మానిఫోల్డ్: మనం నివసిస్తున్న భూమిని తీసుకుందాం. భూమి బల్ల పరుపు/చదునుగా ఉందా? కోడి గుడ్దు ఆకారంలో ఉందా? మనందరికీ భూమి ఆకారం బల్ల పరుపు కాదనీ అది దాదాపు గుండ్రంగా, పోలికకు కోడి గుడ్డు ఆకారం లో ఉన్న ‘వస్తువు’ అనీ తెలుసు. మనం నుంచున్న చోటు నుంచి చుట్టూ చూస్తే మాత్రం కను చూపు మేరలో భూమి చదునుగా కనపడుతుంది. భూమి మొత్తం పరిమాణంతో పోలిస్తే చదునుగా కనపడే కనుచూపు మేర పరిమాణం చాలా చాలా తక్కువ. భూమిలో ఈ ముక్కని ‘నేల’ అందాము. అసలు ఆకారం ఎలా ఉన్నా తక్కువ పరిమాణంలో చదునుగా కనపడే లక్షణం కలిగిన వస్తువు దేనినైనా ‘మానిఫోల్ద్’ అంటాము.
ఆధారం : వొల్ఫ్రాం మాథ్‌వర్‌ల్‌డ్.
శ్రీ వేమూరి, మీకు చాలా కోపం వచ్చిందని మీ మొదటి వాక్యం చెపుతోంది. నేను ఏ రకమైన నైపుణ్యాన్నీ క్లైం చేయ లేదు. నేను ఒక స్థాయిలో తర్ఫీదు పొందిన అప్లయిడ్ మాథమాటిక్స్ పంతులుని మాత్రమే.
“మీరు తెలుగు అనువాదం పేరిట సైన్స్ లొ ఇంగ్లిష్ లొ ప్రాచుర్యంలొ ఉన్న పడికట్టు పదాలకు చేస్తున్న సంస్కృతీకరణ నాకు మెచ్చుకోదగినట్టుగా అనిపించదు.”
గణితంలో నైపుణ్యం ఉందంటున్నారు. గణితంలో పాండిత్యం లేని వ్యక్తికి “మేనిఫోల్డ్” అనే భావం తెలుగులో చెప్పదలుచుకున్నప్పుడు ఏమిటి చెయ్యమంటారు? రీమాన్ చెప్పిన నిర్వచనాన్ని చెప్పి కథ కొనసాగించటమా? లేక నలుగురికీ అర్థం అయే రీతిలో “ఒక బిందు సమూహాన్ని ఊహించుకొండి,” అని మొదలు పెట్టమంటారా? తరువాత ఆ “బిందువు” అనే భావానికి విస్తృతార్థం ఎలా ఉంటుందో వివరణ ఇవ్వొచ్చు. తరగతిలో పాఠాలు ఎలా చెప్పాలో నేను చెప్పటం లేదు. “ఇంగ్లీషు నుండి తెలుగులోకి అనువాదం చెయ్యటం ఎలా?” అన్నది ఈ వ్యాసం యొక్క పరిమితమైన ఉద్దేశం. నమస్కారములతో – వేమూరి.
పరిశోధనాత్మకంగా మీరు రాసిన ఈ వ్యాసం వెల కట్టలేనిది. సి.పి బ్రౌణ్ తెలుగు భాషకో తెలుగు సాహిత్యానికో చేసిన సేవ నిస్వార్ధమైనది కాదని అది అసలు సేవ అని చెప్పుకోవటానికి ఎంత మాత్రం అర్హమైనది కాదని మీరు ప్రతి పెరాగ్రాప్ లో చెప్ప ప్రయత్నించారు. నిజమే అయి ఉండవచ్చు. అయితే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. చరిత్రలో ప్రతి పరిశోధకుడి ఉద్దేశం వెనుక డబ్బు మాత్రమే కనిపిస్తుంది. పెట్టుబడి లేకుండా లేక డబ్బు అనే ఆశ లేకుండ ఏ పరిశోధన ముందుకు సాగలేదేమో? పెట్టుబడి దారి వ్యవస్థ పరిశోధకుల చెవులు మెలి పెట్టి మరీ పరిశోధనలు చేపించుకున్నట్లు మనకు అధారాలున్నాయి. వలసవాద దురహాంకారానికి, అరిస్టోక్రసి మనస్తత్వానికి బ్రౌన్ మినహాయింపు ఎంత మాత్రం కాదు. ఆ మాటకొస్తే ఆ అరిస్టోక్రసి మన పండితులదగ్గర లేదా? నిజానికి వారు నేర్పిన విద్య కాదా మన వారు ఇప్పటికి అనుసరిస్తున్నది?
