పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. గౌతమి గురించి J K Mohana Rao అభిప్రాయం:

    03/05/2014 11:57 am

    నాకు ఈ కథలో నచ్చినది చెట్టు పాత్ర. థామస్ హార్డీ నవలలో వెసెక్స్ ప్రకృతి ఎలా ఎప్పుడు ఒక పాత్రగా ఉంటుందో, అలా ఈ కథలో చెట్టు ఎప్పుడు నేపథ్యములో అన్ని చూస్తూ వింటూ నిలిచి ఉండినది. బహుశా మూగ భాషలో పాత్రలతో మాటలు కూడ ఆడిందేమో! విధేయుడు – మోహన

  2. అన్నమయ్య సంకీర్తనల్లో కవిసమయాలు గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    03/05/2014 11:26 am

    చాలా మంచి వ్యాసం.

  3. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి indrani Palaparthy అభిప్రాయం:

    03/05/2014 10:39 am

    హేమిటో! చక్కగా పసిబాలుడి పల్లవడోలలో ఊగులాడుదామని వచ్చేసరికి, ఇలా జరిగింది. ఈ వెండీ ఎవరో, ఆవిడ రాతల్లో గీతలేమిటో! 🙂

    సముద్రవాయసం తను ప్రచురించిన పుస్తకాలను అర్జునుని బ్రహ్మశిరోనామకాస్త్రము వలె ఏల ఉపసంహరింపవలె! ఇందువలన కదా, నేనొక గొంగళీ పురుగుననీ, ఉదారవాద సమాజ చైతన్యాభిలాషియైన భారతీయత్వాన్ని బురఖా వేసి ఇరుకు వీధుల్లో నడిపిస్తున్నానని తెలిసినది.

    హ హ 🙂 బావుంది హిందుత్వవాది గారు!

    ఇంద్రాణి.

  4. అనగా అనగా ఒకరాత్రి గురించి Nagaraju Pappu అభిప్రాయం:

    03/05/2014 10:07 am

    brilliant.

  5. గౌతమి గురించి రాధ మండువ అభిప్రాయం:

    03/05/2014 7:05 am

    నాగలక్ష్మి గారికి, దమయంతి గారికి, శ్రీవాత్సవ గారికి – ధన్యవాదాలు. కౌమారంలో ఆడపిల్లలు అనే కాదు మగపిల్లలు కూడా ఎన్నో రకాల దురలవాట్లకి లోనవుతున్నారు. నేను స్వయంగా ఎంత మందినో చూసి రాసిన కథ. మీ అందరికీ నచ్చినందుకు సంతోషంగా ఉంది.

  6. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    03/05/2014 4:58 am

    ఈ వ్యాస రచయితగారు నన్నుద్దేశించి ‘మీ అభిప్రాయానికి కృతజ్ఞతలు. “త్రైగుణ్యవిషయా వేదా” అన్నప్పుడు వేద శబ్దానికి చతుర్వేదాలను ఆరోపించటం సబబు కాకపోవచ్చన్నారు. మరైతే, చతుర్వేదాలను పేర్లతో సహా ప్రస్తావించి వాటిని అపరా విద్యలుగా వర్ణించిన ముందకోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తులలో శ్లోకాల గురించి మీ అభిప్రాయం చెప్పగలరా? అని ప్రశ్నించారు.

    ఛాందోగ్యోపనిషత్తు నాదగ్గర లేదు కాబట్టి దానిలోని శ్లోకాలను ఉటంకించి అభిప్రాయం చెప్పలేను. ముండకంలో మీరడిన శ్లోకం గురించి వ్రాస్తాను. ముండకోపనిషత్తులో ప్రథమముండకంలో

    తత్రాఽపరో ఋగ్వేదో యజుర్వేద
    సామవేదోఽథర్వవేదః శిక్షాకల్పో
    వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి
    అథ పరా యయా తదక్షరమధిగమ్యతే

    అన్న మంత్రం నాలుగువేదాలనూ, వాటితో బాటుగా శిక్షాదిగా ఉన్న ఆరు వేదాంగాలనూ‌ ప్రస్తావిస్తున్నది. ఈ మంత్రం తాత్పర్యం ప్రకారం ఇవన్నీ అపరవిద్యలునూ సనాతనమైన ఆత్మను గూర్చి తెలియజేసేది మాతం అపరవిద్యగానూ చెప్పబడుతున్నాయి. నాకున్న మిడిమిడి సంస్కృతభాషాజ్ఞానానికి అవగాహన ఐనదిది. ఈ సందర్భంగా నా అభిప్రాయం క్లుప్తంగా చెప్పటానికి ప్రయత్నిస్తాను.

