పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16474

  1. గణపవరపు వేంకటకవి శబ్దార్థచిత్ర పద్యాలు కొన్ని గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    07/06/2014 2:30 am

    మాన్యతమశ్రీ తః తః గారికి
    నమస్కారములతో,

    సహృదయత ఉట్టిపడుతున్న మీ సద్విలేఖితానికి, భావుక ప్రియంభావుకమైన వాక్యోదాహృతికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆరుద్రగారి వరకు గల సాహిత్యచరిత్రకారులు గణపవరపు వేంకటకవి క్రీ.శ. 1675 (±) నాటివాడని నిశ్చయించారు. క్రీస్తుశకం 1725 నాటివాడని నా అభ్యూహ. ఇప్పుడా చర్చ నిర్నిమిత్తం కావచ్చునని, ఆ విశేషాలను సందర్భానుసారం మరేదైనా వ్యాసంలో వ్రాయవచ్చునని భావించి ప్రకృతాన్ని మాత్రం ముక్తాముక్తంగా అనుఘటించాను.

    తత్పరతః, మాన్యులు శ్రీ ASM చంద్ర గారి ఔదార్యపూర్ణవాక్యానికి –

    మాన్యులు శ్రీ గన్నవరపు నరసింహమూర్తి గారి ఆశీర్నిదేశానికి –

    కృతజ్ఞుణ్ణి.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  2. ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం! గురించి ఏల్చూరి మురళీధరరావు అభిప్రాయం:

    07/06/2014 1:59 am

    మాన్యులు శ్రీ రంగ గారికి
    నమస్కారములతో,

    వ్యాసాన్ని దయతో చదివి ఔదార్యంతో స్పందించినందుకు ధన్యవాదాలు. ‘ఈమాట’ 2013 జులై సంచికలో ప్రకటించిన ‘తెనాలి రామలింగకవి శబ్దార్థ గూఢచిత్ర పద్యం’ చివర ఇచ్చిన లంకెను చూసి విదిత విద్వాంసులు శ్రీ బందా లక్ష్మీనరసింహారావు గారు అందులో కఠినపద్యశ్లోకాలకు అర్థతాత్పర్యాలుంటే బాగుండేదని సూచించారు. ఇప్పుడు శక్త్యనుసారం పద్యంలోని అప్పటి అన్వయదోషాలను సవరిస్తూ సరికొత్త వివృతిని చేర్చి పరివర్ధితంగా పునఃప్రచురించాను. మీరు పూర్వోత్తరరూపాల తారతమ్యాన్ని పరికించి సమ్మతిని ప్రకటించటం నాకెంతో సంతోషాన్ని కూర్చింది. అద్యతనప్రకాశనప్రోత్సాహనులతోపాటు దీనికి తొలుత సూర్యాలోకాన్ని కల్పించిన మాన్యులు శ్రీ తల్లాప్రగడ రామచంద్రరావు గారికి సైతం నేను ఋణపడి ఉన్నాను.

    సప్రశ్రయంగా,
    ఏల్చూరి మురళీధరరావు

  3. కొండదారిలో! గురించి Velcheru Narayana Rao అభిప్రాయం:

    07/05/2014 6:25 pm

    మీరు మాటల చప్పుళ్లతో బొమ్మ కట్ట గలరు. బాగా రాస్తున్నారు. మీలా రాసేవారు తెలుగులో చాలా తక్కువమంది వున్నారు. మీ కవిత్వం మళ్ళా మళ్ళా చదవాలనిపిస్తుంది. ఎప్పటికప్పుడు కొత్తగా వుంటుంది.–నారా

  4. ఆంధ్రవాఙ్మయంలో అత్యంతప్రౌఢమైన పద్యం! గురించి రంగ అభిప్రాయం:

    07/05/2014 2:30 pm

    ఈ వ్యాసం ఈ క్రింది వ్యాసానికి సార్థకమైన వివరణలతో కూడిన విస్తరణ.

    http://www.siliconandhra.org/nextgen/sujanaranjani/apr12/vanmayacharitralo.html

    ఆలోచనామృతమైన వ్యాసపంపరకు కృతజ్ఞతలు.

    రంగ

  5. సమస్త సిద్ధాంతం అవసరమా? గురించి వాసుదేవ రావు ఎరికలపుడి అభిప్రాయం:

    07/05/2014 1:57 pm

    ఈ వ్యాసానికి పెట్టిన పేరు ‘సమస్త సిద్ధాంతము’ అన్నది బాగున్నట్టుగా తోచలేదు నాకు. ‘సార్వత్రిక సిద్ధాంతము ‘అన్నది కొంచెం మెరుగ్గా ఉంటుందేమో ననిపించి ‘ఆంధ్ర భారతి’ చూసాను. ఫలితం :
    సార్వత్రికము
    సార్వత్రికము : తెలుగు నిఘంటువు తెలుగు-తెలుగు (జి.ఎన్.రెడ్డి-ఆం.ప్ర.సా.అ.) 1979
    సంస్కృత విశేష్యము
    1. [భౌతికశాస్త్రము; గణితశాస్త్రము; రసాయనశాస్త్రము] అన్ని విశేషముల నిమిడ్చికొనినది.
    2. [భౌతికశాస్త్రము; గణితశాస్త్రము; రసాయనశాస్త్రము] సర్వవ్యాపకమైనది (Universal).

