే లేదు అనిపిస్తుంది!

    తెలుగులో ‘ఈ మూగ చూపేలా బావా మాటడగా నేరవా” – ఆ గాయనిని మర్చిపోగలమా? అలాగే, ఎల్.ఆర్.ఈశ్వరి గారి మధురమైన పాట ‘నీ సన్నిధే నా పెన్నిధి’ చాలా మెలోడియస్ గా వుంటుంది, వింటున్నప్పుడు. సుస్వర బాల సరస్వతి గారి ‘ఇంతా తెలిసి వుండీ ఈ గుణ మేలరా’ అలాగే కె.రాణి ‘ ఓ దేవదా’. బాక్ గ్రౌండ్ సాంగ్స్ లో కూడా ప్రత్యేక స్వరాలు – మనని వీడక నీడలా నడిచొచ్చే పాటల్లో ‘భళి భళి దేవా,’ ‘తల్లి గోదారికే ఆటుపోటుంటే తప్పుతుందా మడిసికీ తల రాత’.
    హిందీలో గీతా దత్ ‘వక్త్ నే కియా’ అలాగే హేమలత గారి – ‘ భీగా భీగా మౌసం ఆయా’ ఎంత గొప్పగా అనిపిస్తాయంటే — తెలీని మధుర విషాద వీధుల వెంట తిప్పుకు రావూ?

    ఏ ఫీల్డ్ చూసినా ఏముంది గర్వ కారణం. సమస్తమూ రాజకీయల పర్వం. రికమండేషన్ల మయం. గ్రూపిజాల పద్మ వ్యూహం. ఐతేనేం? సింగర్స్ – ఎవరికి ఎవరెన్ని పాడారన్నది రికార్డుల్లోకెళ్తే వెళ్ళు గాక, కానీ ఎవరు పాడిన పాట ఎన్ని గుండెలకెక్కిందన్నదే అసలైన వరల్డ్ రికార్డ్ అంటాను.

    ఇంతకీ, మీ మంచి మాటలకి ధన్య వాదాలు తెలియ చేసుకుంటూ
    నమస్సులతో
    ఆర్.దమయంతి.

  4. పలుకుబడి – కాలమానము II గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    05/14/2013 1:21 pm

    1901లో మన తెలుగు పంచాంగకర్తలకు “శ్రావణమాసం అధికమా? ఆషాఢమాసం అధికమా?” అన్న గొప్ప వివాదం ఏర్పడటమూ, చివఱికి రాజమండ్రిలో పండిత పరిషత్తు ఏర్పడి పరిష్కారాన్ని సూచింపవలసి రావటమూ, అది కోర్టుకు వెళ్ళటమూ – ఆ కథంతా మీరు వినే ఉంటారు.

    మురళీధరరావు గారు: నాకు నిజంగా 1901 వివాదం గురించి తెలియదు. అయితే, నా ఊహ ప్రకారం అధికమాస నిర్ణయంలో సందిగ్ధతకు కారణాలు ఈ కింది వాటిలో ఏదైనా కావచ్చు.

    1. ఉత్తర భారతంలో పౌర్ణమి నుండి పౌర్ణమి ముందురోజు దాకా ఒక చాంద్రమాసంగా పరిగణిస్తే, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహరాష్ట్రా, గుజరాతులలో అమావాస్య తరువాత రోజు నుండి అమావాస్య వరకూ ఒక మాసంగా లెక్కిస్తారు. దీని వల్ల అధిక మాసం వేర్వేరు మాసాల్లో వస్తాయి. (అయితే, 1901 వివాదానికి ఇది కారణం కాకపోవచ్చు).

    2. అధికమాస నిర్ణయానికి సూర్య సంక్రమణ కాలం, చాంద్రమాస కాలం కచ్చితంగా నిర్ణయించాలి. కొన్ని ఘడియల, విఘడియల తేడా వల్ల అధిక మాసం ఒక మాసం కాకుండా మరో మాసం అవుతుంది. ఒక్కో పంచాంగ కర్త ఈ కాలాలను ఒక్కో రకంగా కొద్దిపాటి తేడాతో లెక్కించవచ్చు (అక్షాంశాల్లో తేడాల వల్ల కూడా ఈ లెక్కల్లో తేడా రావచ్చు). నా ఊహ ప్రకారం 1901లో సూర్య సంక్రమణ కాలం, చాంద్రమాస ఆరంభమో, అంతం చాలా దగ్గరిగా ఉండి ఉండాలి. అప్పుడు కొంతమంది పంచాంగకర్తలు ఆషాఢమాసాన్ని అధికమాసంగా లెక్క కడితే, మరికొంత మంది శ్రావణాన్ని అధికంగా పరిగణించవచ్చు.

    భూమినుండి సూర్య, చంద్ర గమనాలను పరికిస్తే ఎలా ఉంటుందో, అధికమాసం ఎలా నిర్ణయిస్తారో ఈ వీడియో ఫైలు చాలా సులభంగా వివరిస్తుంది. అయితే, ఇక్కడ ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. సూర్యసిద్ధాంతంలో సూర్యచంద్రులు భూమి చుట్టూ తిరుగుతున్నట్టు గానే లెక్కలు కట్టారు. అయితే, కాలగమన నిర్ణయానికి భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుందా, లేక సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నాడా అన్న విషయం సాపేక్షం (relative). సూర్యుడు భూమి చుట్టూ తిరుగుతున్నట్టు భావించడం వల్ల కాల నిర్ణయంలో, ఋతు నిర్ణయంలో ఏమాత్రం తేడా రాదు.

    మీకు 1901 వివాదం గురించి మరిన్ని వివరాలు తెలిస్తే వివరించగలరు.

