పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన గురించి రవి అభిప్రాయం:

    11/04/2013 2:43 am

    చాలా చక్కని పరిశోధన వ్యాసం. అయితే మానవల్లి రామకృష్ణకవి పొరబాటును ఎత్తి చూపిస్తూ ఆవేశానికి లోబడి ఆయనే కుమారసంభవం వ్రాసి నన్నెచోడుడికి కర్తృత్వం ఆపాదించారన్నట్టు ధ్వనింపజేయడం బావోలేదు. మానవల్లి వారికి నన్నెచోడుడిపై అవ్యాజమైన అనురాగము, తెనాలి రామకృష్ణునిపై కోపమో, ద్వేషమో ఉండవలసిన అవసరం ఏమిటో తెలియదు.

    నా వంతుగా కొన్ని వరహాలు.

    >>‘దృష్ట్వా యాసాం నయనసుషమాం వఙ్గవారాఙ్గనానామ్’ అన్నచోట వంగదేశపు వారాంగనల ప్రసక్తి; ‘యేయే ఖఞ్జన మేక మేవ కమలే పశ్యన్తి’ మొదలైన చోట్ల >>వర్ణింపబడిన ఖంజన పక్షి ప్రస్తావన – మొదలైన వాటిని బట్టి, వంగదేశాభిమానం గల సంధాత ఎవరో క్రీ.శ. 14వ శతాబ్ది ప్రాంతంలో దీనిని కూర్పగా,

    – ఖంజన శబ్దం వంగదేశీయులకు మాత్రమే ప్రత్యేకం కాదు. దమయంతి కన్నులను వర్ణిస్తూ శ్రీహర్షుడు చెప్పిన శ్లోకం ఇది.

    నలినం మలినం వివృణ్వతీ పృషతీమస్పృశతీ తదీక్షణే |
    అపి ఖఞ్జనమంజనాంచితే విదధాతే రుచిగర్వదుర్విధమ్ ||

    శ్రీహర్షుడు మేవార్ రాజు జయచంద్రుని ఆస్థానకవి అన్న విషయం స్పష్టం.

    పొద్దున లేవగానే ఖంజరీటం కనబడితే శుభం జరుగుతుందన్న ప్రాచీనశ్లోకం ఒకటుంది. (కర్తృత్వం తెలియదు).

    తురంగమాతంగమహోరగేషు సరోజగోచ్ఛత్రవృశేషు యేన |
    పూర్వే చ దృష్టో ऽ హని ఖఞ్జరీటో నిశ్శంసయం తస్య భవేన్నృపత్వమ్ ||

    పొద్దునపూట గుర్రంపైనో, మహాసర్పంపైనో,ఏనుగుపైనో,సరోజం పైనో, ఆవుపైననో, గొడుగుపైనో వ్రాలిన కాటుకపిట్టను చూస్తే వాడికి రాచపదవి తప్పక లభిస్తుంది.

    అలాగే – శృంగారతిలకమ్ ముక్తకమైనప్పటికీ వఙ్గవారాంగనలవర్ణన వఙ్గదేశీయుడే చేయాలన్న నియమం వర్తించదని నా అభిప్రాయం. కవి స్వదేశానికి చెందని రమణీమణులను వర్ణించిన సందర్భాలు సంస్కృతంలో తక్కువ కాదనుకుంటాను. (ఉదాహరణ: రాజశేఖరుని కేరళ, కున్తల భామినుల వర్ణన) వఙ్గ దేశీయకవిత్వం గౌడీ రీతిగా సుప్రసిద్ధం. శృఙ్గారతిలకమ్ ఓజోభరితంగా, కఠిన సమాసాలతో కాక వైదర్భీరీతిలోనే సాగింది. అలాగే వఙ్గదేశీయులకు అభిమానపాత్రమైన సప్తపర్ణి ఈ కావ్యంలో కనిపించదు.

    పై కారణాల వల్ల శృఙ్గారతిలకసంధానకర్త కాళిదాసు అవునో కాదో కానీ వఙ్గదేశీయుడనడం చింత్యమని నా అభిప్రాయం.

    >>కాళిదాస వాఙ్మయంలో లేని ‘పత్రభంగ’ శబ్దప్రయోగం (‘కస్తూరీవరపత్రభఙ్గనికరో’)

    శ్యామలాదండకంలోని ఈ వాక్యాన్ని పరిశీలనార్థం మీ ముందుంచుతున్నాను.

    ..ప్రోల్లసద్వాళికా మౌక్తికశ్రేణికాచన్ద్రికామండలోద్భాసి”గణ్డస్థల న్యస్త కస్తూరికాపత్రరేఖా”సముద్భూత సౌరభ్యసంభ్రాన్తభృంగాంగనా గీత సాంద్రీభవన్మత్ర తంత్రీస్వరే భాస్వరే..

    ఇంకా ఇతర విషయాలేమైనా తెలిస్తే వ్యాఖ్యల ద్వారా పంచుకుంటాను.

    జిజ్ఞాసువు,
    రవి.