    ఫిజిక్స్ లో ‘ థియరీ అఫ్ ఎవెరిథింగ్ ‘ గా ప్రసిద్ధమైన థియరీ ని నిర్మించుకోవటం అవసరమా కాదా అన్న విషయమ్మీద చర్చగా ఈ వ్యాసం రాసారన్న భావన తో ఆ ఇంగ్లీష్ పేరుకిది తెలుగు(?) గా భావించాను. రచయిత ఈవ్యాసం ఇంగ్లిష్ పేరు ను ఎక్కడా ప్రస్తావించ లేదు . కారణం తెలియదు. ఇది ఇలా ఉండ గా ‘ సమస్త సిద్ధాంతము’ అంటే యేమిటో,యేమై ఉంటుందో ఉపొద్ఘ్హాతం మొదలు ఆరు పేరా లైనా- చూచాయ గా నైనా -తెలియ రావటం లేదు.
    ( తెలుగు లో ‘ సిద్ధాంతము’ అన్న మాట తో ఒక తలనెప్పి ఉన్నది . థీరం అన్న పదానికీ, థియరీ అన్న పదానికీ సిద్దాంతమనే అనువాదం. ‘పైథాగరస్ సిద్ధాంతము’ ఒక థీరం, ‘సమస్త సిద్ధాతం ‘ ఒక థియరీ . థియరీ ని ‘వాదము’ అంటం మెరుగేమో).

    “తాత్త్వికులని అడిగితే వారేమంటారు? ఈ విశ్వాన్ని సర్వశక్తి సంపన్నుడైన భగవంతుడుసృష్టించేడు అంటారు.” రచయిత

    ‘తాత్త్వికులు’ అనే మాటను ఫిలాసఫర్స్ అన్న ఇంగ్లీష్ మాటకు అనువాదం గా వాడినట్టు ఉంది గానీ రచయిత కు ‘ తాత్త్వికులు’ అంటే మత తత్త్వవేత్తలే నన్న అభిప్రాయం ఉన్నట్టు గా తోస్తుంది . విజ్ఞాన శాస్త్ర విష యకంగా ఫిలాసఫర్స్ పాత్ర గురించి హెర్మన్ వెయిల్ మాటలివి:

    ” The task of shedding philosophic light on to these questions is none the less an important one, because it is radically different from that which falls to the lot of individual sciences. This is the point at which the philosopher must exercise his discretion. If he keep in view the boundary lines determined by the difficulties inherent in these problems, he may direct, but must not impede, the advance of sciences whose field of inquiry is confined to the domain of concrete objects. ”
    [HERMANN WEYL: SPACE – TIME – MATTER నుంచి]

    ఒక శాస్త్రీయ సిద్ధాంతాన్ని తయారు చేసుకొవలసిన అవసరం పలురకాలు గా ఉంటుంది. 1. ఒక పనిముట్టు గా , 2. తార్కిక సంపూర్ణత కోసం, 3. ఒక అందం కోసం , 4. దానికై అది ( for its own sake) . ఈ వ్యాసం ఈ విషయాలనన్నిటినీ తడిమింది – “పిపీలికాది బ్రహ్మ పర్యంతం ఈ విశ్వంలో ఉన్న ప్రతి పదార్థాన్ని, ప్రతి బలాన్ని, ప్రతి ప్రవర్తనని ఒకే ఒక సిద్ధాంతంలో ఇమడ్చగలిగితే, ఒకే ఒక సూత్రంతో వర్ణించగలిగితే అదొక అందం.” అంటూనే, కొంత తడవైన తరువాత “సృష్టి అంతటికీ ఒకే ఒక సిద్ధాంతం కావాలని మంకు పట్టు పట్టటంలోనూ విజ్ఞత లేదు”” అని ఒక assertive statement . ముగిస్తూ “చరిత్రలో ఎక్కడ చూసినా కుతూహలం అనేది మెదడులో ప్రవేశించిన తరువాత అది కుమ్మరి పురుగులా అలా గొలుకుతూనే ఉంటుంది. సందేహం నివృత్తి అయేవరకు బుర్రలో ఆ దురద తగ్గదు, దాహం తీరదు. ఆ దాహం తీరటానికి గమ్యం చేరుకోవటం ఎంత ముఖ్యమో ఈ ప్రయాణం కూడ అంతే ముఖ్యం” . వంటి మంచి మాట –
    కానీ శాస్త్ర చర్చ ను – పోలికలకు లకు పోవటం ఎక్కువై పోయి – తార్కికంగా ఒక పద్ధతి లొ సమగ్రం గా అమర్చుకోలేదని అనిపిస్తోంది .

