పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16474

  1. మోహమకరందం గురించి naveen అభిప్రాయం:

    06/01/2014 2:28 am

    Awesome ga rasaru

  2. విముక్తం గురించి రాధ మండువ అభిప్రాయం:

    05/31/2014 10:26 pm

    జయప్రభ గారూ, నమస్కారం. మీ ‘అర్జున’ కథని చదివినప్పుడే తెలుసుకున్నాను. జీవితమే సంక్లిష్టం అని చెప్తున్నారని. అది అర్థం చేసుకోకుండా, విచారణ లేకుండా సరళతరం చేసుకోబోయి ఇంకా సంక్లిష్టపరుచుకుంటున్నారేమో కదా!

    మీ అభిప్రాయాన్ని పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  3. విముక్తం గురించి రాధ మండువ అభిప్రాయం:

    05/31/2014 10:17 pm

    ఉష గారూ, బాగుంది. మీరు వ్యక్తపరిచిన విరుద్ధభావాలు అర్థమయ్యాయి. ఈ కథాంశం అలాంటిదే మరి. అన్నిరకాలుగా ఆలోచింపచేస్తుంది. అందుకే అంటారేమో భార్యాభర్తల విషయంలో వేలు పెట్టకూడదు అని కదా! 🙂 ఇక మీ రెండో కామెంట్ గురించి – నిజమే ఇంకా కొంచెం వివరంగా భార్యకి చెప్పుకోవలసింది. ఈ విషయంలో మాధవ్ మాచవరం గారికి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ముందు చాలా క్లుప్తంగా, గంభీరంగా మాట్లాడినట్లు రాశాను. ఇంకొంచెం వివరంగా మురళి భార్యతో మాట్లాడాలి అనడమే కాకుండా “నువ్వంటే గౌరవం తక్కువేమీ లేదనీ” అనే వాక్యం ఆయనే రాశారు. ఆయనకి, ముందు వెర్షన్ ని నిశితంగా గమనించి తమ అభిప్రాయాలు తెలియచేసిన మరో ఇద్దరు (ఎవరో నాకూ తెలియదు) విశ్లేషకులకి సదా కృతజ్ఞురాలిని. మీకు ధన్యవాదాలు – మీ రాధ

  4. వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి వాసుదేవ రావు అభిప్రాయం:

    05/31/2014 3:01 pm

    మోహన గారూ! తెలుగు వాళ్ళు కృతక సంస్కృత పదాలను తెచ్చిపెట్టుకునే కన్నా ద్రవిడ /తమిళ పదాలను వాడుకోవటం ఎంతొ మేలు.’ముద్రణాలయం’ అనటం కన్నా ‘అచ్చగం’ అంటం మెచ్చుకోతగినది.

    ఉష గారూ! సింగీతం శ్రీనివాసరావుగారు ఒక విషయం చెప్పారు ఒక టివి ఇంటర్ వ్యూలో! ఆయన కొన్నాళ్ళు పంతులుగా పనిచేసారట. Cone అని ఇంగ్లిష్ లో పిలిచే వస్తువుకి ఒక తెలుగు పాఠ్య పుస్తకంలొ ‘కోను’ అని ఉన్నదట. వేరొకరు దానినే ‘శంకు’ అన్నారట. ఆయన అనటం, “బాగానే ఉంది. మరొక పండితుడు అథో వృత్త ఊర్ధ్వ కోణము అని రాసాడు.” ఈ అథో వృత్త ఊర్ధ్వ కోణులు తెలుగుని మోసం చేస్తూ, శాస్త్రానికి ద్రోహం చేస్తున్నారు. continuous function, etcల గురించి, ‘బయట చెల్లక పోవటం’ గురించి మీరు నా అక్షరాలను బాగానే పట్టుకున్నారు గానీ ఆలొచనలను కాదు.