  5. పలుకుబడి – కాలమానము II గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    05/14/2013 12:40 pm

    ప్రియమిత్రులు శ్రీ సురేశ్ గారికి
    నమస్కృతులతో,

    అధికమాస నిర్ణయాన్ని గుఱించి మీరు వ్రాసిన వివరణ చాలా బాగున్నది.

    1901లో మన తెలుగు పంచాంగకర్తలకు “శ్రావణమాసం అధికమా? ఆషాఢమాసం అధికమా?” అన్న గొప్ప వివాదం ఏర్పడటమూ, చివఱికి రాజమండ్రిలో పండిత పరిషత్తు ఏర్పడి పరిష్కారాన్ని సూచింపవలసి రావటమూ, అది కోర్టుకు వెళ్ళటమూ – ఆ కథంతా మీరు వినే ఉంటారు.

    నాకు ఎన్నాళ్ళుగానో ఉన్న సందేహం: కాల పరిగణన రీత్యా 1901లో పెద్దలకు అసలు ఈ అనుమానం ఎందుకు వచ్చి ఉంటుంది? రెండు పక్షాల వారికి వారి వారి ఆధారాలేమై ఉంటాయి? అధికమాసం విషయమై చివఱికి ఏది సరైనదని నిర్ణయించి ఉంటారు? నేను ఈ కథను ఆ వివాదంలో పాల్గొన్న మహాకవి శ్రీ దాసు శ్రీరామకవి గారి మనుమరాలు డా. వైదేహి గారి ద్వారా నా చిన్నప్పుడు పూర్తిగా విన్నాను కాని, చివఱికి తీర్పు ఏమని జరిగిందో ఇప్పుడు గుర్తులేదు.

    దయచేసి మీ నిర్ణయాన్ని వివరింప ప్రార్థన.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  6. పలుకుబడి – కాలమానము II గురించి lyla yerneni అభిప్రాయం:

    05/14/2013 11:52 am

    ఈ ప్రశ్నలకు తెలిసీ సమాధానం చెప్పకపోయారో … సురేశ్ కొలిచాల

    ‘రసజ్వల’ – అన్న మాట ఈ పత్రికలో, ఏ సంచికలో, ఎవరి రచనలో, ఎన్నో పేజీలో, ఎన్నో పేరాలో, ఏ వాక్యంలో, ఎందుకు ఉన్నదో, ఎవరైనా చెబితే… అప్పటి సంగతి కదా 🙂

    లైలా

  7. నిడుద సోనా ముగ్గులు గురించి indrani Palaparthy అభిప్రాయం:

    05/14/2013 10:22 am

    Nice articles Mohana Rao garu. Very informative.

    Could you please explain about kaleidoscope patterns?

    Thanks & Regards
    Indrani Palaparthy.

  8. కతికితే అతకదు గురించి smeraa అభిప్రాయం:

    05/14/2013 2:59 am

    కతికింది పిల్ల ఇంట్లొ కాదు కద??!!

  9. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి మోహన అభిప్రాయం:

    05/13/2013 6:19 pm

    భావనారాయణ గారు, నిర్మాతలు, దర్శకులు మాత్రమే కాదు, నాయకీనాయకులుగా నటించే నటులు కూడ ఈ (దు)స్థితికి ఒక కారణమే. పిబిఎస్ వంటి వారు నటులకు, గాయకులకు మధ్య ఉండే గాత్రముల సాదృశ్యము ఒక భ్రమ (illusion) అని చెప్పినా, నాయకీ నాయకులు కొందరు గాయకులనే తమకు పాడడానికి ఎంపిక చేసికొన్నారు. ఒక 15 సంవత్సరాలు తెలుగులో ఒక గాయకుడిని మాత్రమే నాయకులు గాత్రదానమునకు ఎంపిక చేసికొనడము జరిగినది, ఒక గాయకి మాత్రమే నాయకురాళ్లకు గాత్రదానము చేయడము జరిగినది. మిగిలిన భాషాచిత్రాలలో కూడా ఈ పరిస్థితియే. హీందీలో కొందరు నాయకురాళ్లు తమ ఒప్పందములో కూడ ఫలానా గాయకి పాడాలని వ్రాసికొన్నారు. బహుశా దక్షిణభాషా చిత్రాలలో కూడ ఇది ఉండి ఉంటుంది. ఈ పరిస్థితిలో కొందరు దెబ్బ తిన్నారు. పిబిఎస్ స్థితి మెరుగే, వారికి కన్నడములో పెద్ద పీట ఉండినది. కాని జిక్కి, జమునారాణి, ఈశ్వరి, బెంగళూరు లతా, సుమిత్ర మున్నగువారు ప్రధాన నటులకు పాడలేకపోయారు. ఇప్పుడు కూడ ఈశ్వరి నాయకికి తరచుగా పాడి ఉంటే ఎలాగుండేదో అని నేను ఊహిస్తుంటాను. కనీసము వీరందరు చిత్రాలలో పాడారు. మంచి శారీరము ఉండి అవకాశము లేకుండా ఎందరు పాడలేకపోయారో అన్నది కూడ గమనార్హమే. విధేయుడు – మోహన

  10. పై గదిలో ప్రేమికుడు గురించి indrani Palaparthy అభిప్రాయం:

    05/13/2013 3:14 pm

    తః తః గారు:

    కొడవళ్ళ గారు నాకు తెలియదు.

    వారి వ్యాసాలు కూడా చాలా బాగుంటాయి.

    మీ కామెంట్ చూసే ఉంటారని అనుకుంటున్నాను.

    ఇంద్రాణి.