పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16475

  1. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి ప్రసాద్ అభిప్రాయం:

    03/14/2014 10:37 am

    అన్నయ్య గారి ఈ మాటతో నేను ఏకీభవిస్తున్నాను.

    “మీ వ్యాసంపై వచ్చిన కొన్ని కామెంట్లను పరిశీలిస్తే చాందసులు మతమౌఢ్యం ముసుగు కనిపించకుండా పాండిత్యప్రకర్ష ప్రదర్శిస్తూ మీ అభిప్రాయాలపై దాడిచేయడం శోచనీయం.”

    నాలాంటి సామాన్యుడు వేలు పెట్టలేని విధంగా పాండిత్యాన్ని ప్రదర్శిస్తే తిమ్మిని బొమ్మిని చేయవచ్చు.

  2. ముగ్గురు సాధువులు గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    03/14/2014 10:30 am

    ఈ‌ కథను నేను ‘ఒకయోగి ఆత్మకథ’ పుస్తకంలో చదివినట్లు గుర్తు.

    ఈ అనువాదం కూడా బాగుంది.

    జపమాల, విభూతి వంటి అర్షసంప్రదాయానికి చెందినపదాల వాడకం సందర్భోచితంగా ఉంది.

    పాస్టరుగారి ప్రార్థనలో శరణాగతికన్నా డాంబికత హెచ్చుపాళ్ళలో ఉండటమూ, లంకలోని సాధువులకు డాంబికతలేని శరణాగతి లక్షణం ఉండటమూ ఈ కథలో గమనార్హం. అందుకే వారివారి ప్రార్థనలు ఫలప్రదంకావటంలో తేడావచ్చింది.

    “ఆ దూరంగా కనబడే లంకలో ముగ్గురు సాధువులున్నారనీ, వాళ్ళొక వింత జీవితం గడుపుతున్నారనీ ఇతను చెప్తున్నాడు.” వంటి కొద్ది అసహజ ధోరణిలోని వాక్యాలు పరిహరించి శర్మగారు సరళీకరించి చెప్పటానికి ప్రయత్నించాలని నా అభిప్రాయం.

  3. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి ప్రసాద్ అభిప్రాయం:

    03/14/2014 10:27 am

    Yoga గారి వాదన ఇంతవరకూ బాగా enjoy చేశాను. అయితే March 12, 2014 5:39 pm వాఖ్య తర్వాత ఆయన వాదనమీది భ్రమలు పఠాపంచలయ్యాయి!

    రెండు నెలల్లో ముగింపు అన్న వారి సంబరం చూస్తుంటే ముచ్చటేస్తున్నది.

  4. గౌతమి గురించి తాడిగడప శ్యామలరావు అభిప్రాయం:

    03/14/2014 10:14 am

    రాధగారూ,

    నాకు బధ్ధకం చాలా ఎక్కువండీ. ఒక్కోసారి ఏకబిగిన గంటలకు గంటలు పనిచేస్తాను. ఒక్కోసారి రోజుల తరబడి స్థబ్దుగా కూర్చుంటాను. అలాగే నా ఆరంభశూరత్వం అనే అచ్చతెలుగులక్షణం పుణ్యమా అని నేను మొదలుపెట్టిన పనులు కూడా తరచుగా మధ్యలోనే పడకేసి అలా పడుంటాయన్నమాట. ఇలాంటి అనవసరమైన లక్షణాలు తగ్గటం‌ లేదు కాని, చాదస్తం మాత్రం పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. ఒక్కోసారి వీరావేశంతో వ్యాఖ్యానం చేసేసి, ఎందుకంత చాదస్తంగా వ్రాశానా అని ఆశ్చర్యపడుతూ ఉంటాను తీరిగ్గా.

    మీ‌ కథ దాకా వచ్చి కూడా మరి రెండు రోజులదాకా బధ్ధకించి చదవనే లేదు. తీరా చదివాక నాలుగు ముక్కలు గిలక్కుండా ఉండలేక పోయాను. నా మాటలు మీకు నచ్చినందుకు చాలా సంతోషం.

    నా విమర్శలు కూడా రచయితలూ / రచయిత్రులూ గమనికలోనికి తీసుకోవటం అన్నది గమనించాను కాబట్టి, ఇకమీద మరింత బాధ్యతగా నా అభిప్రాయాలు చెబుతూ ఉండటానికి ప్రాయత్నిస్తాను.

