పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. పలుకుబడి – కాలమానము II గురించి Srinivas Vuruputuri అభిప్రాయం:

    05/17/2013 2:11 pm

    హరీశ్ గారికి
    ఈనాడు వ్యాసం చదువుతున్నప్పుడు అపనమ్మకమే కలిగింది నాకు.
    నాకు కనబడ్డ ఓ తప్పు:
    “స్తీమ ఆర్ద్రీభావే” అనే పాణినీయ సూత్రంలో Steam ఉందని చెబుతోంది ఈ వ్యాసం. “స్తీం” ధాతువుకు తడి యగు (to be or become wet or moist) అని అర్థం నిఘంటువులో ఉంది. దాన్ని తప్పుగా రాసి ఆవిరి అవడం అని అర్థం సృష్టించడం చిత్రమే!

    మరో జ్ఞాన గుళిక:
    “హైడ్రోజెన్ ఐసోటోపుల ప్రస్తావన కృష్ణ యజుర్వేదంలో ఉంది.
    ‘ఏకతాయ స్వాహా ద్వితాయ స్వాహా త్రితాయ స్వాహా’ ఇందులో ద్వితా అనే పదాన్ని డ్యుటీరియంగానూ, త్రితా అనే పదాన్ని ట్రిటియమ్‌గా మార్చినట్లు అర్థమవుతుంది.”
    కృష్ణ యజుర్వేదంలో ఎక్కడుందో ఈ మాట కానీ అందులోంచి ఐసోటోపుల అర్థాన్ని ఎలా లాగగలుగుతాము? మొత్తం కాంటెక్స్ట్ చూస్తే ఇదే అర్థం వస్తుందా? మరి కార్బన్ ఐసోటోపుల గురించి, యురేనియం ఐసోటోపుల గురించి కూడా కృష్ణయజుర్వేదంలో ఉన్నదా?

    శ్రీనివాస్

  2. మన సాహిత్యంలో కవులు, పుస్తకాలు గురించి Saradhi Motamarri అభిప్రాయం:

    05/17/2013 3:28 am

    Narayanarao garu,

    Really this is interesting information and thought provoking article.

    One of the great doubt lingers in mind, ever since I started learning grammar, for example:

    – is chandassu created first and then poetry came into being? or
    – is the evolving poetry resulted in formalising chandassu?

    Btw, I am also keen to know when probably chandassu in Telugu could have been created? And by whom?

  3. పలుకుబడి – కాలమానము II గురించి K.S.Hareesh Kumar అభిప్రాయం:

    05/16/2013 11:56 pm

    Incidentally, there is an article published in Eenadu, a telugu daily, which highlights the general notion that every thing of modern life was derived from vedas; I look forward to your opinion thereon.

    Hareesh

  4. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి ఆర్.దమయంతి. అభిప్రాయం:

    05/16/2013 7:19 pm

    “రా. రా. గారు – మిగతా చాలామంది ఆర్టిస్టులకి, హీరోలకీ గూడా నాచేత పాడించారని మీకూ తెలుసు. ఈ ‘సూట్’ అవడమనేది చాలా విచిత్రమైన విషయం. అలవాటు మీదే ఎక్కువగా ఆధారపడి వుంటూంది. అంతే. సర్వసాధారణంగా ఒక పురుష గాత్రం, మరో పురుషగాత్రంతో సరిపోతుంది.” – పి.బి. శ్రీనివాస్

    నిజమే. నేను గమనించినంత వరకు పి.బీ.ఎస్. గారి స్వరం హీరో హరనాధ్ గారికి బాగా నప్పినట్టు వుండేది. అచ్చు హరనాధే పాడుతున్నారా అన్నట్టుండేది. హల్లో మేడం సత్య భామా అంటూ అల్లరిగా పాడినా, నా మాట నమ్మితి వేలా అంటూ కొంటెగా పాడినా అందంగానే వుండేది. ఆ తర్వాత, హీరో చలంకి పాడిన పాటలు కూడా మనకు బాగా గుర్తుండిపోయే పాటలే వున్నాయి. వ్యక్తిగతంగా నాకు చాలా నచ్చేవి. చలం పాట అభినయనంలో వీరి గాత్రం చక్కగా అమరి పోయేది.
    కన్నులే నవ్వేవి… వెన్నెలలు రువ్వే ఇవి’ (సారీ సాహిత్యం గుర్తుకి రావడం లేదు.) ఈ పాటలో శ్రీనివాస్ గారి గాత్రం – చరణంలో మరి మరి వినాలనిపిస్తుంది.

