“భావం ప్రధానం కానీ పేర్లు కాదని నేను నమ్ముతున్నాను”- శర్మ గారు, మీ అభిప్రాయంతో నాకు ఏకీభావం ఉండబట్టే గొర్తి వారికి బదులిచ్చాను, ఉపరితలాల మీద తిరుగాడటం మానండని… 🙂
నమస్కారం
అయ్యా, తెలుగే సరిగ్గా రాయడం చదవడం రాని పండిత పుత్రుణ్ణి నేను. (దీనికి సమాధానం కావాలంటే ఈ విషయం వినండి. విశ్వనాధ సత్యన్నారాయణ గారు రాసిన “చిన్న కధలు” పుస్తకం చదువుతున్నాను. అందులో “ఒక్క దుర్ధురమైనా కూసిందా?” అని ఉంది. దుర్దురం అంటే కోకిల అనుకున్నాను. డిక్షనరీ చూసాక తెలిసింది. అదీ నా పాండిత్యం!!) ఏదో పిచ్చి ఎక్కినప్పుడు ఇలాంటి రాతలు గెలుకుతూ ఉంటాను. ఈమాట వారికి ప్రచురించడానికి ఏమీ దొరకక (ఇలా అంటున్నందుకు సంపాదకులు క్షమించాలి) నేను రాసేవన్నీ వేస్తూ ఉంటారనుకుంటా. రష్యన్ భాషా, భలేవారే. ఇంగ్లీషే సరిగ్గా రాదు నాకు. ఇంటర్మీడియట్ దాకా తెలుగు మీడియంలోనూ, ఆ తర్వాత అత్తెసరి మార్కులతోనూ కుంటుకుంటూ డిగ్రీ పాసైన వాడిని. “L. AND A. MAUDE” వారు అనువదించినది నాకు అర్ధమైనంతలో తెలుగులో గుప్పించాను. మళ్ళీ ఈ పేరుని మాడ్ అనాలా, మాడే అనాలా అని నన్ను అడక్కండి దయచేసి. Please google “Leo Tolstoy 23 tales.” టాల్ స్టాయ్ రాసిన భావం ప్రధానం కానీ పేర్లు కాదని నేను నమ్ముతున్నాను (ఇప్పటికీ). బ్రహ్మానందం గారూ, నరేష్ గారూ దయచేసి పేర్ల మీద, అనువాదాల మీద వాదోపవాదనలు వద్దు. నమస్తే.
ఈ వ్యాసంలో చెప్పదలుచుకున్న విషయాలు అసలంటూ ఏమన్నా మీ పరిశోధనలో తేలిస్తే వాటిని క్లుప్తంగా రెండు మూడు పేజీల లో చెప్పచ్చు. అలాంటిది ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడికో వెళ్ళి, అటు వీరేశలింగం గారి నుండి కట్టమంచి అందరూ భట్రాజులనడం ఎందుకంత అసహనమో తెలియడం లేదు.మీ పరిశోధనలో సత్తా సత్యం ఉంటే అదే నిలుస్తుంది. ఆరోపణలన్నీ అర్ధ రహితంగా ఉన్నాయి. నిజానికి బ్రౌన్ జీవితం అతని లేఖలు బంగోరె పరిశోధన ఇవన్నీ చదువుకున్న మాలాంటి వారికి శ్రీనివాస్, వెల్చేరు వారు ఎందుకు ఈ వలస వాదం గొడవ మొదలుపెట్టారో అర్ధం కావడం లేదు. అసలు ఉద్దేశాలు లక్ష్యాలు లేకుండా ఈ వ్యాసం సాగడం చికాకు కలిగించింది. ఇంతా చేసి ఎక్కడా అసలు విషయం చెప్పరే. ఱ అనే అక్షరాన్ని తొలగించాడు అన్నది అతని పై ఆరోపణ అయితే, అది ఉచ్చారణకి ఇబ్బంది లేదు కనుక చేసి ఉండవచ్చును గాక. ఇక నిఘంటువులో ఇప్పటికీ మిశ్రమ పదాల నిఘంటువు ఎవరో పరాయి దేశస్థుడైన బ్రౌన్ రాశి పెట్టడం నిజంగా గొప్ప విషయం కదా. ఆ మాట కొస్తే గూటాల కృష్ణమూర్తి గారు లండన్ వెళ్ళి అక్కడి కవులను గూర్చి