పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16474

  1. విముక్తం గురించి Vanaja Tatineni అభిప్రాయం:

    05/10/2014 11:55 am

    అభిరుచులు కలసిన వ్యక్తుల మధ్య పెరిగే స్నేహం జీవిత భాగస్వామి అర్ధం చేసుకునే సంస్కారం రాలేదు అనే కన్నా అభద్రతాభావమే విచక్షణారహితంగా ప్రవర్తింపజేస్తుంది. డాక్టర్ మహేంద్ర కుమార్ గారి అభిప్రాయంతొ నేను ఏకీభవిస్తున్నాను రాధ గారు. కథా గమనం ఆకట్టుకుంది. అభినందనలు.

  2. విముక్తం గురించి raghava అభిప్రాయం:

    05/10/2014 11:29 am

    బాగుంది.సున్నితమైన అంశాన్ని అంతే సున్నితంగా ఆవిష్కరించారు. మైథిలి పాత్ర తాలూకు ఘర్షణను అక్షరాల్లోకి ఒదిగించిన తీరు చాలా బాగుంది.అభినందనల్మీకు.

  3. మనకు తెలియని మన త్యాగరాజు – 5 గురించి Sivalenka అభిప్రాయం:

    05/09/2014 10:10 am

    చాల మంచి వ్యాస పరంపర. శ్రీ బ్రహ్మనందం గారికి నమస్కారాలు అనడం మాత్రమే తెలుసు.

    ఈ వ్యాసాలు పుస్తకంగా తెస్తే మటుకు కొందరు వెలిబుచ్చిన అభిప్రాయాలు తప్పక జత పరచండి. అలాగే అక్కడక్కడ 19XX అని పడింది బహుశ 18xx బదులు.

    శివలెంక అయ్యవారు

  4. నన్నెచోడుని కుమారసంభవంలో ‘లలితాస్యాంబురుహంబు’ పద్యవివాదం: స్థితిస్థాపన గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    05/09/2014 10:02 am

    మాన్య విదుషీతల్లజ డా. యెర్నేని లైలా గారికి
    నమస్కృతిపూర్వకంగా,

    పార్వతీ లగ్నమనస్కుడైన శ్రీ పరమేశ్వరుని పాత్రమనోధర్మాన్ని సహృదయంతో ఆవిష్కరించిన మీ వ్యాఖ్యాఫలంగా వ్యాసాన్ని ముద్రణకు ఇచ్చేముందు ఆ భాగాన్ని తొలగించి, అక్కడి విమర్శను పునారచించాను. వ్యాసతాత్పర్యంలో మార్పు లేనప్పటికీ, పొరపాటును సవరించుకోగలిగినందుకు ఎంతో సంతృప్తి కలిగింది.

    సకృతజ్ఞంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  5. ఎండని ఏడో చేప కథ గురించి okaDu అభిప్రాయం:

    05/09/2014 7:23 am

    తెలుగు మాటలు వాడడం నాకు ఒక “ఫెటిష్‌” (అంటే, ఏ పని మీదనైనా అతిగా దృష్టి నిలపడం) గా తయారయిందని ఆక్షేపణలు కూడ వస్తున్నాయి

    ఉన్నమాటే కదండీ? 🙂

  6. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి okaDu అభిప్రాయం:

    05/09/2014 7:21 am

    బ్రౌన్ ఇటువంటి రాతలతో తెల్లారి పోడని నా ప్రగాఢ నమ్మకం.

    ఇన్నేళ్ళ తర్వాత వీళ్ళెవరో ఇంకా ప్రజలకి గుర్తుంటారా అంటే, ఉండరు కానీ మనం వాళ్ళ విగ్రహాలు కట్టి, బలవంతంగా గోంతుకలో పోసి మింగిస్తే గుర్తుపెట్టుకోక ఛస్తారా?

  7. నాకు నచ్చిన పద్యం: కీర్తికి దిక్కెవరు? గురించి Nagaraju Pappu అభిప్రాయం:

    05/08/2014 2:13 pm

    “ఇప్పుడా వ్యాప్తి కొనసాగుతోందా? అవి ఆగిపోవడానికి కారణం అచ్చుయంత్రమా?”

    This is a complex subject.

    partial perspective: There is a difference between preservation and transmission. The print medium might ensure preservation but not necessarily transmission. It is entertainment value of a piece that ensures its survival through transmission. When a piece loses its entertainment value, its transmission is also lost.

    మాయాబజారు, మిస్సమ్మ సినిమాలు ఇప్పటివరకూ అడపాదడపా వస్తూనే ఉంటాయి – టి.వి.లోనూ, సినిమా హాళ్ళలోనూ. మరో ఇరవైఏళ్ళ తర్వాత కూడా వస్తాయంటారా? మన తరవాతి తరాలవాళ్ళని అవి రంజింపచెయ్యలేకపోతే అవి ఆర్కైవులకి పరిమితం అయిపోతాయి. అందుకని “వ్యాప్తి” ఆగిపోవడానికి అచ్చుయంత్రం “మాత్రమే” కారణం అని చెప్పలేం. అచ్చుయంత్రం (డిజిటల్ టెక్నాలజీ) వల్ల ఉపయోగం మాత్రం చెప్పగలం – పూర్తిగా మాయమైపోకుండా “దాచు”కోవచ్చును.

    కానైతే, వ్యాప్తి ఆగిపోవడానికి పరోక్షంగా అచ్చుయంత్రం కారణం అవొచ్చు. Consider this – in an oral medium, relentless transmission is the only way to ensure preservation. The medium of preservation is human memory – which is expensive and effort intensive. If the cost of preservation is made effortless (as in the case of print medium) then the incentive for transmission is low.

