పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. కోనసీమ కథలు: శిరోముండనం గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    03/12/2014 10:26 am

    లైలాగారి ఆవేశపూరితమైన వ్యాఖ్య (ఆంగ్లంలో ఉన్నా, కష్టపడి మరీ) చదివాను.

    ఈ కథ సందర్భంగా ‘కందుకూరి వీరేశలింగంగారు ఒక పేద్ద సుద్ద మొద్దు తెలుగు మగాడు’ అని లైలాగారు ఎందుకు ఆక్షేపించారో తెలియదు. వీరేశలింగంగారు తన రోజుల్లో జీవించారు, అత్యంత అభివృధ్ధిచెందిన విశేషభావజాలం కలిగి ఉన్న (లేదా కలిగి ఉన్నా మనుకుంటున్న) మన రోజుల్లో కాదు. అది ఆయన తప్పు కాదు.

    వైధవ్యం అనేది రెండు కారణాలుగా బాధించే విషయం స్త్రీలకు. ఒకటి తనది అని విశ్వసించదగిన ఆసరా కోల్పోవటం. రెండవది తనను సమాజం ‘చాకిరీకి తప్ప మరి దేనికీ పనికిరాని మనిషిగా’ మార్చి అవమానించటం. వీరేశలింగంగారు అనేక అవమానాలకు ఓర్చుతూ ఆసరా కోల్పడిన ఆ విధవలకు తిరిగి ఆ ఆసరాను కలిగించేందుకు చిత్తశుధ్దితో పాటుబడ్డారు. యావజ్జీవం వెట్టిచాకిరీ చేసుకుంటూ నిరాదరణకు గురి అయ్యే ఆ అమాయకురాళ్ళకు పునర్జీవనం కలిగించాలని తాపత్రయపడ్డారు.

    ‘ఓ విధవరాళ్ళలారా చూడండి, మీ చుట్టూ బోలెడు మంది బోడిగుళ్ళ మగాళ్ళున్నారు కాబట్టి మీ బోడిగుళ్ళగురించి విచారం వదిలేయండి’ అని వాళ్ళకు ఒక మహత్తరమైన దివ్యసందేశం ఇవ్వాలని ఆయనకు తట్టక పోవటం కారణంగా లైలాగారు పంతులుగార్ని సుద్దమొద్దు అని వెక్కిరించటం ఎంతవరకూ సబబూ?

    ఆడపిల్లలూ చక్కగా చదువుకోవాలని పంతులుగారు ఆలోచించటం తెలుగునాట ఆడపిల్లలకు వరమైనదీ‌ లేదా ఆయన ఒక సుద్దమొద్దుస్వరూపం కాబట్టి శాపమే ఐనదీ కూడా ఒకసారి ఆలోచించవలసిందిగా లైలాగారికి నా విజ్ఞప్తి.

    స్త్రీలు నాడైనా నేడైనా శిరోముండనం అనేది తప్పకుండా ఘోరమైన అవమానంగానే భావిస్తారు. అది తప్పు భావన, వాళ్ళు అలా ఎందుకు భావించాలీ అంటే దానికి కారణం, ఇంకా ఈ‌ దేశంలో స్త్రీలు సంప్రదాయపు గడపకు లోపల ఒక కాలూ వెలుపల ఒక కాలూగా ఉన్నారు కాబట్టి వారిలో సాంప్రదాయికమైన తప్పూ-ఒప్పూ, మంచీ-చెడూ, మంగళరూపం-అమంగళరూపం వంటి అనేకానేక భావనలు మన పోష్టుమోడర్నిజం రోజులకు తగినట్టుగా ఎగిరిచక్కాపోక పోవటం వలన.