శ్రీ ఏల్చురి మురళీధర రావు గారి వ్యాసము చాలా విజ్ఞానదాయికముగా నున్నది. శబ్దార్ధ చిత్ర కవితల అర్ధ వివరణ రసవత్తరముగాను అద్భుతముగాను సాగింది. ఈ వ్యాసమును చాలా పర్యాయములు పునర్దర్శించుకోవాలి.
ఈవ్యాసం లో ఇంకా మార్పులూ గట్రా ఉన్నాయని అన్నారు. అవి రెండు రొజుల్లో చేర్చి ప్రకటిస్తామని కూడా అన్నారు. అవి ప్రకటించాకా వాటిల్లో మరిన్ని విశేషాలుంటాయని ఆశిస్తాను.
ఎప్పట్లానే ఇటీవలి నారాయణరావు వ్యాసాలలో కనిపించే అనవసరమైన తొందర ఒకటి ఇందులో కూడా కనిపించింది. అది బహుశా ఆయన ధోరణి లో వచ్చిన మార్పు కావొచ్చును.
బ్రౌన్ మీద కచ్చతో రాసినట్టుంది గానీ, మరొక దృష్టితో ఈ విశ్లేషణ కనిపించడం లేదు. ఇవాళ ఇందులో మనం కాబోలని ఒక నిట్టూర్పు విడిచి ఊరుకోవడం తప్ప తనమీదటి ఆరోపణలని కాదనో ఔననో అనడానికి ఆ బ్రౌను దొర లేడు కదా?? ప్రతీ వ్యక్తినీ వారి చేతలనీ ప్రతీ తరమూ భిన్నంగా చూస్తుంది. ఆ చూపు నారాయణ రావు చూపించిన ధోరణి లో బహుశా ఉండకపోవచ్చును. పైగా ఆకాలం లో బతికిన పండితులనీ, వారి తరవాతి కాలం లోని పండితులనీ [బ్రౌన్ ని మెచ్చుకున్న వారందరినీ కూడా] ఒక భావ దాస్యం లో భాగంగా చూపించడం ఆశ్చర్యం! తెలుగుదేశంలోని సకల పండితవర్గమూ ఈ లెఖ్ఖన ఈ ఆరోపణ కిందికి చేర్చడం ఏ రకమైన భావజాలమో మరి??
ప్రసాద్ గారన్నట్టే, అన్ని కాలాల్లోనూ బతుకుతెరువులో భాగంగా పండితులు అనేక రకాల పనులు చేసారు. ధూర్జటి శతకం లో మనకి వారి ఈ స్థితి కనిపిస్తుంది. దీన్ని అటుంచితే బ్రౌన్ దొర చేసిన పని లాంటి పనిని ఆయన కాలంలో మరొకరు కూడా చేసినప్పుడు మాత్రమే మనకి పోలిక సాధ్యమౌతుంది. అందులోని మంచి చెడులు నిర్ణయం చేయడమూ సాధ్యమౌతుంది. ఒక తరం వాళ్ళు రాజులని ఆశ్రయించారు. బతికారు. మరొక తరం వారు దొరలని ఆశ్రయించారు. బతికారు. మరొక తరం వారు మరొక దేశంలోని విశ్వవిద్యాలయాలని ఆశ్రయించారు. ఏ తరమైనా వారి వారి కాలాలకే నిబధ్ధులు. అయాకాలాలలోని మంచి చెడులకి కూడాను. అంతే కదా??
ఒఖ్ఖడు గారూ! మీకుతెలుసో లేదో గానీ తెల్లదొరలే కాదండోయ్, మన నల్ల దొరలు కూడా సమానంగా పరిశోధన పేర భారతీయ భాషలలోని వారిని కేవలం “రిసోర్స్” లకి గానూ వాడుకుని వదిలేయడమూ, ఆపై ఇంగ్లీషులో పుస్తకాలు రాసుకొని బతకడమూ చేసారు. ఉదాహరణకి ఫోక్లోర్ [జానపద వాగ్మయం] అని ఒకటి ఉంది. అందులో పనిచెసిన మన దేశీయ పండితులు కూడా అచ్చం విదేశీయులకి మల్లేనే మన జానపదులని ఇష్టం వచ్చిన రీతిలో అతి చవుకగానూ అతి హీనంగానూ వాడుకుని వారినించి విషయాలని రాబట్టి పీహెచ్డీలని పొందినవారూ ఉన్నారు. అలాంటి వాటికి ఉదాహరణగా బోలెడన్ని కధలు ప్రచారం లో ఉన్నవి.