పరిశోధించి అక్కడి వారికే చెప్పేరు. ఇది ఎంత గొప్ప విషయం. తప్పులు ఉండవచ్చు కాదనను అప్పుడే కొందరు పండితులు కొన్ని తప్పులు ఎంచారు. నిజమే కానీ రాసింది మన భాష వాడు కాదు కదా. మనకి తెలిసిన విధంలో చదువుకుందాము. పోనీ ఆ దోషాలన్నీ వెల్చేరు వారు శ్రీనివాస్ గారు ఇప్పుడు కూర్చుని సరి చేసేస్తారా ? చేయండి పోనీ ఎవరి పట్ల ఐనా ఒక పరిశీలన పరిశోధన చేసేటప్పుడు కనీస మర్యాద ఉంది తీరాలి. పోనీ ఇప్పుడీ వ్యాసం వలన మనకి ఒరిగిందేమైనా ఉందా? వారు నేర్పిన ఆంగ్లాన్నే నేర్చుకుని వారినే తరిమి కొట్టిన మన భారతీయులు అంతా వెర్రి వారా? ఇప్పుడు వీరు కనిపెట్టిన గొప్ప విషయమేమీ లేదు బ్రౌన్ గురించి. అది వారికి సవినయంగా మనవి చేస్తున్నాను.
ధన్యవాదాలు ప్రసాద్ గారు. మీరు ఎంతో చూస్తారు మీకెందుకు తెలియదండీ ప్రసాద్ గారు. మనం అన్ని విషయాలూ విశ్లేషించుకుంటే బావుంటుంది. అభిప్రాయాలు పంచుకుంటే బావుంటుంది అందుకు ఈమాట మనకి వేదిక అయింది కదా! మరోసారి ధన్యవాదాలతో – రాధ
కినిగె వెబ్ పత్రికలో నెల నెలా మొపసా కథల నా అనువాదాలు పోస్ట్ అవుతున్నాయి కనుక, రచయిత పేరు ‘గి దె ముపాస’ అని పలకాలి అని గొర్తి వారు నాకు మెయిల్ పెట్టారు కనుక, ఇక్కడ గొర్తి సాయి బ్రహ్మానందం గారు ప్రస్తావించిన ‘పెద్ద రచయిత కమ్ జర్నలిస్టు’ నేనే కాబట్టి (పెద్ద అనే విశేషణంలో ఉన్న వ్యంగ్యాన్ని గ్రహిస్తూ) నా వివరణ ఇవ్వడానికి ఇక్కడ అసందర్భంగా జోక్యం చేసుకుంటున్నాను.
“మీ అనువాదం అస్సలు నచ్చలేదు. రచయిత పేరే తప్పు. గై డి మొపాసా కాదు. గి దె ముపాస. పూర్వం మనకి ఫ్రెంచ్ పేర్లు ఎలా పలకాలో తెలియకపోవచ్చు. ఇంటర్నెట్లో పేర్లు ఎలా పలకాలో గూగిలిస్తే తెలుస్తాయి” అని వారు హితవు చెప్పారు, నాకు రాసిన mailలో. దానికి నా బదులు ఇది:
“Pronunciations విషయంలో నేను ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా ఉంటాను. దానికి కారణం ఏమిటంటే, వాళ్లు ఎలా ఉచ్ఛరిస్తారో నానాతంటాలు పడి మనం ఆ విధంగానే పలకడానికి ప్రయత్నిస్తామే గానీ, మన విషయంలో వాళ్లు అంత శ్రద్ధ తీసుకున్నట్టు అనిపించదు. తీయని మన ‘గోదావరి’ని వాళ్లు ‘గోడావ్రి’ అని నోటికొచ్చినట్టు పలకడంలో ఏదో cultural hegemony, supremacy ని మించిన పొగరు కనిపిస్తుంది. అందుచేత, పేర్లు ఎలా పలికితే ఏమిలే అనుకుంటాను. పేర్లు పక్కన పెట్టి, అనువాదంలో ఉన్న ఇతరేతర తప్పిదాల్ని తెలియజేస్తే సంతోషిస్తాను.”
నా యీ సమాధానంతో ఆయన ఖంగుతిన్నారట (కంగుని వత్తి పలకడం ద్వారా ఆయనెంత ఇబ్బంది పడ్డారో అర్థమయ్యింది).
