పాఠకుల అభిప్రాయాలు

Total Comments: 16473

  1. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి మోహన అభిప్రాయం:

    05/02/2015 4:54 pm

    <> ఇప్పుడు కూడ “ఈమాట”లో పీర్ రెవ్యూ ఉన్నదనే నేను భావిస్తాను. బహుశా సంవత్సరానికి ఒక మారు సంపాదకులు వారి పేరులను ప్రచురిస్తే బాగుంటుందేమో? – విధేయుడు – మోహన

  2. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి తఃతః అభిప్రాయం:

    05/02/2015 4:02 pm

    “మొత్తం మీద చెప్పాలంటే తెలుగువాళ్లు ప్రపంచమంతటా వున్నారు. అంచేత ప్రపంచంలో చాలా చోట్ల మాట్లాడబడుతున్న భాష కాబట్టి తెలుగు ప్రపంచ భాషే!”
    ఇలాంటి వాక్యాలదగ్గరే నా రా తొ నాకు కుదరదు.
    1. ఇది తర్క దూరమైన నిర్ధారణ. తెలుగు మాతృభాషగా ఉన్నవాళ్ళున్నంత మాత్రాన వాళ్ళు అక్కడ తెలుగు మాట్లాడు తున్నారని నిర్ధారించి చెప్పలేము..-‘ అంచేత’ అంటూ conclude చెయ్యలేము.
    తెలుగు వాళ్ళు, వాళ్ల సొంత ఊళ్ళల్లో ఉన్న వాళ్లూ, వాళ్ళల్లొ వాళ్ళే తెలుగు మాట్లాడుకోరన్నది అందరికీ తెలిసిందే. బెజవాడ- విశాఖపట్నం – భువనేశ్వర్ ల మధ్య ఈ అయిదారు సంవత్సరాలలో కొన్ని వందల సార్లు రైలు ప్రయాణం చేశాను. ఈ ప్రాంతంలో బరంపురం దాకా తెలుగు వాళ్లు చెదల పుట్ట్ల్లల్లా ఉన్నారు. అయినా , ప్లాట్ఫార్మ్ ల మీద, రైల్లోనూ అమ్ముకునే వాళ్లు ఏఒక్క వస్తువునూ ఆ వస్తువు కు ఉన్న తెలుగు పేరు తో అమ్మటం నేను వినలేదు ,చూడలేదు . ద్రాక్షలను అంగూర్ లని , మజ్జిగ / చల్లను లస్సీ అని, అరటి పళ్ళను కేలాలని, జామకాయలను అమృదులనే అమ్ముతారు. డబ్బు/ వ్యాపారం తల్లి కడుపును కొడుతుంది.
    2. రెండవ పేరా చివరలో ధృఢం గా ‘ తెలుగు ప్రపంచ భాషే!’ అంటూ చెబుతున్న వాక్యాన్ని ఇంతకు మించి వితర్కించకుండా కాసేపు ఆపి 13 వ పేరా చివరి వాక్యం చూద్దాం, ‘….అప్పుడు తెలుగు ప్రపంచ భాష అవుతుంది.’
    ఫైన “తెలుగు ప్రపంచ భాషే!'” అని గట్టిగా అనటం? ఇక్కడ ఇలా. ఇదేమి నిర్మాణం?
    సైన్స్ వ్యాసాల తొ కొద్ది పాటి పరిచయం ఉన్న వారికెవరికైనా ఈరకమైన రచన చిరాకు తెప్పిస్తుంది.
    తా.క : ఏదో రూపంలో ఈ రచయితల వ్యాసాలలొ కొంత నింద తో – నెగెటివ్ సెన్స్ – తో విశ్వనాథ ను తేవటాన్ని పాఠకులు గమనించి ఊంటారు.

    తఃతః

  3. యద్భావం తద్భవతి గురించి ayyavaru అభిప్రాయం:

    05/02/2015 3:48 pm

    తెలిసిన కధకి కధనం (స్క్రీన్ ప్లే అనాలేమో) భలేగా కుదిరింది.

  4. తెలుగు అంతర్జాతీయ భాష కావాలంటే… గురించి సూర్యుడు అభిప్రాయం:

    05/02/2015 2:15 pm

    వ్యాసం చాలా బాగుంది.

  5. శేషు మావయ్య గురించి B.prathapkumar reddy అభిప్రాయం:

    05/02/2015 1:11 pm

    కధ చాల బాగుందండి.. గుండెల్ని పిండేసినా కూడా….చాల సేపు ఏదో ఆలోచనలో ఉండి పోయాను నేనయితే…ఈ లోకం తో ఏ సంబంధమూ లేనట్లుగా ……నిజం చెప్పాలంటే కధనం కధని డామినేట్ చేసింది…. మామూలుగా మీ కధల్లో కధ మీద ఎంత శ్రద్ధ పెడతారో,కధనం మీద అంత కంటే ఎక్కువ శ్రద్ధ పెట్టి రాస్తారనిపిస్తుంది…ఇది ఒక మంచి రచయితకి ఉండాల్సిన ఒక గొప్ప లక్షణం….పాఠకుడు చదవడం మొదలు పెట్టిన తర్వాత ఆపకుండా ఏకబిగిన చదివించగలిగే శక్తి మీ కధనానికి ఉంది..కొన్ని వర్ణనలు,కొన్ని వాక్యాలు భలే ఉన్నాయి. ఉదాహరణకి “ఈర్ష్యా అసూయలెక్కువైనప్పుడు, పట్టలేని ఉడుకుమోత్తనానికి కూడా ఏడుపొస్తుంది”. “మాట ఎప్పుడూ ఉప్పు లాటిది. తగినంత వాడాలి. లేకపోతే పదార్ధం చెడిపోతుంది.”…. మంచి కధని మాచేత చదివించినందుకు మీకు ధన్యవాదాలు చెప్తూ, మరిన్ని మంచి కధలు మీ కలం నుంచి రావాలని మనసారా కోరుకుంటున్నాను …

  6. సూరిగాడి కొలువు గురించి raghava అభిప్రాయం:

    05/02/2015 12:47 pm

    కధ బాగుంది శాంతా.. !

  7. యద్భావం తద్భవతి గురించి Indraganti Prasad అభిప్రాయం:

    05/02/2015 12:41 pm

    చాలా బావుంది. అద్భుత పౌరాణిక కథ అనచ్చేమో. చినబాబు చెయ్యి బాగా తిరిగింది.

  8. సూరిగాడి కొలువు గురించి Prasad అభిప్రాయం:

    05/02/2015 12:29 pm

    wonderful story

  9. శేషు మావయ్య గురించి నండూరి సుందరీ నాగమణి అభిప్రాయం:

    05/02/2015 12:19 pm

    అక్షరాల పంక్తుల వెంట పరుగులు తీయించిన కథనం, చక్కని వర్ణనలూ, ఎంతో మంచి కథ… ఆద్యంతమూ… ఎంతో ఆసక్తిగా చదివింపజేసే శైలి మీది. కథ చాలా బాగుంది దమయంతి అక్కా… చివరాఖరికి వచ్చేసరికి మనసు మూగవోయింది… ధన్యవాదాలు మంచి కథ మాకు అందించినందుకు.

  10. సూరిగాడి కొలువు గురించి మణి వడ్లమాని అభిప్రాయం:

    05/02/2015 10:25 am

    బావుంది కధ అపర్ణా !