కాటన్ దొర మనుష్యులని బెదిరించి పనులని చేయించుకోవడం వలన కనీసం డెల్టాలకి సాగు నీరొచ్చింది. కానీ మిగిలినవన్నీ వట్టి దండగ గానే మిగిలాయి కద జానపద పరిశోధనలో!! జానపదులకేం వొరిగిందీ??
అంచేత లాభ నష్టాలని మనం ఏ ప్రాతిపదిక మీద చూస్తాం అన్నది అంతే ముఖ్య విషయం అవుతుంది. అది బ్రౌన్ దొర అయినా!! మరో నల్ల దొర అయినా!!
వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి వాసుదేవ రావు ఎరికలపూడి అభిప్రాయం:
05/04/2014 11:33 pm
మానిఫోల్డ్: మనం నివసిస్తున్న భూమిని తీసుకుందాం. భూమి బల్ల పరుపు/చదునుగా ఉందా? కోడి గుడ్దు ఆకారంలో ఉందా? మనందరికీ భూమి ఆకారం బల్ల పరుపు కాదనీ అది దాదాపు గుండ్రంగా, పోలికకు కోడి గుడ్డు ఆకారం లో ఉన్న ‘వస్తువు’ అనీ తెలుసు. మనం నుంచున్న చోటు నుంచి చుట్టూ చూస్తే మాత్రం కను చూపు మేరలో భూమి చదునుగా కనపడుతుంది. భూమి మొత్తం పరిమాణంతో పోలిస్తే చదునుగా కనపడే కనుచూపు మేర పరిమాణం చాలా చాలా తక్కువ. భూమిలో ఈ ముక్కని ‘నేల’ అందాము. అసలు ఆకారం ఎలా ఉన్నా తక్కువ పరిమాణంలో చదునుగా కనపడే లక్షణం కలిగిన వస్తువు దేనినైనా ‘మానిఫోల్ద్’ అంటాము.
ఆధారం : వొల్ఫ్రాం మాథ్‌వర్‌ల్‌డ్.
శ్రీ వేమూరి, మీకు చాలా కోపం వచ్చిందని మీ మొదటి వాక్యం చెపుతోంది. నేను ఏ రకమైన నైపుణ్యాన్నీ క్లైం చేయ లేదు. నేను ఒక స్థాయిలో తర్ఫీదు పొందిన అప్లయిడ్ మాథమాటిక్స్ పంతులుని మాత్రమే.
విముక్తం గురించి Sukanya అభిప్రాయం:
05/04/2014 8:42 pm
సంస్కారవంతమైన కధాంశం
వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి Rao Vemuri అభిప్రాయం:
05/04/2014 6:07 pm
గణితంలో నైపుణ్యం ఉందంటున్నారు. గణితంలో పాండిత్యం లేని వ్యక్తికి “మేనిఫోల్డ్” అనే భావం తెలుగులో చెప్పదలుచుకున్నప్పుడు ఏమిటి చెయ్యమంటారు? రీమాన్ చెప్పిన నిర్వచనాన్ని చెప్పి కథ కొనసాగించటమా? లేక నలుగురికీ అర్థం అయే రీతిలో “ఒక బిందు సమూహాన్ని ఊహించుకొండి,” అని మొదలు పెట్టమంటారా? తరువాత ఆ “బిందువు” అనే భావానికి విస్తృతార్థం ఎలా ఉంటుందో వివరణ ఇవ్వొచ్చు. తరగతిలో పాఠాలు ఎలా చెప్పాలో నేను చెప్పటం లేదు. “ఇంగ్లీషు నుండి తెలుగులోకి అనువాదం చెయ్యటం ఎలా?” అన్నది ఈ వ్యాసం యొక్క పరిమితమైన ఉద్దేశం. నమస్కారములతో – వేమూరి.
