కృష్ణకుమారు గారూ,
పిల్లలకు తెలుగు నేర్పడంలో సిలికానాంధ్ర వారి ప్రయత్నం కొనియాడదగిందే. కానీ ఎవరికి నేర్పుతున్నారన్నది కూడా కొంచెం ఆలోచించండి. మీరు ఉదహరించిన క్లిష్ట పదాలు ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు ఉచ్చరిస్తున్నారా లేక ఈ మధ్య కాలంలో ఆంధ్రదేశం నుండి వచ్చిన పిల్లలా? వారిద్దరి మధ్య తేడా పసిగట్టడం అంత కష్టంకాదు. ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చిన పిల్లలు, వచ్చినప్పటి వారి వయసు, ఇక్కడికి రాకముందు వాళ్ళకు తెలుగుతో ఉన్న పరిచయం, మొదలైన వాటిననుసరించి, వాళ్ళలో తెలుగు ఎంతకాలం నిలుస్తుందో కూడా తెలుసుకోవచ్చు. వెల్చేరు గారంటున్నది తెలుగు కేవలం మాతృభాషగాగల పిల్లల గురించి కాదు, తెలుగు రెండవ భాషైన పిల్లల గురించి. ఒక్కసారి తెలుగుతో సంబంధం లేని పిల్లలకు (పెద్దవాళ్ళకైనాసరే) తెలుగు నేర్పడానికి ప్రయత్నించి చూడండి. మనకు తెలుగు నేర్పడం ఎంత తెలుసో తెలుస్తుంది. ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు, లేదా అతి చిన్న వయసులో ఇక్కడకు వచ్చి పాఠశాలకు వెళ్ళడం మొదలుపెట్టిన పిల్లలకు అసలు తెలుగుతో సంబంధం లేని వాళ్ళకు ఆట్టే తేడా ఉండదు. వాళ్ళకు తెలుగు నేర్పే సత్తా మనకింకా రాలేదు. అది ఏర్పాటు చేసుకోవాలన్న అవగాహన లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా సముద్రాన్ని దోసిలితో తోడాలనుకోవడమే అవుతుంది!
మొన్న తోగరె వెంకటాచల శాస్త్రి వ్రాసిన కన్నడ ఛందఃకోశమును కొని పుటలను తిరగవేస్తుండగా అందులో సార్థకనామవృత్తములను వారు గణాక్షరవృత్తములని పేర్కొనడము గమనించాను. విధేయుడు – మోహన
అభిప్రాయాలు సూచనలతో ఈ ముఖాముఖి నడిపారు.తప్పు లేదు, కానీ ఈ వ్యాసం వల్ల స్పష్టమైన అవగాహన ఎక్కడ అన్నది సమస్య.ముఖాముఖి చేసిన వ్యక్తి ప్రశ్నలలో కూడా వస్తువు పట్ల సమగ్ర అవగాహన తీసుకు వద్దామన్న ప్రయత్నం కనబడలేదు. కొన్ని ప్రశ్నలు వేస్టు. (బ్రౌన్ ఫుటో) ముఖాముఖి మొత్తం ఒకే సబ్జెక్ట్ (బహుశా సినిమా పాటల) మీద సాగి ఉంటే మరిన్ని శ్రీనివాస్ గారి ద్వారా చక్కని విషయాలు తెలిసి ఉండేవి.
అభిప్రాయాలకు నిర్దుష్టమైన విలువ ఏదీ లేదు. అది గొప్ప అభిప్రాయమైనా, తప్పు అభిప్రాయమైనా సరే. తప్పో ఒప్పో తెగబడి ఒక ప్రయత్నం చేస్తే తదనంతరం అది మరిన్ని ఆలోచనలకు తావిస్తుంది. ఇది వరకు చరిత్రకారులు చరిత్ర వ్రాయడంలో అనుసరించిన అసమగ్ర విధానాల వల్ల కొత్త పద్ధతులు పుట్టాయి, బావుంది. తప్పో, ఒప్పో వాళ్ళు అలా వ్రాశారు కాబట్టే కదా, అది తప్పని తెలిసింది? బ్రౌన్ కానీ, మరొకరు కానీ ఒక ప్రయత్నమంటూ అతని మీద మొదలెడితే కదా పదిమంది దానిని చర్చించేది? భారతి పత్రికలోనే అసమగ్ర వ్యాసాలు కుప్పలుగా ఉన్నాయి. ఆరంభింపక నీచ మానవులుగా ఉండడం కంటే కనీసం మధ్యములుగా మొదలెట్టటం మంచిదే కదా?
