పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    03/04/2014 10:06 am

    వేమూరి గారు: వెండీ డానిగర్ విదేశీ పరిశోధకురాలు కాబట్టి ఆమె వెలిబుచ్చిన అభిప్రాయాలు ఆక్షేపణలలా కనిపించాయన్నది వాస్తవమే కావచ్చు. నిజానికి హిందువులు కానివారు వెండీ డానిగర్ పుస్తకం చదివితే హిందూ మతంలో తొలినుండి కనిపించే భిన్నత్వంలో ఏకత్వం, కొత్త కొత్త ఆలోచనలను తనలో ఇమిడ్చుకోగలిగే విశాల దృక్పథం మొదలైన వాటి గురించి ఆమె వివరించిన విధానాన్ని బట్టి హిందూ మతంపై ఎనలేని గౌరవం కలుగుతుందనే నా అభిప్రాయం.

    ఇక, బైబిల్ లోని కథల గురించి పలురకాల విశ్లేషణలతో క్రైస్తవులు, క్రైస్తవేతరులు రాసిన వందలకొద్ది పుస్తకాలు వచ్చాయి. నీషీ (Nietzsche) రాసిన The Antichrist (Der Antichrist), రసెల్ (Bertrand Russell) రాసిన Why I Am Not a Christian క్రిస్టియానిటీనీ తీవ్రంగా విమర్శిస్తూ రాసిన పుస్తకాలలో కొన్ని. మతాతీత/లౌకిక లక్ష్యాలతో ఐజక్ అసిమోవ్ రాసిన Asimov’s Guide to the Bible, అమెరికన్ ప్రెసిడెంట్ థామస్ జెఫర్సన్ రాసిన The Life and Morals of Jesus of Nazareth వంటి పుస్తకాలపై కొంతమంది మతఛాందసవాదులు విరుచుకుపడ్డా ఆ పుస్తకాలు ఏ నిషేధానికి గురికాలేదు.

    విశ్వవిద్యాలయాల్లో బైబిల్ పై అధ్యయనాలు Textual criticism, Source criticism, Form criticism, Redaction criticism, Canonical criticism, Rhetorical criticism, Narrative criticism,Psychological criticism, Socio-scientific criticism, Postmodernist criticism, Feminist criticism అంటూ శాఖోపశాఖలుగా విస్తరిల్లినట్టుగా క్రిస్టియన్ స్టడీస్ పై కొన్ని పేపర్లు చూచాయగా చూసిన నాకనిపిస్తుంది. హిందూ మతానికి చెందిన వారిలో దీపక్ చోప్రా రాసిన The Third Jesus: The Christ We Cannot Ignore, Jesus: A Story of Enlightenment చూశారా? ఇందులో దేవదూతగా మనకు తెలిసిన జీసస్, చర్చి వారు వారి మతప్రచారానికి సృష్టించుకున్న వ్యక్తి అని, చరిత్రకారులు చెబుతున్న రెండవ జీసస్ కాక, అసలు జీసస్ కథ అంటూ ఊహాత్మకంగా మూడవ జీసస్ కథ చెబుతాడు. ఈ పుస్తకాలపై వివాదం కానీ, అనవసరమైన ప్రచారం కానీ జరగలేదు.

    పాకిస్తాను, ఆఫ్ఘనిస్తాన్ వంటి దేశాలు భారతదేశానికి పక్కనే ఉండడం, అక్కడ ప్రబలంగా ఉన్న తాలిబన్ ఛాందస భావాలు, వారి మతంపై, మతగ్రంథంపై ఏమాత్రం కొత్తరకమైన విశ్లేషణను సహించలేని మూఢత్వం, మన దేశంపై కూడా పడి హిందూ మతస్థులను ఈ రకమైన మతమౌఢ్యాన్ని ప్రేరేపిస్తున్నాయని నా అభిప్రాయం.