మన సర్వనామాలు ‘మనం రాసే స్పెల్లింగ్ ప్రకారమే వాళ్ళు ఉచ్చరిస్తారు కాబట్టి, నేరం మనదే కానీ, వారిది కాదు అంటున్నారు గొర్తి వారు. ఆయన మాటల ప్రకారమే చూస్తే, స్పెల్లింగ్ ప్రకారం Guy De Maupassant ని గై డి మొపాసా అని ఎందుకు పలక కూడదు. వారు నాకు రాసిన mailలో “గి దె ముపాస’ అని, ఇక్కడ ‘ఈ మాట’ వెబ్ లో ‘గి ద ముపసా’ అని రాసారు (రెంటిలో ఏది సరైన ఉచ్ఛారణ?). International Phonetic Alphabet (IPA) ప్రకారం
Guy De Maupassant : /gi də moʊ paˈsɑ̃/ అని ఉంది. అంటే “గి డ మొపసా” అని పలకాలని ఉంది.
రష్యన్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ రచయితల్ని వారి స్పెల్లింగ్ ల బట్టి కాకుండా, అక్కడ వారెలా పిలుస్తారో నానా తంటాలు పడి తెలుసుకోవల్సిందే అంటున్నారు గొర్తి వారు. తూర్పున ఉన్న మనం, మన లిపి వేరైనా, వారి వర్ణమాలలో వారి సౌలభ్యం మేరకి సాధ్యమైనంత కృషి చేసి వారికి మన పేర్లు రవి, గోదావరి ఇత్యాదుల్ని Ravi, Godavari అని అని వాళ్ల అక్షరాల్లో తెలియజేసుకుంటుంటే, ‘గాంధీ’ని మేము ‘గాండీ’ అని పిలుస్తామని, అలా పిలవకూడదనుకుంటే, ఎలా పిలవాలో IPA వంటి tools అందించవల్సిన అగత్యం కూడా మనదే అనడం పొగరుగానే అనిపిస్తుంది, పాశ్చాత్య భక్తి, కలోనియల్ విధేయతా బొత్తిగా లేని నాకు.
రాధ గారు, బహుశా నేను చెప్పాలనుకున్నది అర్థవంతంగా చెప్పలేదనుకుంటాను.
అలాంటి ఆలోచనలు కలగని స్నేహం ఆడా-మగా మధ్య సాధ్యం కాదని చెప్పడం నా వుద్దేశ్యం కానే కాదు. అలాంటివి ఎన్నో వుంటాయి. కేవలం ఇద్దరు మిత్రులు ఆడా-మగా అయినంత మాత్రానే వారి మధ్య లేని “అదేదో” వుందని ఆపాదించడం ఖచ్చితంగా అన్యాయమే!
అయితే, పరస్పర అభిరుచులు కలవడం, ఒకరిమిద ఒకరికి గౌరవం, ఆసక్తి పెరగడం, ఆడా-మగా మధ్య మరింత సాన్నిహిత్యానికి దారి తీసే అవకాశాన్ని మాత్రమే నేను ప్రస్తావిస్తున్నాను. అందువల్ల ఈ కథలో మైథిలి సంఘర్షణ అర్థం చేసుకోదగిందే అనిపించింది.
ఈ కథను నాగమణి గారు “తరంగ రేడియో”లో చదవగా కూడా విన్నాను. చాలా బాగుంది.
ఈమాట గురించి గురించి Rao Vemuri అభిప్రాయం:
05/21/2014 1:33 pm
మొదట వ్యక్తి పేరు, తరువాత ఇంటిపేరు రాయటం ఆంగ్లేయ సంప్రదాయమే కాదు, భారతీయ సంప్రదాయంలో కూడ ఉంది కదా: జవాహర్లాల్ నెహ్రూ, ఇందిరా గాంధీ, వగైరా. – వేమూరి
ఈమాట గురించి గురించి ప్రసాద్ అభిప్రాయం:
05/20/2014 1:06 pm
ఒక తెలుగు ప్రేమికునిగా, ఈమాట ప్రేమికునిగా ఒక మాట!
పేర్లు రాసేటప్పుడు తెలుగు సంప్రదాయము ప్రకారము మొదట ఇంటి పేరు తర్వాత వ్యక్తి పేరు వస్తే బాగుండదూ?