తెలుగు భాషాభిమానులకు ఎన్నో కొత్త వెలుగులను, లో చూపులను, ఆదర్శాలను అందిస్తూ శ్రీనివాస్ గారి ముఖాముఖీ ఆద్యంతం ఆసక్తిదాయకంగా సాగింది. ఆయన కృషి స్వరూపం తెలిసినవారు పరిధిని విస్తరించి ఇంకా ఎన్నో విషయాలను ప్రసంగించే వ్యవధి, అవకాశం ఉండే అంతర్జాలపత్రిక ముఖాముఖీ అయితే మఱింత ఆలోచనాత్మకంగా, స్ఫూర్తిమంతంగా రాణించేదని. ఎప్పుడైనా ప్రయత్నించి ‘ఈమాట’ మిత్రులే ఆ కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుంటుందని అనిపించింది.
ఈమాట గురించి గురించి naseer అభిప్రాయం:
09/04/2013 5:40 am
page numbers in “పాఠకుల అభిప్రాయాలు” are not working.
[We are working on it. Thank you for noticing it. -Ed]
రాతి పడవ గురించి Anil అనిల్ అట్లూరి అభిప్రాయం:
09/04/2013 3:29 am
బెకన్ అన్నట్టు ..ఇది జీర్ణం చేసుకోవలసిన కథ. కాస్త సమయం పడుతుంది. విరుపులు , చెమక్కులు, వ్యంగాలు కొల్లలు.
ఇంటి మొగుడు గురించి శ్రీనివాస్ పప్పు అభిప్రాయం:
09/04/2013 1:49 am
“ఇప్పుడు జీతం లేకుండానే పని చేస్తున్నావా?”
అసూయతోనే అడిగాడనిపించింది నాకు.”
కెవ్వ్వ్వ్వ్వ్ భలే రాసారు గురూజీ.
ఇంటి మొగుడు గురించి బులుసు సుబ్రహ్మణ్యం అభిప్రాయం:
09/04/2013 1:03 am
శ్రావ్య గారికి — మీకు మొహమాటం మరీ ఎక్కువ అనుకుంటాను. దహా. అయినా సరే మరో మారు మీకు ధన్యవాదాలు.
చంద్రశేఖర్ గారికి, రాధ గారికి, మధురవాణి గారికి, జ్యోతిర్మయి గారికి, మనోహర్ గారికి, ధన్యవాదాలు.
మురళీధర్ గారికి — వినేవారు అనుమానం లో(తో) తేలిపోతారు. దహా. ధన్యవాదాలు.
ప్రేమ కవితలు గురించి kesava అభిప్రాయం:
09/03/2013 12:41 pm
మీ కవిత చాలా బాగున్నాయి.
మీ కవితలు చదువుతుంటే నాకు కవితలు రాయాలని అనిపిస్తుంది. నిజంగా అంత బాగున్నాయి.
తెలుగు ప్రపంచభాష ఎప్పుడవుతుంది? గురించి Krishna Rao Maddipati అభిప్రాయం:
09/03/2013 9:35 am
కృష్ణకుమారు గారూ,
పిల్లలకు తెలుగు నేర్పడంలో సిలికానాంధ్ర వారి ప్రయత్నం కొనియాడదగిందే. కానీ ఎవరికి నేర్పుతున్నారన్నది కూడా కొంచెం ఆలోచించండి. మీరు ఉదహరించిన క్లిష్ట పదాలు ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు ఉచ్చరిస్తున్నారా లేక ఈ మధ్య కాలంలో ఆంధ్రదేశం నుండి వచ్చిన పిల్లలా? వారిద్దరి మధ్య తేడా పసిగట్టడం అంత కష్టంకాదు. ఎప్పటికప్పుడు కొత్తగా వచ్చిన పిల్లలు, వచ్చినప్పటి వారి వయసు, ఇక్కడికి రాకముందు వాళ్ళకు తెలుగుతో ఉన్న పరిచయం, మొదలైన వాటిననుసరించి, వాళ్ళలో తెలుగు ఎంతకాలం నిలుస్తుందో కూడా తెలుసుకోవచ్చు. వెల్చేరు గారంటున్నది తెలుగు కేవలం మాతృభాషగాగల పిల్లల గురించి కాదు, తెలుగు రెండవ భాషైన పిల్లల గురించి. ఒక్కసారి తెలుగుతో సంబంధం లేని పిల్లలకు (పెద్దవాళ్ళకైనాసరే) తెలుగు నేర్పడానికి ప్రయత్నించి చూడండి. మనకు తెలుగు నేర్పడం ఎంత తెలుసో తెలుస్తుంది. ఇక్కడ పుట్టి పెరిగిన పిల్లలు, లేదా అతి చిన్న వయసులో ఇక్కడకు వచ్చి పాఠశాలకు వెళ్ళడం మొదలుపెట్టిన పిల్లలకు అసలు తెలుగుతో సంబంధం లేని వాళ్ళకు ఆట్టే తేడా ఉండదు. వాళ్ళకు తెలుగు నేర్పే సత్తా మనకింకా రాలేదు. అది ఏర్పాటు చేసుకోవాలన్న అవగాహన లేకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా సముద్రాన్ని దోసిలితో తోడాలనుకోవడమే అవుతుంది!