  2. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Sravya V అభిప్రాయం:

    03/04/2014 9:35 am

    సురేష్ గారు,

    నాకు కొన్ని సందేహలు, ఇవి వెండీ పుస్తకం లోని అంశాలు గురించి కానీ, లేదూ పురాణాలు ఏమి చెబుతున్నాయి అని కానీ కాదు! కొంచెం టాపిక్ నుంచి పక్కకి పోయి అడుగుతున్నందుకు క్షమించాలి (మరీ out of context కాదులెండి).

    1. ఇది మీ వ్యాసం లోని భాగం :

    [నిజానికి, కాస్త తెలివైన జడ్జి ఎవరైనా ఈ పుస్తకం క్షుణ్ణంగా చదివి ఆపై ఈ కేసు పరిశీలించి ఉంటే ఇటువంటి నిరాధారమైన అభియోగాలు ఉన్నందుకు ఈ కేసు ఎందుకు పనికి రానిదని వెంటనే కొట్టివేసి ఉండేవాడు. కానీ అలా జరగలేదు.]

    పెంగ్విన్ పబ్లిషర్స్ (ఇది ఏదో చిన్న పబ్లిషింగ్ సంస్థ కాదు కదా?) ఇది గమనించకుండా అది కూడా కోర్టు బయట ఒప్పందంతో కేసు నుంచి తప్పుకోవటం ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. దీనికి కారణం ఏదన్నా ఉందంటారా?

    2. పుస్తకం ఎవరూ ఇంత వరకు బాన్ చేయలేదు కేవలం పెంగ్విన్ పబ్లిషర్స్ వెనక్కి తీసుకున్నారు అంతే కదా? మరి వెండీనో లేదూ ఆ పుస్తకాన్ని సమర్దించేవారు చాలా మందే ఉన్నారు కదా, వీళ్ళు ఎవరన్నా వేరే పబ్లిషర్స్ నుంచి పుస్తకాన్ని రిలీజ్ చేయొచ్చు కదా?

    3. ఇండియన్ లా, అమెరికన్ లా, కంపేర్ చేసి రాశారు. అమెరికాలో జెండాని కాల్చినా నేరం కాదు ఇది అందరికీ తెలిసిన విషయమే, అదే పని ఇండియాలో చేస్తే కేసు. అది కూడా అందరికీ తెలిసిన విషయమే కదా? వేరు వేరు దేశాలకి వేరే వేరే Law policies ఉండటం నేరమా? అయినా ఒక matured సొసైటీ Lawని ఇండియా లో కూడా implement చేయమనడం మనకి బావున్నా అది సాధ్యం కాదేమో. ఆ సాధ్యాసాధ్యాలు ఏంటొ తెలుసుకోవాలి అని ఉంది.

    4. బాత్రా తనకున్న కోర్టులో కేసు వేసుకునే వెలుసుబాటు / అవకాశం ఏదో దాన్ని వాడుకుని లీగల్ గా ప్రొసీడ్ కావటంలో నేరం ఏంటి? అది అతను చేయకూడదు అని అనటం తన హక్కుని కాలరాయటం కాదా? ఇది violation of freedom స్పీచ్ కాదంటారా? ఆ లీగల్ నోటిస్ లో బుక్ ని బాన్ చేయమని లేదు కదా? ఏవో కొన్ని అంశాలు ప్రస్తావించారు. దానికి వెండీ ఎందుకు వివరణం ఇవ్వకూడదు? ఫిక్షన్ రాస్తే ఏమో కానీ, ఆల్టర్నేట్ హిస్టరీ అని చెప్తునప్పుడు వివరణలు, దానికి తగిన ఆధారాలు అవసరం కాదా?

    5. మీరు The Satanic Versesని ఇక్కడ ప్రస్తావించారు. ఆ పుస్తకం విషయం లోను, ఈ పుస్తకం విషయం జరిగిన రభస ఒక్కటేనా? తేడా లేదంటారా?