    అలాగే, జగ్గయ్య గారికి కూడా బాగా సూట్ అయ్యేది. ‘నీలి మబ్బుల నీడ ల లోన’ — గుడి గంటలు సినిమాలో ఈ పాట ఎంత జోరుగా వుంటుందనీ! ఇంకా, చిగురాకుల ఊయలలో’ — ఇలా చాలా వున్నాయి. మనమెవ్వరమూ ఎప్పటికి మరచిపోలేని మరో మాణిక్యం లాంటి వారి పాట – ముద్దు ముద్దు నవ్వు, బుగ్గల్లో రువ్వు, జాజి మల్లి పువ్వూ, బజ్జోమ్మా నువ్వూ, బజ్జోమ్మ నువ్వు’ ఈ పాటనింకెవరు పాడినా, ఇంత లాలితనం వొలికే అవకాశం లేదేమో!?

    అటు శాస్త్రీయ సంగీతం తో బాటు,ఇటు సినిమా సంగీతం లోనూ తనదైన ఒక ముద్రని కలిగిన ఈ గాయకుని గురించి ఇంత వివరణ తో కూడిన సమాచారాన్ని అందించిన మీ ముగ్గురికి ఇవే నా అభినందనలు.

    వారిని ఇలా స్మరించుకుంటూ, ఆయన పాటలను గుర్తు చేసుకుంటూ, మన తెలుగు గాయకుని ప్రతిభా పాటవాలnu పదిమందితో పంచుకునే ఈ అవకాశాన్ని కలగచేసిన ఈమాట వారికి కూడా నా ప్రత్యేక ప్రశంసలను తెలియ చేస్తున్నాను.
    వారి ఆత్మకి శాంతి కలగాలని ఆ భగవంతుణ్ని ప్రార్ధిస్తూ.. అంజలి ఘటిస్తూ..

    – ఆర్.దమయంతి.

  5. ఏ నడలో ఏ ఎడలో! గురించి indrani Palaparthy అభిప్రాయం:

    05/16/2013 4:55 pm

    ఈ పాటను చాలా సార్లు విన్నాను. దీని మీద అభిప్రాయాలను ఇప్పుడే చూస్తున్నాను.

    పాటను ఈ విధంగా రాసి, సంగీతం సమకూర్చుకుని, పాడించి ఇక్కడ ఉంచడం చాలా శ్రమతో కూడుకున్న పని.

    ఈ పాట చిన్నప్పుడు రేడియో లో వచ్చే,” మార్గము చూపుము ఇంటికి మా తండ్రి ఇంటికి” లాంటి పాటను గుర్తుకు తెస్తోంది,బహుశా పాడిన విధానం వల్ల కావచ్చు.

    చారలు కట్టిన పాటలివి
    జాలికి రాలే పుప్పొడులు
    ఏ మరులో ఏ ఇరులో!
    నీ కొస చూపుల సైగలకే
    ఈ తెరలా మరలా!
    ఇన్నాళ్ళూ ఏ దూరానో
    ఉన్నావనుకొని ఊరుకొనీ
    ఎన్నటిదీ కన్నీరు ప్రియా!
    వెన్న సుమా మనసు.

    చాలా బాగా వచ్చింది. మొత్తంగా వెంటాడే సంగీతం,పాట.

    కలలో కల్లలో – దగ్గర దగ్గరగా వినిపించే పదాలు కాకుండా – వేరే పదం అయితే బాగా వినిపించేదేమో.

    నాకు వివిధ దేశాల సంగీతం వినడం ఇష్టం.

    ఇలాంటి పాటలు ఆత్మకు ఆహారంలా అనిపిస్తాయి,నెమ్మదిగా వేసవిలో ఏ వేప చెట్టు కిందో కూచుని వింటే-

    http://www.youtube.com/watch?v=PMigXnXMhQ4

    http://www.youtube.com/watch?feature=endscreen&NR=1&v=Zq5S5sH1Ikk

    http://www.youtube.com/watch?v=zvAv3ynh4M8

    పాలపర్తి ఇంద్రాణి.

  6. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    05/16/2013 1:53 pm

    మాన్యులు శ్రీ మోహనరావు గారికి
    నమస్కృతులతో,

    శ్రీ పి.బి. శ్రీనివాస్ గారు సంఖ్యాశాస్త్రాన్ని, అక్షరసాంఖ్యాన్ని అభ్యసించి తమను సంప్రతించిన మిత్రులకు పేరును వ్రాయటంలో చిన్న చిన్న మార్పులు చేసుకొంటే మేలవుతుందని సూచనలు చేస్తుండేవారు. జన్మదినాన్ని బట్టి వారి వారి జాతకాలను గుణించి చెబుతుండేవారు. రేసుకోర్సులో వినోదార్థం లెక్కలు వేసి ఈ గుఱ్ఱం ఇప్పుడు గెలుస్తుందని చెబుతుండేవారు కాని, వారు స్వయంగా ఆడిన సందర్భాలు తక్కువ. వీరిది పాశ్చాత్య గణన పద్ధతి. ఆ రీతులను గుఱించిన ఒక వ్యాసంలో కొన్ని వివృతులను వ్రాశారు.

