పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. ఏటి గట్టున ఇల్లు గురించి ఆకునూరి మురళీకృష్ణ అభిప్రాయం:

    09/26/2013 1:37 pm

    ‘కథ బాగుంది’ అని మామూలుగా చెప్పడానికి వీల్లేని కథ ఇది. కథలో ఏదో వుంది. మనసుని కట్టి పడేసేదీ, మనసుకు మాత్రమే అర్ధమయేదీ. దీన్ని కధలా చదవడం పొరపాటు – కవిత్వంలా ఆస్వాదించాలి. కథ కదిలిస్తుంది, ఆలోచనని రేకెత్తిస్తుంది, మహా అయితే మనల్ని ఊపేస్తుంది. కానీ కవిత్వం మనసుని అంటి పెట్టుకుని వుంటుంది. ఇంతకన్నా ఏం చెప్పగలను దమయంతి గారూ?

  2. చిలక – గోరింక గురించి Murthy Akella అభిప్రాయం:

    09/25/2013 1:36 am

    కథ బాగుంది, రచయిత సమస్యను చర్చించేలా చెయ్యడంలో కృతకృత్యులయ్యారు. వీటికి సొల్యుషన్లు ఉండవు, చర్చలే, that makes life charming. అందరూ ఒకలాగే ఆలోచిస్తే టైప్ కాస్ట్ అయిపోదూ?

  3. పల్లెటూర్ to పట్నం: The Seven Seater గురించి uma kaundinya అభిప్రాయం:

    09/24/2013 8:34 pm

    ఇంద్రాణీ:

    గ్రాంథికంలో తెలుగు ‘వచన పజ్యాలు’, ఆ పద్దేల మీద వీర సంస్కృతంలో విమర్శలూ చదివి అర్థం కాక బుర్ర గోక్కుంటూ — ఫీనిక్స్‌లో వడదెబ్బ కొట్టి డీలా పడిపోయిన నాలాటి దానికి — చల్లటి చల్లలో చిటికెడు ఉప్పు ఓ కరేపాకు రెబ్బ పడేసి బతికించినట్టుగా, బతికున్న తెలుగులో రాసిన నీ పద్యం ‘అమ్మయ్య!’ అనిపించిందంటే నమ్ము!

    ఇలాంటి మంచి మంచి పద్యాలు బోలెడు బోలెడు రాయవూ?

    — ఉమ.

  4. పల్లెటూర్ to పట్నం: The Seven Seater గురించి mallikarjuna sarma అభిప్రాయం:

    09/24/2013 3:14 am

    ‘రాడా రాడా రాడా రాడా రాడా’ అని ఇంకా ఓ డజన్ సార్లు అంటే కూడా కొత్తవాళ్లకు అర్థం కాదేమో! లింగంపల్లి /మియాపూర్ నుండి వెళ్లేటప్పుడు అది ‘ఎర్రగడ్డ’ అని. అలాగే ‘గుట్టా గుట్టా…’ మలక్పేట దగ్గర అది ‘చాంద్రాయణగుట్ట’. కూకట్ పల్లి దగ్గర అది ‘జగద్గిరిగుట్ట’. ఉప్పల్ దగ్గర అది ‘యాదగిరిగుట్ట’. సందర్భానుసారంగా ప్రజలు అర్థంచేసుకోవలసిన ‘ప్రజాటో’ వాళ్ల భాష ఇది.

    కవిత ఓ మంచి పరిశీలన. పదాల వివరణ ఓ మంచి అలవాటు.

  5. పలుకుబడి: ఋతువులు, కాలాలు గురించి నరసింహశర్మా మంత్రాల అభిప్రాయం:

    09/24/2013 12:26 am

    ప్రియమైన సురేశ్ గారు,

    నమస్కారం. సాధ్యమైనంత ఎక్కువ సమాచారాన్ని అందివ్వాలన్న మీ తపన హర్షణీయం. మీ వ్యాసం చదివి ఇప్పటి వరకు నాకు అవగాహనలేని ఎన్నో విశ్మయం కనిగించే అంశాలను గ్రహించగలిగాను. అందుకు కృతజ్ఞతలు. ఇలాగే మీరు మరిన్ని ఉపయుక్తమైన వ్యాసాలను పరంపరగా ప్రచురించాలని విన్నపం. మరిందరు కొత్త మిత్రులను పొందే భాగ్యం కలిగింది.

    ఈమాట.కామ్ నాలోని జిగ్న్యాసను మరింతగా వృద్ధి చేయనుంది.