    కథకుడు మనకాలం వాడు. అయన అమ్మమ్మ చాలా పాతకాలం మనిషి. అప్పటి వారి బుఱ్ఱల్లో సంప్రదాయపు వాసనలు ఇంగువకట్టినగుడ్డవాసనలుగా కాక ఇంగువవాసనల ఘాటుతో ఉంటాయి. ఆవిడ తనకు జరిగిన శిరోముండనాదులను అవమానంగా భావించినా అసహాయంగా ఉండిపోయి మనశ్శాంతి కోసం ఆధ్యాత్మిక చింతనను ఆశ్రయించింది. ఆశ్చర్యకరంగా ఇది నాటికీ నేటీకి పెద్దవాళ్ళకు మనశ్సాంతి సాధనం అవుతునే ఉన్నది – మన ఆమోదమూ తిరస్కారమూ అనే వాటితో పని లేకుండానే. ఐతే, అమ్మమ్మగారి మనస్సులో ఉన్న వివేచనాజ్ఞానం ఒక మంచి సలహా ఇచ్చేందుకు గాను సంప్రదాయాన్ని బద్దలు కొట్టటానికి వెనుదీయలేదు. నోటి మాట సలహాకాకుండా, తనకు చేతనైన ద్రవ్యసహాయం కూడా చేసారావిడ.

    ఇక్కడ అమ్మమ్మగారి పాత్రలో ‘మార్పు’ కోసం తపన చూడండి – స్వయంగా తను అది సాధించుకోలేకపోయినా, మరొకరికి సమాజాన్ని మార్చటానికి తోడ్పడాలన్న ఆమె తపనను గమనించండి.

    ఇక్కడ ‘గుండు’ అనేది పదేపదే ఆవిడమీద రుద్దబడిన దురవస్థకు ప్రతీకగా ప్రస్తావించబడింది. ఆవిడ తన తలవెండ్రుకలను కొన్నింటిని దాచుకోవటంలో లైలాగారు ‘అనవసరమైన’ సౌందర్యదృష్టిని చూస్తున్నారని నాకు అనిపిస్తోంది. నేను దాన్ని ఆవిడ తాను కోల్పడిన అస్తిత్వానికి వాటిని ప్రతీకలుగా భావించటాన్ని అర్థంచేసుకున్నాను. ఈ‌ప్రపంచం తన అస్తిత్వాన్ని క్రూరంగా అణచి ఉంచినా, దాన్ని ఆవిడ తననుండి ఎన్నడూ దూరంచేసుకోలేదు అని కథ స్పష్టం చేస్తోందని ‘ఈ వెంట్రుకల’ సంగతి స్పష్టం చేస్తోందని అనుకుంటున్నాను. నేనేమీ కాకలు తీరిన విమర్శకుడను కాను కాబట్టి నా అభిప్రాయం తప్పంటే వాదించలేను.

    ఒక ఉదాహరణ చెబుతాను, నా అనుభవం లోనిది. అమ్మమ్మల కాలందాకా ఎందుకు? మా అమ్మగారి కాలం చూసినా, ఆవిడ పాతరోజుల ఛాందసం దట్టంగా ఉన్న మనిషే. వివాహాల విషయంలో ఆవిడకు శాఖాబేధం కూడా సమ్మతంగా ఉండేది కాదు చాలాకాలం పాటు. అలాంటి పెద్దావిడ ఒక సందర్భంలో ఒక వితంతువు ఐన ఆడపిల్లకు ‘అమ్మా బొట్టూకాటుకా, పువ్వులూ అన్నీ‌ పెట్టుకో, ఏమీ తప్పులేదు’ అని బోధించిటం ఎంతో ఆశ్చర్యానందాలు కలిగించింది. తమాషా ఏమిటంటే నా తరంవాడే ఐన ఆపిల్ల అన్నగారికి మా అమ్మగారి సలహా అంతగా నచ్చలేదు!

    లైలాగారితో సహా ఏ స్త్రీమూర్తులకూ నేను ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్త్రీల మనస్సులు అగాథసముద్రాలు. సామాజికపరిస్థితుల కారణంగా వారు తమతమ అభిప్రాయాలూ అభిమతాలు హెచ్చుశాతం సందర్భాలలో వెల్లడించలేక పోవచ్చును. కాని సమయం వచ్చినప్పుడు అవి బయటకు రాకుండా ఎవరూ ఆపలేరు.