    నా ఇ మెయిలు vasudevary@gmail.com

    నన్రి
    వాసుదేవ రావు ఎరికలపూడి

  5. విముక్తం గురించి ఉష అభిప్రాయం:

    05/30/2014 11:35 pm

    ఇంకొక మాట-

    “ఇమేజెస్ పెట్టుకోకూడదనుకుంటూనే ఇంకొకళ్ళు తమ మనసులో నీ గురించి గౌరవమైన ఇమేజ్ పెట్టుకోలేదని నీ బాధ. నువ్వంటే నాకు గౌరవం తక్కువేమీ లేదనీ, కాదనీ, బహుశా ఇది నీ ఆత్మన్యూనతో, నువ్వు కట్టుకున్న గూడు కూలిపోతుందనే అభద్రతాభావమో అయివుండచ్చని ఒక్క క్షణం ఆలోచించావా?” అతని గొంతులో కఠినత్వం.”…

    బహుశ ఇటువంటి మురళి మాటలు వింటే ఏ ఉక్రోషం నిండిన భార్య మనసైనా మైథిలిలాగే మరింత కుంగిపోతుంది. నేననేదేంటంటే, “సరే మైథిలీ, నీకు నచ్చకపోతే నేనామెతో మాట్లాడను. ఏ అనుబంధం పెట్టుకోను. నిన్ను ఆ విషయం అంతగా బాధిస్తుందని నేనూహించలేదు. నీ సంతోషం కన్నా నాకేదీ ఎక్కువ కాదు. పోనీలే, మాటలు, భావాలే కదా. పంచుకోకపోతే వచ్చిన నష్టం ఏం ఉంది. కాలక్రమేణ నువ్వు అర్థం చేసుకుంటావన్న నమ్మకం నాకుంది.” వంటి మాట ఆ భర్త ఎందుకు మాట్లాడలేకపోయాడు? కేవలం సంజాయిషీ ఇవ్వటమో, లేక అర్థం చేసుకోలేదని ఆక్షేపించటమో కాక, ఆమెలో నమ్మకం కలిగేవరకు, “నాకు ఆమెకన్నా నీవే ముఖ్యం” అనే ఆశ్వాసన ఇవ్వాలి కదా. అది మరికాస్త సాకారాత్మకంగ ఉండేదేమో. ఆలోచించండి. ఏం చేసినా నేను మారను, అని మైథిలి నిశ్చయించుకుంటే, రాధిక ఎంత మంచిదైనా, మురళి ఎంత స్వచ్చమైనవాడైనా- నష్టపోయేది మైథిలి ఒక్కర్తే కాదు కదా- అని నా ఆలోచన. అంతే.

  6. విముక్తం గురించి ఉష అభిప్రాయం:

    05/30/2014 11:18 pm

    క్షమించండి, నా ఉద్దేశం అట్ల వ్యక్తపరచటానికి వెనక కారణం ఈ ప్రారంభం.

    “ఇంట్లో ఒకళ్ళనొకళ్ళం తప్పించుకుని పారిపోతున్నాం. నాకు అతని పట్ల అసహ్యం. అతనికి నేను తనని అర్థం చేసుకోలేకపోతున్నానని అసహనం. ముందు ముందు ఏం జరగబోతుందో తెలీని అయోమయస్థితి ఇల్లంతా ఆవరించుకుని ఉంది.”

    ఆ స్థాయిలో సమస్య- ఆమె మనసులోనే కావచ్చు గాక- చోటు చేసుకుంది కదా. ఒక్కసారి మొండితనానికి వస్తే ఆమె భర్త చేయగలిగింది ఏం ఉంది, రాధికతో స్నేహానికి స్వస్తి చెప్పటం తప్ప? చివరకు మైథిలి అర్థం చేసుకోగలిగింది కనక ఆ ఇల్లు నిలబడింది. లేకపోతే? అనే భయమే నా విమర్శకు కారణం.

    కథలో దోషం ఉందని నేననలేదు రాధగారు – అది కేవలం స్నేహమే అయినా, ఏ భార్య అయినా తన భర్తకు తానే స్నేహితురాలు సన్నిహితురాలు కావాలని కోరుకుంటుంది. చాలా సార్లు నా ఆలోచన ఈ వైపుగా సాగుతుంది. ఆమె భర్త తన స్థాయికి చెందిన ఆలోచన పరిపక్వత కలిగిన ఒక స్నేహితురాలితో మాట్లాడుతున్నాడని తెలిసినా క్షణికావేశంలో ఆమె విచక్షణ కోల్పోయింది. అట్ల ఒక్కోసారి శాశ్వత అనుబంధాలకు తెరపడే అవకాశం ఉంటుంది. అసలు మా మధ్య ఉన్నది స్నేహమా, వేరొకటా అని తన భార్యకో భర్తకో సంజాయిషీ ఇచ్చుకునే పరిస్థితికి తలెత్తించే స్నేహాల చెడు ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని మాత్రమే నేను ఆలోచించాను.