    వాసుదేవ రావు

  6. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి మోహన అభిప్రాయం:

    07/05/2014 6:48 am

    ఈ వ్యాస రచయితలకు గాని, జయప్రభగారికి గానీ యోగ్యతాపత్రాలను ఇవ్వడానికి అర్హతలు, తాహతు నాకు లేవు. నేను చలం కాదు. కాని అచలముగా కూడ ఉండడము సాధ్యము కాదు. నా స్పందన క్రింది వాక్యముపైన మాత్రమే.

    పట్టుమని ఒక తెలుగు పద్యానికి – పూర్వ ఛందస్సులో వున్నా కొత్త ఛందస్సులో వున్నా – అర్థం వివరించగలిగే సత్తాలేని చచ్చు తెలుగు పి. ఎచ్. డి. లు ఎందరో తెలుసు నాకు. జయప్రభ అలాటి కోవలోదో కాదో నాకు తెలీదు

    అదే విధముగా క్రింది వాక్యముపైన కూడ నేను స్పందించినాను –

    కానీ పరుచూరి శ్రీనివాస్ గారి సంపత్తి తెలుగు సాహిత్యంలోనూ తెలుగు విమర్శలోనూ ఏపాటిదో తెలియడం కష్టం.

    పి.ఎచ్‌డి. డిగ్రీపైన నా ఉద్దేశములను వెల్లడించినాను; తఃతః గారు కూడ దీనిపైన వ్రాసియున్నారు.

    నమస్సులతో విధేయుడు – మోహన

  7. కొండదారిలో! గురించి navin అభిప్రాయం:

    07/05/2014 3:22 am

    మనసును హత్తుకొనె భావ పరిమళమేదో మీ కవిత్వంలో ఉన్నట్లుంది.అది ఊపిరిలో చేరి మనసుని నీలాకాశం మోసుకెల్లె కడవని చేసింది.

  8. మనకు తెలియని బ్రౌన్ దొర: ఛాల్స్ ఫిలిప్ బ్రౌన్ గురించి K.V.S. Ramarao అభిప్రాయం:

    07/04/2014 2:30 pm

    మోహనరావు మంచివారు. ఐతే ఆయన ఉదారంగా ఇచ్చిన యోగ్యతాపత్రానికి, ఇక్కడ జరుగుతున్న చర్చకి ఎలాటి సంబంధము లేదు. జయప్రభ పద్యాలు రాస్తారా వాటిని అనర్గళంగా పాడతారా మరోటా అనేది కాదు విషయం. ఇతరుల పరిశోధనల మీద ఆవిడ ప్రకటించే అభిప్రాయాల గురించి, వారి అర్హతల గురించి ఆవిడ వేసే ప్రశ్నల గురించి. రాసిన వ్యాసం లో వున్న విషయాన్ని చదవటము, అర్థం చేసుకోవటము, ఆ విషయం మీద తార్కికంగా చర్చించటం కాకుండా రాసిన వాళ్ల గురించి sweeping generalizations, వాళ్ల అర్హతల గురించిన అతార్కిక భావజాలం – ఇవీ ఇక్కడి సందర్భం. అర్హత, చేసిన పని నుంచి వస్తుంది గాని పేరుపక్కన పేర్చుకున్న డిగ్రీల పట్టికనుంచి కాదనేది తెలుసుకోవాలి.

  9. ప్లే బ్యాక్ సింగర్ పి. బి. ఎస్. గురించి మోహన అభిప్రాయం:

    07/04/2014 10:00 am

    ఇద్దరి గొంతులు ఒకే నాయకునికి సరిపోతుందంటారు, చిత్రములలో పాడకపోయినా ఆ నాయకుడు కూడ గాయకుడే. పి. బి. ఎస్. ఏ. ఎం. రాజా దర్శకత్వములో పాడిన ఆడిపెరుక్కులోని ఈ పాట ( https://www.youtube.com/watch?v=niR_Io-rHFM ) అంటే నాకు ఎంతో ఇష్టము. రాజా స్వరపరచిన ఎంత చక్కని పాటను అంత చక్కగానే పాడారు పి. బి. ఎస్. ఈ నేపథ్య గీతములో అంతర్గతమైన వాద్యసంగీతము కూడ అద్భుతమైనదే! ఎక్కడున్నారో ఇప్పుడు అట్టి గాయకులు, అట్టి సంగీత దర్శకులు! విధేయుడు – మోహన

  10. బడి పిల్లల అయోమయం గురించి siva prasad అభిప్రాయం:

    07/04/2014 4:29 am

    చూడబోతే పంచతంత్రం కథలు కూడా తప్పు అనేట్లున్నారు మీరు. పంచతంత్రం కథల్లో జంతువులు మాట్లాడుకుంటాయి, అంత మాత్రాన ఆ కథలు నిష్ఫలం అని ఎలా అనగలరు? పిల్లలకి కావాల్సింది కథలోని నీతి, లాజిక్ కాదు…లాజిక్ నేర్పడానికి ఇంకా చాలా వయసుంది వాళ్ళకి….