    ఈ‌ కథలో కథకుడి నమ్మకాలూ ఆలోచనలూ కాదు ముఖ్యం. ఆయన అమ్మమ్మగారి సంగతీ ఆవిడ రోజుల్లోని నమ్మకాలూ ఆలోచనలూ వాటి పరిణామాలూ ముఖ్యం.

  2. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    03/12/2014 9:32 am

    చాలా సంవత్సరాల క్రిందట వార్తాపత్రికల్లో చదివిన సంగతి ఒకటి ప్రస్తావించటం అసందర్భం కాదని అనిపిస్తోంది.

    ఒకాయన తనకు చదువుచెప్పి డాక్టరేట్ (సంస్కృతంలో) ఇచ్చిన విశ్వవిద్యాలయం మీద దావా వేశారు!

    “నాకు సంస్కృతంలో అద్భుతమైన ప్రతిభ ఉందని ప్రోత్సహించి ప్రోత్సహించి పి.హెచ్‌.డి ఇచ్చారు. ఇప్పుడు నాకు మీరు చెప్పిన చదువు ఆధారంగా దొరికే ఉద్యోగం ఎంతప్రయత్నించినా ఏదీ చిక్కటంలేదు. నా దుస్థితికి మీ విశ్వవిద్యాలయంవారే బాధ్యులు. తెలిసీ తెలియని వయస్సులో ఉన్న నన్ను ‘ఇదేదో గొప్ప చదువూ’ అని మభ్యపెట్టారు. బోలెడు సంవత్సరాలు వృథాచేసారు. అంతేకాని ‘నాయనా, ఈ చదువుకు ఏ ఉద్యోగమూ దొరక్కపోయే ప్రమాదం మెండు సుమా’ అని ఎన్నడూ‌ చెప్పక నన్ను చిన్నవాడిని చేసి మోసం చేసారు” అని ఆయన వాదన అట.

    ఇప్పుడు పరిస్థితి మరింత దిగజారిందని అనిపిస్తోంది.

    కొసమెఱుపు ఏమిటంటే, బోలెడు మంది విద్యార్థులు సంస్కృతం చదువుతున్నారు స్కూళ్ళల్లో. కాని వాళ్ళల్లో ముప్పాతికమువ్వీసం మందికి రామశబ్దం కూడా రాదు. తమాషాగా 95% పైనే మార్కులు వచ్చేస్తున్నాయి వాళ్ళందరికీ.

    ఇ.బి. నాష్‌ పుస్తకాలూ, కెంట్ పుస్తకాలూ చదవకుండానే హోమియో డాక్టర్లైపోవచ్చును. కాళిదాసు ఎవరో తెలియకుండానే సంస్కృతం చదివేసి పరీక్షలిచ్చేయవచ్చును. హతవిధీ!

  3. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి Yoga అభిప్రాయం:

    03/12/2014 7:28 am

    ఒరి నాయనొయి పంపించేసారా? పైగా మీ మీద గూగుల్ లో వెతికేసి ఇక్కడికొచ్చిందనుకోండి. ఇప్పుడావిడ మన తెలుగు సాహిత్యం మీద పడుతుందేమో అని మహా టెన్షన్ గా ఉందండీ బాబూ. ఈ పేరేదో తెలుగు వాడిది లా ఉందే… అని ఇప్పుడెమి పూనుకుంటుందో ఏమో ఆమె.

    వాడెవడో గుడ్డు విసిరాడని నిరసనగా హిందువులకి ఒక ప్రత్యమ్నాయ చరిత్ర సృష్టించేసింది. ఇప్పుడు ఇంకొకడెవడో ఈమైల్ లో ఖండించాడని… వామ్మో! ఊహించుకోడానికి… తెలుగు వాడికి ఒక కొత్త చరిత్ర వచ్చే లా ఉంది. మరి ఆ చరిత్ర లో తెలంగాన ఉంటుందో లేదో! శుభం భూయాత్!

