పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. గౌతమి గురించి వనజ తాతినేని అభిప్రాయం:

    03/02/2014 10:58 pm

    కథ చదువుతున్నట్లు లేదు. దృశ్యం కదలాడినట్లు ఉంది. చాలా బాగుంది. అభినందనలు రాధ గారు.

  2. ఒక ఆదివారం ప్లాట్ఫామ్ బెంచ్‌ మీద గురించి నిశిగంధ అభిప్రాయం:

    03/02/2014 10:36 am

    “…నేనెటు వెళ్తానో, గమ్యమేమిటో నాకు తెలీదు, కానీ గమ్యానికి తెలుసు నేనోరోజు వస్తానని. అది దారిని పరిచి ఎదురు చూస్తూనే ఉంటుంది, అన్ని అనుకోని మలుపులకీ అవతల నిశ్చింతగా ఏ సందేహమూ లేకుండా. మలుపుల్లో ఎవరెవరో ఎదురుపడతారు. చేతులు పట్టుకు వదలరు కొందరు. చివరిదాకా వస్తామని చెప్పేస్తారు అలవాటైన అలవోకదనంతో. ఇద్దరికీ తెలుసు ‘చివర’ అంటే ఎవరికో. అది ప్రతి ఒక్కరికీ మారుతుందనీ, ప్రత్యేకమనీ మరెవ్వరూ రాలేరనీ తెలిసీ, అబద్ధాలు చెప్పుకుంటూ రిహార్సిల్ లేని నాటకలాడుతూ కలుస్తూ, నమ్మిస్తూ, నటిస్తూ ఉంటారు అందరూ. లేక కొందరు బహుశా; దగ్గరివారు, దగ్గర అనుకున్నవారు, దగ్గరవ్వాలనుకున్నవారు.”

    “…కానీ మీ బొమ్మల్లో కథలుంటాయి. ‘ఎగిరిపోయే మల్లెపువ్వు’ చిత్రంలో కూడా! మల్లె వెళ్లిపోయాక రాయిమీద పగులు, కానీ అడుగున ఎక్కడో…”

    “తన బంధాలు తనలోంచే, తన వృత్తంలోంచే కావాలి. బయటివన్నీ ఆటవిడుపు కోసం, ఆశని బతికించుకోవడం కోసం.”

    ఇలా అయితే మళ్ళీ మొత్తం ఇక్కడ పేస్ట్ చేస్తానేమో! ప్రతివాక్యమూ పట్టి ఆపేసినా ఇవి మాత్రం చాలాసేపే కూర్చోబెట్టి మరీ కలవరపరిచాయి!

    జస్ట్ టూ గుడ్!

  3. ఒక ఆదివారం ప్లాట్ఫామ్ బెంచ్‌ మీద గురించి సాయి పద్మ అభిప్రాయం:

    03/02/2014 9:11 am

    మార్మికత నాకు అర్ధం కాదు. చాలా సార్లు మర్మం లేకుండా ఒక వాక్యం రాయటం ఎంత సులభమో అంత కష్టం కూడా నాకు. అలాంటి ఒక వాక్యాల సమాహారం, ఒక జీవితకాలపు మధనాన్ని ఈ పిల్ల కొన్ని వాక్యాల్లో ఇంత నెప్పితోనో, లేకుండానో ఎలా రాసేస్తుందీ అని నాకెప్పుడూ ఆశ్చర్యమే! ఒక్కోసారి ఆ ఫిలసాఫికల్ డైలమా మీద విచారం కూడా. ఎలాంటి విచారం అంటే, ‘మల్లెపూవు ఎగిరిపోయాక రాయి మీద పడ్డ పగులంత’ ‘ఎదురుచూడ్డం చేతకాని రోజున ఏడవటం మర్చిపోతానేమోనన్న భయమంత…’

    నిజమే. మిన్నాగుల్లాంటి మనిషి చేసే పనులకన్నా వానపాముల్లాంటి ఆలోచనలు ఎంత నెప్పో తెలిసినదాన్ని కనుక, స్వాతి మీద ఇష్టం లాంటి గౌరవంతో… వీలుంటే, తప్పక చదవాల్సిన మిస్టికల్ మ్యూసింగ్స్!!