సురేశ్ కొలిచాల, మాధవ్ మాౘవరం, చంద్ర కన్నెగంటి, మానస చామర్తి … ఇలా ఆంగ్లేయ సంప్రదాయం నాకు చెప్పులో రాయిలా గుచ్చుకంటోంది.
ఈమాటపై భక్తితో
ప్రసాద్
ఇద్దరు మిత్రులు గురించి Naresh Nunna అభిప్రాయం:
05/20/2014 12:00 pm
“భావం ప్రధానం కానీ పేర్లు కాదని నేను నమ్ముతున్నాను”- శర్మ గారు, మీ అభిప్రాయంతో నాకు ఏకీభావం ఉండబట్టే గొర్తి వారికి బదులిచ్చాను, ఉపరితలాల మీద తిరుగాడటం మానండని… 🙂
ఇద్దరు మిత్రులు గురించి శర్మ దంతుర్తి అభిప్రాయం:
05/20/2014 9:45 am
నమస్కారం
అయ్యా, తెలుగే సరిగ్గా రాయడం చదవడం రాని పండిత పుత్రుణ్ణి నేను. (దీనికి సమాధానం కావాలంటే ఈ విషయం వినండి. విశ్వనాధ సత్యన్నారాయణ గారు రాసిన “చిన్న కధలు” పుస్తకం చదువుతున్నాను. అందులో “ఒక్క దుర్ధురమైనా కూసిందా?” అని ఉంది. దుర్దురం అంటే కోకిల అనుకున్నాను. డిక్షనరీ చూసాక తెలిసింది. అదీ నా పాండిత్యం!!) ఏదో పిచ్చి ఎక్కినప్పుడు ఇలాంటి రాతలు గెలుకుతూ ఉంటాను. ఈమాట వారికి ప్రచురించడానికి ఏమీ దొరకక (ఇలా అంటున్నందుకు సంపాదకులు క్షమించాలి) నేను రాసేవన్నీ వేస్తూ ఉంటారనుకుంటా. రష్యన్ భాషా, భలేవారే. ఇంగ్లీషే సరిగ్గా రాదు నాకు. ఇంటర్మీడియట్ దాకా తెలుగు మీడియంలోనూ, ఆ తర్వాత అత్తెసరి మార్కులతోనూ కుంటుకుంటూ డిగ్రీ పాసైన వాడిని. “L. AND A. MAUDE” వారు అనువదించినది నాకు అర్ధమైనంతలో తెలుగులో గుప్పించాను. మళ్ళీ ఈ పేరుని మాడ్ అనాలా, మాడే అనాలా అని నన్ను అడక్కండి దయచేసి. Please google “Leo Tolstoy 23 tales.” టాల్ స్టాయ్ రాసిన భావం ప్రధానం కానీ పేర్లు కాదని నేను నమ్ముతున్నాను (ఇప్పటికీ). బ్రహ్మానందం గారూ, నరేష్ గారూ దయచేసి పేర్ల మీద, అనువాదాల మీద వాదోపవాదనలు వద్దు. నమస్తే.
మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి సిద్ధార్థ అభిప్రాయం:
05/20/2014 6:28 am
సంపాదకులకి నమస్తే !