  8. నాకు నచ్చిన పద్యం: కీర్తికి దిక్కెవరు? గురించి కామేశ్వరరావు అభిప్రాయం:

    05/08/2014 1:50 pm

    తః తః గారూ,

    నిజమే. అచ్చూ, పుస్తకమూ వచ్చిన తర్వాత పద్యాలు పుస్తకాలలో ఉండడం సహజమే అనిపిస్తుంది. ఇక్కడ ఆలోచించాల్సిన విషయమల్లా, ఒక తరం నుండి మరొక తరానికి వ్యాప్తి పొందే సంప్రదాయం ఆగిపోవడం. ఇది కేవలం అచ్చుయంత్రం వల్ల వచ్చిన మార్పా, దానితో పాటుగా వచ్చిన మార్పా అన్నది పరిశీలించాల్సిన విషయం. వ్యాప్తిలో ఉన్న రెండంశాలు – ఒకటి, వ్యాప్తి మౌఖిక రూపంలో జరగడం. రెండు, ఆ వ్యాప్తి ఒక తరం నుండి మరొక తరానికి జరగడం. మౌఖికరూపం లిఖితరూపంగా మారడానికి అచ్చుయంత్రం ప్రధాన కారణం అనుకున్నా, లిఖితరూపంలో మాత్రం తరతరానికి వ్యాప్తి జరుగుతోందా అన్నది ప్రశ్న. ఉదాహరణకు, ఇంట్లో పాడుకొనే పాటలు (స్త్రీలపాటలు, జోలపాటలు, పెళ్ళిపాటలు…) తీసుకుందాం. ఇవి కూడా చాటువుల్లా మౌఖికరూపంలో తరతరాలు వ్యాప్తి చెందుతూ వచ్చినవే. ఇప్పుడా వ్యాప్తి కొనసాగుతోందా? అవి ఆగిపోవడానికి కారణం అచ్చుయంత్రమా?

    ఇలాంటి సంప్రదాయాలు ఆగిపోవడం పట్ల నేను ఆవేదనా బాధా ప్రకటించడం లేదిక్కడ (వేలూరిగారికి అలాంటిది ధ్వనించిందంటే, బహుశా నా వ్యక్తీకరణ వల్ల కావచ్చు). ఇది సాంఘిక, సాహిత్య చరిత్రకారులు (వాటిపై ఆసక్తి ఉన్నవాళ్ళు) తప్పనిసరిగా గమనించాల్సిన ఒక ముఖ్యవిషయం అని సూచించడమే నా ఆశయం.

  9. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి katha murali అభిప్రాయం:

    05/08/2014 4:56 am

    సర్,

    దీనిని యెన్ని సార్లు చదివినా నాకు బ్రౌన్ మీద అభిమానం పెరగడమే తప్ప తగ్గడం లేదు. ఆ పెద్దమనిషి ఆ భయంకరమైన కాలంలో దోమల బారిన పడి లేదంటే కడప యెండల్లో మాడి చావక పొవడమే పెద్ద విశేషం. దానికి తోడు తెలుగు గురించి ఇంత పని చేయాలనుకోవడం కీర్తి కోసం అయి వుండదు. ఇంత మంది దొరలు వచ్చారు కదా ఒకరిద్దరినే యెందుకు గుర్తు పెట్టుకున్నాం. వాళ్ళు చేసిన పని good intention తో చేసారని అనుకొవడానికి నొప్పి యేమిటి. నిఘంటువు గురించి మీ వాదన మరీ తేలిగ్గా వుంది. రాముడు గొప్ప పాలన అందించాడు అనంటే అందులో రాముడి పాత్ర యెంత? అధికారులు మంత్రులూ సేనాధిపతులూ వీళ్ళు కదా నానా చాకిరి చేసి వుంటారు అనంటే. మంచి పాలన చెయ్యాలనుకునే సంకల్పం చాలు. అది తట్టని గాడిదలు యెన్నుంటే యేమిటి అవి మనవి అయితే యేమిటి. క్షమించాలి. మీ వ్యాసం అంతా చదివితే ‘పండితులు’ అని వచ్చిన చోటంతా ‘బ్రాహ్మణులు’ అని రావాలనే తపన కనిపించింది. రాలేదనే ధుగ్ధ కనిపించింది.

    బ్రౌన్ ఇటువంటి రాతలతో తెల్లారి పోడని నా ప్రగాఢ నమ్మకం.

  10. నాకు నచ్చిన పద్యం: కీర్తికి దిక్కెవరు? గురించి తః తః అభిప్రాయం:

    05/08/2014 4:16 am

    ధన్యవాదాలు కామేశ్వర రావు గారూ. అచ్చూ, పుస్తకమూ అంటూ ఏర్పడ్ద తర్వాత వేదమైనా నాలుకల మీద కాక పుస్తకాల్లోనే వుంటుంది. పుస్తకాలు వచ్చిన తర్వాత పుస్తకాలకెక్కకుండా (ఒక రకమైన) ప్రజల నాలుకల మీద ఉన్నవి (పచ్చి) బూతు పద్యాలు మాత్రమే అవటానికి అవకాశం ఉంది. బందా మీద దేవులపల్లి చెప్పాడన్న ప్రతీతితో ప్రజల నాలుకల మీద నలిగిన ఒక శార్దూలం నాకు తెలుసు – తః తః