నాకు నచ్చిన పద్యం: కీర్తికి దిక్కెవరు? గురించి తః తః అభిప్రాయం:
05/04/2014 2:08 pm
“విగ్గేల కృష్ణ శాస్త్రికి …”, ” ఆంతా సురా ఘటేశు లే …” వంటి పద్యాలు ఎంతో కొంత ఈ ‘చాటు’ సంప్రదాయానికి చెందినవని అనుకోవచ్చా కామేశ్వరరావు గారూ?
తః తః
మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి Thirupalu అభిప్రాయం:
05/04/2014 1:26 pm
పరిశోధనాత్మకంగా మీరు రాసిన ఈ వ్యాసం వెల కట్టలేనిది. సి.పి బ్రౌణ్ తెలుగు భాషకో తెలుగు సాహిత్యానికో చేసిన సేవ నిస్వార్ధమైనది కాదని అది అసలు సేవ అని చెప్పుకోవటానికి ఎంత మాత్రం అర్హమైనది కాదని మీరు ప్రతి పెరాగ్రాప్ లో చెప్ప ప్రయత్నించారు. నిజమే అయి ఉండవచ్చు. అయితే మనం ఒక విషయం గుర్తుంచుకోవాలి. చరిత్రలో ప్రతి పరిశోధకుడి ఉద్దేశం వెనుక డబ్బు మాత్రమే కనిపిస్తుంది. పెట్టుబడి లేకుండా లేక డబ్బు అనే ఆశ లేకుండ ఏ పరిశోధన ముందుకు సాగలేదేమో? పెట్టుబడి దారి వ్యవస్థ పరిశోధకుల చెవులు మెలి పెట్టి మరీ పరిశోధనలు చేపించుకున్నట్లు మనకు అధారాలున్నాయి. వలసవాద దురహాంకారానికి, అరిస్టోక్రసి మనస్తత్వానికి బ్రౌన్ మినహాయింపు ఎంత మాత్రం కాదు. ఆ మాటకొస్తే ఆ అరిస్టోక్రసి మన పండితులదగ్గర లేదా? నిజానికి వారు నేర్పిన విద్య కాదా మన వారు ఇప్పటికి అనుసరిస్తున్నది?
గణపవరపు వేంకటకవి శబ్దార్థచిత్ర పద్యాలు కొన్ని గురించి Gannavarapu Narasimha Murty అభిప్రాయం:
05/04/2014 12:51 pm
శ్రీ ఏల్చురి మురళీధర రావు గారి వ్యాసము చాలా విజ్ఞానదాయికముగా నున్నది. శబ్దార్ధ చిత్ర కవితల అర్ధ వివరణ రసవత్తరముగాను అద్భుతముగాను సాగింది. ఈ వ్యాసమును చాలా పర్యాయములు పునర్దర్శించుకోవాలి.
శ్రీ ఏల్చూరి వారికి వందనములు! అభినందనములు!
మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి jayaprabha అభిప్రాయం:
05/04/2014 11:25 am
ఈవ్యాసం లో ఇంకా మార్పులూ గట్రా ఉన్నాయని అన్నారు. అవి రెండు రొజుల్లో చేర్చి ప్రకటిస్తామని కూడా అన్నారు. అవి ప్రకటించాకా వాటిల్లో మరిన్ని విశేషాలుంటాయని ఆశిస్తాను.
ఎప్పట్లానే ఇటీవలి నారాయణరావు వ్యాసాలలో కనిపించే అనవసరమైన తొందర ఒకటి ఇందులో కూడా కనిపించింది. అది బహుశా ఆయన ధోరణి లో వచ్చిన మార్పు కావొచ్చును.
బ్రౌన్ మీద కచ్చతో రాసినట్టుంది గానీ, మరొక దృష్టితో ఈ విశ్లేషణ కనిపించడం లేదు. ఇవాళ ఇందులో మనం కాబోలని ఒక నిట్టూర్పు విడిచి ఊరుకోవడం తప్ప తనమీదటి ఆరోపణలని కాదనో ఔననో అనడానికి ఆ బ్రౌను దొర లేడు కదా?? ప్రతీ వ్యక్తినీ వారి చేతలనీ ప్రతీ తరమూ భిన్నంగా చూస్తుంది. ఆ చూపు నారాయణ రావు చూపించిన ధోరణి లో బహుశా ఉండకపోవచ్చును. పైగా ఆకాలం లో బతికిన పండితులనీ, వారి తరవాతి కాలం లోని పండితులనీ [బ్రౌన్ ని మెచ్చుకున్న వారందరినీ కూడా] ఒక భావ దాస్యం లో భాగంగా చూపించడం ఆశ్చర్యం! తెలుగుదేశంలోని సకల పండితవర్గమూ ఈ లెఖ్ఖన ఈ ఆరోపణ కిందికి చేర్చడం ఏ రకమైన భావజాలమో మరి??