  4. ఒక ఆదివారం ప్లాట్ఫామ్ బెంచ్‌ మీద గురించి కె. కె. రామయ్య అభిప్రాయం:

    03/02/2014 6:33 am

    “యూకలిప్టస్ చెట్ల ఘాటు వాసనల్లో గుప్పుమన్న మోహపు పరిమళాలు, పసుపురంగు సీతాకోక చిలకలా భుజం మీద వాలిపోయిన చలికాలపు లేతఎండ మధ్యాహ్నాలు, చినుకులా తను అరచేతిలో రాలిపడబోయేలోపు మైదానంగా నేను మారిపోయిన ఏకాంతపు సాయంత్రాలు, రంగురంగుల నిముషాలు…”

    “ఎప్పుడో, ఏ దశాబ్ధానికో పుష్కరానికో తగలడం కాకుండా నిజంగానే కలుస్తారెవరో, నాకు మాత్రమే కావలసినవాళ్ళు, మర్చిపోవడం తరం కాని వాళ్ళు.”

    త్రిపుర తండ్రితో మాకు దొరికిన, దొరికి చెయిజారిపోయిన అపురూప క్షణాల అలౌకికానందాలకు అక్షరరూపం ఇచ్చినట్లుగా భావన కలిగించిన రచయిత్రి స్వాతికుమారి గారికి (త్రిపుర గారి వీరాభిమానికి) కృతజ్ఞతలు.

  5. కోనసీమ కథలు: శిరోముండనం గురించి మోహన అభిప్రాయం:

    03/01/2014 9:01 pm

    ఎంతమంది పూర్వసువాసినులు ఇలా బాధ పడ్డారో ఆ కాలములో! కళ్లను చెమరించే చక్కని కథ! విధేయుడు – మోహన

  6. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి పూర్ణిమ అభిప్రాయం:

    03/01/2014 12:27 pm

    పర్లేదు. త్వరలోనే ఈ వ్యాసం వస్తుందని ఆశిస్తూ, ఎదురుచూస్తుంటాం.

  7. కోనసీమ కథలు: శిరోముండనం గురించి Gowri Kirubanandan అభిప్రాయం:

    03/01/2014 11:35 am

    “పోయింది జుట్టు కాదురా! స్వేచ్ఛ!”
    అక్షర సత్యం ఈ మాటలు. ఒక స్త్రీ సాటి స్త్రీపట్ల ఎలా రాక్షసంగా ప్రవర్తించ గలుగుతుందో ఊహకి అందని విషయం.

  8. కంప్యూటింగ్ పూర్వాపరాలు, సాధ్యాసాధ్యాలు – 8: దిగ్భ్రమ కలిగించే గూడెల్ మేధోక్రీడ గురించి మల్లేశ్వరరావు పొలిమేర అభిప్రాయం:

    02/28/2014 6:15 pm

    హనుమంతరావు గారు మీ అభిరుచికి, తెలుగులో వివరించే విధానము బాగా నచ్చాయి. గణితం గురించి ఎన్నో కొత్త విషయాలను అందరికి తెలియ జేస్తున్నారు. మీకు నా అభినందనలు..

  9. స్పందన: నన్నెచోడుడు ప్రబంధయుగానంతర కవియా? గురించి మోహన అభిప్రాయం:

    02/20/2014 10:17 am

    భూవినుతుఁ, డార్యజనపూజితుఁడు, సద్గుణవిభూషితుఁడు, సర్వా-
    శా వివర పూరిత విశాల శర నిర్మలయశఃప్రసరశోభితుఁడు, సద్భూ
    దేవకులశేఖరుఁడు, దేవమునిముఖ్యుఁడు, సుధీజనవరేణ్యుఁడు, ప్రియుండై
    యీ వసుధ శిష్టతతి కిష్టఫలయుక్తముగ నిచ్చు దయ మంగళమహాశ్రీ

    ఇది నన్నెచోడుని మంగళమహాశ్రీ పద్యము. ఇందులో మొదటి పాదములో చివరి రెండు గురువులకు ముందు ఒక పంచమాత్ర లోపించియున్నది. ఒక వేళ మానవల్లి రామకృష్ణకవియే దీనిని వ్రాసియుంటే ఇలా పద్యమును అసంపూర్ణముగా వదలియుండడు గదా? అందువలన ఇది నన్నెచోడుని పద్యమే అనుకోవాలి.

    విధేయుడు – మోహన

  10. నాకు నచ్చిన పద్యం: అశోకవనంలో సీత వర్ణన గురించి రహ్మానుద్దీన్ అభిప్రాయం:

    02/19/2014 10:46 am

    నాయికను పోల్చడానికి సూర్య చంద్రులనూ, ఇంద్రధనస్సునూ, మొ॥ ఇతర వస్తువులతో పోల్చడం పరిపాటి. ఇక్కడ నాయికను నాయకుడితో, నాయకుడికి సంబంధించిన వస్తువులతో పోల్చి సరికొత్త పోకడకూ, వినూత్న ప్రయోగానికీ తెఱ తీశారు కవి సామ్రాట్.

    కల్పవృక్షంలో నాకెంతో నచ్చిన పద్యమిది!