కృష్ణారావు
దశావతారస్తుతి గురించి మోహన అభిప్రాయం:
09/03/2013 9:30 am
మొన్న తోగరె వెంకటాచల శాస్త్రి వ్రాసిన కన్నడ ఛందఃకోశమును కొని పుటలను తిరగవేస్తుండగా అందులో సార్థకనామవృత్తములను వారు గణాక్షరవృత్తములని పేర్కొనడము గమనించాను. విధేయుడు – మోహన
ఇంటి మొగుడు గురించి manohar అభిప్రాయం:
09/03/2013 1:23 am
చాలా బావుంది
బ్రౌన్‌ని సమగ్రంగా ఎవరూ చూడలేదు: పరుచూరి శ్రీనివాస్‌తో ఆకాశవాణి ముఖాముఖీ గురించి రవి అభిప్రాయం:
09/03/2013 12:34 am
అభిప్రాయాలు సూచనలతో ఈ ముఖాముఖి నడిపారు.తప్పు లేదు, కానీ ఈ వ్యాసం వల్ల స్పష్టమైన అవగాహన ఎక్కడ అన్నది సమస్య.ముఖాముఖి చేసిన వ్యక్తి ప్రశ్నలలో కూడా వస్తువు పట్ల సమగ్ర అవగాహన తీసుకు వద్దామన్న ప్రయత్నం కనబడలేదు. కొన్ని ప్రశ్నలు వేస్టు. (బ్రౌన్ ఫుటో) ముఖాముఖి మొత్తం ఒకే సబ్జెక్ట్ (బహుశా సినిమా పాటల) మీద సాగి ఉంటే మరిన్ని శ్రీనివాస్ గారి ద్వారా చక్కని విషయాలు తెలిసి ఉండేవి.
అభిప్రాయాలకు నిర్దుష్టమైన విలువ ఏదీ లేదు. అది గొప్ప అభిప్రాయమైనా, తప్పు అభిప్రాయమైనా సరే. తప్పో ఒప్పో తెగబడి ఒక ప్రయత్నం చేస్తే తదనంతరం అది మరిన్ని ఆలోచనలకు తావిస్తుంది. ఇది వరకు చరిత్రకారులు చరిత్ర వ్రాయడంలో అనుసరించిన అసమగ్ర విధానాల వల్ల కొత్త పద్ధతులు పుట్టాయి, బావుంది. తప్పో, ఒప్పో వాళ్ళు అలా వ్రాశారు కాబట్టే కదా, అది తప్పని తెలిసింది? బ్రౌన్ కానీ, మరొకరు కానీ ఒక ప్రయత్నమంటూ అతని మీద మొదలెడితే కదా పదిమంది దానిని చర్చించేది? భారతి పత్రికలోనే అసమగ్ర వ్యాసాలు కుప్పలుగా ఉన్నాయి. ఆరంభింపక నీచ మానవులుగా ఉండడం కంటే కనీసం మధ్యములుగా మొదలెట్టటం మంచిదే కదా?
బ్రౌన్‌ని సమగ్రంగా ఎవరూ చూడలేదు: పరుచూరి శ్రీనివాస్‌తో ఆకాశవాణి ముఖాముఖీ గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:
09/02/2013 10:57 pm