ప్రసాద్ గారన్నట్టే, అన్ని కాలాల్లోనూ బతుకుతెరువులో భాగంగా పండితులు అనేక రకాల పనులు చేసారు. ధూర్జటి శతకం లో మనకి వారి ఈ స్థితి కనిపిస్తుంది. దీన్ని అటుంచితే బ్రౌన్ దొర చేసిన పని లాంటి పనిని ఆయన కాలంలో మరొకరు కూడా చేసినప్పుడు మాత్రమే మనకి పోలిక సాధ్యమౌతుంది. అందులోని మంచి చెడులు నిర్ణయం చేయడమూ సాధ్యమౌతుంది. ఒక తరం వాళ్ళు రాజులని ఆశ్రయించారు. బతికారు. మరొక తరం వారు దొరలని ఆశ్రయించారు. బతికారు. మరొక తరం వారు మరొక దేశంలోని విశ్వవిద్యాలయాలని ఆశ్రయించారు. ఏ తరమైనా వారి వారి కాలాలకే నిబధ్ధులు. అయాకాలాలలోని మంచి చెడులకి కూడాను. అంతే కదా??
ఒఖ్ఖడు గారూ! మీకుతెలుసో లేదో గానీ తెల్లదొరలే కాదండోయ్, మన నల్ల దొరలు కూడా సమానంగా పరిశోధన పేర భారతీయ భాషలలోని వారిని కేవలం “రిసోర్స్” లకి గానూ వాడుకుని వదిలేయడమూ, ఆపై ఇంగ్లీషులో పుస్తకాలు రాసుకొని బతకడమూ చేసారు. ఉదాహరణకి ఫోక్లోర్ [జానపద వాగ్మయం] అని ఒకటి ఉంది. అందులో పనిచెసిన మన దేశీయ పండితులు కూడా అచ్చం విదేశీయులకి మల్లేనే మన జానపదులని ఇష్టం వచ్చిన రీతిలో అతి చవుకగానూ అతి హీనంగానూ వాడుకుని వారినించి విషయాలని రాబట్టి పీహెచ్డీలని పొందినవారూ ఉన్నారు. అలాంటి వాటికి ఉదాహరణగా బోలెడన్ని కధలు ప్రచారం లో ఉన్నవి.
కాటన్ దొర మనుష్యులని బెదిరించి పనులని చేయించుకోవడం వలన కనీసం డెల్టాలకి సాగు నీరొచ్చింది. కానీ మిగిలినవన్నీ వట్టి దండగ గానే మిగిలాయి కద జానపద పరిశోధనలో!! జానపదులకేం వొరిగిందీ??
అంచేత లాభ నష్టాలని మనం ఏ ప్రాతిపదిక మీద చూస్తాం అన్నది అంతే ముఖ్య విషయం అవుతుంది. అది బ్రౌన్ దొర అయినా!! మరో నల్ల దొర అయినా!!
మోహమకరందం గురించి S A RAHMAN అభిప్రాయం:
05/04/2014 3:14 am
మోహ మకరందం మంచి కవిత అందించినందుకు రచయిత్రి గారికి ధన్యవాదములతో-
ఎస్.ఎ. రహమాన్.
మరి నువ్వేమో… గురించి రాధ మండువ అభిప్రాయం:
05/04/2014 1:17 am
నిశ్చింత పరమాణువైన వారు అదృష్టవంతులు – చాలా బాగా రాశారు నిశిగంధ గారూ – అభినందనలు.
ఏనాడూ విడిపోని ముడి వేసెనె గురించి avinEni bhAskar/అవినేని భాస్కర్ అభిప్రాయం:
05/04/2014 12:26 am
భాష, వాక్యాల్లో చమత్కారం, విషయాన్ని నర్మగర్భంగా చెప్పే శైలీ! Mystic Poetry చదివినట్టు ఉంది! Class Touch ఇచ్చారు!
చివరిగా బాగుంది అని తేల్చి తీర్మానంగా చెప్పలేను. కథల్లో బాగుండే ఇలాంటి కొన్ని నిజజీవితాల్లో ఎందుకో బాగుండవు.