    బహుశ అట్ల చెడుగా ఆలోచించి బంధం తెంపుకునే పరిస్థితి తెచ్చుకునేవారికి ఒక గుణపాఠంగా మీ కథను చూసి ఉంటే నా విమర్శ వేరుగా ఉండేదేమో. నా విమర్శ కథ పరిధి దాటి చేసిందే కానీ, నేరుగా కథలో అంశం కాదు.

    మైథిలిలా బాధపడేవారిని తరుచూ చూస్తుంటాము. భర్తకు ఉన్న మానసిక పరిపక్వత తమకు లేనందువల్ల ఆ భర్త సాన్నిహిత్యాన్ని తాము కొన్ని పరిధులు దాటి అనుభూతి చెందలేకపోతున్నామని, ఆ సాన్నిహిత్యం ఇతరులకు దక్కినప్పుడు (ఎవరైనా సరే, ఎంత స్వచ్ఛమైన అనుబంధమైనా సరే)- తాము ఆ స్థాయికి ఎదగలేక, ఆ అనుబంధాన్ని అంగీకరించలేక మానసికంగ కుంగిపోవటం కళ్ళారా చూస్తుంటాము. అందుకే అట్ల స్పందించాను. అందుకే ప్రాచీనులు అటువంటి సామీప్యాలకు తావివ్వలేదు అని అన్నాను. ఎంతగా ఆడా మగా పక్కన కూర్చుని ప్రయాణాలు చేసినా, కలిసి చదువుకున్నా భార్యాభర్తా అనుబంధం వచ్చేసరికి అందులో “అంతా నాకే చెందాల”నే ఆశ (దురాశే కావచ్చు) చోటుచేసుుకంటుంది.

    ప్రతి భార్య-భర్తలు అసలు ఏ స్నేహాలైనా, ఏ అనుబంధాలైనా చేసే ముందు తమ “జీవితభాగస్వామికి అది ఎట్ల అనిపిస్తుంది” అనే గీటురాయి మీద పరీక్షించాకే ముందుకు పోవాలి. ఆ దారిలో ఈ కథను నేను ఆలోచించాను. అంతే, అది దృక్పథంలో తేడా మాత్రమే రాధగారు. కథలో లోపం కాదు. మైథిలి తొందరపడ్డా సత్యం తెలుసుకోవటం వైపు మీ దృష్టి ఉంది. ఆ పరిస్థితి కలిగించిన ఆమె భర్త పై, ఆ రకం సాన్నిహిత్యాలు ఏ వైపు తీసుకుపోతాయి, సగటు జీవితంలో వాటి అవసరం ఎంత- అనే అంశం మీద నా దృష్టి ఉంది.

    కథ సుఖాంతం అయింది. అది ఆనందకరం. లేదంటే ఈ మధ్య ఏ సమస్యకైనా అనుబంధాలు విచ్ఛిన్నం కావటము మాత్రమే సమాధానంగా, ఏకమాత్ర పరష్కారంగా చూపించిన కథలను చదివి బెంగపడ్డాక మీ కథ చదవటం నిజానికి నాకు ఆశ్వాసననిచ్చింది అని చెప్పుకోవాలి. 🙂

  7. విముక్తం గురించి jayaprabha అభిప్రాయం:

    05/30/2014 12:32 pm

    “ఏది విలువైనదో ఏది శాశ్వతమైనదో దానివెంట మనిషి పోవాలి” అంటే ఏమిటీ? విలువలు మారవూ? సంస్థలు విచ్చిన్నమై కొత్తవి పుట్టవూ? ఏ వ్యవస్థ అయినా మారదా? కొత్త మార్పులు రావా? ఈ కధని అలా ఉంచితే కాసేపు, ఈ కధ మీద వచ్చిన అభిప్రాయాలలో మాత్రం ఎక్కువ భయం కనబడుతూంది. “కొన్ని విషయాలలో పరిధి దాట వద్దు. అంతే” అంటే ఏమిటో? అసలు ఏమిటీ వాక్యాలూ? నీతి బోధలు చేయడమూ విధి నిషేధాలు చేయడమూ మతసంస్థల పని. ఏ జమాతే ఇస్లామీవో లేదా అలాంటి మరో మత సంస్థనో అనే మాటలు ఇవి!