    మొత్తం మీద మాత్రం అమెజాన్.కామ్‌లో పదకొండు వేల రాంక్ ఉన్న పుస్తకం – (ఇది మీరు చెప్పినదే) మరి అంతగా పాపులర్ కానీ పుస్తకాన్ని పబ్లిషర్స్ వెనక్కి తీసుకుంటే నిజంగా చాలా నష్టం జరిగిపోతుంది అని ఇంత వాదనలు ఎందుకబ్బా వీళ్ళు కూడా లీగల్ గా ప్రొసీడ్ అయ్యి కోర్టు ద్వారానే సమాధానం చెప్పి ఉండొచ్చుగా అని కూడా అనిపిస్తుంది. ఇది ఎంత వరకు కరెక్టో అది మాత్రం తేల్చుకోలేక పోతున్నాను.

    ఈ పుస్తకానికి అస్సలు సంబంధం లేని ఇంకో సందేహం కూడా వస్తుంది — 200 / 300ఏళ్ళ తరవాత ఎవరన్నా తెలుగు వాళ్ళ చరిత్ర రాయాలని నిర్ణయించుకుంటే ఇప్పుడు వచ్చే సినిమాలు, టివిల్లో వచ్చే సీరియల్స్, తెలుగు బ్లాగుల్లో రాస్తూ ఉంటారు కదా ఇవన్నీ కూడా సోర్సెస్ అవుతాయా అని. అవుతాయేమో!

  3. నాకు నచ్చిన పద్యం: పల్లవడోలలో పసిబాలుడు గురించి చంద్ర మోహన్ అభిప్రాయం:

    03/04/2014 9:26 am

    హృద్యంగా ఉంది!

    ఇది చదువుతుంటే ఒక తమిళ సినీ గీతం గుర్తొచ్చింది. “నదియిల్ విళైయాడి, కొడియిన్ తలై శీవి నడంద ఇళన్ తెండ్రలే” అని ఓ తల్లి తన బిడ్డను వర్ణిస్తూ పాడుతుంది. “నదిలో జలకాలాడి, పూలతీగల తలలుదువ్వి నడచిన పిల్లతెమ్మెరవే” అని.

  4. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి రాజు అభిప్రాయం:

    03/04/2014 9:12 am

    మొత్తం మీద వెండీ తనకు తెలిసినట్లు తర్జుమా చేసినా మన భారతీయులలొ మన సొంత వాంగ్మయం పట్ల ఉన్న అజ్ఞానాన్ని వెలికి తీసింది. ఒక్క సారిగా భగవద్గీతను వదిలి రామయణం పై చర్చ మొదలైంది ఎందుకో అర్ధం కాలేదు. ఒక చర్చ పూర్తి కాకుండా మరొక చర్చ మొదలు పెట్టడంలా ఉంది!

  5. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి చంద్ర మోహన్ అభిప్రాయం:

    03/04/2014 9:10 am

    సురేశ్ గారూ,

    మంచి వ్యాసం. ఇక్కడ రెండు రకాల వాదాలు ఉన్నాయి:

    1. ఫలానా పుస్తకం రచయితకు తానేం వ్రాస్తుందో, ఎందుకలా వ్రాస్తోందో బాగా తెలుసు. ఆమెకు హిందూ ధర్మాన్ని కించపరిచే ఉద్దేశం ఎంతమాత్రమూ లేదు. కనుక ఆమె పుస్తకాన్ని నిషేధించడం తప్పు. (అంటే ఒకవేళ ఆమె అజ్ఞాని అయి ఉండివున్నా, ఆమె హిందువులను అవహేళన చేసే ఉద్దేశ్యంతో వ్రాసి వున్నా పుస్తకాన్ని నిషేధించితే తప్పు లేదు).