  5. రెండు అమెరికన్ రుతాలు గురించి ప్రసాద్ అభిప్రాయం:

    03/14/2014 9:46 am

    “భూమికి అటువేపు
    నాకోసం చూసి చూసి
    రాలి ఎండిన కొండ రేగుపళ్ళు”

    రెండు అద్భుతమైన అమెరికన్ రుతాల వెనుక మరిచిపోని భూమికి అటువేపున రేగుపళ్ళ జ్ఞాపకం అద్భుతం!

  6. హిందూమత చరిత్రలో ప్రత్యామ్నాయ కథనాలకు ఆస్కారం లేదా? గురించి annaiah అభిప్రాయం:

    03/14/2014 8:32 am

    సురేశ్ కొలిచాల గారూ…

    మీ విశ్లేషణా వ్యాసం అసక్తికరంగా, విజ్ఞానదాయకంగా ఉంది. ఎన్నో విషయాలు తెలిపారు. ధన్యవాదాలు. అభిప్రాయభేదాలను దీర్ఘ సంవాదాల ద్వారా పరిష్కరించుకొనే ఘనమైన సంప్రదాయం ఉన్న మన జాతికి ఇలా పుస్తకనిషేధాలు, పరిశోధకులపై బెదిరింపు దాడులు, భావప్రకటనాస్వేచ్ఛపై నియంత్రణలు — మునుపెన్నడూ లేని మతమౌఢ్యాన్ని, ఆత్మన్యూనతను పంచి పెంచి పోషిస్తాయే తప్ప ఏ రకంగానూ మేలు చేయవు. మీరన్నది ముమ్మాటికి నిజం. మీ వ్యాసంపై వచ్చిన కొన్ని కామెంట్లను పరిశీలిస్తే చాందసులు మతమౌఢ్యం ముసుగు కనిపించకుండా పాండిత్యప్రకర్ష ప్రదర్శిస్తూ మీ అభిప్రాయాలపై దాడిచేయడం శోచనీయం. డానిగర్‌ను మత కోణంలో చూడకుండా ఆమె మంచి పరిశోధకురాలిగా భారతీయ వేదవాజ్ఞ్మయంపై ఆమెకున్న అపార ప్రజ్ఞను తెలియజేస్తూ ఆమె రచనలను కూడా తెలియపర్చారు. చరిత్రను ఎలా అర్ధం చేసుకోవాలో ఆమె మాటలనే ఉటంకిస్తూ చక్కగా వివరించారు.

    హుస్సేన్‌ని కాషాయ మూకలు ఎన్ని రకాలుగా వేధించినదీ, ఎలా ఈ దేశం వీడి వెళ్లిపోయేలా చేసిందీ చూశాము. చివరికి పరాయి గడ్డపై ఆయన తుదిశ్వాస వీడాల్సిన దుస్థితికి ఈ మత ఛాందసవాద శక్తులే కారణం. హుస్సేన్‌ మరణించి ఆరేళ్లు గడచినా రచయితలు, కళాకారులు, చిత్ర నిర్మాతలు, ఇతర సృజనాత్మక రంగాలకు చెందిన ప్రముఖులను మత మౌఢ్యశక్తుల బారి నుంచి కాపాడేందుకు ఎలాంటి చర్యా తీసుకున్న పాపాన పోలేదు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాజకీయ ఫాసిస్టులు, వారి కనుసన్నల్లోని సాంస్కృతిక ఫాసిస్టులు కలిసి ఈ దేశంలో ప్రజాస్వామ్యాన్ని నిలువునా ఖూనీ చేస్తాయన్న ఆందోళన చాలామంది వ్యక్తం చేస్తున్నారు. ప్రగతిశీల, లౌకిక, ప్రజాతంత్రవాదులంతా ఒక్కటై మత ఛాందసవాద శక్తులను ఒంటరిపాటు చేయాలి.

    ఆర్‌. అన్నయ్య
    కర్నూలు.