ఈ వ్యాసంలో చెప్పదలుచుకున్న విషయాలు అసలంటూ ఏమన్నా మీ పరిశోధనలో తేలిస్తే వాటిని క్లుప్తంగా రెండు మూడు పేజీల లో చెప్పచ్చు. అలాంటిది ఎక్కడో మొదలు పెట్టి ఎక్కడికో వెళ్ళి, అటు వీరేశలింగం గారి నుండి కట్టమంచి అందరూ భట్రాజులనడం ఎందుకంత అసహనమో తెలియడం లేదు.మీ పరిశోధనలో సత్తా సత్యం ఉంటే అదే నిలుస్తుంది. ఆరోపణలన్నీ అర్ధ రహితంగా ఉన్నాయి. నిజానికి బ్రౌన్ జీవితం అతని లేఖలు బంగోరె పరిశోధన ఇవన్నీ చదువుకున్న మాలాంటి వారికి శ్రీనివాస్, వెల్చేరు వారు ఎందుకు ఈ వలస వాదం గొడవ మొదలుపెట్టారో అర్ధం కావడం లేదు. అసలు ఉద్దేశాలు లక్ష్యాలు లేకుండా ఈ వ్యాసం సాగడం చికాకు కలిగించింది. ఇంతా చేసి ఎక్కడా అసలు విషయం చెప్పరే. ఱ అనే అక్షరాన్ని తొలగించాడు అన్నది అతని పై ఆరోపణ అయితే, అది ఉచ్చారణకి ఇబ్బంది లేదు కనుక చేసి ఉండవచ్చును గాక. ఇక నిఘంటువులో ఇప్పటికీ మిశ్రమ పదాల నిఘంటువు ఎవరో పరాయి దేశస్థుడైన బ్రౌన్ రాశి పెట్టడం నిజంగా గొప్ప విషయం కదా. ఆ మాట కొస్తే గూటాల కృష్ణమూర్తి గారు లండన్ వెళ్ళి అక్కడి కవులను గూర్చి పరిశోధించి అక్కడి వారికే చెప్పేరు. ఇది ఎంత గొప్ప విషయం. తప్పులు ఉండవచ్చు కాదనను అప్పుడే కొందరు పండితులు కొన్ని తప్పులు ఎంచారు. నిజమే కానీ రాసింది మన భాష వాడు కాదు కదా. మనకి తెలిసిన విధంలో చదువుకుందాము. పోనీ ఆ దోషాలన్నీ వెల్చేరు వారు శ్రీనివాస్ గారు ఇప్పుడు కూర్చుని సరి చేసేస్తారా ? చేయండి పోనీ ఎవరి పట్ల ఐనా ఒక పరిశీలన పరిశోధన చేసేటప్పుడు కనీస మర్యాద ఉంది తీరాలి. పోనీ ఇప్పుడీ వ్యాసం వలన మనకి ఒరిగిందేమైనా ఉందా? వారు నేర్పిన ఆంగ్లాన్నే నేర్చుకుని వారినే తరిమి కొట్టిన మన భారతీయులు అంతా వెర్రి వారా? ఇప్పుడు వీరు కనిపెట్టిన గొప్ప విషయమేమీ లేదు బ్రౌన్ గురించి. అది వారికి సవినయంగా మనవి చేస్తున్నాను.
ఇట్లు ..సిద్ధార్థ
[Edited -Ed.]
ఏనాడూ విడిపోని ముడి వేసెనె గురించి Amarnath అభిప్రాయం:
05/20/2014 4:29 am
నిజ జీవితాల్లో దాంపత్యం లోని అవసరాన్ని, దానితోటి ముడిపడ్డ ఆనందాన్ని చాలా బాగా చెప్పారు కథలో. Good one.
విముక్తం గురించి రాధ మండువ అభిప్రాయం:
05/20/2014 2:02 am
ధన్యవాదాలు ప్రసాద్ గారు. మీరు ఎంతో చూస్తారు మీకెందుకు తెలియదండీ ప్రసాద్ గారు. మనం అన్ని విషయాలూ విశ్లేషించుకుంటే బావుంటుంది. అభిప్రాయాలు పంచుకుంటే బావుంటుంది అందుకు ఈమాట మనకి వేదిక అయింది కదా! మరోసారి ధన్యవాదాలతో – రాధ
ఇద్దరు మిత్రులు గురించి Naresh Nunna అభిప్రాయం:
05/19/2014 11:57 pm
కినిగె వెబ్ పత్రికలో నెల నెలా మొపసా కథల నా అనువాదాలు పోస్ట్ అవుతున్నాయి కనుక, రచయిత పేరు ‘గి దె ముపాస’ అని పలకాలి అని గొర్తి వారు నాకు మెయిల్ పెట్టారు కనుక, ఇక్కడ గొర్తి సాయి బ్రహ్మానందం గారు ప్రస్తావించిన ‘పెద్ద రచయిత కమ్ జర్నలిస్టు’ నేనే కాబట్టి (పెద్ద అనే విశేషణంలో ఉన్న వ్యంగ్యాన్ని గ్రహిస్తూ) నా వివరణ ఇవ్వడానికి ఇక్కడ అసందర్భంగా జోక్యం చేసుకుంటున్నాను.