    2. అసలు ఆమె ఏం వ్రాసిందన్నది ప్రక్కన పెడితే, ఏ పుస్తకాన్నైనా నిషేధించడం, ఏ వాదాన్నైనా అది మనకు నచ్చలేదు కనుక తిరస్కరించడం తప్పు. అందులో మనకు అభ్యంతరకరమైనవి ఏమైనా ఉంటే చర్చల ద్వారా, వాదాల ద్వారా ఎదుర్కోవాలి గాని అసలు ఆ పుస్తకాన్ని అమ్మనివ్వం అని చెప్పడం మంచిది కాదు.

    ఇందులో ఏదో ఒక వాదాన్ని మీరు ఆవిష్కరించి ఉంటే గొడవలేక పోవును. ఈ రెండు వాదాలనూ కలగలిపేసి మీరు చిక్కులు కొనితెచ్చుకొన్నట్లు నాకు అనిపిస్తోంది 🙂

    నా వోటు రెండో వాదానికే.

  6. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి సురేశ్ కొలిచాల అభిప్రాయం:

    03/04/2014 8:00 am

    నాగార్జున గారు: మంచి ప్రశ్నే అడిగారు. వెండీ డానిగర్ రామాయణ,మహాభారతాలు క్షుణ్ణంగా చదువుకుందని చెప్పడానికి ఇదో మంచి ఉదాహరణ. ఫలానా పదానికి ఫలానా ఇంగ్లీష్ పదం వాడింది కాబట్టి ఆమెకు సంస్కృతం రాదు, రామాయణ, మహాభారతాలు ఆమెకు తెలియవు అన్న విమర్శలు వింటూవుంటాం. అయితే, ఆమెకు తెలిసినన్ని పురాణ కథలు, ఉపనిషత్తుల కథలు, అనేక రకాల రామాయణ, మహాభారత కథలు — వాటిలో కనిపించే సూక్ష్మ వ్యత్యాసాలు — ఆమెకు తెలిసినంతగా మరెవ్వరికీ తెలియవని ఆమెను వ్యక్తిగతంగా ఎరిగిన వారు నాతో అన్నారు.

    మీరు చూపిన శ్లోకంలో దశరథుణ్ణి ఉద్దేశించి చెప్పిన మాటల్లో కామ- అన్న శబ్దానికి అర్థం ‘దేహ సంబంధమైన కాముకత్వం’ కాదు అన్నదే మీ ఆరోపణ, అవునా?

    రాముడు, లక్ష్మణుడు అడవులకు వెళ్ళిన తరువాత అయోధ్యలో ఉన్న తల్లిదండ్రుల గురించి వారు మాట్లాడుకున్న విషయాలను వివరించే వాల్మీకి రామాయణపు శ్లోకాలు చూడండి (అయోధ్య కాండ, 53వ సర్గ):

    స తు సమ్విశ్య మేదిన్యాం మహా అర్హ శయన ఉచితః |
    ఇమాః సౌమిత్రయే రామః వ్యాజహార కథాః శుభాః || 2-53-5

    గొప్ప శయనతల్పం పై పరుండడానికి అలవాటు పడిన రాముడు, మైదానంపై మేను వాల్చి సౌమిత్రితో ఇలా పలికాడు.

    ధ్రువం అద్య మహా రాజో దుఃఖం స్వపితి లక్ష్మణ |
    కృత కామా తు కైకేయీ తుష్టా భవితుం అర్హతి || 2-53-6

    మహారాజు నేడు రాత్రి దుఃఖం అనుభవిస్తుంటాడు. కైకేయికి మాత్రం తన కోరిక (కామా) నెరవేరినందుకు తృప్తిగా ఉండి ఉంటుంది.

    సా హి దేవీ మహా రాజం కైకేయీ రాజ్య కారణాత్ |
    అపి న చ్యావయేత్ ప్రాణాన్ దృష్ట్వా భరతం ఆగతం || 2-53-7

    భరతుడు తిరిగి వచ్చాక ఆ దేవి కైకేయి రాజ్యం కోసం ఆ మహారాజు ప్రాణాలను హరించదుకదా!