  2. ప్రద్యుమ్నుడి ఉపవాసం గురించి mallikarjuna sarma అభిప్రాయం:

    11/04/2013 2:28 am

    ఇంటింటి ప్రభావతీ ప్రద్యుమ్నం! సరే, అలాక్కానివ్వండి!
    మల్లికార్జున శర్మ.

  3. ద్వితీయ కళత్రం గురించి mallikarjuna sarma అభిప్రాయం:

    11/04/2013 2:16 am

    శర్మ దంతుర్తి గార్కి,

    నమస్తే.చిన్ని కథ చక్కగా చెప్పారు. జాతకాల ప్రామాణికతపైన చర్చ ఈనాటిది కాదు. అనుభవాలు అటూ ఇటూ కూడా వుంటూవుంటాయి. ఆ చర్చను పక్కన పెడితే: 1. కథాకాలం, 2.’పాప జాతకం అంత వివరంగా విశ్లేషించవలసిన సందర్భం’ … తెలుసుకునే వీలుంటే ఇంకా గొప్పగా వుండేది.
    మల్లికార్జున శర్మ దేవరకొండ.

  4. పలుకుబడి: శషసలతో శషభిషలు గురించి jayaprabha అభిప్రాయం:

    11/03/2013 2:20 pm

    కొలిచాలా! పత్రికల భాష లోని “ప్రామాణికత” అన్నది మరో చర్చ చేయవల్సిన సంగతి. పత్రికల ప్రామాణికత అసలు అలాంటిదొకటి ఉందేమిటి :)! ఇంక “అన్నమయ్య రచనలు??” అన్నారేమిటీ? వాటిని కూర్చుని స్వయంగా అన్నమయ్య “రాయలేదు” కద! అవి జీతానికి నియమించిన ఎవరో రాయసకాండ్రు రాసినవి. ఇహ ఆ జీతగాళ్ళు కూడా ఏమంత భాషా పండితులు కారు అన్నది ఆయన సంపుటాలకి ముందుమాటలు రాసినవారంతా పరిశీలన ద్వారా అనుకున్న అభిప్రాయమే! ఆ లేఖకుల అంతంత భాషా సామర్ధ్యమూ .. వారి వారి సొంత పలుకుబడీ కలిసి ఆ రాగిరేకుల రాతలో మిళితమై పోవడానికి ఎంతో వీలున్నది. కనుక రాగిరేకులలోని రాత ఆధారంగానే మనం ఇది ఖచ్చితంగా అన్నమయ్య పలుకుబడి అన్న ఒక్క మాటతో ఒక అభిప్రాయానికి వచ్చేయలేము.

    ఇంక ఉచ్చారణకి సంబంధించి మనకి చదువుకున్న వారి మాట ఒకటి, అంతగా చదువుకోని వారి మాట ఒకటి సమజంలో అన్ని కాలాల్లోనూ ఉండింది. అందులో చదువుకున్న వారి “చ” చదువుకోని వర్గాల దగ్గరికి వచ్చేసరికి “స” “శ” గా మారిన ఉదాహరణలెన్నో ఉన్నాయి. ఇంక మాండలిక భేదాలలో (జిల్లా జిల్లాకీ కనిపించేవి) ఇటువంటివి ఇంకా బాగా కనిపిస్తాయి. ఇటువంటి వాటికి ప్రతేకంగా నేను ఉదాహరణల్ని ఇవ్వనఖ్ఖరలేదనుకుంటాను.

    ఇంతకీ తెలుగు వాళ్ల “వ” బెంగాలీల నోట “బ” గానూ .. కొండొకచో అటుదిటుగా కూడానూ ఉంటుందే? ఇది ఎందుకూ? వాళ్ల వర్ణమాలలో “వ” లేదు కాబోలు ? తమిళులకి సరళాలు తప్ప పరుషాలు లేనట్టు! అంతేనా?

    జయప్రభ.

  5. ప్రద్యుమ్నుడి ఉపవాసం గురించి ..nagarjuna.. అభిప్రాయం:

    11/03/2013 12:22 pm

    :))

  6. ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    11/03/2013 11:11 am

    మాన్యులు శ్రీ వాసుదేవరావు గారికి
    నమస్కృతులతో,

    ఎంత తేనెపెఱను గుండెల్లో ఎన్నాళ్ళుగా దాచుకొన్నారో గాని, ఋషిఋణం తీర్చుకోవాలని కాబోలు, ఇంత కాలానికి బయటపెట్టారు.

    ఎంత అందంగా వ్రాశారండీ!