    నాలుగువేదాలూ సమస్తమైన (వైదిక)కర్మకలాపానికీ మూలం. ధర్మం యొక్క స్వరూపంగా భాసిల్లే విధినిషేధాలనూ ఈ వేదం ఆధారాలుగానే తెలుసుకుంటున్నాము. సమస్తమైన ఆర్షజీవనానికి శ్రుతి అంటే వేదమే ప్రమాణం. శ్రుతివిరోధం లేనంతవరకూ ఉపనిషత్తులు కూడా ప్రమాణాలు. శ్రుత్యుపనిషత్ప్రమాణాలకు విరోధం కానంత వరకూ పురాణేతిహాసాలు కూడా ప్రమాణాలే. ఇదీ మనం ఆర్షవాంగ్మయం నుండి ప్రామాణికతను గ్రహించే విధానం. శిక్షాదిగా ఉన్న ఆరు వేదాంగాలూ, వీటిని సమగ్రంగా బోధించే సమస్తశాస్త్రాలూ కూడా శ్రుతిప్రామాణ్యతను అనుసరించే తగినంత ప్రమాణాలు. కాని ఇదంతా ఇహలోక వ్యవహారంలో ధర్మానుష్ఠానానికి సంబంధించినది. స్వర్గాదికామసుఖప్రదములైన యజ్ఞాదులన్నీ కూడా వైదికమైన వ్యవహారములే. వేదాధ్యయనం కావచ్చును, యజ్ఞాచరణం కావచ్చును కాని అవేవీ స్వయంగా మోక్షప్రదమైనవి కానేకావు. అందుచేత వీటికి సంబంధించిన సమస్తవ్యవహారమూ అపరవిద్య.

    కేవలం ఆత్మాఽనాత్మవివేకసంపాదనా సాధనాలైన ఉపనిషత్తులు మాత్రము పరవిద్యను బోధిస్తున్నాయి. పునరావృత్తిరహితమైన పదమునకు చేర్చేది తత్త్వమసీతి వాక్యప్రబోధములను చక్కగా తెలుసుకున్నవాడే కాని ఏవిధమైన లౌకికవిద్యాభ్యాసం చేసినవాడూ కాడు.

    అట్టి పరావిద్యను యెఱిగినవాడు దేహాభిమానం విడచి పరమాత్మతో సంయోగం చెందుతాడు. అనేక జన్మలసాథన పట్టవచ్చు ఒక జీవికి ఆ స్థితి రావటానికి. గీతలోనే, భగవన్ముఖంగా, యోగభ్రష్టుడు తిరిగి తన యోగాభ్యాసాన్ని కొనసాగించేందుకు తగిన ఉత్తమమైన జన్మను పొందుతాడని చెప్పబడింది. అందుచేత అప్పుడప్పుడు మనకు జన్మసిధ్ధులైనవారు కూడా లోకంలో దర్శనం ఇస్తారు. కాని వారు తాము లౌకికప్రపంచంలో పదిమంది దృష్టికి రావటాన్ని ఇష్టపడకపోవచ్చు తరచుగా. అందుచేత అటువంటి వారు మనమధ్యే ఉన్నా వారి సంకల్పం లేనిదే మనం వారిని తెలుసుకోలేము. ప్రాపంచికమైన విషయాలమీద వారికి ఏ విధమైన కోరికా ఉండదు కాబట్టి వారు ఏ విధమైన అపరవిద్యలను ఆశ్రయించరు. రకరకాల సౌఖ్యాలను అపేక్షించే మనకోసమే అపరవిద్యలు. కేవలం పరబ్రహ్మమును కోరిన వారు పరవిద్యను మాత్రం ఆదరిస్తారు.ఇంతకంటే చెప్పగల అధికారిని కాదు, క్షమించాలి.