    అనాథః చైవ వృద్ధః చ మయా చైవ వినాకృతః |
    కిం కరిష్యతి కామ ఆత్మా కైకేయ్యా వశం ఆగతః || 2-53-8

    వృద్ధుడు, అనాథ అయిన ఆయన, నేను లేకుండా ఉన్న వేళ, కామాత్ముడై, కైకేయి వశంలో పడిపోయి ఏం చేస్తాడో.

    ఇదం వ్యసనం ఆలోక్య రాజ్ఞః చ మతి విభ్రమం |
    కామఏవ అర్థ ధర్మాభ్యాం గరీయాన్ ఇతి మే మతిః || 2-53-9

    మహరాజుకు కలిగిన సంకట పరిస్థితిని (వ్యసనం), మతిభ్రమణాన్ని చూస్తుంటే అర్థ, ధర్మాదుల కంటే కామమే బలమైనదని నాకనిపిస్తుంది.

    కో హి అవిద్వాన్ అపి పుమాన్ ప్రమదాయాః కృతే త్యజేత్ |
    చంద అనువర్తినం పుత్రం తాతః మాం ఇవ లక్ష్మణ || 2-53-10

    ఎటువంటి అవిద్యావంతుడైన తండ్రి అయినా స్త్రీ కోసం నావంటి పుత్రుణ్ణి త్యజిస్తాడా?

    సుఖీ బత సభార్యః చ భరతః కేకయీ సుతః |
    ముదితాన్ కోసలాన్ ఏకో యో భోక్ష్యతి అధిరాజవత్ || 2-53-11

    అయ్యో! కైకేయి సుతుడు, తన భార్యతో కోసల రాజ్యాన్ని అధిష్టించి ఒక్కడే సంతోషంగా భోగిస్తాడు.

    స హి సర్వస్య రాజ్యస్య ముఖం ఏకం భవిష్యతి |
    తాతే చ వయసాతీతే మయి చ అరణ్యం ఆశ్రితే || 2-53-12

    తండ్రి వయసాతీతుడైనాడు. నేను అరణ్యాలపాలయ్యాను. ఇక భరతుడే సర్వరాజ్యానికి అధిపతిగా కాగలడు.

    అర్థ ధర్మౌ పరిత్యజ్య యః కామం అనువర్తతే |
    ఏవం ఆపద్యతే క్షిప్రం రాజా దశరథో యథా || 2-53-13

    దశరథ రాజులాగా ఎవరైతే అర్థాన్ని, ధర్మాన్ని పరిత్యజించి కామాన్ని అనువర్తిస్తారో, వానికి ఈ రకమైన కష్టాలు తప్పవు.

    వాల్మీకి రామాయణంలో ఇంత వివరంగా చెప్పిన రాముని వచనాలు చదివాక కూడా కామ- అన్న పదం దశరథుని కాముకత్వాన్ని, స్త్రీలోలత్వాన్ని సూచించడానికి వాడిందని అనుకోవడంలో తప్పు లేదు కదా!

    వెండీ డానిగర్‌ను విమర్శిస్తున్న వాళ్ళలో చాలా మంది వాల్మీకి రామాయణాన్ని, సంస్కృతమూలాలను చదవలేదు. వీళ్ళలో కొంతమందికి సినిమాల్లో, టీవీ సీరియళ్ళలోనూ చూపిందే వారికి తెలిసిన రామాయణము. వీరందరికంటే, పలు భాషల్లో, పలురకాల రామాయణాలను తరచి చూసి కొత్త కొత్త కోణాలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్న వెండీ డానిగర్‌ దృక్కోణం నాకు చాలా ఆసక్తికరంగాను, పరిశోధనాత్మకంగానూ అనిపిస్తుంది. ఆవిడ విశ్లేషణతో వీరు ఏకీభవించకపోయినా ఫరవాలేదు కాని, ఆమె పుస్తకాన్ని పూర్తిగా చదవకుండా, సంస్కృత మూలాలతో పరిచయం లేకుండా ఆమె పాండిత్యాన్ని కించపరుస్తూ నానా మాటలు అనడం సమంజసం కాదని నా అభిప్రాయం. మీరేమంటారు?