    ప్రేమతో
    నరసింహశర్మ మంత్రాల

  6. రక్తకన్నీరు గురించి Indrani Palaparthy అభిప్రాయం:

    09/23/2013 11:04 am

    రక్త కన్నీరు నాటకం ఇదే వినడం. నాగ భూషణం గారి గొంతు వినడం ఎంతో బావుంది. ఇక్కడ ఉంచినందుకు ధన్యవాదాలు.

    చిన్నప్పుడు దూరదర్శన్ లో “పావలా” నాటిక (రచన గణేష్ పాత్రో?)చూసాను. దాని గురించి ఇప్పటికీ మా అమ్మగారు, నేను మాట్లాడుకుంటుంటాము. ఆ నాటకం ఎవరి వద్ద అయినా ఉంటే దయచేసి ఈమాటలో ఉంచగలరు.

    ధన్యవాదాలు.
    ఇంద్రాణి.

  7. రచయితలకు సూచనలు గురించి శివకృష్ణ.పి అభిప్రాయం:

    09/22/2013 10:13 am

    ఈమాట మాగజైన్‌కు ఎడిటర్‌గారికి నమస్కారం. నాపేరు శివకృష్ణ మొదటి సారిగా మీ వెబ్ సైట్‌ను చూశాను.చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఇప్పటి వరకూ ఇలాంటి వెబ్‌సైట్‌ ఉన్నది అనేది నాకు తెలియదు.ఇంగ్లీష్, హీందీ భాషలే ప్రాధాన్యత ఇస్తున్న ఈరోజుల్లో ఇలాంటి మాగజైన్‌ ఉండడం చాలా అభినందనీయం. దేశభాష పట్ల మీలాంటి వారు పెంచుకున్న మమకారానికి, ఆప్యాయతకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది. మీలాంటి వారివల్ల ఈ సమాజంలో తెలుగు భాష ఇంకా బ్రతికేవుంది అనేది అర్ధమౌతుంది.అయితే నేను చిన్నిమేధాశక్తితో చిన్న కవితలు రాశాను. ఇప్పటి వరకు నాకవితాలు ఏ మ్యాగజైను పంపలేదు. కానీ మొదటిసారిగా మీ మ్యాగజైన్‌ నాకు మీ పంపాలని ఆశపడుతున్నాను.మీ నాకవితలు నచ్చితే ప్రచురిస్తారని నమ్ముతున్నాను.
    ఇట్లు మీ
    ప్రేమతో
    శివ

  8. రక్తకన్నీరు గురించి Sowmya అభిప్రాయం:

    09/22/2013 6:46 am

    ఈ రికార్డింగ్ ఎప్పటిదో కొంచెం తెలియజేయగలరా? అలాగే, ఆ నేపథ్య సంగీతం నాకు ఇళయరాజా స్వరపరచిన – How to name it, Nothing but Wind లలో ఎందులోనో విన్న సంగీతంలా తోస్తోంది. అందువల్ల కుతూహలంగా ఉంది ఈ నేపథ్య సంగీతం గురించి. (అవన్నీ ఒకే రాగమో ఏదో కావొచ్చు, నాకు అలాంటి పరిజ్ఞానం లేదు కనుక నా అజ్ఞానాన్ని మన్నించి, వెటకారంగా కాక మామూలుగా వివరించగలరు)

  9. స్వప్నలోకచిత్రకారుడు మచాడో గురించి Dr.Ismail అభిప్రాయం:

    09/21/2013 11:42 pm

    ఏల్చూరి మురళీధరరావు గారు — మీ మొదటి వ్యాఖ్య చదువుతూంటే ఓ విధమైన గగుర్పాటు కలిగింది. Thanks. For me ‘పురాతనమైన నీడ’ gave me ‘రససిద్ధి’ as for as that poem is concerned.

    Nice discussion. Enjoyed it.

  10. రక్తకన్నీరు గురించి Acharya అభిప్రాయం:

    09/21/2013 6:04 am

    నిజముగా నా జన్మ ధన్యము ఐనది మాస్టారూ. గత పది సంవత్సరములు క్రితం విన్నాను. ఛాలా కాలము నుండి ఎక్కడ దొరుకుతుందా అని ఎదురు చూస్తున్నా. వీలుంటే నాగభూషణం గారి ఆసలైన రక్తకన్నీరు వీడియో పోస్ట్ చేస్తే తెలుగువాళ్ళ జన్మ ధన్యము అవుతుంది.