“మీ అనువాదం అస్సలు నచ్చలేదు. రచయిత పేరే తప్పు. గై డి మొపాసా కాదు. గి దె ముపాస. పూర్వం మనకి ఫ్రెంచ్ పేర్లు ఎలా పలకాలో తెలియకపోవచ్చు. ఇంటర్నెట్లో పేర్లు ఎలా పలకాలో గూగిలిస్తే తెలుస్తాయి” అని వారు హితవు చెప్పారు, నాకు రాసిన mailలో. దానికి నా బదులు ఇది:
“Pronunciations విషయంలో నేను ఉద్దేశపూర్వకంగానే నిర్లక్ష్యంగా ఉంటాను. దానికి కారణం ఏమిటంటే, వాళ్లు ఎలా ఉచ్ఛరిస్తారో నానాతంటాలు పడి మనం ఆ విధంగానే పలకడానికి ప్రయత్నిస్తామే గానీ, మన విషయంలో వాళ్లు అంత శ్రద్ధ తీసుకున్నట్టు అనిపించదు. తీయని మన ‘గోదావరి’ని వాళ్లు ‘గోడావ్రి’ అని నోటికొచ్చినట్టు పలకడంలో ఏదో cultural hegemony, supremacy ని మించిన పొగరు కనిపిస్తుంది. అందుచేత, పేర్లు ఎలా పలికితే ఏమిలే అనుకుంటాను. పేర్లు పక్కన పెట్టి, అనువాదంలో ఉన్న ఇతరేతర తప్పిదాల్ని తెలియజేస్తే సంతోషిస్తాను.”
నా యీ సమాధానంతో ఆయన ఖంగుతిన్నారట (కంగుని వత్తి పలకడం ద్వారా ఆయనెంత ఇబ్బంది పడ్డారో అర్థమయ్యింది).
మన సర్వనామాలు ‘మనం రాసే స్పెల్లింగ్ ప్రకారమే వాళ్ళు ఉచ్చరిస్తారు కాబట్టి, నేరం మనదే కానీ, వారిది కాదు అంటున్నారు గొర్తి వారు. ఆయన మాటల ప్రకారమే చూస్తే, స్పెల్లింగ్ ప్రకారం Guy De Maupassant ని గై డి మొపాసా అని ఎందుకు పలక కూడదు. వారు నాకు రాసిన mailలో “గి దె ముపాస’ అని, ఇక్కడ ‘ఈ మాట’ వెబ్ లో ‘గి ద ముపసా’ అని రాసారు (రెంటిలో ఏది సరైన ఉచ్ఛారణ?). International Phonetic Alphabet (IPA) ప్రకారం
Guy De Maupassant : /gi də moʊ paˈsɑ̃/ అని ఉంది. అంటే “గి డ మొపసా” అని పలకాలని ఉంది.
రష్యన్, ఫ్రెంచ్, జర్మన్, స్పానిష్ రచయితల్ని వారి స్పెల్లింగ్ ల బట్టి కాకుండా, అక్కడ వారెలా పిలుస్తారో నానా తంటాలు పడి తెలుసుకోవల్సిందే అంటున్నారు గొర్తి వారు. తూర్పున ఉన్న మనం, మన లిపి వేరైనా, వారి వర్ణమాలలో వారి సౌలభ్యం మేరకి సాధ్యమైనంత కృషి చేసి వారికి మన పేర్లు రవి, గోదావరి ఇత్యాదుల్ని Ravi, Godavari అని అని వాళ్ల అక్షరాల్లో తెలియజేసుకుంటుంటే, ‘గాంధీ’ని మేము ‘గాండీ’ అని పిలుస్తామని, అలా పిలవకూడదనుకుంటే, ఎలా పిలవాలో IPA వంటి tools అందించవల్సిన అగత్యం కూడా మనదే అనడం పొగరుగానే అనిపిస్తుంది, పాశ్చాత్య భక్తి, కలోనియల్ విధేయతా బొత్తిగా లేని నాకు.
ఇద్దరు మిత్రులు గురించి తఃతః అభిప్రాయం:
05/19/2014 5:40 pm
శ్రీ గొర్తి: మీ స్పందన కు ధన్యవాదాలు. ఏ అనువాదమైనా – ఏ భాష లొ ఉన్న ఏ రచయిత రచన నుంచి చేసారో చెప్పటం అనువాద రచయిత నైతిక బాధ్యత అని నేననుకుంటాను. తః తః
విముక్తం గురించి ప్రసాద్ అభిప్రాయం:
05/19/2014 11:45 am