    మనం ఆరాధించే తెలుగు సాహిత్యం బానే ఉంది. అది ఈమాట లో కూడా బానే పొందుపరిచారు (ఈ విషయం లో ఈమాట ని అభినందించాలి).

    ఇహ మన పని సెలవు! త్వరలో ఈ క్రింది పుస్తకాలకి వ్యాసాలు రాయడానికి సిధ్ధంగా ఉండాలి…

    1. Sexual perversion in Telugu literature: A result of their … ఇది వెండీ కే వదిలేస్తున్నా..
    2. No Andhra Pradesh: The discrimination of Telangana in Telugu Literature. A comprehensive study of opression through a psycho-analytical lens.
    3. Charles Philippe Brown and his obsession with Telugu: A psycho-analytical account of “desire” in South India…
    4. తరువాత టైటిల్స్ ఎవరి మారాన వారు సృష్టించుకోవచ్చు. అన్నిటికీ ప్రత్యమ్నాయం ఉండాలి కదా…వాక్స్వేచ్చ లో ఇవన్నీ అవసరం.

    ఇంకో చిన్న ముక్క కూడా:

    బాత్రా గారికి కూడా ఒక మాటు చేప్పేస్తే, ఈ పై పుస్తకాలు ప్రచురితం అవ్వక ముందే ఆయన కేసు వెయ్యడానికి సన్నాహలు సిధ్ధం చేసుకుంటారు. సురేశ్ గారు ఎలాగూ ఇవన్నీ చదువుతున్నారు కనుక, (ఆవు వ్యాసం లాగా) అవి కూడా వాక్స్వేచ్చని ఖండిస్తున్నాయని, దానికి ఎలాగూ హిందుత్వమే కారణం అని నిర్ధారించేసి, “సహేతుకంగా, నిష్పక్షపాతం”గా బేరీజు వేసి వచ్చే ఈమాట సంచికకి వ్యాసం కూడా రాసేస్తారు. దాన్ని ఈమాట సంపాదకులు కూడా అభినందించేస్తారు.

    వచ్చే సంచిక లో ఆ వ్యాసానికి ఎదురు చూస్తూ…

  4. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి SriRam అభిప్రాయం:

    03/12/2014 7:09 am

    మనం సంస్కృతాన్ని ఆ స్థాయికి ఎందుకు తేవటానికి ప్రయత్నం చేయము?

    కొంత కాలం క్రితం ఈ విషయం గురించి మాజీ డిజిపి అరవింద్ రావు గారు చర్చించారు. ప్రస్తుతం ఆ వివరాలు నాదగ్గర లేవు, లింక్ ఇవ్వలేకపోతున్నాను. ఒకప్పుడు ఓరియంటల్ కాలేజ్ లనేవి ఉండేవి. ఇప్పుడు దాదాపు అన్ని మూతపడ్డాయనుకొంటాను. బహుశా ఉంటే తిరుపతిలో ఉండేది ఇంకా కొనసాగుతుండవచ్చు. తిరుపతిలోని ప్రభుత్వ విద్యాసంస్థలన్నిటికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో టిటిడి నిధులు అందుతూంటాయి. ఇవి మూతపడటానికి ప్రధాన కారణం ప్రభుత్వ నిర్లక్షం. రాను రాను ఆ కాలేజిలో చేరేవారు హాస్టల్ సీట్ల కోసం చేరి క్లాస్లకి అటెండ్ అయ్యేవారు కాదని ఒక ఉపాద్యాయుడు చెప్పాడు.