    శ్రీనివాస్ గారు 1930 సెప్టెంబరు 22-వ తేదీనాడు (8 సంఖ్య) జన్మించారు. వారు ఆంగ్లంలో వ్రాసికొన్న Sreenivos (వారి పద్ధతి ప్రకారం) 8 సంఖ్య అవుతుంది. దానికి P B చేరిస్తే వచ్చే 9 కలిపినా మళ్ళీ 8 సంఖ్యే వస్తుంది. అది వారి జీవితగతికి నిర్ణాయకమైన అదృష్ట సంఖ్య అన్నమాట.

    నేటి మన విశ్వాసావిశ్వాసాలతో నిర్నిమిత్తంగా విశ్వసనీయమని విశ్వసించినందున వారీ విధంగా తమ పేరును వ్రాసికొనేవారు. నేను నా వ్యాసంలో వారి అక్షరసాంఖ్య పరిశోధనలను గూర్చిన వివరాలను వ్రాయలేదు.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  7. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి మోహన అభిప్రాయం:

    05/16/2013 12:16 pm

    During the preparation of this article not only did I hear hundreds of PBS songs, but also had the good fortune to read countless articles, short and long. But I am still puzzled by a trivial fact. Why did PBS choose the unusual spelling Srinivos for his name? Any trivia buffs there? Regards! – mOhana

  8. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి V S PRAKASA RAO అభిప్రాయం:

    05/16/2013 8:02 am

    దమయంతి గారు, మోహన గారు.

    రేణుకగారి పాటల్ని గుర్తుకుతెచ్చి మమ్మల్ని ఓ నొస్టాల్జియా లోకి తీసుకెళ్ళారు. రేణుకగారి కుమార్తె అనురాధ కర్నాటక, హిందుస్తాని సంగీతాన్ని అభ్యసించి మంచి గాయనిగా పేరుతెచ్చుకున్నారు.

    రేణుకగారి ప్రస్తావనతో మరొక మరుగున పడిన సుస్వరం గుర్తుకొస్తున్నది. అది శ్రీమతి సునందా శాస్త్రి (ముక్కామల సునంద) గారిది. చివరకు మిగిలేది సినిమా కోసం వారు పాడిన “చిన్నారీ నీ మనసే” (అశ్వత్థామ బాణీ, మల్లాది రామకృష్ణ శాస్త్రి రచన) 60లలో విన్నవారే కాదు ఇప్పుడు నెట్ లొ విన్నా ఎన్నటికీ మరిచి పోలేం.

    అలాగే కీ. శే. శ్రీరంగం గోపాలరత్నం గారు బికారిరాముడు సినిమా కోసం పాడిన “నిదురమ్మా నిదురమ్మా కదలీ వేగమె రావమ్మ” (బీ. గోపాలం బాణీ. రాసింది పాలగుమ్మి పద్మరాజు గారు.) ఇదే సినిమా లో జానకి, బి. గోపాలం పాడిన “ఈ దినం నా మనం పూల తోరణం” కూడా ఓ మంచి పాట.

  9. కతికితే అతకదు గురించి chudamani అభిప్రాయం:

    05/16/2013 6:34 am

    కధ బాగుంది.

  10. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి మోహన అభిప్రాయం:

    05/14/2013 8:34 pm

    దమయంతి గారు, నాకు కూడ రేణుకగారి పాటలంటే ఇష్టమే. [మీరు ఉదహరించిన ఆ పాట ఒక ఓ పి నయ్యర్ హిందీ పాటకు అనుసరణ అనుకొంటాను, పాట జ్ఞాపకానికి రావడము లేదు, కాని కబ్ ఛాయె ఘటా ఘన్ ఘోర్ అని వస్తుంది అందులో.] అరవైలలో బెంగళూరులో ఉండేటప్పుడు ఆమె పాటలను కన్నడములో వినేవాడిని. ముఖ్యముగా ఆమె జానకి, లతాలతో పాడిన హూవతందు మారిదళు తరచుగా రేడియోలో ప్రసారము చేసేవాళ్లు. ఇది పిబిఎస్ పైన వ్యాసము గనుక, రేణుక, పిబిఎస్ యుగళగీతము నొకదానిని దుడ్డే దొడ్డప్ప అనే చిత్రమునుండి వినవచ్చును.

    విధేయుడు – మోహన