    జీవితమే సంక్లిష్టం. ఎప్పుడైనా అది సరళంగా ఎలా ఉంటుందీ?

  8. విముక్తం గురించి రాధ మండువ అభిప్రాయం:

    05/30/2014 12:39 am

    ఉదాహరణకి ఇది చూడండి ఉష గారూ! ఆ రోజు “రాధిక రాసింది నువ్వంటా వాళ్ళమ్మ దగ్గరకి ఒకసారి వెళ్ళిరా” అని మురళి చెప్పి ఉండేవాడేమో మైథిలి ఆగి చూడాల్సింది కదా ఉష గారూ? చెప్పకపోతే ఏదో తప్పుడు భావం మీలో ఉన్నట్లే కదా అని అడగొచ్చు. చెప్తే అసలు బాధ పడవలసిన అవసరమే లేదు. కాబట్టి సమస్యని బట్టి మాట్లాడాలి, నిర్ణయాలు తీసుకోవాలి గాని అనవసరంగా దు:ఖాంతం చేసుకోవడం మంచిది కాదు కదా?

  9. విముక్తం గురించి రాధ మండువ అభిప్రాయం:

    05/30/2014 12:17 am

    ఉష గారు, నమస్కారం. ఇక్కడ రాధిక, మురళి హద్దులు మీరి ప్రవర్తించినట్లు ఉందా? తనకి చెప్పలేదనే ఉక్రోషంతోనో, అభద్రతాభావనతోనో అనవసరమైన అనుమానాలు పెట్టుకోకూడదు అనే నేనంటున్నాను. ఎవరికి వారు వారి వారి సమస్యలకి తగ్గ నిర్ణయాలు విచక్షణతో తీసుకోవాలి. ఇక్కడ మైథిలి తన సమస్య ఏమిటో గుర్తించింది. తగినట్లుగా ఆరోగ్యకరమైన నిర్ణయం తీసుకుంది. మీ కామెంట్ లో నన్ను బాధ పెట్టిన వాక్యం “ఎన్నో వాస్తవపు గాథలు ఈ కథలా సుఖాంతాలు కాక దుఃఖాంతాలే కావటం చూస్తూ కూడా ఇటువంటి వాటిని ప్రోత్సహించటం ఆరోగ్యకరం కాదు” అనేది.

  10. వైజ్ఞానిక రంగంలో తెలుగులోకి అనువాదాలు చెయ్యటంలో సాధక బాధకాలు గురించి మోహన అభిప్రాయం:

    05/29/2014 10:34 pm

    నేను 1962-65 కాలములో కోయముత్తూరులోని PSG College of Technologyలో పని చేసినాను. అప్పుడు దాని ప్రిన్సిపాల్ తరువాత మదరాసు విశ్వవిద్యాలయపు ఉపకులపతియైన జి ఆర్ దామోదరన్. వారికి కలైక్కదిర్ అచ్చగం అని ఒక ముద్రణాలయము ఉండేది. 50 సంవత్సరాలకన్న ముందే తమిళములో కలైక్కదిర్ అని నెలనెలా ఒక పత్రికను ప్రచురించేవారు. ఆంగ్లములోని శాస్త్రీయ వ్యాసములకు తమిళ అనువాదములను ఇచ్చేవారు అందులో. అప్పుడే ఆంగ్లములోని శాస్త్రీయ పదములకు తమిళములో సరియైన పదములను ఉపయోగపరిచేవారు. పదము సరియైనా, అంత సరికాకపోయినా, దానిని ఉపయోగిస్తూ ఉంటే అది చెలామణిలో వస్తుంది. ఇప్పుడు కూడ తమిళనాడులో రోడ్డు, స్త్రీట్ వంటి పదములను వాడరు. అణ్ణా శాలై, రంగనాదన్ తెరు అనే వాడుతారు. నా ఉద్దేశములో పదములను వాడుతూ ఉంటే అవి అమలులోకి వస్తాయి. పోతే కొన్ని ఆంగ్లములోని శాస్త్రీయ పదములను అలాగే వాదుకొనవచ్చును, ఉదా. మాలిక్యూలు (నాకు బణువు నచ్చలేదు), అమినో ఆసిడ్, న్యూక్లియిక్ ఆసిడ్ ఇత్యాదులు. విధేయుడు – మోహన