    సంస్కృత భాష దయనీయ పరిస్థితి గురించి గురుచరణ దాస్ ఈ వ్యాసం లో వివరించారు.

    the sobering truth that an Indian who seriously wants to study the classics of Sanskrit or ancient regional languages will have to go abroad. “If Indian education and scholarship continue along their current trajectory ,” writes Sheldon Pollock, the brilliant professor of Sanskrit at Columbia University, “the number of citizens capable of reading and understanding the texts and documents of the classical era will very soon approach a statistical zero. India is about to become the only major world culture whose literary patrimony, and indeed history, are in the hands of scholars outside the country”

  5. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి రాజు అభిప్రాయం:

    03/12/2014 5:45 am

    ఎవరి రచన పై ఈ చర్చ జరుగుతుందో ఆ రచయితకు ముఖ్యంగా రఘోత్తమ రావు గారి వ్యాఖ్యలు (ఎందుకంటే ఆయన చర్చించిన తీరు, ఎంచుకున్న ఆధారాలు – భాషకు సంబంధించినవి నాకు సహేతుకంగా ఉన్నాయి కనుక; అలాగే భాష తటస్థమైనది; దానిని వాడే వారి మనసు అది అద్దం లా ప్రతిఫలిస్తుంది కనుక) పంపించాను. ఆమె వెంటనే తన జవాబు పంపింది అది క్రింది పొందుపరచాను చదువగలరు. మహోన్నతమైన భారత దేశ సంస్కృతి, సాంప్రదాయలు, భాష,ముఖ్యంగా సంస్కృత భాషపై వేద వాగ్మయం పై ఎవరు ఎప్పుడు తప్పు అన్వయాలను చేసినా దానిని ఖండించే హక్కు (అదే వాక్స్వాతంత్ర్యం) ప్రతి భారతీయునికీ ఉంది. భారతీయ తత్వ వాదాలు చెసిన త్రిమతాచార్యులు వారి వారి వాదాలను వారెంచుకున్న వేద ప్రమాణాలతో తెలియచేసారు మినహా ఎవరూ ఎవరినీ వ్యక్తిగతంగా దూషించలేదు. ఇది వారు ఏర్పరచిన అత్యుత్తమ చర్చా/వాద ప్రమాణం. దానికి మనం వారసులం కాని క్రియలలో కాదు ని ఈ చర్చలో తెలిసింది.

    ———- Forwarded message ———-
    From: Wendy Doniger
    Date: 11 March 2014 19:25
    Subject: Re: Humble submission.
    To: ivns raju

    dear dr. raju, many thanks for this; i’m always interested in responses to my work. thanks for taking the trouble to send this to me. yours, wendy

    On Mar 11, 2014, at 2:20 AM, ivns raju wrote:

    > Hi,
    > A very good day ahead to you.
    > Attached please find some of the excerpts from the discussion that took place in Face Book on your book.
    > I thought that this would provide a different perspective of your work to you and you would benefit from gaining this perspective.
    > Sanskrit is a Samadhi Bhasha, it needs to be understood based on the context by linking the Kartha, Karma and Kriya.
    > I am sure you would appreciate this. I have shared this with one of the Daily News papers in India.
    > Dr. IVNS Raju

  6. కోనసీమ కథలు: శిరోముండనం గురించి akella suryanaryana murthy అభిప్రాయం:

    03/12/2014 3:33 am

    హృదయానికి హత్తుకొంది. ఎన్నో చిన్నప్పటి సంఘటనలు గుర్తుకొచ్చేయ్.

  7. కోనసీమ కథలు: శిరోముండనం గురించి lyla yerneni అభిప్రాయం:

    03/12/2014 3:13 am

    కందుకూరి వీరేశలింగం కన్నా కూడా, సుద్ద మొద్దు తెలుగు మగాడు ఈ కధలో కథకుడు.