  7. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి ..nagarjuna.. అభిప్రాయం:

    03/04/2014 5:15 am

    విశ్లేషణాత్మకమైన వ్యాసం అందించారు సురేష్ గారు. ధన్యవాదాలు.
    అయితే అంతటి ఒక scholarగా చెప్పబడుతున్న రచయిత చేసిన కొన్ని interpretations చూసాక నాకు కొంత ఆశ్చర్యం కలిగింది, చాలా పరిశోధన చేసానని చెప్పుకున్నవాళ్ళు ఇలా ఎలా అర్దం చెసుకున్నారని,
    ఉదా: In Chapter 8: THE THREE AIMS OF LIFE.. the author states “Kama represents pleasure and desire, not merely sexual but more broadly sensual—music, good food, perfume, paintings”

    but in Chapter9: THE LOSS OF SITA
    the author writes, as said by Lakshmana, “..The king is perverse, old, and addicted to sex, driven by lust” .. probably quoting this.

    ఇలాంటి striking and selective interpretations ను చూసాక కూడా రచయితలోని నిజాయితినీ ప్రశ్నించకుండా ఉండగలమా?

  8. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి రాజు అభిప్రాయం:

    03/04/2014 4:30 am

    వేమూరి గారి వ్యాఖ్య వెండీ ను సమర్ధిస్తున్నట్లు ఉంది. ఇక్కద వెండీ ఇతర దేశానికి చెందింది కనుక ఆమెపై దాడి చేయాలని కాదు ఈ వ్యాసం, దానిపై ఇప్పుడు జరుగుచున్న చర్చా. వేదొక్తమైన విషయాలను చిత్తం వచ్చినట్లు ఎవరు వ్రాసినా ఆ వ్రాతలను ఖండించ వలసిందె. ఇక భారతీయులు ఇస్లాం, క్రైస్తవ గ్రంధాలపై వ్యాఖ్యానాలు వ్రాసి ఆ వ్రాతలపై ఖండనలను పొందిన దృష్టాంతాలు చరిత్రలో నాకు తెలిసినంత వరకూ లేవు ఎందుకంటే అసలు నిజమైన భారతీయ సాధకులకు జీవిత కాలం చాలదు మన వాఙ్మయాన్ని చదివి అర్ధం చేసుకోవడానికి. ఒక వేళ వ్రాసి ఉండి ఉంటె తెలుపగలరు. విదేశీయులకు మన వేదాలపై ఆసక్తి ఉండడం వాటి ప్రాచీనత రీత్యా సహజమే.

    అసలు త్రిమతాచార్యులు చెప్పిందే పూర్తిగా మన భారతీయులకు తెలియదు అప్పుడు వెండీ లాంటి రచయితలు వ్రాసింది బాగ అర్ధమైపొయింది అని అనుకొంటే ఇహ వ్రాయవలసింది చర్చించాల్సింది ఏమీ లేదు.

  9. కోనసీమ కథలు: శిరోముండనం గురించి Madhu అభిప్రాయం:

    03/03/2014 10:56 pm

    ఛాలా మంచి కథ. హృదయాన్ని తాకిన కథ.

  10. కృషితో దుర్భిక్షం గురించి chittenraju అభిప్రాయం:

    03/03/2014 8:51 pm

    After reading this story, I recollected one of my stories published as part of americakamma kathalu published a few months ago in rachana a Telugu print magazine. It’s some what different from that story. I too center my stories around my wife.