  7. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి రాజు అభిప్రాయం:

    03/05/2014 3:56 am

    రఘోత్తమరావు గారి వ్యాఖ్యకు సురేశ్ గారి సమాధానం లేదు కనుక భగవద్గీత పై రఘోత్తమ రావు గారు చెప్పినవి సత్యాలని తెలిసిపొయింది. చర్చను అర్ధంతరంగా ముగించి మరో విషయాలపై మళ్ళడం సబబు కాదు. అలాగే రామాయణంపై రఘోత్తమ రావు గారు చర్చిద్దాం అని చెప్పగా మౌనం వహించడం కూడా సబబు కాదు.

  8. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి హిందువుననుకునే ఒక హిందూత్వ వాది అభిప్రాయం:

    03/05/2014 12:46 am

    హేమిటో! చక్కగా పసిబాలుడి పల్లవడోలలో ఊగులాడుదామని వచ్చేసరికి, ఇలా జరిగింది. ఈ వెండీ ఎవరో, ఆవిడ రాతల్లో గీతలేమిటో!

    అహో! వెండీ ఇట్టి ప్రత్యామ్నాయ ప్రబంధ సుందరమైన ఆలోచనాత్మక గ్రంథమేల రాయవలె! రాసినదిపో, అది నిరంకుశ నిర్హేతుక నిర్లిప్త భారతావనియందు సముద్రవాయసమేల ప్రచురించవలె! ప్రచురించెనుపో! బాత్రా మహాశయుడు అది తనమత విశ్వాసాలను కించపరుచుచున్నదని ఏల శంకించవలె! శంకించెనుపో, అతడు ఏ పవిత్ర యుద్ధమునో చేయక, కేవలము న్యాయస్థానమును ఆశ్రయించుటయా! ఆశ్రయించెనుపో, న్యాయస్థానము తన సహజరీతిలో తన తీర్పును నేనెక్కే రైలు లాగ జీవితకాలం ఆలసింపచేయనేల! చేసెనుపో! సముద్రవాయసం తను ప్రచురించిన పుస్తకాలను అర్జునుని బ్రహ్మశిరోనామకాస్త్రము వలె ఏల ఉపసంహరింపవలె! ఇందువలన కదా, నేనొక గొంగళీ పురుగుననీ, ఉదారవాద సమాజ చైతన్యాభిలాషియైన భారతీయత్వాన్ని బురఖా వేసి ఇరుకు వీధుల్లో నడిపిస్తున్నానని తెలిసినది. మతమౌఢ్యాన్నీ, సంకుచితత్వాన్నీ, నింపుకుని పరిఢవిల్లుతున్న ఈ జాతి సంస్కృతికి నిష్కృతి లేదు. విశ్వసమాజం ముస్లిములకు సరితూగుదురు అని నిందిస్తుండగా జీవించుటెట్లు? ఈ ఆత్మన్యూనతతో మరణించుటెట్లు? అహో నా అస్తిత్వానికే ప్రమాదమొచ్చినదే! మనుటయా? మరణించుటయా? ఈ మేధావులకు టోకుగా ముస్లిములను కించపరుచు అధికారమెట్లు వచ్చేనో? సరి సరి! ఉదారవాదమన్న వామాంకస్థితముకదా! ఈ అపప్రధతో జీవించు ముస్లిములే ఆధారభూతముగా నేను కూడ మనెదును గాక!

  9. గౌతమి గురించి raadhika (naani) అభిప్రాయం:

    03/05/2014 12:32 am

    కథ చాలా బావుందండి. విడిచిన గ్రహణం తెలుగువెలుగు లో చదివానండి బావుంది.

  10. కృషితో దుర్భిక్షం గురించి బులుసు సుబ్రహ్మణ్యం అభిప్రాయం:

    03/05/2014 12:15 am

    Ravi గార్కి,
    Kota గార్కి,
    దుగ్గిరాల శ్రీశాంతి గార్కి,
    బాబురావు గార్కి,
    ధన్యవాదాలు.

    Chittenraju గార్కి,
    రచనలో ప్రచురించబడిన మీ కధ లింక్ కానీ సంచిక వివరాలు కానీ నాకు పంపించగలరా? నా మెయిల్ ఐడి srisubrahlaxmi@Gmail.com

    >>>It’s some what different from that story.

    అని వ్రాసారు మీరు కామెంటులో. పోలికలేమైనా ఉన్నాయా అని తెలుసుకోవాలని కుతూహలం గా ఉంది. ధన్యవాదాలు.