  7. కోనసీమ కథలు: శిరోముండనం గురించి Brahmanandam Gorti అభిప్రాయం:

    03/14/2014 1:39 am

    లైలాగారూ,

    మీ ఆవేశమూ, భావమూ అర్థం చేసుకోగలను. నేను చెప్పదల్చుకున్న లేదా చెప్పిన కథలో “నేను” అనే కథకుడు మామూలు మగాడు. అతనికి అమ్మమ్మ పట్ల సింపతీ ఉంది కానీ ప్రేమ లేదు. గౌరవం లేదు. ఆప్యాయత అంతకంటే లేదు. ఆ జాలి లేదా సింపతీ ఆమె స్థితి చూసి కాదు. ఆమె దుఃఖానికి చిన్నప్పటి అతను సాక్షి. ఆవిడంటే అస్సలు పడని కోపం చివరి వరకూ ఉంది. పెద్దయ్యాక కూడా ఉంది. కథ మధ్యలో ఒకచోట –

    ఇదంతా అమ్మమ్మ వల్లే వచ్చిందనుకుంటూ గట్టిగా పైకి తిట్టాను. “మధ్యలో అమ్మమ్మేం చేసిందట? వీళ్ళని అనలేక ఆవిణ్ణెందుకు తిట్టుకోవడం? అయినా ఆవిడంటే నీకెప్పుడూ పడదు. పోయినవాళ్ళని తిట్టుకోకూడదని…” కాచి అలా అనేసరికి కాస్త వెనక్కి తగ్గాను.- అని చెబుతాడు.

    ఒక పక్క అమ్మమ్మ స్థితి మీద జాలి ఉన్నా, ఆవిడంటే చిన్నప్పటినుండీ పేరుకుపోయిన కోపం మాత్రం పోలేదు. అందుకే ఆవిణ్ణి తిట్టుకున్నాడు. ఈ కథలో నేను పాత్రధారి పరిపక్వత లేని వ్యక్తి. చివర్లో చంద్రమతి చెప్పింది విని ఆశ్చర్య పోయాడు తప్ప ఆవిడ చర్య మీద గౌరవం పెరిగిన ప్రవర్తన కూడా లేదు. ఈ కథలో అతనిది ఒక నెగెటివ్ పాత్ర. అతను వీరేశలింగంలా ఉద్ధరించే ఉదాత్తుడూ కాదు. నెగెటివ్ షేడ్స్ ఉన్న వ్యక్తి ద్వారా చెప్పించిన కథది. మీరన్నట్లు పెర్పెట్యుయల్ డినైయల్లోనే చివరవరకూ ఉన్నాడు.

  8. గౌతమి గురించి రాధ మండువ అభిప్రాయం:

    03/13/2014 10:17 pm

    శ్యామలరావుగారూ, నమస్కారం. మీకు కథ నచ్చినందుకు సంతోషంగా ఉంది. మీరు మేఘన గురించి ప్రస్తావించగానే ‘అరె! భలే! మేఘన అంటే సందేశాలు పంపించినట్లుంది కదా!’ అనుకున్నాను. మాధవ్ గారు గౌతమి అనే పేరుని కూడా అలాగే పెట్టానని అన్నారు. అయితే సర్ నిజంగా ఈ పేర్లు నేను అసలు అనుకోకుండా పెట్టినవి.

    ఇక మీరన్న భర్త వాక్యం నిజంగా నేను మీరన్నట్లు రాయాల్సింది. ఈసారి జాగ్రత్తగా ఉంటాను. అయితే కీలకమైన మాటలు టీచర్ అనినవి మాత్రం నాకు కూడా బాగా నచ్చాయి సర్. మాధవ్ గారు మార్చాలని అన్నారు కాని నేను ఒప్పుకోలేదు. ఆ డైలాగే కథకి అందం అని నేననుకున్నాను. మీరు ప్రతి కథనీ శ్రద్ధగా చదివి మీ అభిప్రాయాలు అందరికీ తెలియచేస్తున్నారు. శ్యామలరావు గారు నా కథకి కామెంట్ రాయలేదే అని కూడా అనుకున్నాను నాలుగు రోజుల క్రితం.

    మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు.

  9. నాకు నచ్చిన పద్యం: పల్లవడోలలో పసిబాలుడు గురించి lyla yerneni అభిప్రాయం:

    03/13/2014 1:09 pm

    I am sorry! But, the poem is misinterpreted.

    మరుత్కుమారుని పసిబాలుడిగా ఊహించారేమి? సువర్ణ శ్రీ కుమారుడు, అభిమన్య కుమారుడు, లక్ష్మణ కుమారుడు – అన్నప్పుడు, వారు బుజ్జి పాపాయిలు కారు.

    They are youth. So is the wind in this poem.
    It is a springtime romantic poem. A beautiful poem indeed.

    Lyla.

  10. అనగా అనగా ఒకరాత్రి గురించి Giridhararao అభిప్రాయం:

    03/13/2014 11:25 am

    Nice one.