    కధ చెపుతున్న అతను పెద్దైనాకే, చెపుతున్నాడు. చిన్న బొప్పి అప్పుడు కాదు. ఇండియా లోనే కాక, వేరే దేశాల్లో ఉద్యోగం చేసి, వేరే కల్చర్లు కూడా చూశాక, ప్రస్తుత కాలంలో రాస్తున్నాడు. ఓ నలభై ఏళ్లుండొచ్చు అతనికే. కథలో మగవాడు ఒక్క తన అమ్మమ్మ బోడి గుండే చూచినాడా? తదుపరి తన గుండు చూసుకోలేదూ? అతనికి అమ్మమ్మ గుండు ఇమేజ్, అంద విహీనంగా, ఆమె శిరోముండనం బాధా జనకంగా ఉండటం, ఎందువల్ల?

    Weren’t there images on a book cover, (Many Ramayanas?) of Rama and Lakshmana, with shaved heads and పిలకలు.) There are images of males with no hair on their heads, in this magazine. Weren’t there depictions of Buddha, in poetry, in this magazine? There are shaven headed Buddha’s statues all over. A shaven headed Buddha seems to exude wisdom and peace and all noble sentiments. A male Brahmin exudes బ్రహ్మ వర్చస్సు, when he has a shaven head. Pravara, the Brahmin male with బోడిగుండు is so very handsome. If a man wears white clothing, he is so pure, calm and serene. What is the visual difference in a man wearing white, a man with shaved head, with white cloth covering over his head and a woman of similar attire?

    A ‘shaven head’ is a shaven head whether it is a man’s or woman’s. Then why is this male narrator of the story not repulsed by men’s బోడి గుళ్లు. How come only a woman’s shaven head elicits such a repulsion / pity in him?

    What about the baldness of many men. What is the percentage of men going bald by the time they hit forty. Is this narrator of the story going to be so vexed about men’s బట్టతలలు? Does he shed tears when he watches movie Cleopatra and sees those Roman senators, with a rim of hair around their heads. Or is he only in the habit watching Vanaja and Water, and weeping?

    ఇంకో లాగా చెప్పటానికి ప్రయత్నిస్తాను. ఏమన్నా అర్ధమవుతుందేమో. ఈ కథకుడికి, ఇంకా బిలీఫ్ – అంతకు ముందు సంస్కర్తల లానే – విధవ అనే ఒక entity ఉంది అనే. అది ‘రియల్’ అనే. పారిస్ ఉంటం, లండన్ ఉండటం ఎంత నిజమో, ‘విధవ’ అంతే, అలాటి నిజమే వీరికి. ‘విధవ’ అచ్చం ‘కథకుడి’ లానే ఉన్నా, ఆమె కున్న స్థితిగతులు అతనికీ ఉన్నా, అతడూ, అతడి తరహా పూర్వ వాసనలున్న వారూ, పర్పెట్యుయల్ డినయల్ లో ఉంటారు. What a pity!

    లైలా

    [Comment edited -ed.]

  8. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి Yugandar అభిప్రాయం:

    03/12/2014 1:32 am

    What to say about PBS except float on his sublime voice to the unseen beautiful worlds! Thanks for YT links….I kept saluting to the screen(PBS)almost naturally….I could hear his Shanti Nivasam shlokam at least a million times….Thanks for the unforgettable rhythms, sounds and voice like velvet! RIP PBS!

  9. బల్లి ఫలితం గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    03/12/2014 12:37 am

    శ్రీఏల్చూరివారు చక్కగా సందేహనివృత్తి చేసారు. వారికి ధన్యవాదాలు.

  10. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి hareesh అభిప్రాయం:

    03/11/2014 9:19 pm

    I completely agree with the author of this essay that one should have absolute freedom expression. It is impossible to find out first how each one would react and then write something. Any fetters of freedom of expression would completely kill creativity.

    I understand that the book “Ramayna vishavriksham” written by Ranganayakamma was neither banned nor was any criminal action taken against her. Instead, Tenneti Hemalatha, (if I am right) had written another book condemning Vishavriksham (Vishavrikshna Khandana).That should be the spirit and similarly any one who didn’t like the book written by Wendy must take to writing explaining why such works are objectionable. I also heard that some one wrote Khandana of Vishavriksha Khandana also and I request through these columns to let me know who was that.

    Hareesh