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  7. ఈమాట నవంబర్ 2013 సంచికకు స్వాగతం! గురించి మోహన అభిప్రాయం:

    11/03/2013 10:54 am

    లైలాగారు, As they say, all are equal; but some are more equal than others 🙂 నన్నెవ్వరు అడగలేదు, కాని నా ఉద్దేశములో ఏ రచన ప్రత్యేకమైనదో కాదో పాఠకులు నిర్ణయిస్తారు. రచన అనేది ఒక ధనుర్ముక్త బాణములాటిది. అది దూసుకొనిపోయి ఎవరి హృదయాన్ని తాకుతుందో, ఎవరి కెరుక? విధేయుడు – మోహన

  8. అల బేల మరుల స్వామి గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    11/03/2013 9:47 am

    కనక ప్రసాద్:

    మీ సాహిత్యాన్ని అహిర్ భైరవి రాగంలో పాడిన నచికేత యక్కుండి అత్యుత్తమ గాయకుడే! ఈ పాట విని నేను చాలా ఆనందించాను. రాగ లక్షణం సంవృద్ధిగా పాటలో కనపడింది. ఎన్నో ఏళ్ళ సాధన చేసిన, ఉత్తమ గురువైన బసవరాజ్ రాజ్‌గురు వంటి వారి శిష్యుల ప్రతిభకు తక్కువేమి! మంచి గాయకుని వల్ల మీ సాహిత్యం వన్నెకెక్కుతుంది.

    మీతో ఉన్న పరిచయం వల్ల, చనువుగా అడుగుతున్నా! మీ పాటల సాహిత్యం ఎందుకు అంత తేలికగా అర్ధం కాదు?

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  9. ఈమాట నవంబర్ 2013 సంచికకు స్వాగతం! గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    11/03/2013 9:36 am

    ఈమాట సంపాదకులకు:

    నవంబర్ సంచికలోని ప్రత్యేక రచనలు నిజంగా ప్రత్యేక రచనలే! నాలాగే ఈమాట పాఠకలోకం వీటిని ప్రత్యేక రచనలగానే తలుస్తారు. మీరు చేసే నిర్ణయాలపై మీరు సంజాయిషీ ఇవ్వనవసరం లేదని మీకు తెలిసినా,నాకు ఈమాటతో ఉన్న ఒకప్పటి అనుబంధంతో ఈ రెండు మాటలు రాస్తున్నాను.

    విష్ణుభొట్ల లక్ష్మన్న

  10. ఆచార్య సుబ్బరామయ్య మీనాక్షిసుందరం గురించి విష్ణుభొట్ల లక్ష్మన్న అభిప్రాయం:

    11/03/2013 9:24 am

    వాసుదేవరావు గారికి:

    ఒక మంచి గురువును, పరిశోధకుడు అయిన తెలుగు శాస్త్రజ్ఞుని పరిచయం చేసినందుకు ముందుగా మీకు ధన్యవాదాలు!!!

    మీ వ్యాసం నాకు పాత జ్ఞాపకాలను ఎన్నో గుర్తుకు తెచ్చింది. వ్యాసకర్తగా అవి కొంచెం మీతో పంచుకుందామని నా గోత్రనామాలు మీకు తెలియచేసుకుంటున్నాను.

    ఆంధ్రవిశ్వకళా పరిషత్‌లో నేను మీ చదువు పూర్తి అయిన 7,8 ఏళ్ళు తరవాత న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎం.ఎస్.సి చేసాను. అప్పటికే స్వామి జ్ఞానానంద గారి హయాంలో ఏర్పడిన న్యూక్లియర్ ఫిజిక్స్ విభాగానికి Applied Mathematics తో ఎటువంటి సంబంధాలు ఉండేవి కావు! అందువల్ల, మీ వ్యాసం ద్వారానే ప్రొఫెసర్ మీనాక్షిసుందరం గారి గురించి తెలిసి ఆనందించాను. తరవాత కాలంలో నేను Tata Institute of FundamentaL Research, Mumbai లో డాక్టరేట్ చేస్తున్నప్పుడు మీ వ్యాసంలో చెప్పిన ప్రొఫెసర్ ముస్లి గారిని కలవటం, K.G.Ramanathan వంటి TIFR Mathematicains గురించి తెలియటం మొదలైంది. ఇందుకు తోడు 1955-57 సంవత్సరాల్లో ఆంధ్రవిశ్వకళా పరిషత్ లో నాలాగే న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎం. ఎస్. సి చేసిన K.V.L.Sarma గారు నాకు పిల్లనిచ్చిన మామగారు కావటం, ఆయన TIFRలో Theoretical Physics లో ప్రొఫెసర్ గా ఉండటం వల్ల, మీరు మీ వ్యాసంలో చెప్పిన ఎన్నో విషయాలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.

    ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే, మీలాగా ఎంతో అనుభవం ఉన్న వ్యక్తులు పూనుకొని మీనాక్షి సుందరం వంటి తెలుగు తేజాలను తరవాతి తరాలకు పరిచయం చెయ్యకపోతే ఆ వివరాలు కాలగర్భంలో కలిసిపోతాయని చెప్పటానికే. మీనాక్షి సుందరం వంటి మహామహులు ఇప్పటి యువతకు నిజంగా స్పూర్తిదాతలే!

    ఒక అత్యుత్తమ వ్యక్తిని ఒక మంచి వ్యాసం ద్వారా ఈ మాట పాఠకులకి పరిచయం చేసినందుకు మీకు అనేక ధన్యవాదాలు తెలియచేస్తూ,

    అభినందనలతో,

    విష్ణుభొట్ల లక్ష్మన్న